బ్రౌజింగ్ సురక్షితం ఇలా! (Eenadu Internet tips 31/05/2012)
లేచింది మొదలు... బ్రౌజింగ్ అనివార్యం!! మరి మీ వెబ్ విహారం సురక్షితమేనా? ఇవిగో అదనపు యాడ్‌ఆన్స్! బ్రౌజర్‌లోనే చేరి భద్రత కల్పిస్తాయి!! ఫైర్‌ఫాక్స్‌లో ఏదైనా ట్యాబ్‌ని పొరబాటున క్లోజ్ చేస్తే తిరిగి అదే ట్యాబ్‌ని ఓపెన్ చేయడం సాధ్యమే. అందుకు హిస్టరీలోని Recently Closed Tabsలోకి వెళితే సరి. ఎందుకంటే క్లోజ్ చేసిన అన్ని ట్యాబ్‌లు అదే మెనూలో ఉంటాయి. మరి, చూసిన ప్రైవేటు ట్యాబ్‌ని ఇతరులెవరూ ఓపెన్ చేయకుండా ఉండాలంటే? అందుకో ప్రత్యేక యాడ్‌ఆన్ ఉంది. అదే Close'n forget. బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసి రీస్టార్ట్ చేయాలి. ఇక మీరు క్లోజ్ చేయాలనుకునే ట్యాబ్‌పై రైట్‌క్లిక్ చేసి Close and erase cookies for the current siteపై క్లిక్ చేయవచ్చు. ఇక ఆ ట్యాబ్‌కి సంబంధించిన హిస్టరీ ఎక్కడా కనిపించదు.http://goo.gl/HpNKq * ఏదైనా ప్రమాదకరమైన సైట్ ఓపెన్ అవ్వకుండా చేయాలంటే WOT సర్వీసు ఉంది. ఇన్‌స్టాల్ చేయగానే అడ్రస్‌బార్ పక్కనే ప్రత్యేక గుర్తుతో కనిపిస్తుంది. Basic, Light, Parental Control విభాగాలుగా సెక్యూరిటీని సెట్ చేసుకోవచ్చు. పేరెంటల్ కంట్రోల్స్‌తో సైట్‌లను ఓపెన్ కాకుండా చేయవచ్చు. http://goo.gl/TiS1L * బ్రౌజింగ్ హిస్టరీ, కూకీస్ ఇతరుల కంటపడకుండా మేనేజ్ చేసుకోవాలంటే BetterPrivacyఉంది. ఇన్‌స్టాల్ చేయగానే 'టూల్స్' మెనూలో చేరిపోతుంది. LSO Manager, Optionsతో కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు.http://goo.gl/NbzRh * సెక్యూరిటీ నిమిత్తం ఒరిజనల్ ట్యాబ్ టైటిళ్లను తొలగించి మీకు నచ్చిన టైటిల్ పెట్టుకోవాలంటేTabRenamizer పొందండి. ఇన్‌స్టాల్ చేసి ట్యాబ్‌పై రైట్‌క్లిక్ చేసి Rename this tabతో టైటిల్ మార్చేయవచ్చు.http://goo.gl/0maQE క్రోమ్‌లో కొత్తగా..! మెయిల్, బ్యాంకింగ్, ఇతర సర్వీసులకు వాడుతున్న పాస్‌వర్డ్‌లు ఎంత సురక్షితమో తెలుసుకోవాలంటే సాఫ్ట్‌వేర్‌లే అక్కర్లేదు. బ్రౌజర్‌లోనే తెలుసుకోవచ్చు. అందుకు క్రోమ్ ఎక్స్‌టెన్షన్ Password Secure Testerను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. నిక్షిప్తం చేయగానే అడ్రస్‌బార్ చివర్లో ఐకాన్ గుర్తు వస్తుంది. ఇక ఏ సర్వీసులోనైనా పాస్‌వర్డ్ టైప్ చేస్తే దాన్ని ట్రేస్ చేయడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో చెప్పేస్తుంది.http://goo.gl/L65aw * ఓపెన్ చేసి ఉంచిన అన్ని