అందానికి ద్రాక్ష

తియ్యని పుల్లని ద్రాక్ష పండ్లు తినడానికే కాదు, సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ద్రాక్షలు చర్మానికి మెరుపు తీసుకొస్తాయి. వయసు చాయలు కనిపించకుండా చేస్తాయి.
కొన్ని ద్రాక్ష పళ్లని చేతులతో ముద్దగా చేసుకుని, దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై, చర్మం కాంతిమంతం అవుతుంది. చర్మం పొడిబారే సమస్యతో బాధపడే వారు గుడ్డులోని తెల్లసొనకు, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి రాసుకుని పది నిమిషాల తరవాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. కళ్ల చుట్టూ ముడతలు వస్తున్నప్పుడూ ద్రాక్ష పండ్లతో వాటిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షను రెండు ముక్కలుగా చేసుకుని కంటి చుట్టూ కొన్ని క్షణాలు రాయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు తగ్గిపోతాయి.
అయిదు స్పూనుల పెరుగుకి, మూడు స్పూనుల ద్రాక్షరసం, ఒక స్పూను నారింజ రసం కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌లా వేసుకోవచ్చు. ఇది వయసు పైబడిన ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ద్రాక్షలకు మొటిమలూ, వాటి వల్ల వచ్చే మచ్చల్నీ తగ్గించే గుణం ఉంది. నాలుగైదు ద్రాక్ష పళ్లని మెత్తగా చేసి, దానికి చెంచాలో పావు వంతు గోధుమ పిండినీ, కాస్త బేకింగ్‌ సోడానీ కలిపి మొటిమలొస్తున్న ప్రదేశంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
Eenadu direct link: http://eenadu.net/vasundara/Vasundarainner.aspx?qry=beauty

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు