పాటిస్తే కిటుకులు... ఎన్నో ప్రయోజనాలు! (Applications tips_16/08/2012)


పాటిస్తే కిటుకులు... ఎన్నో ప్రయోజనాలు!
యూట్యూబ్‌లో వీడియో పాఠాలు... మొబైల్‌ అప్లికేషన్లకు ప్రత్యేక అడ్డాలు... బుర్రకు పదునుపెట్టే పజిళ్లు... గూగుల్‌ సెర్చ్‌లో మ్యాజిక్‌... డాస్‌బాక్స్‌తో క్లాసిక్‌ గేమ్స్‌... అండ్రాయిడ్‌లో అదిరే అప్లికేషన్లు... ఇలా పాఠకులు బోలెడు చిట్కాలు చెబుతున్నారు.
వీడియో పాఠాలు
యూట్యూబ్‌లో సినిమాలు, వీడియో పాటలు చూస్తుంటాం. ఇదే మాదిరిగా మెడిసిన్‌కి సంబంధించిన వీడియోలను కూడా చూడొచ్చు. సుమారు 400 గంటలకు పైగా వీడియోలున్నాయి. మెడిసిన్‌ చేస్తున్న విద్యార్థులకు ఉపయోగం. మొత్తం వీడియో ఫైల్స్‌ జాబితాగా కనిపిస్తాయి. కావాల్సిన వాటిని డౌన్‌లోడ్‌ టూల్స్‌తో సిస్టంలో పొందే వీలుంది. http://goo.gl/XLsl
- శ్రీనివాసులు, ఆస్ట్రేలియా
ఎందరో మహానుభావులు!
దేశానికి స్వేచ్ఛని అందించిన మహానుభావుల గురించి తెలుసుకోవాలంటే http://indianfreedomfighters.inలోకి వెళ్లండి. హోం పేజీలో అమరవీరుల జాబితా కనిపిస్తుంది. ఫొటోలతో పాటు సమాచారాన్ని పొందు పరిచారు.ఇలాంటిదే మరోటి http://goo.gl/6MrlW ప్రొఫైల్‌ ఫొటోలతో పాటు అదనపు వివరాల్ని పొందొచ్చు.
గణితంపై ఆసక్తి ఎక్కువా? అయితే, ఇవిగో సైట్‌లు..http://mathforum.orgవిద్యార్థులందరినీ ఓ తాటిపైకి తెచ్చి విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది.
తరగతుల ఆధారంగా పిల్లలకు గణితాన్ని బోధిస్తా అంటూ ముందుకొచ్చింది www.aaamath.com. గ్రేడ్‌ల వారీగా పిల్లలకు లెక్కల్ని బోధించొచ్చు.
వరుసగా మరికొన్ని... www.coolmath.c om, www.figurethis.org, www.mathcats.com, www.easymaths.org, www.mathleague.com, www.funbra in.com/numbers.html
- ఎం.వి. సాయికిరణ్‌, తుని,
అన్నీ కలగలుపు!
బుర్రకి పదునుపెట్టే పజిళ్లు, గణిత సమస్యలు, పోటీ పరీక్షల సమాచారం కావాలంటే http://youngmathematicians.we bs.com సైట్‌లో సభ్యులైతే సరి. మ్యాథ్స్‌ వీడియోలను కూడా చూడొచ్చు. విభాగాల వారీగా సమాచారాన్ని పొందుపరిచారు.ఫొటోల్లో మార్పులు చేస్తూ ఆకట్టుకునేలా చేయాలంటేwww.photofunia.comలోకి వెళ్లండి. హోం పేజీలోని కావాల్సిన ఇమేజ్‌ స్త్టెల్‌ని సెలెక్ట్‌ చేసి ఫొటోని అప్‌లోడ్‌ చేయవచ్చు.
- పావని, యామిని, వైజాగ్‌
మ్యాజిక్‌.. మ్యాజిక్‌!
నిత్యం గూగుల్‌ సెర్చ్‌ చేస్తుంటారుగా... ఒక్కసారి సెర్చ్‌బాక్స్‌లో google gravity అని కొట్టి సెర్చ్‌ రిజల్ట్స్‌లోని మొదటి లింక్‌పై క్లిక్‌ చేయండి. గూగుల్‌ సెర్చ్‌ పేజీ మొత్తం ఒక్కసారిగా తెర కిందికి పడిపోతుంది.మరోసారి గూగుల్‌ సెర్చ్‌ బాక్స్‌లో google sphereఅని టైప్‌ చేసి సెర్చ్‌ రిజల్ట్స్‌లో మొదటి లింక్‌పై క్లిక్‌ చేయండి. గూగుల్‌ హోం పేజీలోని మెనూలన్నీ గుండ్రంగా తిరుగుతూ కనిపిస్తాయి.
*  నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. ఆన్‌లైన్‌ వీడియోగేమ్స్‌కి కొదవే లేదు. అలాంటి సైట్‌లు కొన్ని... www.myrealgames.com, www.myplaycity.com, www.game top.com, www.freegamepick.com, www.miniclip.com, www.yupgames.com ఆన్‌లైన్‌లోనే కాదు. కొన్ని సైట్‌ల నుంచి గేమ్స్‌ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా.
- వై.దిలీప్‌ కుమార్‌ రెడ్డి, బీటెక్‌, కోరాటమడ్డి.  

ఆండ్రాయిడ్‌కి ప్రత్యేకం..
చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే గూగుల్‌ స్టోర్‌లోకి వెళ్లండి. ఆటలు, అప్లికేషన్లే కాదు, ఆదాయాన్ని అందించేవి కూడా ఉన్నాయి. వాటిల్లో AppRedeemఒకటి. ఇన్స్‌స్టాల్‌ చేసుకుని ఆయా అప్లికేషన్లపై రివ్యూలు రాయడం ద్వారా కొంత మొత్తాన్ని ఆర్జించొచ్చు. మీకొచ్చే రివార్డ్‌ పాయింట్స్‌ ఆధారంగా డబ్బు మీ పేపాల్‌ ఎకౌంట్‌లో డిపాజిట్‌ అవుతుంది. http://goo.gl/8o8rxఎస్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌, కాల్‌ లాగ్స్‌ని జీమెయిల్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవాలంటే SMS Backup అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఉచితంగా గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. దీన్ని రన్‌ చేయడానికి ముందుగా జీమెయిల్‌లోని IMAP ఎనేబుల్‌ చేయాలి. http://goo.gl/swE1w
ఫోన్‌ని వాకీటాకీలా మార్చాలంటే ఇది ఉంటే సరి. ఇన్‌స్టాల్‌ చేసి తెరపై కనిపించే బటన్‌ని నొక్కితే కుటుంబసభ్యులు, స్నేహితులకు వినిపిస్తుంది. సమాధానంగా అవతలి వ్యక్తి బటన్‌ నొక్కి తన స్పందనని తెలియజేస్తారు. http://goo.gl/1Agj5
మొబైల్‌లో టైపింగ్‌ని మరింత సులభతరం చేస్తూ ముందుకొచ్చింది SlideIT Soft Keyboard. ఇన్‌స్టాల్‌ చేసి వివిధ రకాల కీబోర్డ్‌ లేఅవుట్స్‌తో టైపింగ్‌ చేసుకోవచ్చు. టైపింగ్‌కి షార్ట్‌కట్స్‌ని పెట్టుకునే వీలుంది. http://goo.gl/JwrTP
- జి.ఎస్‌.ఎన్‌. చౌదరి, హనుమాన్‌ జంక్షన్‌, కృష్ణా జిల్లా
గూగుల్‌ డ్రైవ్‌
న్‌లైన్‌లో ఉచితంగా స్టోరేజ్‌ స్పేస్‌ని అందించే సైట్‌లు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు గూగుల్‌ అందిస్తున్న 'డ్రైవ్‌' ఒకటి. మీరు వాడుతున్న జీమెయిల్‌ ఐడీతోనే దీంట్లోకి లాగిన్‌ అవ్వొచ్చు. ఉచితంగా 5 జీబీ అందిస్తున్నారు. అదనపు స్పేస్‌ కావాలంటే ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. పీసీ, మ్యాక్‌, ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఆండ్రాయిడ్‌ మొబైళ్లలో గూగుల్‌ డ్రైవ్‌ని యాక్సెస్‌ చేసే వీలుంది. సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా సిస్టంలోని ఇన్‌స్టాల్‌ చేసుకుని డేటాని ఆటో సింక్రనైజ్‌ చేయవచ్చు.http://drive.google.com
- కేవీఆర్‌పీ తేజ, విజయవాడ
డాస్‌బాక్స్‌ కావాలా?
విండోస్‌ సెవెన్‌, విస్టా, 2000 ఓఎస్‌ వెర్షన్లు వాడుతున్నారా? డాస్‌ వెర్షన్‌లో రూపొందిన క్లాసిక్‌ గేమ్స్‌ని వాడాలంటే 'డాస్‌బాక్స్‌' అప్లికేషన్‌ ఉంటే సరి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసి డాస్‌తో పని చేసే అన్ని వీడియో గేమ్స్‌, థర్డ్‌పార్టీ అప్లికేషన్లను పని చేసేలా చేయవచ్చు. ఫోల్డర్లనుMountచేయడం ద్వారా ఇది సాధ్యమే. www.dosbox.com                                                                                                         

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు