తెలివిగా వాడేందుకు తీరైన దారులు! (Eenadu Thursday_24/01/13)


పీసీ.. ల్యాపీ... నెట్‌బుక్‌... ఏదో ఒకటి ఉండే ఉంటుంది... మరి, ఏదో వాడేస్తున్నాం అంటే సరి కాదు... కొత్త ఏడాదైనా కాస్త తెలివిగా వాడండి! అందుకు మార్గాలు అనేకం!
కే పంథాలో వాడుతూ వెళితే కొత్త కంప్యూటర్‌ కూడా కుమ్మరి పురుగులానే పని చేస్తుంది. కొత్త ఏడాది అంతా కొత్త కొత్తగా ఉండాలనుకునే దాని విషయంలోనూ పాటించండి. పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సరికొత్త చిట్కాలు తెలుసుకోవాలి. పనిని సులభం చేసుకోవాలి. కొత్త టూల్స్‌ వాడాలి. అనేక ప్రయోజనాల్ని పొందాలి. అందుకు పైసా ఖర్చు అక్కర్లేదు. ఉచితంగానే అన్నీ అందుబాటులో ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా చూద్దాం!పవర్‌ అందించండి!
సిస్టంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే టెక్నీషియన్‌ని సంప్రదించకుండా అప్లికేషన్‌ రూపంలోనే పీసీని పర్యవేక్షించే సేవకుడిని పెట్టుకోవచ్చు. అదే PowerSuite LITE 2013. ఉచిత వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని సిస్టం మొత్తాన్ని స్కాన్‌ చేసి లోపాల్ని తెలుసుకోవచ్చు. అందుకు Speed Tools, System Optimization, Disk Optimization విభాగాలున్నాయి. ఫ్రీ వెర్షన్‌లో కొన్ని సౌకర్యాల్ని వాడుకోవచ్చు. http://goo.gl/yzkN5
ఇలాంటిదే మరోటి SpeedUpMyPc. స్టార్ట్‌అప్‌లో అనవసరంగా రన్‌ అయ్యే ప్రొగ్రాంలను తొలగించొచ్చు. సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. http://goo.gl/i4yNZ
ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల యూజర్లతో పీసీలను పర్యవేక్షిస్తోంది Advanced SystemCare 6. విండోస్‌ 8, 7 ఓఎస్‌ల్లో కూడా వాడుకోవచ్చు. యాంటీవైరస్‌లా స్పైవేర్‌, యాడ్‌వేర్‌లను తొలగిస్తుంది. http://goo.gl/P7kTq
ఎప్పటికప్పుడు ఇల్లుని సర్దుకున్నట్టుగానే పీసీ హార్డ్‌డ్రైవ్‌లోని ఫైల్స్‌ని సర్దేయాలంటే Auslogics Disk Defragటూల్‌ని ప్రయత్నించండి. http://goo.gl/7hm3Y
మీరున్నా లేకపోయినా నిర్ణీత సమయానికి సిస్టం ఆటోమాటిక్‌గా షట్‌డౌన్‌ అయ్యేలా చేయాలంటే Auto Shut Downటూల్‌ని వాడేయండి. ఇన్‌స్టాల్‌ చేశాక ప్రత్యేక విండోలో సమయాన్ని సెట్‌ చేయాలి. http://goo.gl/LXYo4
మురిపించే టూల్స్‌!
కొత్త ఏడాదిలో అన్ని అప్‌డేట్స్‌తో యాంటీవైరస్‌ను వాడుకుని పీసీ సామర్థాన్ని కాపాడుకోవాలంటే AVG Antivirus Free 2013 కి అప్‌డేట్‌ చేయండి. హోం యూజర్లకు ఉచిత వెర్షన్‌ సిద్ధంగా ఉంది. http://goo.gl/7vRlS
మాల్వేర్‌లను మట్టుపెట్టే మరో రక్షణ వలయంMalwarebytes Anti Malware Free. హోం యూజర్లకు ఇది ప్రత్యేకం. సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. వార్మ్స్‌, ట్రోజన్స్‌, రూట్‌కిట్స్‌, స్పైవేర్‌లు, డైలర్స్‌... లాంటి ప్రమాదకరమైన వైరస్‌లను అడ్డుకుంటుంది. ఆటోమాటిక్‌ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు స్కాన్‌ చేసుకోవచ్చు. గత ఏడాది యాంటీవైరస్‌ డౌన్‌లోడ్స్‌లో మూడో స్థానంలో నిలించింది. http://goo.gl/g0oNU
450 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో Ad-Aware Free Antivirusముందుకొచ్చింది. ఇదో యాంటీ స్పైవేర్‌ ప్రొగ్రాం. నెట్‌ యూజర్లకు ఇదో రక్షణవలయం. ఫైల్‌ ఫార్మెట్‌తో సంబంధం లేకుండా నెట్‌ నుంచి చేసే డౌన్‌లోడ్స్‌ని నిత్యం స్కాన్‌ చేస్తూ స్పైవేర్‌లను కట్టడి చేస్తుంది.http://goo.gl/K6ayy
పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌లను వాడుతూ నెట్‌లో సంచరిస్తున్నారా? అయితే, మీ నెట్‌కనెక్షన్‌ని భద్రంగా వాడుకోవలంటే Hotspot Shield వాడుకోవాల్సిందే. మొత్తం నెట్‌ ట్రాఫిక్‌ని ఇన్‌క్రిప్ట్‌ చేసి హ్యాకర్ల చేతికి చిక్కకుండా పహారా కాస్తుంది. http://goo.gl/nSxQ2
ల్యాపీ ఛార్జింగ్‌ని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ ఛార్జింగ్‌ సమస్య లేకుండా చేయాలంటే? అందుకుBatteryDeley ఉచిత అప్లికేషన్‌ సిద్ధంగా ఉంది. మీరే ఎలర్ట్‌లను సెట్‌ చేసుకోవచ్చు. తరిగిపోతున్న ఛార్జింగ్‌ శాతం ఆధారంగా ఎలర్ట్‌లను సెట్‌ చేయవచ్చు. ఎలర్ట్‌ మెసేజ్‌ల్లో కావాల్సిన ఇమేజ్‌లను పెట్టుకోవచ్చు.http://goo.gl/5AsGS
అవసరం ఏదైనా...
వీడియోలను ప్లే చేయాలంటే విండోస్‌ మీడియా ప్లేయర్‌ ఒక్కటే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో GOM Media Player. హై క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. సులువైన ఇంటర్ఫేస్‌తో ప్లేలిస్ట్‌లను క్రియేట్‌ చేసుకుని చూడొచ్చు. http://goo.gl/DpxVN
ఆన్‌లైన్‌ ఛానల్‌ యూట్యూబ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన వాటిని ఎంపీ3 ఫార్మెట్‌లోకి మార్చుకోవాలంటే? Free Youtube to Mp3 Converter టూల్‌ని ప్రయత్నించండి. http://goo.gl/XCNDM
నెట్‌ నుంచి ఎక్కువగా వీడియోలు, మ్యూజిక్‌, ఇతర డేటా ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేస్తున్నారా? వాటిని సులువైన పద్ధతిలో మేనేజ్‌ చేసుకోవాలంటే? Orbit Downloaderవాడొచ్చు. http://goo.gl/jr1Vy
ఇంట్లో శుభకార్యాలకు మీరే డీజేగా మారి అలరించాలంటే? Virtual DJ అప్లికేషన్‌తో పీసీని డీజే సిస్టంగా మార్చేయవచ్చు. http://goo.gl/rR4ER
కుటుంబ సభ్యులు, స్నేహితులతో లైవ్‌ వీడియో ఛాటింగ్‌ చేయాలంటే? Camfrog టూల్‌తో ప్రత్యేక వీడియో ఛాటింగ్‌ రూమ్స్‌ని క్రియేట్‌ చేయవచ్చు. http://goo.gl/oXe6V
ఫొటోలను వివిధ రకాల టెంప్లెట్‌ డిజైన్లతో ఆకట్టుకునేలా డిజైన్‌ చేసుకోవాలంటే PhotoShine వాడొచ్చు.http://goo.gl/72Y02
పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఇమేజ్‌ ఫార్మెట్‌లోకి మార్చాలంటే Office Convert PDF to JPG Free ఉంది. http://goo.gl/BMLBE
తప్పక ప్రయత్నించాలి!
మీకు పెయింటింగ్స్‌ వేయడం ఇష్టమా? అయితే, Speedy Painter టూల్‌ని ప్రయత్నించండి. తక్కువ మెమొరీతో 'సీ ప్లస్‌ప్లస్‌' ప్రొగ్రామింగ్‌ ఆధారంగా దీన్ని రూపొందించారు. సులువైన ఇంటర్ఫేస్‌తో బ్రష్‌ సైజుల్ని మార్చుకుని డ్రా చేయవచ్చు. రంగుల్ని మార్చుకునేందుకు కలర్‌ ప్యాలెట్‌ ఉంది. http://goo.gl/Zu2W3
నెట్‌ వాడుతున్నారా? మీ ఐపీ అడ్రస్‌ని తెలుసుకోవాలంటే? టాస్క్‌బార్‌పై నిత్యం కనిపించేలా పెట్టుకోవాలంటే? సెట్టింగ్స్‌, టెక్నిక్స్‌ ఏం అక్కర్లేదు. Mr.IPటూల్‌ని ప్రయత్నిచండి. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రే పై భాగంలో ఐపీ కనిపిస్తుంది. కావాలంటే మినిమైజ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/ZmtPf
ఫొటోలను ఎడిట్‌ చేయడానికి చాలానే టూల్స్‌ని ఉన్నాయి. Trimto అప్లికేషన్‌ని ప్రయత్నించారా? ఇమేజ్‌ల సైజుని తగ్గించడమే కాకుండా 'షార్పెన్‌ ఎడ్జ్‌, ఆటో కరెక్షన్‌' చేస్తుంది. http://goo.gl/bb3bA
కావాల్సిన అప్లికేషన్లు, ఫోల్డర్లు, ఫైల్స్‌ని ప్రత్యేక ఇంటర్ఫేస్‌తో ఓపెన్‌ చేయాలంటే MadAppLauncher ని ప్రయత్నించండి. ఒక్కో ట్యాబ్‌లో 30 ప్రొగ్రాంలను పెట్టుకునే వీలుంది. మొత్తం 300 ప్రొగ్రాంలను కాన్ఫిగర్‌ చేయవచ్చు.http://goo.gl/nBVvu


Eenadu link: http://eenadu.net/Specialpages/e-eenadu/e-eenaduinner.aspx?qry=sp-eenadu1


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు