తెలివిగా వాడేందుకు తీరైన దారులు! (Eenadu Thursday_24/01/13)
పీసీ.. ల్యాపీ... నెట్‌బుక్... ఏదో ఒకటి ఉండే ఉంటుంది... మరి, ఏదో వాడేస్తున్నాం అంటే సరి కాదు... కొత్త ఏడాదైనా కాస్త తెలివిగా వాడండి! అందుకు మార్గాలు అనేకం! ఒ కే పంథాలో వాడుతూ వెళితే కొత్త కంప్యూటర్ కూడా కుమ్మరి పురుగులానే పని చేస్తుంది. కొత్త ఏడాది అంతా కొత్త కొత్తగా ఉండాలనుకునే దాని విషయంలోనూ పాటించండి. పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సరికొత్త చిట్కాలు తెలుసుకోవాలి. పనిని సులభం చేసుకోవాలి. కొత్త టూల్స్ వాడాలి. అనేక ప్రయోజనాల్ని పొందాలి. అందుకు పైసా ఖర్చు అక్కర్లేదు. ఉచితంగానే అన్నీ అందుబాటులో ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా చూద్దాం! పవర్ అందించండి! సిస్టంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే టెక్నీషియన్‌ని సంప్రదించకుండా అప్లికేషన్ రూపంలోనే పీసీని పర్యవేక్షించే సేవకుడిని పెట్టుకోవచ్చు. అదే PowerSuite LITE 2013. ఉచిత వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని సిస్టం మొత్తాన్ని స్కాన్ చేసి లోపాల్ని తెలుసుకోవచ్చు. అందుకు Speed Tools, System Optimization, Disk Optimization విభాగాలున్నాయి. ఫ్రీ వెర్షన్‌లో కొన్ని సౌకర్యాల్ని వాడుకోవచ్చు. http://goo.gl/yzkN5 * ...