ఎక్కడైనా సరే... ఇవి ఉంటే భలే! (software tips_16/08/2012)


ఇంట్లో పీసీనో, ల్యాపీనో ఉంది... కావాల్సినవి ఇన్‌స్టాల్‌ చేసుకుందామంటే... సెక్యూరిటీ నిమిత్తం అడ్మిన్‌రైట్స్‌ లేవు! ఇక ఆఫీస్‌ సిస్టంలోనైతే.. అన్నీ ఆంక్షలే! ఏదీ ఇన్‌స్టాల్‌ అవ్వదు! అనివార్యమై అదనపు అప్లికేషన్స్‌ని వాడుకోవాల్సివస్తే? ఇలా చేస్తే సరి!
ముఖ్యమైన డాక్యుమెంట్‌ని ఇంట్లోనో.. ఆఫీస్‌లోనో ఎడిట్‌ చేసి పంపాలి. కానీ... అడ్మిన్‌రైట్స్‌ లేకపోవడం వల్లో.. ఇతర పరిమితుల వల్లో సిస్టంలోని ఆఫీస్‌ అప్లికేషన్స్‌ని పొందలేరు. అప్పుడెలా? మీకు నచ్చిన ఫొటోలు, వీడియోలను డీవీడీపై రైట్‌ చేయాలి. కానీ, సంబంధిత సాఫ్ట్‌వేర్‌ని యాక్సెస్‌ చేయలేని పరిస్థితి. ఏం చేయాలి? ఫంక్షన్‌కి తీసుకున్న ఫొటోలను ఎడిట్‌ చేయాలి. అడోబ్‌ ఫొటోషాప్‌ సిస్టంలో లేదు. మరో మార్గం ఏంటి?.. ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ముఖ్యమైన పనుల్ని చేసుకోవాలంటే? అందుకు అనువైన అప్లికేషన్లు చాలానే ఉన్నాయి. ఇట్టే సిస్టంలో ఒదిగిపోయి అవసరాల్ని తీర్చేస్తాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం!!అంతా ఆన్‌లైన్‌లోనే!
డాక్యుమెంట్స్‌, వర్క్‌షీట్స్‌్‌, ప్రజంటేషన్స్‌ని ఎడిట్‌ చేయాలంటే సిస్టంలో ఎమ్మెస్‌ ఆఫీస్‌ ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. వెబ్‌ అప్లికేషన్స్‌తో ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అందుకు మీరు సర్వీసులో సభ్యులైతే చాలు. బ్రౌజరే ఆఫీస్‌ అప్లికేషన్‌లా మారిపోతుంది. ఎడిట్‌ చేసిన డాక్యుమెంట్‌లు, వర్క్‌షీట్‌లను ఇతరులతో షేర్‌ చేసుకోవడం కూడా చాలా సులభం. ఫైల్స్‌ని ఆన్‌లైన్‌లోనే భద్రం చేసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా పొందే వీలుంది. ఇలా ఆన్‌లైన్‌లో సేవ్‌ చేసిన ఫైల్స్‌ మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న స్కైడ్రైవ్‌లో అందుబాటులో ఉంటాయి. ఆఫీస్‌ వెబ్‌ అప్లికేషన్లు స్కైడ్రైవ్‌్‌తో ముడిపడి పని చేస్తాయి. హోం పేజీలోని పైన కనిపించేCreate Word Document, Create Excel Workbook, Create PowerPoint Presentation,Create OneNote Notebook లతో ఆఫీస్‌ ఫైల్స్‌ని రూపొందించుకోవచ్చు. వన్‌నోట్‌ అప్లికేషన్‌తో ముఖ్యమైన అపాయింట్‌మెంట్స్‌ని జాబితాగా క్రియేట్‌ చేసుకుని సులువుగా మేనేజ్‌ చేసుకోవచ్చు.http://office.microsoft.com/en-in/web-apps/
ఇలాంటిదే మరోటి 'జోహో వర్క్‌ ఆఫీస్‌'. డాక్యుమెంట్‌లను ఎడిట్‌ చేయడం మాత్రమే కాకుండా మరిన్ని అదనపు పనుల్ని ఎలాంటి ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియలు లేకుండానే ముగించొచ్చు. 'టాస్క్‌ మేనేజర్‌'తో రోజువారీ పనుల్ని మేనేజ్‌ చేసుకోవచ్చు. సిస్టంపై పని గంటల్ని ట్రాక్‌ చేసే వీలుంది. ఛార్ట్‌లతో మొత్తం వివరాల్ని పొందే వీలుంది. www.zoho.com
ఫొటోలకు ప్రత్యేకం
ఫొటోలను ఎడిట్‌ చేయడానికి ఎలాంటి ఇన్‌స్టలేషన్‌ ప్రాసెస్‌ లేకుండా ఆన్‌లైన్‌లోనే సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా వాడుకునే వెబ్‌ సర్వీసు కావాలనుకుంటే Pixlr Image Editorగురించి తెలుసుకోవాలి. హోం పేజీలోని 'ఓపెన్‌ ఫొటో ఎడిటర్‌'పై క్లిక్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ మాదిరిగానే ఎడిటింగ్‌ టూల్‌ని ఆన్‌లైన్‌లోనే ఓపెన్‌ చేయవచ్చు. మెనూబార్‌, టూల్‌బార్‌, వివిధ రకాల ప్యాలెట్స్‌తో ఓపెన్‌ అవుతుంది. సిస్టంలోకి కాపీ చేసుకున్న ఫొటోలను 'ఓపెన్‌ ఇమేజ్‌ ఫ్రం కంప్యూటర్‌'తో పొందొచ్చు. 'టైప్‌ టూల్‌'తో ఇమేజ్‌లో టెక్స్ట్‌ని ఇన్‌సర్ట్‌ చేయవచ్చు.Adjustment, Filter మెనూలతో ఫొటోలను వివిధ రకాల ఎఫెక్ట్‌లను పొందవచ్చు. 'హిస్టరీ ప్యాలెట్‌'తో వాటిని మరోసారి చెక్‌ చేసుకోవచ్చు. 'స్టాంపింగ్‌' చేసుకునే వీలుంది. ఇంచుమించు అడోబ్‌ ఫొటోషాప్‌ మాదిరిగా పని చేస్తుంది. ఎడిటింగ్‌ పూర్తయ్యాక ఫైల్‌ మెనూలోని 'సేవ్‌'తో సిస్టంలో భద్రం చేసుకోవచ్చు.http://pixlr.com/editor
యాడ్‌ఆన్స్‌ చాలు...
సాఫ్ట్‌వేర్‌లు, యూఎస్‌బీ డ్రైవ్‌లు, అదనపు డిస్క్‌లు ఎందుకనుకుంటే బ్రౌజర్‌నే ఆసరాగా చేసుకుని అదనపు అప్లికేషన్లను రన్‌ చేయవచ్చు. అందుకు మీరు వాడుతున్న బ్రౌజర్లలో ఉన్న యాడ్‌ఆన్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. బ్రౌజర్‌ని రీస్టార్ట్‌ చేయగానే ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్‌ బ్రౌజర్‌లో ప్రత్యేక గుర్తుతో కనిపిస్తుంది.* ఫొటోలను క్రోమ్‌ బ్రౌజర్‌లోనే ఎడిట్‌ చేసుకునేలాAviary యాడ్‌ఆన్‌ని అందిస్తున్నారు. 'యాడ్‌ టూ క్రోమ్‌'పై క్లిక్‌ చేసి బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు. వివిధ గుర్తుల్ని ఫొటోల్లో ఇన్‌సర్ట్‌ చేసుకునే వీలుంది. http://goo.gl/OaaH7
బ్రౌజర్‌ హిస్టరీని సురక్షితం చేసుకోవాలంటే Click & Cleanయాడ్‌ఆన్‌తో చేయవచ్చు. ఒకే క్లిక్కుతో బ్రౌజింగ్‌ హిస్టరీ, టైప్‌ చేసిన యూఆర్‌ఎల్స్‌, ఫ్లాష్‌ కూకీస్‌, క్యాచీ మెమొరీలను తుడిచేస్తుంది. మీరు చేస్తున్న ఆన్‌లైన్‌ యాక్టివిటీలపై ఓ కన్నేస్తుంది. http://goo.gl/Qndnf
ప్రజంటేషన్స్‌ క్రియేట్‌ చేయాలంటే ఎమ్మెస్‌ ఆఫీసే కానక్కర్లేదు. చిన్న యాడ్‌ఆన్‌తో ఆకట్టుకునేలా రూపొందించొచ్చు. SlideRocketక్రోమ్‌ యాడ్‌ఆన్‌తో ఇది సాధ్యమే. గూగుల్‌ డ్రైవ్‌లో భద్రం చేసుకుని ఇతరులతో పంచుకోవచ్చు. ప్రజంటేషన్స్‌కి సిస్టంలోని ఆడియో, వీడియోలను జతచేయవచ్చు. లింక్‌, embedకోడ్‌లతో బ్లాగు, సైట్‌ల్లో ఆయా ప్రజంటేషన్స్‌ని పొందుపరచొచ్చు.
ఇట్టే రైట్‌ చేస్తుంది
ఇంట్లో, ఆఫీస్‌లో ఎక్కడైనా అనుకోకుండా సీడీ, డీవీడీలను సిస్టంలో రైట్‌ చేయాల్సివస్తే! Infra Recorderఉంటే సరి. ఇదో ఓపెన్‌సోర్స్‌ అప్లికేషన్‌. విండోస్‌ సెవెన్‌, ఎక్స్‌పీ, విస్టా యూజర్లకు ఇది ప్రత్యేకం. డ్యుయల్‌ లేయర్‌ డీవీడీను కూడా సపోర్ట్‌ చేస్తుంది. వీడియో, ఆడియో సీడీలను క్రియేట్‌ చేయవచ్చు. డిస్క్‌లను ఐఎస్‌ఓ ఇమేజ్‌ ఫైల్స్‌గా మార్చుకుని తీరిగ్గా రైట్‌ చేసుకోవచ్చు. http://infrarecorder.org
ఎక్స్‌పీ యూజర్లకు ప్రత్యేకంగా రూపొందించిన మరోటిCDBurnerXP.అన్ని రకాల డిస్క్‌లను దీంట్లో రైట్‌ చేయవచ్చు. బర్నింగ్‌ ప్రాసెస్‌ పూర్తయ్యాక 'డేటా వెరిఫికేషన్‌' చేస్తుంది. http://cdburnerxp.se/en/home
అన్నీ డ్రైవ్‌లోనే...
సిస్టం హార్డ్‌డిస్క్‌, స్టార్ట్‌అప్‌, సపోర్టింగ్‌ ఫైల్స్‌ అక్కర్లేకుండానే పోర్టబుల్‌ డ్రైవ్‌, క్లౌడ్‌ డ్రైవ్‌లోనో అప్లికేషన్స్‌ని కాపీ చేసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవాలంటే అందుకు అనువైన అప్లికేషన్‌ ఒకటుంది. అదే 'పోర్టబుల్‌ ఆప్స్‌'. కొత్త వెర్షన్‌ 10 అందుబాటులో ఉంచారు. దీన్ని నిక్షిప్తం చేసుకుంటే 'ఆప్స్‌ డిక్షనరీ'లోని అన్ని అప్లికేషన్స్‌ని ఇట్టే యాక్సెస్‌ చేయవచ్చు. యుటిలిటీ టూల్స్‌ అన్నీ గుత్తగా పొందినట్టే అన్నమాట. ఇన్స్‌స్టలేషన్‌ ప్రక్రియలో భాగంగా ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌ని సలెక్ట్‌ చేసుకోవాలి. డిక్షనరీలో పొందుపరిచిన అప్లికేషన్స్‌లోని కావాల్సిన వాటిని చెక్‌ చేసి 'నెక్స్ట్‌'పై క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మొత్తం అప్లికేషన్లు సిస్టం ట్రేలో ప్రత్యేక గుర్తుతో కనిపిస్తాయి. మైక్రోఎస్‌డీ కార్డ్‌, ఐపాడ్‌, పెన్‌డ్రైవ్‌, పోర్టబుల్‌ హార్‌డిస్క్‌ల్లోకి కాపీ చేసుకుని వాడుకోవచ్చు. ఆయా యుటిలిటీ అప్లికేషన్ల సరికొత్త వెర్షన్లను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.http://portableapps.com
మరికొన్ని...
సిస్టం సమాచారం మొత్తాన్ని ఆడిట్‌ చేసి తెలుసుకోవాలంటే WinAudit టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి. దీనికి ఇన్‌స్టలేషన్‌ అక్కర్లేదు. రన్‌ చేయగానే ప్రత్యేక విండోలో పీసీకి సంబంధించిన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సమాచారాన్ని జాబితాగా చూపిస్తుంది. ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్లు, లైసెన్స్‌ సమాచారం, మెమొరీ యూసేజ్‌, ప్రాసెసర్‌ మోడల్‌, స్టార్ట్‌అప్‌ ప్రొగ్రామ్‌లు, నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌... ఇలా అన్ని వివరాల్ని మోనిటర్‌ చేయవచ్చు.http://goo.gl/Dn0lo
తెరపై కనిపించే వాటిని స్క్రీన్‌షాట్‌ తీసుకోవడానికిShottyసులభమైన మార్గం. మొత్తం డెస్క్‌టాప్‌నే కాకుండా కావాల్సిన మేర సెలెక్ట్‌ చేసుకుని ఇమేజ్‌గా మార్చొచ్చు. ఇమేజ్‌ ఎడిటర్‌తో తీసుకున్న వాటిని ఎడిటింగ్‌ చేయవచ్చు కూడా. టెక్స్ట్‌ ఇన్‌సర్ట్‌ చేయవచ్చు. http://goo.gl/uNuW7
బ్యాంకు ఎకౌంట్‌ వివరాలు, యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌... లాంటి ముఖ్యమైన సమాచారాన్ని టెక్స్ట్‌ ఫైల్‌లో టైప్‌ చేసి ఇతరులు చూడకుండా పాస్‌వర్డ్‌తో తాళం వేయాలంటే LockNoteసిద్ధంగా ఉంది. ఫైల్‌లో మేటర్‌ని టైప్‌ చేసి ఫైల్‌ మెనూలోని 'ఛేంజ్‌ పాస్‌వర్డ్‌'లోకి వెళ్లి క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని సెట్‌ చేయాలి. క్లోజ్‌ చేసి ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే పాస్‌వర్డ్‌ అడుగుతుంది.http://goo.gl/CQP1y


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు