మీ మొబైల్ కు కొత్త రెక్కలు! (Eenadu mobile tips_09/08/2012)

చేతిలో మొబైల్‌ ఉంటే... మెయిల్‌ చెక్‌ చేశామా? సెర్చ్‌ కొట్టామా?ట్వీట్‌ పోస్ట్‌ చేశామా? అంటే సరికాదు! ఇంకా చాలానే చేయవచ్చు! అందుకు యుటిలిటీ టూల్స్‌ చాలానే ఉన్నాయి!! ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత!
ఫోన్‌, పీసీ, ట్యాట్‌.... వాడేది ఏదైనా ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటే అప్‌డేట్‌ కానట్టే! కొత్త వాటిని ఎప్పటి కప్పుడు అందిపుచ్చుకోవాల్సిందే. మీకు తెలుసా? ఎక్కువ పేజీలున్న పీడీఎఫ్‌ ఫైల్స్‌ని మొబైల్‌లోనే ఒకే పీడీఎఫ్‌ ఫైల్‌గా మార్చేయవచ్చు. ఫైల్‌కి పాస్‌వర్డ్‌తో తాళం వేయవచ్చు. 18 సాఫ్ట్‌వేర్‌లు చేసే పనులన్నింటినీ కలిపి ఒకే అప్లికేషన్‌లో పొందొచ్చు... ఇలా చెబుతూ వెళితే చాలానే ఉన్నాయి! అవేంటో వివరంగా తెలుసుకుందాం!మొత్తం పద్దెనిమిది
ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో 18 ముఖ్యమైన పనుల్ని చేసే ఉచిత సాఫ్ట్‌వేర్‌ సిద్ధంగా ఉంది. పేరు Android Assistant. మొబైల్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఫోన్‌ పీసీయూ, మెమొరీ, బ్యాటరీ వివరాల్ని తెలుసుకునేందుకు Monitor Status ఉంది. 'ప్రాసెస్‌ మేనేజర్‌'తో అనవసరమైన అప్లికేషన్లను వెతికి ఏరేయవచ్చు. 'సిస్టం క్లీన్‌'తో బ్రౌజర్‌ హిస్టరీ, క్లిప్‌బోర్డ్‌, జీమెయిల్‌ హిస్టరీలను తుడిచేసే వీలుంది. 'ఫైల్‌ మేనేజర్‌'తో ఫైల్స్‌ని సులువుగా చూడొచ్చు. 'బ్యాచ్‌ అన్‌ఇన్‌స్టాల్‌'తో ఒకేసారి నాలుగైదు అప్లికేషన్స్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేసే వీలుంది. 'వాల్యూమ్‌ కంట్రోల్‌'తో సౌండ్‌ సిస్టంని మేనేజ్‌ చేసుకునే వీలుంది.http://goo.gl/g2AJH
పీడీఎఫ్‌లకు ప్రత్యేకం
పీడీఎఫ్‌ ఫైల్స్‌తో అనేక పనుల్ని చేయాలంటే PDF Utility-Liteపొందండి. ఇన్‌స్టాల్‌ చేయగానే గుర్తులతో ఆప్షన్లు కనిపిస్తాయి. Splitతో ఒకే పీడీఎఫ్‌గా ఉన్న ఫైల్‌ని ముక్కలు చేయవచ్చు. Mergeతో ఎక్కువ పేజీలున్న పీడీఎఫ్‌ని ఒకే ఫైల్‌గా మార్చుకునే వీలుంది. పీడీఎఫ్‌లో ఉన్న ఇమేజ్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి పొందే వీలుంది. ఇమేజ్‌లను పీడీఎఫ్‌ ఫైల్‌గా మార్చేయవచ్చు కూడా. ముఖ్యమైన పీడీఎఫ్‌లకు తాళం వేయవచ్చు కూడా.http://goo.gl/702SA
తాళం వేస్తే!
నోకియాలోని అప్లికేషన్లను ఇతరులు వాడకుండా చేయాలనుకుంటే LockOnApps టూల్‌తో సాధ్యమే. ఇన్‌స్టాల్‌ చేసి పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే సరి. గ్యాలరీలు, మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌కి కూడా సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. http://goo.gl/5gXhl
మొబైల్‌కి చేరే కాల్స్‌ని ఆటోమాటిక్‌గా రికార్డ్‌ చేయాలంటే Call Recorder ఉంది. మైక్రోఎస్‌డీ కార్డ్‌లోని స్పేస్‌ ఆధారంగా రికార్డింగ్‌ చేయవచ్చు. http://goo.gl/ibygO
'యాపిల్‌' ఉందా?
బ్యాటరీ వాడకాన్ని ఆకట్టుకునే థీమ్స్‌తో సెట్‌ చేసుకోవాలంటే Battery Magic ఉంది. బ్యాటరీ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. http://goo.gl/J6p7V
ఐఫోన్‌ 4 లో ఆకట్టుకునే Smiley, Emoticon Keyboardకావాలనుకుంటే Emoji Icons అప్లికేషన్‌ని పొందండి. ఎసెమ్మెస్‌, నోట్స్‌, కాంటాక్ట్స్‌, క్యాలెండర్‌, ఇతర అప్లికేషన్లతో వాటిని వాడుకోవచ్చు. http://goo.gl/L5yhx
ఐఫోన్‌ను పాత కాలపు డైలర్‌ ల్యాండ్‌లైన్‌లా మార్చేయాలనుకుంటే Dial Plate అప్లికేషన్‌ని పొందండి. ల్యాండ్‌లైన్‌పై డయల్‌ చేసిన మాదిరిగానే డయల్‌ చేయవచ్చు. http://goo.gl/R9Wji
మొబైల్‌లోని మెమొరీ యూసేజ్‌ని ప్రత్యేక అప్లికేషన్‌తో తెలుసుకోవాలంటే Disc Space నిక్షిప్తం చేసుకోండి.http://goo.gl/Lg6pQ
రహస్యం అనుకుంటే!
మీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోని మెసేజ్‌లను భద్రం చేయడానికి Secret SMS పొందండి. మెసేజ్‌లను మాయం చేయడం మాత్రమే కాకుండా 'ఎన్‌క్రిప్ట్‌' చేయవచ్చు.http://goo.gl/Ef3bY
వై-ఫై కనెక్షన్‌ ద్వారా మొబైల్‌లోని డేటాని పీసీలోకి సింక్రనైజ్‌ చేయాలంటే SimpleSync పొందండి. ఫొటోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌, అడ్రస్‌బుక్‌, మ్యూజిక్‌ ఫైల్స్‌ని, వీడియో ఫైల్స్‌, అడ్రస్‌బుక్‌, మెసేజ్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఇదో సులువైన మార్గం. ఇదో డేటా బ్యాక్‌అప్‌ టూల్‌గా చెప్పుకోవచ్చు. http://goo.gl/SB0CJ
యాంటీవైరస్‌తో మొబైల్‌ని సురక్షితం చేసుకోవాలంటేDr.Web Anti-Virus Lightని ఉచితంగా పొందొచ్చు. వైరస్‌లు, మాల్వేర్‌లు, స్పామ్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.http://goo.gl/FqB0y
ఇలా రాస్తే చాలు
తాకేతెరపై కాంటాక్ట్స్‌ని వెతకాలంటే టైప్‌ చేయక్కర్లేదు. పలకపై రాసినట్టుగా వేలితో తెరపై రాస్తే చాలు ఆయా అక్షరాలతో కూడిన కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో కనిపిస్తాయి. అలాంటిదే Gesture Search. ఒక్క కాంటాక్ట్స్‌నే కాకుండా బుక్‌మార్క్‌లు, అప్లికేషన్స్‌, మ్యూజిక్‌ ఫైల్స్‌ని కూడా ఇలా వెతికే వీలుంది. http://goo.gl/BWq5j
డాల్ఫిన్‌ బ్రౌజర్‌ వాడుతుంటే బుక్‌మార్క్‌లను మైక్రోఎస్‌డీ కార్డ్‌లోకి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. అందుకుBookmarks to SD ప్రత్యేకం. http://goo.gl/W1jxb
ఎప్పటికప్పుడు మొబైల్‌ని రీబూట్‌ చేసి మెమొరీ వాడకాన్ని మెరుగు పరుచుకోవాలంటే Fast Rebootవాడండి. http://goo.gl/jKFlm


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు