వేగంగా టైపింగ్ కి.. ఇవిగో మార్గాలు!!! (Typing tips_23/08/12)

కంప్యూటర్‌... ల్యాపీ... ట్యాబ్లెట్‌.. మొబైల్‌... ఇలా పరికరం ఏదైనా... టైపింగ్‌ తప్పని సరి! అదీ క్వర్టీ కీబోర్డ్‌పైనే!మరి, మీ టైపింగ్‌ సామర్థ్యం ఎంత? కీబోర్డ్‌లోని అక్షరాల్ని వెతుక్కుంటున్నారా? వేగంగా టైప్‌ చేసేందుకు చాలా మార్గాలున్నాయి!
విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు... ఎవరైనా నేటి టెక్‌ ప్రపంచంలో దూసుకుపోవాలంటే కచ్చితంగా ఒకటి నేర్చుకోవడం అనివార్యం. అదే టైపింగ్‌. పాత కాలంలో టైపింగ్‌ నేర్చుకోవడం అంటే పెద్ద ప్రక్రియే. ఇన్స్‌స్టిట్యూట్‌కి వెళ్లాలి. లోయరో.. హయ్యరో... పూర్తి చేయాలి! అబ్బో పెద్ద తతంగమే అనుకుని నీరసించొద్దు. టైపింగ్‌ని సులభమైన పద్ధతిలో నేర్చుకునేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్గాలు చాలానే ఉన్నాయి. వీడియో గేమ్స్‌ మాదిరిగా టైపింగ్‌ అప్లికేషన్స్‌ని రూపొందించారు. ఇంకేముందీ ఆడుతూ.. పాడుతూ.. సాధన చేస్తే మెయిళ్లు, డాక్యుమెంట్లు, ఎసెమ్మెస్‌లు టైప్‌ చేసి పంపడం ఇట్టే సాధ్యం!క్షణాల్లో సాధన!
టైపింగ్‌ సులువుగా నేర్చుకోడానికి www.keybr.comఓ సులభమైన వేదిక. వెబ్‌ సర్వీసుని వాడుకోవాలంటే సభ్యుల వ్వక్కర్లేదు. ఒకే క్లిక్కుతో సాధన ప్రారంభించొచ్చు. హోం పేజీలో విజువల్‌ గ్రాఫిక్స్‌తో కీబోర్డ్‌ లేఅవుట్‌ కనిపిస్తుంది. దాని ఆధారంగా వేళ్లని కదుపుతూ పైన కనిపించే టెక్స్ట్‌ మేటర్‌ని టైప్‌ చేయాలి. స్టేటస్‌ బార్‌లో Speed, Errors కనిపిస్తాయి. రోజువారీ ప్రోగ్రెస్‌ని రికార్డ్‌ చేస్తూ టైపింగ్‌ వేగాన్ని పెంచుకోవాలంటే సర్వీసులో సభ్యులవ్వాల్సిందే. ఫేస్‌బుక్‌ ఐడీ వివరాలతో లాగిన్‌ అయ్యే వీలుంది. టైపింగ్‌కి సంబంధించిన బేసిక్స్‌ని తెలుసుకోవడానికి How to Typeట్యాబ్‌ ఉంది. కమ్యూనిటీలోని టాప్‌ స్కోర్‌ సాధించిన వారిని జాబితా చూడాలంటే High Scores లోకి వెళ్లాలి.
అన్నీ ఇందులోనే!
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టైపింగ్‌ నేర్చుకునే మార్గాల్ని అందిస్తోంది Rapid Typing Zone. సాఫ్ట్‌వేర్‌ రూపంలో టూల్స్‌ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని నిక్షిప్తం చేసుకోవచ్చు. అందుకు హోం పేజీలో 'ర్యాపిడ్‌ టైపింగ్‌' టూల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. Beginner, Intermediate, Expert లెవల్స్‌ ఉన్నాయి. మీ టైపింగ్‌ స్కిల్స్‌ని తెలుసుకోవడానికి హోం పేజీలో 'ఆన్‌లైన్‌ టైపింగ్‌ టెస్ట్‌' విభాగం ఉంది. పేరు, టెక్స్ట్‌ మేటర్‌ని సెలెక్ట్‌ చేసి 'స్టార్ట్‌ టెస్ట్‌'పై క్లిక్‌ చేయాలి. టెస్ట్‌ పూర్తయ్యాక Doneనొక్కాలి. దీంతో Word Per Minutes, Char Per Minutes, Accuracyవివరాలతో రిపోర్ట్‌ జనరేట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో పాల్గొన్న ఇతరుల ఫలితాల్ని కూడా జాబితాగా చూడొచ్చు. ఇక వీడియో గేమ్స్‌ ఆడుతూ టైపింగ్‌ సాధన చేయడానికి 'టైపింగ్‌ గేమ్స్‌' విభాగం ఉంది. Word Mountain, Fast Typer 2, Type Fast... ఇలా సుమారు 20 గేమ్స్‌ ఉన్నాయి.టైపింగ్‌లోని మెళకువల్ని తెలుసుకోవడానికి 'టైపింగ్‌ టెక్నిక్‌' విభాగం ఉంది.www.rapidtyping.com
కోర్సు చేసినట్టే!
ఉచితంగా టైపింగ్‌ కోర్సుని ఇంట్లో కూర్చునే పూర్తి చేయాలంటే 'గుడ్‌ టైపింగ్‌' వెబ్‌ సర్వీసు సిద్ధంగా ఉంది. సైట్‌లో సభ్యులై టైపింగ్‌ పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. మొదటి దశలో అన్ని వేళ్లను వాడుతూ ఎలా టైపింగ్‌ చేయాలో తెలిపే పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం '27 గైడ్‌ లెసన్స్‌'ని సాధన చేయాలి. మొత్తం 22 కీబోర్డ్‌ లేఅవుట్స్‌ ఉన్నాయి. ఎలాంటి డౌన్‌లోడ్స్‌ లేకుండానే కోర్సు పూర్తి చేయవచ్చు. మీ సాధనకి సంబంధించిన వేగం, తప్పులు, కచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేసుకునే వీలుంది. ఇమేజ్‌ల ఆధారంగా టైపింగ్‌ చిట్కాల్ని సులువుగా నేర్చుకోగలగడం దీంట్లోని ప్రత్యేకత. www.goodtyping.com.
ఆడుతూ... పాడుతూ...
నైపుణ్యాన్ని సాధించడంలో కూడా ఫన్‌ ఉండాలంటూ ఆటలతో టైపింగ్‌ని నేర్చుకునేలా ముందుకొచ్చిందేEnse-Lnag.హోం పేజీలో టుటోరియల్స్‌, గేమ్స్‌, స్కూల్స్‌, సర్టిఫికేషన్‌... విభాగాలు కనిపిస్తాయి. టైపింగ్‌కి సంబంధించిన బేసిక్స్‌ని 'టుటోరియల్స్‌'లోకి వెళ్లి చూడొచ్చు. ఒక్కో 'లెసన్‌' సెలెక్ట్‌ చేసి తెరపై కనిపించే లేఅవుట్‌ ఆధారంగా సాధన చేసే వీలుంది. 'గేమ్స్‌' విభాగంలోకి వెళ్లి ఇష్టమైన ఆటని సెలెక్ట్‌ చేసుకుని టైపింగ్‌ని ప్రాక్టీస్‌ చేయవచ్చు. టైపింగ్‌ రేస్‌, టైపింగ్‌ ఒలంపిక్‌, టైప్‌ ఫర్‌ యువర్‌ లైఫ్‌, టైపింగ్‌ చెఫ్‌... లాంటి గేమ్స్‌ ఉన్నాయి. http://games.sense-lang.org
* ఇలాంటిదే మరోటి 'టైపింగ్‌ వెబ్‌'. ఇదో ఆన్‌లైన్‌ టైపింగ్‌ ట్యూటర్‌. అన్ని వయస్సుల వారికీ అనువుగా పాఠాల్ని రూపొందించారు. కమ్యూనిటీలో సభ్యులై ఉచితంగా సాధన చేయవచ్చు. Net Speed, Gross Speed Accurancy, Problem keys... వివరాలతో టైపింగ్‌ టెస్ట్‌ ఫలితాలు జనరేట్‌ అవుతాయి.www.typingweb.com
ఇదో సాఫ్ట్‌వేర్‌!
సాఫ్ట్‌వేర్‌ రూపంలో సిస్టంలో ఒదిగిపోయి టైపింగ్‌ని నేర్పించే సాఫ్ట్‌వేర్‌లు కావాలనుకుంటే KeyBlaze Typing Tutor టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. విండోస్‌, మ్యాక్‌లకు ప్రత్యేక వెర్షన్లని అందుబాటులో ఉంచారు. 'ఫింగర్‌ గైడ్‌'తో వేళ్లను కీబోర్డ్‌లోని ఆయా కీలపై ఎలా కదిలించాలో తెలుసుకోవచ్చు. తప్పు కీని నొక్కితే అలారం సౌండ్‌ చేస్తుంది. తప్పులన్నీ ఎరుపు రంగులో హైలెట్‌ అవుతాయి. 'నెంబర్‌ కీ' లెసన్స్‌ కూడా ఉన్నాయి. టైపింగ్‌ టెస్ట్‌ ఫలితాల్ని ప్రత్యేక ఫైల్‌ ఫార్మెట్‌లో భద్రం చేసుకోవచ్చు. గేమ్స్‌ ద్వారా టైపింగ్‌ వేగాన్ని పెంచొచ్చు. www.nchsoftwa re.com/typingtutor/index.html
'టిప్‌' టాప్‌గా...
విండోస్‌, మ్యాక్‌, లినక్స్‌ యూజర్లకు ఉచితంగా టైపింగ్‌ నేర్పేస్తానంటూ ముందుకొచ్చింది Tipp10.సుమారు 2 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి. బేసిక్స్‌ నుంచి టైపింగ్‌ని ప్రాక్టీస్‌ చేసేవారికి ఇది ప్రత్యేకం. 'ఇంటిలిజంట్‌ ట్రాకింగ్‌ సిస్టం'తో ఎక్కువసార్లు చేసే తప్పుల్ని ప్రత్యేకంగా తెలుసుకుని టైపింగ్‌ వేగాన్ని మరింత పెంచొచ్చు. 'ఫింగర్స్‌' ఛార్ట్‌తో ఒక్కో వేలి నుంచి చేస్తున్న టైపింగ్‌ తప్పుల్ని error rate per fingerలో చూడొచ్చు. సుమారు 20 పాఠాలు ఉన్నాయి. ఫాంట్‌, టెక్స్ట్‌ రంగుల్ని మార్చుకుని విజువల్‌గా ఆకట్టుకునేలా చేయవచ్చు. చేసిన తప్పులు, స్పీడ్‌... లాంటి వివరాలతో జనరేట్‌ చేసిన రిపోర్ట్‌లను ప్రింట్‌ తీసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు www.tipp10.com/en/download/
మొబైల్‌ మాటేంటి?
మొబైల్‌, ట్యాబ్లెట్‌ల్లో టైపింగ్‌ వేగాన్ని పెంచుకోవాలంటే అందుకు చాలానే మార్గాలున్నాయి. వివిధ రకాల కీబోర్డ్‌ లేఅవుట్స్‌తో మార్పులు చేసుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్‌ వాడుతున్నట్లయితే 'గూగుల్‌ ప్లే' నుంచి కావాల్సిన వాటిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీకు 'టచ్‌పాల్‌ కీబోర్డ్‌' తెలుసా? స్టోర్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. క్వర్టీ కీబోర్డ్‌లో ఒక్కో అక్షరాన్ని టైప్‌ చేయకుండా 'స్త్లెడ్‌' చేస్తే సరిపోతుంది. Intelligent next-word Prediction తో టైప్‌ చేయబోయే పదాల్ని ముందే ఇన్‌సర్ట్‌ చేసేస్తుంది. దీంతో టైపింగ్‌ మరింత వేగంగా పూర్తవుతుంది. వాయిస్‌ ఇన్‌పుట్‌తో మెసేజ్‌లు పంపే వీలుంది. http://goo.gl/h2lex
* షార్ట్‌కట్‌లు సెట్‌ చేసుకుని టైపింగ్‌ వేగాన్ని పెంచాలంటే Perfect Keyboard Free ఉంది. కీబోర్డ్‌ లేఅవుట్స్‌ని కూడా కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా కీబోర్డ్‌లను ఎంపిక చేసుకోవచ్చు.http://goo.gl/2erHe
* ట్యాబ్లెట్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందిందే SwiftKey 3 Tablet. టైప్‌ చేయబోయే అక్షరాల్ని ముందే గ్రహించి టైప్‌ చేసేస్తుంది. ట్యాపింగ్‌ కాకుండా 'స్త్లెడింగ్‌' పద్ధతిలో టైపింగ్‌ చేయవచ్చు. http://goo.gl/CTAup
* ఒక్కో అక్షరాన్ని ఒక్కో కీగా తెరపై కనిపించేలా పెట్టుకుని టైప్‌ చేయాలంటే Big Buttons Keyboard ఉంది.http://goo.gl/ulbPc
యాపిల్‌కి ప్రత్యేకం
ఐఫోన్‌ వాడుతున్నారా? ఐట్యూన్స్‌ నుంచి అదనపు కీబోర్డ్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుని టైపింగ్‌ని మరింత సులభం చేసుకోవచ్చు. Smart Keyboard Lite తో అది సాధ్యమే. టైప్‌ చేస్తుండగానే రాబోయే పదాల్ని జాబితాగా కనిపిస్తాయి. కావాల్సిన పదంపై ట్యాప్‌ చేస్తే చాలు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో కూడా కీబోర్డ్‌ని వాడుకోవచ్చు. http://goo.gl/vmmo8
* ఇలాంటిదే మరోటి 'ఫాస్ట్‌ కీబోర్డ్‌'. http://goo.gl/z34wH
* గేమ్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని టైపింగ్‌ని సాధన చేయాలంటే ControlShift Retro Space Action Typing Gameసిద్ధంగా ఉంది. గేమ్‌ స్టార్ట్‌ అవ్వగానే తెరపై కొన్ని పదాలు కనిపిస్తాయి. వాటిని టైప్‌ చేస్తూ స్పేస్‌క్రాఫ్ట్‌తో పేల్చేయాలి. http://goo.gl/0yLEm
* క్వర్టీ కీప్యాడ్‌పై మీ టైపింగ్‌ వేగాన్ని పరీక్షించుకోవాలంటే 'ఫాస్ట్‌ టైప్‌ 2' గేమ్‌ ఉంది. నిర్ణీత సమయంలోపు మీరెన్ని పదాల్ని టైప్‌ చేయగలుగుతారు అనేదే వీడియో గేమ్‌.http://goo.gl/V2MBB
ఆండ్రాయిడ్‌ ఆటలు
టైప్‌ రైటర్‌ మీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ తెరపై ప్రత్యక్షం అవుతుంది. పైన కనిపించే పదాల్ని కరెక్ట్‌గా టైప్‌ చేయాలి. మీ సామర్థ్యం ఆధారంగా గేమ్‌ లెవల్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అందుకే గేమ్‌కి 'టైప్‌రైటర్‌' అని పేరు పెట్టారు. గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/5iKUH
* మరో గేమ్‌ Typing Class. టైపింగ్‌ వేగాన్ని మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతంది. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో రూపొందించారు. http://goo.gl/bX4dT
* మరికొన్ని... Typing Master- http://goo.gl/LJ58, Speedy Type- http://goo.gl/kcLRe


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు