వెబ్ విహారానికి కొత్త రెక్కలు!! (Mozilla Firefox tips_31/08/2012)
వెబ్ విహారానికి కొత్త రెక్కలు!! ఫైర్‌ఫాక్స్ వాడుతున్నారా? చాలా సౌకర్యాలు తెలిసే ఉండవచ్చు...మరి సరికొత్తవి ఉన్నాయని తెలుసా? అందుకు యాడ్‌ఆన్స్ సిద్ధం! నిక్షిప్తం చేసుకుంటే పని సులభం! వెబ్ విహారానికి దోహదపడే బ్రౌజర్‌లో అదనపు సౌకర్యాలను తెలుసుకోవడం చాలా అవసరం. అందుకు సిద్ధంగా ఉండే యాడ్‌ఆన్స్‌ను వాడుకుంటే పని సులువవుతుంది. అలా ఫైర్‌ఫాక్స్‌లో వేలల్లో యాడ్‌ఆన్లను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు కూడా. వాటి సాయంతో బుక్‌మార్క్‌లను థంబ్‌నెయిల్ బాక్స్‌ల్లో మేనేజ్ చేసుకోవచ్చు. స్పీడ్ డయల్‌గా పెట్టుకునే వీలుంది. జీమెయిల్, క్యాలెండర్, గూగుల్ రీడర్, జీమెయిల్ ల్యాబ్స్.... అన్నింటినీ ఒకే చోట పొందొచ్చు. ఎప్పుడూ 'న్యూ ట్యాబ్' ఎందుకు? 'ట్యాబ్ కింగ్'ని తీసుకోవచ్చు. ఏదైనా వెబ్ పేజీని ప్రింట్ తీసుకోవాలనుకుంటే రైట్‌క్లిక్‌లోనే 'ప్రింట్ ప్రివ్యూ' చూడొచ్చు.. ఇలా ఒకటా రెండా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వాటి సంగతులేంటో తెలుసుకుందాం!! బుక్‌మార్క్‌లకు ప్రత్యేకం వెబ్ విహారరలో ఆకట్టుకున్న వాటిని బుక్‌మార్క్ పెట్టుకుని వీలున్నప్పుడు చూస్తుంటాం. వ...