వెబ్‌ విహారానికి కొత్త రెక్కలు!! (Mozilla Firefox tips_31/08/2012)

వెబ్‌ విహారానికి కొత్త రెక్కలు!!
ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నారా? చాలా సౌకర్యాలు తెలిసే ఉండవచ్చు...మరి సరికొత్తవి ఉన్నాయని తెలుసా? అందుకు యాడ్‌ఆన్స్‌ సిద్ధం! నిక్షిప్తం చేసుకుంటే పని సులభం!
వెబ్‌ విహారానికి దోహదపడే బ్రౌజర్‌లో అదనపు సౌకర్యాలను తెలుసుకోవడం చాలా అవసరం. అందుకు సిద్ధంగా ఉండే యాడ్‌ఆన్స్‌ను వాడుకుంటే పని సులువవుతుంది. అలా ఫైర్‌ఫాక్స్‌లో వేలల్లో యాడ్‌ఆన్లను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు కూడా. వాటి సాయంతో బుక్‌మార్క్‌లను థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో మేనేజ్‌ చేసుకోవచ్చు. స్పీడ్‌ డయల్‌గా పెట్టుకునే వీలుంది. జీమెయిల్‌, క్యాలెండర్‌, గూగుల్‌ రీడర్‌, జీమెయిల్‌ ల్యాబ్స్‌.... అన్నింటినీ ఒకే చోట పొందొచ్చు. ఎప్పుడూ 'న్యూ ట్యాబ్‌' ఎందుకు? 'ట్యాబ్‌ కింగ్‌'ని తీసుకోవచ్చు. ఏదైనా వెబ్‌ పేజీని ప్రింట్‌ తీసుకోవాలనుకుంటే రైట్‌క్లిక్‌లోనే 'ప్రింట్‌ ప్రివ్యూ' చూడొచ్చు.. ఇలా ఒకటా రెండా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వాటి సంగతులేంటో తెలుసుకుందాం!!బుక్‌మార్క్‌లకు ప్రత్యేకం
వెబ్‌ విహారరలో ఆకట్టుకున్న వాటిని బుక్‌మార్క్‌ పెట్టుకుని వీలున్నప్పుడు చూస్తుంటాం. వాటిని మరింత సులభంగా మేనేజ్‌ చేసుకోవడానికి 'వ్యూమార్క్స్‌' యాడ్‌ఆన్‌ ఉంది. Open View marks పై క్లిక్‌ చేయగానే అప్పటివరకూ పెట్టుకున్న అన్ని బుక్‌మార్క్‌లు కొత్త ట్యాబ్‌లో థంబ్‌నెయిల్‌ బాక్సుల్లో ఓపెన్‌ అవుతాయి. పాయింటర్‌ని బాక్స్‌పై పెడితే సైట్‌ పేరు, అడ్రస్‌,Description, Created Date... వివరాలు కనిపిస్తాయి. రైట్‌క్లిక్‌ చేసి బుక్‌మార్క్‌లను ఓపెన్‌ చేయడం మాత్రమే కాకుండా ఒకే క్లిక్కుతో లింక్‌ని కాపీ చేసుకోవచ్చు. అందుకు Copy Link Location ఉంది. 'ఎడిట్‌' ఆప్షన్‌తో ఇమేజ్‌ని అప్‌లోడ్‌ చేసి థంబ్‌నెయిల్‌ బాక్స్‌లో కావాల్సిన పిక్చర్‌ని పెట్టుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో బుక్‌మార్క్‌లు ఉంటే సెర్చ్‌బాక్స్‌తో వెతకొచ్చు. థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల సైజుని కూడా పెంచుకునే వీలుంది. http://goo.gl/tlX7A
* వెబ్‌ పేజీల్లో కావాల్సిన పేజీని ప్రింట్‌ ప్రివ్యూ చూసి ప్రింట్‌ తీసుకోవాలంటే... పేజీలోనే రైట్‌క్లిక్‌ చేసి పని ముగించేయవచ్చు. అందుకు Print/Print Preview ఉంది. ఇన్‌స్టాల్‌ చేసి పేజీలో రైట్‌క్లిక్‌ చేస్తే మెనూలో అదనంగా 'ప్రింట్‌' కనిపిస్తుంది. 'ప్రింట్‌ ప్రివ్యూ'లో పేజీ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. http://goo.gl/KJb3L
మూడు ఒకేచోట
గూగుల్‌ అందించే అదనపు సౌకర్యాల్ని జీమెయిల్‌లోనే యాక్సెస్‌ చేయాలంటే Integrated Gmailయాడ్‌ఆన్‌ ఉండాల్సిందే. నిక్షిప్తం చేయగానే జీమెయిల్‌ రీఫ్రెష్‌ అయ్యి రూపాన్ని మార్చుకుంటుంది.ఇన్‌బాక్స్‌, గూగుల్‌ రీడర్‌, గూగుల్‌ క్యాలెండర్‌ జాబితాగా కనిపిస్తాయి. మొదట్లో ప్రివ్యూ వీడియో ద్వారా వీటిని వాడుకునే విధానాన్ని చూడొచ్చు. Inbox బాక్స్‌లో ఉండి మెయిలింగ్‌ వ్యవహరాల్ని చూడొచ్చు. Reader లోకి వెళ్లి వెబ్‌ వరల్డ్‌లో చోటు చేసుకుంటున్న విశేషాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఆసక్తిగా అనిపించిన వాటిని గూగుల్‌ ప్లస్‌ నెట్‌వర్క్‌లో షేర్‌ చేయవచ్చు. వ్యక్తిగతంగా మెయిల్‌ రూపంలో పంపవచ్చు. ఇకCalendarసర్వీసుతో షెడ్యూల్‌ని నిర్వహించుకోవచ్చు. ఈవెంట్‌ ప్లానింగ్‌ చేసుకుని ఎసెమ్మెస్‌ ఎలర్ట్‌లను పెట్టుకోవచ్చు. మీ మొబైల్‌ని గూగుల్‌ క్యాలెండర్‌తో సింక్రనైజ్‌ చేయవచ్చు.http://goo.gl/6WFm8
* కొత్త ట్యాబ్‌ విండోని ఒకేలా వాడుకుని బోరింగ్‌గా అనిపిస్తే New Tab King యాడ్‌ఆన్‌ని ప్రయత్నిచండి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసి 'ప్లస్‌' బటన్‌ని నొక్కగానే 'ట్యాబ్‌ కింగ్‌' సౌకర్యాలతో కొత్త ట్యాబ్‌ వస్తుంది. అప్పటి వరకూ ఎక్కువ సార్లు ఓపెన్‌ చేసి వెబ్‌ సర్వీసులు జాబితాగా కనిపిస్తాయి. ఆయా సైట్‌లను ఎన్నిసార్లు సందర్శించామో కూడా సంఖ్యని చూపిస్తుంది. వెబ్‌ సర్వీసుల్ని థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో కూడా పెట్టుకోవచ్చు. ట్యాబ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌ని సెట్‌ చేసుకోవచ్చు. Configure Optionsతో మరిన్ని మార్పులు చేసుకునే వీలుంది.http://goo.gl/LnTpe
* ట్యాబ్‌ విండోలను 'పిన్‌' చేసి పెట్టుకున్నప్పటికీ ఆయా వెబ్‌ సర్వీసుల అప్‌డేట్‌ని నోటిఫికేషన్‌ అలర్ట్‌ని పొందాలంటే Tab Badge ఉంది. ఉదాహరణకు పిన్‌ చేసి పెట్టుకున్న ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ స్టేటస్‌ వివరాల్ని ఎరుపు రంగులో చూపిస్తుంది.http://goo.gl/jfe2s
మొత్తం తుడిచేస్తుంది!
బ్రౌజింగ్‌ హిస్టరీ, కూకిస్‌... లాంటి వివరాల్ని హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. టూల్స్‌లోని ఆప్షన్స్‌తో ఆయా వివరాల్ని తొలగిస్తుంటాం. దీనికి మరో సులువైన మార్గం ఉంది తెలుసా? అదే Click & Clean. ఇన్‌స్టాల్‌ చేయగానే టూల్‌బార్‌లో కనిపించకపోతేCustomizeద్వారా ఆప్షన్స్‌ని టూల్‌బార్‌లోకి డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ చేయాలి. ఇక బాణం గుర్తుపై క్లిక్‌ చేసి Clear Browsing Dataతో హిస్టరీని తొడిచేయవచ్చు. కావాల్సిన వాటిని మాత్రమే చెక్‌ చేసి క్లియర్‌ చేసే వీలుంది. 'యాక్టీవ్‌ విండో'ని మినహాయించి మిగతా అన్ని ట్యాబ్‌లను క్లోజ్‌ చేయడానికి Clear UI ఉంది. మొత్తం అన్ని ట్యాబ్‌ విండోలను Clear All Tabs తో తీసేయవచ్చు. Preferencesఆప్షన్‌తో మరిన్ని అదనపు సౌకర్యాల్ని పొందుపరచుకోవచ్చు. ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌, ట్విట్టర్‌ల్లోని హిస్టరీని కూడా తీసివేసే వీలుంది. అంతేకాదు! సిస్టంలోని ఇన్‌స్టాల్‌ చేసిన ఎక్స్‌టర్నల్‌ అప్లికేషన్లను కూడా రన్‌ చేయవచ్చు. అందుకు 'ప్రిఫరెన్సెస్‌' మెనూలోని External Applicationని సెలెక్ట్‌ చేసుకుని Run Nowపై క్లిక్‌ చేస్తే సరి.http://goo.gl/HEuBw
* బ్రౌజర్‌ని రోజూ ఒకే రంగుల్లో చూసి విసుకొస్తే నిమిషానికో థీమ్‌ని మార్చేయండి. Personas Rotatorతో ఇది సాధ్యమే. సుమారు 65,000 స్కిన్స్‌ని నిర్ణీత సమయంలో బ్రౌజర్‌కి అప్త్లె అయ్యేలా చేయవచ్చు. వచ్చిన టూల్‌బార్‌లోని 'ఆప్షన్స్‌'లోకి వెళ్లి Rotation Interval టైంని సెట్‌ చేసుకోవాలి. మాన్యువల్‌గా స్కిన్‌ని మారేలా చేయాలంటే టూల్‌బార్‌లోని Rotate Nextపౖ క్లిక్‌ చేయాలి. అయితే, స్కిన్స్‌ని ఆటోమాటిక్‌గా పొందేందుకు Personas Plusయాడ్‌ఆన్‌ని కూడా ఇన్‌స్టాల్‌ చేయాలి.http://goo.gl/ZbW8h,http://goo.gl/xjcor
ఇంకా వినొచ్చు!
ఏదైనా వెబ్‌ పేజీలోని టెక్స్ట్‌ని సిస్టమే చదివి వినిపించాలంటే?అబ్బో! అందుకు ప్రత్యేక 'టెక్స్ట్‌ టూ వాయిస్‌' సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయాల్సిందే అంటారా? అక్కర్లేదు. ఒక బుల్లి యాడ్‌ఆన్‌తో ఇట్టే సాధ్యం. అదే Text to Voice. నిక్షిప్తం చేయగానే స్పీకర్‌ గుర్తుతో ఐకాన్‌ టూల్‌బార్‌లోకి చేరిపోతుంది. ఇక వెబ్‌ పేజీలోని ఏదైనా మేటర్‌ని సెలెక్ట్‌ చేసి గుర్తుపై క్లిక్‌ చేస్తే టెక్ట్స్‌ని చదివి వినిపిస్తుంది. మొత్తం పూర్తయ్యాక చదివిన ఫైల్‌ని ఎంపీ3 ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా. Preferencesతో వాయిస్‌, భాషని మార్చుకోవచ్చు. http://goo.gl/9PHUN
ఒకే క్లిక్కు చాలు
యూట్యూబ్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేయడానికి అనేక డౌన్‌లోడ్‌ మేనేజర్‌ టూల్స్‌ ఉన్నాయి. అయితే, సిస్టం స్పేస్‌ ఎక్కువ వృథా కాకుండా బ్రౌజర్‌లో యాడ్‌ఆన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే Easy Youtube Video Downloader ఉంటే సరి. యూట్యూబ్‌ సైట్‌లోకి వెళ్లి ఏదైనా వీడియోని ఓపెన్‌ చేస్తే వీడియో కింది భాగంలో Download ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి వివిధ ఫార్మెట్‌ల్లో వీడియోని డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. http://goo.gl/N9EkO
* వెబ్‌ పేజీల్లోని రంగుల్ని మార్చుకుని ప్రింట్‌ కాస్ట్‌, మానిటర్‌ పవర్‌ యూసేజ్‌ని తగ్గించాలంటే Colorificటూల్‌ని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేయండి. Color Inversion, Brightness Scaling, Hue Filtering సెట్టింగ్స్‌ని కావాల్సినమేర మార్చుకునే వీలుంది. http://goo.gl/qqCGd

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు