అరచేతిలోనే వార్తా ప్రపంచం! (Eenadu_17/01/13)
అత్యాచారాలు... యాసిడ్ దాడులు... మోసాలు... చెప్పాలంటే లెక్కకు మిక్కిలి నేరాలు! రోజూ పత్రికలు ఎలుగెత్తి చాటుతూనే ఉన్నాయి... నిత్యం వార్తాంశాల్ని అప్‌డేట్ చేస్తున్నాయి... అందుకు స్మార్ట్ మొబైళ్లూ వేదికలవుతున్నాయి! మునివేళ్లపైనే వార్తా విశ్లేషణల్ని అందిస్తున్నాయి! ఆయా వారధుల విశేషాలిగో..! తెలుగు, ఇంగ్లిష్, హింది, మలయాళం... దేశంలోని వివిధ భాషల దిన పత్రికల్ని బ్రౌజ్ చేసి చదవాలంటే News Huntఆప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేలో పొందొచ్చు. సుమారు 10 భాషల పత్రికల్ని పొందే వీలుంది. ఎలర్ట్, నోటిఫికేషన్ల రూపంలో బ్రేకింగ్ న్యూస్‌ని పొందొచ్చు. నచ్చిన వార్తాంశాన్ని ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ చేయవచ్చు. ఫేస్‌బుక్ లాంటి సోషల్‌నెట్‌వర్క్ సైట్‌ల్లోనూ షేర్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీరు ఈనాడు వార్తా పత్రికలోకి వెళితే తాజా వార్తలు, ముఖ్యాంశాలు, క్రికెట్ లైవ్... విభాగాలు కనిపిస్తాయి. హెడ్డింగ్‌పై క్లిక్ చేసి వార్త చదివి Shareపై క్లిక్ చేసి ఫేస్‌బుక్, ట్విట్టర్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేయవచ్చు. సైట్‌లోని వార్తాంశాలపై కామెంట్ కూడా చేసే వీలుంది.http://goo.gl/lTYCT * యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/Q8iKn * నోకియా యూజర్లు ఒవీ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. http://goo.gl/syshL ప్రపంచ వ్యాప్తంగా... దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సంఘటనల్ని తెలుసుకునేందుకు World Newspapers ఉంది. సుమారు 105 దేశాలకు చెందిన 6000 పేపర్లను దీంట్లో బ్రౌజ్ చేసి చూడొచ్చు. Country, Categoriesవారీగా పేపర్లను ఎంపిక చేసుకోవాలి. బుక్‌మార్క్ పెట్టుకునే వీలుంది. వార్తల వీడియోలను వీక్షించొచ్చు. ఆసక్తికరంగా అనిపించిన వాటిని Read it Later లో పెట్టుకోవచ్చు. http://goo.gl/fu8L8 * ఐఫోన్ యూజర్లు ఆప్‌స్టోర్ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోండి. http://goo.gl/01qpR గూగుల్ 'కరెంట్స్' మీ ఆసక్తుల మేరకు వివిధ రంగాల్లో చోటు చేసుకునే అప్‌డేట్స్‌ని క్షణాల్లో తెలుసుకోవాలంటే Google Currentsఉంది. The Guardian, TechCrunch, PBS... లాంటి ఎడిషన్స్‌తో పాటు బిజినెస్, లైఫ్‌స్టెల్, ఫ్యాషన్, స్పోర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, డిజైన్ రంగాల్లోని అప్‌డేట్స్‌ని తెలుసుకోవచ్చు. ముఖ్యాంశాల్ని 'బ్రేకింగ్ స్టోరీస్'లో చూడొచ్చు. తీరిగ్గా చదువుదాం అనుకుంటే Saved Stories లో దాచుకోవచ్చు. 'ట్రాన్స్‌లేట్'లోకి వెళ్లి అనువాదం చేసుకోవచ్చు. సుమారు 44 భాషల్ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ స్టోర్ నుంచి పొందొచ్చు. http://goo.gl/nC7Tc * యాపిల్ యూజర్లు ఆప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. http://goo.gl/ulWx 'పల్స్' తెలుసుకోండి! సులువైన ఇంటర్ఫేస్‌తో వార్తల్ని బ్రౌజ్ చేసుకునేలా Pulse News ఆప్‌ని రూపొందించారు. థంబ్‌నెయిల్ వ్యూలో అప్‌డేట్స్‌ని చూడొచ్చు. కీవర్డ్స్‌తో కావాల్సిన ఆర్టికల్స్‌ని వెతికే వీలుంది. నచ్చిన వ్యాసాల్ని Instapaper, Read it later, Evernote, గూగుల్ రీడర్ సర్వీసుల్లోకి కాపీ చేసుకోవచ్చు.http://goo.gl/ykoKa * ఐఫోన్ యూజర్లు ఆప్‌స్టోర్ నుంచి పొందొచ్చు.http://goo.gl/nz3rH * విండోస్ ఫోన్ ఓఎస్‌తో మొబైల్ వాడుతున్నట్లయితే 'విండోస్ ఆప్ స్టోర్' నుంచి ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.http://goo.gl/NkywG 'వాల్‌స్ట్రీట్' కావాలా? గ్లోబల్ న్యూస్ కవరేజ్ కోసం 'వాల్‌స్ట్రీట్ జర్నల్' వ్యాసాలు కావాలనుకుంటేThe Wall Street Journal ఉంది. వివిధ రంగాలకు సంబంధించిన ఇన్‌డెప్త్ వ్యాసాల్ని తాకేతెరపై తిరగేస్తూ చదవొచ్చు. http://goo.gl/eaMjN * యాపిల్ యూజర్లు ఆప్‌స్టోర్ నుంచి పొందొచ్చు.http://goo.gl/WGVRl * బీబీసీ న్యూస్ కావాలంటే BBC NEWSఆప్ ఉంది. గూగుల్ స్టోర్‌లో ఉచితం. http://goo.gl/7WssW * ఐఫోన్ యూజర్లు బీబీసీ న్యూస్‌ని ఆప్‌స్టోర్ నుంచి పొందొచ్చు. http://goo.gl/LdFnc డిస్కవరీ... భూమ్మీది వింతలు, విశేషాల్ని ప్రపంచానికి పరిచయం చేసే 'డిస్కవరీ న్యూస్' మొబైల్‌లోనూ చూడాలనుకుంటే గూగుల్ ప్లే నుంచి DiscoveryNewsఆప్‌ని పొందొచ్చు.http://goo.gl/ 3sQ9k * ఐట్యూన్స్ నుంచి యాపిల్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. http://goo.gl/EZX2g మరికొన్ని... * అంర్జాతీయ వార్తాంశాల కోసం Fast News పొందండి. ఆండ్రాయిడ్ యూజర్లుకి http://goo.gl/muxHD * టెక్నాలజీ వార్తల కోసం C-Netఉంది. http://goo.gl/5ca7s * ఆండ్రాయిడ్ మొబైల్‌లో యాహూ న్యూస్ కోసంhttp://goo.gl/VV ugP * జేబులో దినపత్రికలు పెట్టుకుని తిరగాలనుకుంటేPocketఆప్ పొందండి. http://goo.gl/nE YZY * ఐఫోన్ యూజర్లు 'పాకెట్' అప్‌ని http://goo.gl/GZTgWనుంచి పొందొచ్చు. * 'ఇండియా టుడే' ఆప్ కోసం ఆండ్రాయిడ్ యూజర్లుhttp://goo.gl/tf4yK లింక్‌లోకి వెళ్లండి. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి