కొత్త్తకొత్తగా మొబైల్ అప్లికేషన్స్.! (Eenadu_03/01/13)
వెర్షన్లు మారిపోతాయి... కొత్త మోడళ్లు కవ్విస్తాయి... తాకేతెర సౌకర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత యాపిల్ ఐఫోన్‌దే. వెర్షన్ ఐదుతో గతేడాదే మురిపించింది. ఇక ఈ ఏడాది 'ఐఫోన్ 5ఎస్'కి రంగం సిద్ధం చేయనుంది. సూపర్ హెచ్‌డీ కెమెరా, బ్యాటరీ బ్యాక్‌అప్ ప్రధాన ఆకర్షణలుగా ఫోన్‌ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఆరు రంగుల్లో మొబైల్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇది రావచ్చనేది అంచనా. 'ఐటీవీ' కూడా... ఇప్పటి వరకూ ఐఫోన్, ట్యాబ్లెట్, ఐప్యాడ్, మిని... లాంటి వాటినే డిజైన్ చేసిన యాపిల్ కంపెనీ కొత్త ఏడాదిలో ఐటీవీని ప్రపంచానికి పరిచయం చేయనుంది. మరో ప్లేగ్రౌండ్ ఎక్స్‌బాక్స్ 360తో గేమింగ్ రంగాన్ని ఊపేసిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు కొత్త వెర్షన్‌తో ముస్తాబవుతోంది. పేరు 'ఎక్స్‌బాక్స్ 720'. మోషన్ డిటెక్షన్ టెక్నాలజీనే కాకుండా త్రీడీ కళ్లజోళ్లతో మరింత భిన్నమైన అనుభూతితో వీడియో గేమ్స్ ఆడేలా రూపొందిస్తున్నారు. ఈబుక్స్‌లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమైన అమెజాన్ ఇప్పుడు కిండిల్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. హార్డ్‌వేర్‌లో అత్యాధునిక మార్పులు లేకపోయినప్పటికీ సాఫ్ట్‌వేర్‌లో వినూత్న సౌకర్యాల్ని అందించనుంది. ఆమెజాన్ అప్‌స్టోర్, అమెజాన్ ఎంపీ3, క్లౌడ్ ప్లేయర్, కిండిల్ బుక్స్‌ని మొబైల్‌లో సులువుగా పొందవచ్చు. ఫోన్‌లో ఏర్పాటు చేసే బార్‌కోడ్ స్కానర్‌తో అమెజాన్ స్టోర్‌లో షాపింగ్ చేయడం కూడా సులువే. కొత్త కళ్లజోళ్లు ఇప్పటి వరకూ త్రీడీ కళ్లజోళ్లు తెలుసు. మరి,Augmented Reality Glasses తెలుసా? ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్, Vuzixకంపెనీలు ఈ కళ్లజోళ్లలను రూపొందిస్తున్నాయి. కళ్లజోడు ముందు భాగంలో ఏర్పాటు చేసిన బుల్లి తెరపై మొబైల్ ఫార్మెట్‌లో మెసేజ్‌లు, ఈ-మెయిల్, నెట్‌ని బ్రౌజ్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్షన్‌తో ఇది సాధ్యం. ఈ ఏడాది వేసవికల్లా ఈ కళ్లజోళ్లు దర్శనమివ్వనున్నాయి. ఛార్జర్ లేకుండా మొబైల్‌ను ఛార్జ్ చేయగలిగే కొత్త మోడళ్లు మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అందుకు ఉదాహరణలే నోకియా రూపొందించిన 'నోకియా లుమియా 920'. మొబైల్‌ని ఛార్జర్‌కి ప్లగ్ చేయక్కర్లేదు. ఫోన్ ప్యాడ్‌పై ఉంచితే ఛార్జ్ అవుతుంది. అలాగే, హెచ్‌టీసీ తయారు చేసినDroid DNA కూడా అలాంటిదే. మొబైల్‌ల్లో వాడుతున్న సింగిల్ కోర్ ప్రాసెసర్లు సామర్థ్యాన్ని పెంచుకుని క్వాడ్‌కోర్ ప్రాసెసర్లుగా ముందుకొస్తున్నాయి. దీంతో మొబైల్‌లో అలరిస్తున్న ఆప్స్‌ని మరింత వేగంతో వాడుకోవచ్చు. తాకే తెరల పరిమాణాన్ని మరింత పెంచేందుకు కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. దీంతో తెరపై కనిపించే క్వర్టీ కీబోర్డ్‌పై టైప్ చేయడం సులభం అవుతుంది.ఇక కనువిందే! ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచే టీవీలు ఈ ఏడాది మరింత ఆధునికంగా రూపొందనున్నాయి. అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో తెర రిజల్యూషన్ చూపు తిప్పకుండా కట్టిపడేస్తుంది. 7680X4320 పిక్సల్స్‌్. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ హెచ్‌డీటీవీలకు 16 రెట్ల ఎక్కువ క్వాలిటీ అన్నమాట. ఎల్‌జీ, సోనీ కంపెనీలు ఇప్పటికే ఆల్ట్రా హెచ్‌డీ టీవీ మోడళ్లను (LG 84LM9600, Bravia KD-X9000)ప్రకటించాయి కూడా. టీవీలు కంప్యూటర్‌లా మారి మరింత స్మార్ట్‌గా పని చేస్తాయి. వాయిస్ కమాండ్స్‌తో టీవీతో మాట్లాడొచ్చు. వేళ్లు కదుపుతూనే ఛానళ్లు మార్చేయవచ్చు. ఆప్స్‌ని రన్ చేస్తూ మల్టీపర్పస్ డివైజ్‌గా మార్చేయవచ్చు. |
Eenadu Direct Link : http://eenadu.net/Specialpages/e-eenadu/e-eenaduinner.aspx?qry=sp-eenadu1
Are u looking for The above products like Automatic water level Controller, Solar Products and Electronic Security Systems?. Contact on the given number. We deal with top brands only.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి