బ్యాటరీ ఛార్జింగ్ ఇలా అధనం (Eenadu 14/06/2012)
ఆధునిక ఫోన్ వాడుతున్నారా? ఇట్టే ఛార్జింగ్ అయిపోతోందా? ఇవిగో చిట్కాలు! పాటించండి! ప్రయోజనం పొందండి! ఎక్కువ 'బ్రైట్‌నెస్' పెట్టుకుని మొబైల్‌వాడితే ఛార్జింగ్ అంతే సంగతులు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎక్కువ శాతం స్మార్ట్ మొబైళ్లు 'లైట్ సెన్సర్' సదుపాయంతో బ్రైట్‌నెస్‌ను ఆటోమాటిక్‌గా మార్చేస్తుంటాయి. అంతమాత్రాన బ్యాటరీ ఆదా అయిపోదు. మాన్యువల్‌గా బ్రైట్‌నెస్ తగ్గించి పెట్టుకోవాలి. * ఎడ్జ్, త్రీజీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్... సర్వీసులతో మొబైల్‌ని వాడుతుంటే ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. వాటిని అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ వాడకం తగ్గించొచ్చు. త్రీజీ నుంచి 2జీలోకి మారడం ద్వారా కూడా కొంత ఆదా చేయవచ్చు * సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, సోషల్ నెట్‌వర్క్ అప్‌డేట్స్... లాంటి నోటిఫికేషన్స్‌ని ఎనేబుల్ చేయడం వల్ల బ్యాటరీ ఖర్చు పెరుగుతుంది. అనివార్యమై పెట్టుకోవాల్సి వస్తే సౌండ్, వైబ్రేషన్‌ని ఆఫ్‌లో ఉంచితే మంచిది. * ఏవేవో అప్లికేషన్లు ఓపెన్ చేసి హోం బటన్‌ని నొక్కితే ఓపెన్ చేసిన అప్లికేషన్లు క్లోజ్ అవ్వవు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. బ్యాటరీ ఖర్చు మరింత పెరుగుతుంది. టాస్క్ మేనేజర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే వాటిని క్లోజ్ చేయాలి. *రింగ్‌టోన్లకు వైబ్రేషన్‌ను ఆఫ్ చేయండి. కీబోర్డ్ టైపింగ్‌కు వైబ్రేషన్ ఎఫెక్ట్ ఉంటే టర్న్‌ఆఫ్ చేయండి. అప్లికేషన్లు అదనం బ్లాక్‌బెర్రీ మొబైల్‌లో Battery Saver Pro అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని బ్యాటరీ వాడకాన్ని తగ్గించవచ్చు. గ్రాఫ్‌లతో వాడకాన్ని చూడొచ్చు. Auto on offతో ఒకేసారి నెట్‌వర్క్ సర్వీసుల్ని డిసేబుల్ చేయవచ్చు. 'డిస్‌ప్లే మేనేజర్'తో బ్రైట్‌నెస్, రింగ్‌టైం... లాంటివి సెట్ చేసుకోవచ్చు. 'బ్యాటరీ ఎలర్ట్స్'తో ఎప్పటికప్పుడు వాడకానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని అందిస్తుంది.http://goo.gl/DSSFn * ఇలాంటిదే మరోటి Battery Watch Free Power Consumption Monitor, http://goo.gl/6PiaE. * ఐఫోన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిందే Battery Life Pro.ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో బ్యాటరీ వాడకాన్ని మానిటర్ చేస్తుంది. బ్యాటరీ టిప్స్‌తో సామర్థ్యాన్ని పెంచవచ్చు. సిస్టం మానిటర్‌తో మెమొరీ వాడకం, రన్ అవుతున్న అప్లికేషన్స్... సమాచారాన్ని పొందే వీలుంది.http://goo.gl/lOR3v *ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుంటే Juice Defenderను పొందండి. 5 Preset Profilesలో దేన్నయినా సెట్ చేసుకోవచ్చు. http://goo.gl/aZZtu*Easy Battery Saver మరోటి.Normal Mode, General Power Saving mode, Intelligent Power Saving modes... లాంటి ఐదు మోడ్స్ ఉన్నాయి. ఒక్కో అప్లికేషన్ ఎంతెంత ఛార్జింగ్ ఖర్చవుతుందో చూడొచ్చు.http://gog.gl/ZP0SN * ఆండ్రాయిడ్ యూజర్లకు Battery Aid ప్రత్యేకం. దీంట్లోని టాస్క్ మేనేజర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అప్లికేషన్స్‌ని క్లోజ్ చేయవచ్చు. Battery Low అవ్వగానే బీప్ శబ్దంతో అలర్ట్ చేస్తుంది. http://goo.gl/Mcioh * నోకియా వాడుతుంటే Advanced Battery Saver Free ఉంది. సుమారు 30 శాతం సామర్థ్యాన్ని పెంచొచ్చు.http://goo.gl/Hn7At * ఇలాంటిదే మరోటి Nokia Battery Monitor, http://goo.gl/tZQJC ఇవి వాడుతున్నారా? అదనపు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లతో ఛార్జింగ్ సమస్య లేకుండా చేసుకోవచ్చు కూడా. అవే Battery Cases. వాటిల్లో ముందు వరుసలో నిలిచిందే Mophie's Juice Pack. బిల్డ్‌ఇన్ బ్యాటరీతో రూపొందించారు. ఛార్జ్ చేసిన బ్యాటరీ కేస్‌ని మొబైల్‌కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ధర సుమారు 3000.http://goo.gl/C5Rq1 * మరోటి Third Rail. ఇది ఉంటే అదనపు బ్యాటరీ చేతిలో ఉన్నట్టే. ఫోన్‌ని డాక్ చేసి వాడుకునేందుకు అనువుగా కేస్‌ని రూపొందించారు. http://goo.gl/Pxkwv * పోర్టబుల్ ఛార్జర్లు మరో మార్గం. Energizer అందుకు ఉదాహరణ. మొబైల్‌ని పిన్ ద్వారా ఛార్జింగ్‌కి కనెక్ట్ చేస్తే చాలు ఛార్జింగ్ అవుతుంది. సుమారు రూ.3000 నుంచి అందుబాటులో ఉన్నాయి. http://goo.gl/28GrR *Loftek High Quality Dual USB 5000MAH మరోటి. ధర సుమారు 2,700. http://goo.gl/LMubR * మరిన్ని పోర్టబుల్ ఛార్జర్ల కోసం http://goo.gl/NpTpB మరికొన్ని... * కొన్ని అప్లికేషన్లు జీపీఎస్ సేవల్ని వాడుకుంటాయి. దీంతో అప్లికేషన్లు ఆన్‌లో ఉన్నంత వరకూ వై-ఫై, జీపీఎస్ సదుపాయాలు ఆన్‌లోనే ఉంటాయి. బ్యాటరీ ఖర్చు ఎక్కువవుతుంది. ఆయా అప్లికేషన్లతో అవసరం తీరగానే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిసేబుల్ చేయండి. * ఆండ్రాయిడ్ యూజర్లు Settings-> Applicationsలోకి వెళ్లి బ్యాటరీ వాడకాన్ని చూడొచ్చు. ఏయే అప్లికేషన్లకు ఎంతెంత ఖర్చవుతుందో తెలుసుకోవచ్చు. వాటిని అక్కర్లేకుంటే క్లోజ్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిది. * ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి డౌన్‌లోడ్ చేసే లైవ్ వాల్ పేపర్లు, ఇతర థర్డ్‌పార్టీ యానిమేటెడ్ విడ్జెట్స్ ఎక్కువ ఛార్జింగ్‌ని తీసుకుంటాయి. అలాంటి వాటిని వాడకపోవడం మంచిది. * అక్కర్లేని అప్లికేషన్లను సులభంగా తొలగించేందుకుTask Manager ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రత్యేకం. టూల్‌ని రన్ చేసి అక్కర్లేని వాటిని సెలెక్ట్ చేసి Kill Selectచేస్తే సరి. http://goo.gl/GXlBg * వాడని అప్లికేషన్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకుUninstaller ఉంది. సెర్చ్ ద్వారా కావాల్సిన అప్లికేషన్‌ని వెతికి తొలగించొచ్చు. http://goo.gl/g75C8 * Easy Uninstaller మరోటి. ఒకేసారి ఒకటి అంటే ఎక్కువ అప్లికేషన్లు అన్‌ఇన్‌స్టాల్ చేసే వీలుంది. http://goo.gl/Dl7MO ========================================================================= ========================================================================= |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి