హింస ధ్వని! (14/07/13_Sunday magazine)
హింస ధ్వని! వేలిముద్రల్లో నేరస్థుల ఆనవాళ్లు ఉన్నట్టే...'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో' వార్షిక నివేదికల్లో రక్తపు మరకల గుర్తులు కనిపిస్తాయి, హాహాకారాల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. యముని మహిషపు గంటల సవ్వడిని తలపించే ఆ అంకెల రంకెలివి... వీ ధులన్నీ ఎర్రగా - రక్తంతో కళ్లాపి చల్లినట్టు. చెట్లకు పుర్రెల గుత్తులు. ఎటుచూసినా శవాల గుట్టలు. ట్రక్కులకొద్దీ నోట్ల కట్టలు. ఎక్కడి నుంచో తుపాకుల మోతలు. పత్రికల నిండా చావు రాతలు. ఎవడో దొంగాడు...ముసలమ్మ మెడలోని పుస్తెలతాడు తెంచుకెళ్తున్నాడు. ఇంకెవడో ముసుగు వెధవ, తాళాలు పగులగొట్టి ఇల్లంతా దోచేస్తున్నాడు. డెబిట్‌కార్డు బేబులోనే ఉంటుంది, ఖాతాలోని డబ్బు మాయమౌతుంది. ఇ-మెయిల్‌లో లాటరీ వూరింపులు, ఫేస్‌బుక్ నిండా అమ్మాయిల మార్ఫింగ్ ఫొటోలు. మన జాగాలో ఏ గూండాలో పాగావేస్తారు. ప్రశ్నించలేం. తిరగబడలేం. ఎవరి నేరాలివి? ఏ ముఠాల ఘోరాలివి? 34వేల హత్యలు, 35వేల హత్యాయత్నాలు, 25వేల అత్యాచారాలు, 27వేల దోపిడీలు - ఇవేం ప్రగతి సూచికలు కాదు. ఏడాది కాలపు పాపాల చిట్టాలు. 2012 సంవత్సరానికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చే...