ట్యాబ్‌లను ఒకేసారి మాయం చేయాలంటే PanicButtonపొందండి. అడ్రస్‌బార్ చివర్లో వచ్చిన ఐకాన్ గుర్తుపై క్లిక్ చేస్తే ఓపెన్ చేసిన ట్యాబ్‌లు మాయం అవుతాయి. మళ్లీ పొందాలంటే అదే గుర్తుపై క్లిక్ చేయాలి. http://goo.gl/C2nbw * ఒకే క్లిక్‌తో బ్రౌజింగ్ హిస్టరీ, కూకీస్, డౌన్‌లోడ్ హిస్టరీ, టెంపరరీ ఫైల్స్, ఫ్లాష్ కూకీస్‌లను తొలగించాలంటే Click & Clean పొందండి. స్క్రీన్‌క్యాప్చర్, ఫుల్‌స్క్రీన్, టాస్క్‌మేనేజర్... లాంటి సౌకర్యాలు ఉన్నాయి. సిస్టంలోని చెత్తని కూడా తీసేయవచ్చు. http://goo.gl/PPbnz * బ్యాకింగ్, ఈ-షాపింగ్... లాంటి సర్వీసుల్ని సురక్షితం చేసుకోవాలంటే SaferChromeను పొందండి. http://goo.gl/9dmeC ఓన్లీ ఒపేరాలో!! ఏదైనా వెబ్ సర్వీసుకి క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని ఎంపిక చేసుకోవాలంటే Better Password Generator ఎక్స్‌టెన్షన్‌ను పొందండి. అడ్రస్‌బార్ పక్కన వచ్చిన తాళం గుర్తుపై క్లిక్ చేసి ఎన్ని క్యారెక్టర్లలో పాస్‌వర్డ్‌లో ఉండాలో సెట్ చేసుకోవాలి. తర్వాత Letters, Numbers, Specials ఎంచుకునిGenerateపై క్లిక్ చేయాలి. http://goo.gl/VLz7u * ట్యాబ్ బార్‌లో కాకుండా కావాల్సిన వెబ్ సర్వీసుల్ని ప్రత్యేక జాబితాగా పెట్టుకోవాలంటే Tab Vaultను పొందండి. కావాల్సిన వెబ్ సర్వీసుని ఓపెన్ చేసి ఐకాన్ గుర్తుపై క్లిక్ చేసి Save Tabెపౖ క్లిక్ చేయండి. http://goo.gl/a5fuu * ఎక్కువ ట్యాబ్‌లను ఓపెన్ చేసినప్పుడు డూప్లికేట్ ట్యాబ్‌లు ఏమైనా ఉంటే తొలగించాలంటే No Dupes ఉంది.http://goo.gl/c0JlK * బ్రౌజర్ ట్యాబ్‌ల్లో ఎన్ని వెబ్‌సర్వీసుల్ని ఓపెన్ చేశారో తెలుసుకోవాలంటే Tab Counterతో సాధ్యమే.http://goo.gl/AqWQO ఎక్స్‌ప్లోరర్‌లో ఎన్నో! ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ కూకీస్‌పై ఓ కన్నేయాలంటే CT Cookie Spy యాడ్‌ఆన్‌ని పొందండి.http://goo.gl/caf7c * ఒకవేళ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 వాడుతున్నట్లయితేTracking Protection Lists జాబితా నుంచి కావాల్సిన వాటిని బ్రౌజర్‌కి యాడ్ చేసుకుని ప్రైవసీని పెంచుకోవచ్చు.www.iegallery.com/addons * బింగ్ టూల్‌బార్‌ని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని మరింత సురక్షిత పద్ధతిలో వెబ్ సర్వీసుల్ని యాక్సెస్ చేయవచ్చు. అందుకు http://goo.gl/8SjRd లోకి వెళ్లి Bing Barను ఇన్‌స్టాల్ చేయండి. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి