అలరించేందుకు అన్నీసిద్దం! (Eenadu_10/01/13)
ఏడాది ప్రారంభం...లెడ్ టీవీలు... స్మార్ట్ కెమెరాలు.. స్మార్ట్ మొబైళ్లు... ఇంటిలిజెంట్ ట్యాబ్‌లు... ఇలా సరికొత్త మోడళ్లు అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ (Consumer Eletronics Show) 2013లో దర్శనమిస్తున్నాయి. ఔరా! అనిపించే సౌకర్యాల్ని పరిచయం చేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ముంచెత్తబోయే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు అవి మోసుకొచ్చే సౌకర్యాలేంటో చూద్దాం!55 అంగుళాలు ఎల్‌జీ కంపెనీ OLED TV ని పరిచయం చేసింది. తెర పరిమాణం 55 అంగుళాలు. 4 మిల్లీమీటర్ల (0.16 అంగుళాలు) మందంతో నాజూకుగా కనిపిస్తుంది. బరువు 10 కేజీలు. ధర సుమారు రూ.11,999 డాలర్లు. 65 అంగుళాల తెరతో మరో మోడల్‌ని పరిచయం చేసింది. దీనికి ఇంకా ధర నిర్ణయించలేదు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/iovhQ, http://goo.gl/bwilh ఇద్దరూ ఒకేసారి! శ్యామ్‌సంగ్ మరో 'సూపర్ ఓలెడ్ టీవీ'ని ప్రదర్శించింది. పేరు F8000.ఐఫోన్ పరిచయం చేసిన 'సిరి' టెక్నాలజీని టీవీలో పరిచయం చేస్తున్నారు. అంటే వాయస్ కమాండ్స్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయవచ్చు. అలాగే, టీవీ ముందు కూర్చుని Hand Gesture Functionతో చేతుల్ని ఆడిస్తూనే టీవీ ఛానళ్లను మార్చేయవచ్చు. నచ్చిన వీడియోలను రికార్డ్ చేయవచ్చు. వేరు వేరు ఆడియో, ఇతర సెట్టింగ్స్‌తో ఒకే స్క్రీన్‌పై రెండు హెచ్‌డీ ఛానల్స్‌ని ట్యూన్ చేసి చూడొచ్చు. దీన్నే 'మల్టీవ్యూ'గా పిలుస్తున్నారు. ఫుల్ హెచ్‌డీ నాణ్యతతో రెండు ఛానళ్లను సెట్ చేయవచ్చు. అయితే, ఇద్దరు వ్యూయర్స్ ప్రత్యేక త్రీడీ కళ్లజోళ్లను పెట్టుకోవాల్సిందే. కళ్లజోళ్లలో ఏర్పాటు చేసిన ఇన్‌బిల్డ్ స్పీకర్లతో ఆడియో కంట్రోల్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు.http://goo.gl/APnKw ఇక కెమెరాలు శామ్‌సంగ్ ఇక కెమెరాలతో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. WB250F/WB200F, WB800F, WB30F, DV150F, ST150F పేర్లతో స్మార్ట్ కెమెరాల్ని ప్రదర్శించింది. డబ్యూబీ సీరీస్ మొత్తాన్ని 'లాంగ్ జూమ్'తో రూపొందించారు. డీవీ సీరీస్‌లో డ్యుయల్ వ్యూ సదుపాయం ఉంది. వై-ఫై టెక్నాలజీతో తీసుకున్న ఫొటోలను కెమెరా నుంచే ఇతరులకు షేర్ చేయవచ్చు. AutoShareఆప్షన్‌తో తీసీన ఫొటో తీసినట్టుగానే సెలెక్ట్ చేసుకున్న మొబైల్, పీసీ, ఇతర వెబ్ సర్వీసుల్లోకి ఆటోమాటిక్ సింక్రనైజ్ అవుతాయి.Smart Camera App ని ఇన్‌స్టాల్ చేసుకుని కెమెరా తీసిన ఫొటోలను వెంటనే బ్యాక్‌అప్ చేసుకోవచ్చు. http://goo.gl/He40A ఇదే తొలిసారి ప్రపంచంలోనే తొలి 4K OLED టీవీని పరిచయం చేసిన ఘనతను సోనీ సొంతం చేసుకుంది.3,840X2,160రిజల్యుషన్‌తో వీడియో చూడొచ్చు. తెర పరిమాణం 56 అంగుళాలు.Oxide Semiconductor TFTs, Super Top Emission టెక్నాలజీ సౌకర్యాలు అదనపు ఆకర్షణలు. http://goo.gl/qOl6p * అలాగే, 'ఎక్స్‌పెరియా జెడ్' స్మార్ట్ మొబైల్‌తో సోనీ కంపెనీ టెక్ ప్రియుల్ని ఆకట్టుకుంది. రెటీనా డిస్‌ప్లేతో 5 అంగుళాల హెచ్‌డీ తాకేతెరని రూపొందించారు. Qualcomm's Snapdragon Pro Quad Coreప్రాసెసర్‌ని మొబైల్‌లో వాడారు. ర్యామ్ 3జీబీ. ఆండ్రాయిడ్ 4.1 (జెల్లీ బీన్' ఓఎస్‌తో పని చేస్తుంది. 13 మెగాపిక్సల్ కెమెరాని నిక్షప్తిం చేశారు. 'హై డైనమిక్ రేంజ్' టెక్నాలజీతో పని చేస్తుంది. డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్‌తో మొబైల్‌ని సురక్షితం చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 11 గంటలు మాట్లాడొచ్చు. బరువు 146 గ్రాములు. వివరాలకుhttp://goo.gl/mHDxg పెనాసోనిక్ ప్రత్యేకంగా... వివిధ రకాల ప్లాస్మా, లెడ్ టీవీలను ప్రదర్శించి ఆకట్టుకుంటోంది పెనాసోనిక్. వాటిల్లో Smart Viera HDTV లు ప్రత్యేకం. మై హోం స్క్రీన్, స్వైప్ & షేర్ 2.0, టచ్‌పెన్, వాయిస్ గైడెస్, వాయిస్ ఇంట్రాక్షన్ కొత్త సౌకర్యాలు. మై హోం స్క్రీన్ ద్వారా టీవీలో కనిపించే హోం స్క్రీన్‌ని కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. స్వైప్ & షేర్‌తో ఫొటోలు, వీడియోలను స్మార్ట్‌మొబైల్, ట్యాబ్‌లోకి టీవీ నుంచి సులభంగా షేర్ చేసుకోవచ్చు. 'టచ్ పెన్'తో కావాల్సిన టెక్స్ట్‌ని తెరపై కనిపించే ఫొటోలపై రాసి ఇతర డివైజ్‌ల్లో షేర్ చేసుకునే వీలుంది. అందుకు ప్రత్యేక ఎలక్ట్రిక్ టచ్ పెన్నుని అందిస్తున్నారు. ఆప్షన్లను పలకడం ద్వారా వాటిని పని చేసేలా చేసేదే వాయిస్ గైడెన్స్. ఇతర వివరాలకుhttp://goo.gl/lQCmw టేబుల్ కంప్యూటర్ పర్సనల్ కంప్యూటర్ అంటే ఒక్కరు మాత్రమే వాడుకోగలరు. అలాకాకుండా కుటుంబ సభ్యుల్ని మొత్తం ఒకేచోట చేర్చి అలరించేందుకుIdeaCentre Hoarizon Table PCముందుకురానుంది. ప్రముఖ పీసీ తయారీ కంపెనీ లెనెవో పీసీని తయారు చేసింది. తెర పరిమాణం 27 అంగుళాలు. పది వేళ్లనూ తెరపై కదిలిస్తూ ఆపరేట్ చేయవచ్చు. విండోస్ 8 ఓఎస్‌ని నిక్షిప్తం చేశారు. వెబ్ కెమెరా, వై-ఫై ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు గంటల పాటు వాడుకోవచ్చు. 1.1 అంగుళాల మందంతో స్లిమ్‌గా రూపొందించారు. హోం పేజీ చక్రంలా కనిపిస్తుంది. తిప్పుతూ కావాల్సిన ఆప్‌ని రన్ చేయవచ్చు. క్వర్టీబోర్డ్‌ని కనెక్ట్ చేసి డెస్క్‌టాప్ పీసీ మాదిరిగా వాడుకోవచ్చు. వివరాలకుhttp://goo.gl/uiKBK జోరైన ల్యాపీ విండోస్ 8 ఓఎస్‌తో శ్యామ్‌సంగ్ కొత్త ఆల్ట్రాబుక్‌ని ప్రదర్శించింది. పేరు Series 7 Chronos. 15.6 అంగుళాల సూపర్‌బ్రైట్ లెడ్ స్క్రీన్‌తో తెరని రూపొందించారు. సాధారణ ల్యాపీ కంటే 36 శాతం ప్రకాశవంతంగా గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. Anti-Reflectiveలెడ్ మరో ప్రత్యేకత. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. 0.94 అంగుళాల మందంతో స్లిమ్‌గా ఆకట్టుకుంటోంది. బరువు 2.29 కేజీలే. ఇంటెల్ కోర్ ఐ7-3635క్యూఎం ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 4జీబీ నుంచి 8 జీబీ. స్టోరేజ్ సామర్థ్యం 1 టీబీ. హెచ్‌డీఎంఐ పోర్ట్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉన్నాయి. http://goo.gl/HJaAh 6.1 అంగుళాలు Huaweiకంపెనీ పరిచయం చేసిన Ascend Mateప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ మొబైల్‌గా ఆకట్టుకుంది. 6.1 అంగుళాల హెచ్‌డీ తాకేతెర, 1.5GHz Hi-Silicon quad-core ప్రాసెసర్, 4050 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్, 8.0 మెగాపిక్సల్ కెమెరా, వీడియో ఛాటింగ్‌కి 1 మెగాపిక్సల్ హెచ్‌డీ కెమెరా ఉన్నాయి. Dual MIC noise reduction టెక్నాలజీతో అనవసర శబ్దాల్ని కట్టడి చేస్తుంది. తెర రిజల్యుషన్1280X720.మరిన్ని వివరాలకు http://goo.gl/dAzi7 బుల్లి కెమెరా హెల్మెట్‌లో, జేబులో ఎక్కడైనా ధరించి లైవ్ స్ట్రీమింగ్‌లో వీడియోలు, శ్నాప్ షాట్స్‌ని పంపాలంటే లిక్విడ్ ఇమేజీ కంపెనీ రూపొందించిన Ego Miniకెమెరా గురించి తెలుసుకోవాల్సిందే. 1080 పిక్సల్ నాణ్యతతో వీడియోలు చిత్రీకరిస్తుంది. వై-ఫై సదుపాయంతో నెట్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో వీడియో ఫుటేజ్‌ని నిత్యం చూస్తుండొచ్చు. 360 degree recording, side by side, camera మోడ్స్‌లో కెమెరాని వాడుకోవచ్చు. కెమెరా మోడ్‌లో 12 మెగాపిక్సల్ నాణ్యతతో ఫొటోలను తీస్తుంది. Liquid Imageఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని కెమెరాని మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లు ఐట్యూన్స్‌ని పొందొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది. http://goo.gl/CJjf5 'యోగా' నేర్చుకున్నాయి! అల్ట్రాబుక్స్ యోగాని అభ్యసిస్తున్నాయి. కావాలంటే లెనోవా తయారు చేసిన IdeaPad Yoga చూడండి. సీఈఎస్ షోలో ఎటు కావాలంటే అటు ఒంగుతూ ఆసనాలతో ఆకట్టుకుంది. 13.3 అంగుళాల తాకేతెర, థర్డ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, విండోస్ 8 ఓఎస్, 1600X900,128 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్‌లతో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 8 గంటలు. ట్యాప్‌టాప్, బ్యాబ్లెట్, టెంట్, స్టాండ్ మోడ్‌ల్లో ఆల్ట్రాబుక్‌ని వాడుకోవచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/CsFLB టుడీ నుంచి త్రీడీలోకి... శామ్‌సంగ్ కొత్త కెమెరా లెన్స్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతోంది. లెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్విచ్‌మోడ్‌తో 2డీ నుంచి 3డీలోకి మార్చుకోవచ్చు. శామ్‌సంగ్ తయారు చేసిన కొత్త మోడల్ NX300 కెమెరాతో లెన్స్‌ని వాడుకోవచ్చు. కెమెరాతో త్రీడీ వీయోలను చిత్రీకరించొచ్చు. 20 మెగాపిక్సల్ సెన్సర్‌తో పని చేస్తుంది. రికార్డ్ చేసిన వీడియోలను 3డీ టీవీల్లో ప్లే చేసుకుని చూడొచ్చు. ప్రపంచానికి తొలిసారి పరిచయమైన 'సింగిల్ లెన్స్ 3డీ సిస్టం' ఇదే. http://goo.gl/b0bKe అవేం వినిపించవు ప్రశాంతంగా మ్యూజిక్ వినాలనుకున్నప్పుడు బయటి శబ్దాలు ఆటంకం కలిగించకుండా ఉండాలంటే A Tim Tebow, Soul SL300 హెడ్‌ఫోన్స్ వాడితే సరి. ఇవి 'నోయిస్ క్యాన్సిలింగ్' టెక్నాలజీతో పని చేస్తాయి. ఖరీదు 299 డాలర్లు. మొబైల్, ట్యాబ్లెట్, ఎంపీ3 ప్లేయర్, సిస్టంలకు కేబుల్‌తో అనుసంధానం చేసి వాడుకోవచ్చు.http://goo.gl/ey3vd రెండు వారాలు ప్రయాణాల్లో ఎక్కువగా మొబైల్‌ఫోన్లు, ఎంపీ3 ప్లేయర్లతో ఛార్జింగ్ సమస్య వస్తుంటుంది. అలాంటప్పుడు Nectarమొబైల్ పవర్ సిస్టంని వాడుకుంటే సరి. ఇది ఉంటే ఛార్జింగ్ స్టేషన్ జేబులో ఉన్నట్టే. వారం రోజుల పాటు ఛార్జింగ్‌తో పని చేసే అన్ని రకాల పరికరాల్ని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ప్రపంచానికి పరిచయమైన తొలి పోర్టబుల్ పవర్ సిస్టంగా చెబుతున్నారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/eekBR మొబైల్ నుంచే... ఇంట్లోని అన్ని గదుల్లో లైట్‌లు... ఫ్యాన్లు.. ఫ్రిడ్జ్... టీవీలు... వాషింగ్ మెషిన్... అన్ని కరెంటుతో పని చేసేవి. అన్నింటికి ఎప్పటికప్పుడు ఆన్, ఆఫ్ చేస్తుంటాం. కొన్నిసార్లు మర్చిపోతుంటాం. మరి, మీ స్మార్ట్‌హోంని ప్రత్యేక WeMo Swith తో మరింత స్మార్ట్‌గా మార్చేయవచ్చు. ప్రత్యేక ఆప్‌ని ఐఫోన్, ఐప్యాడ్‌ల్లో ఇన్‌స్టాల్ చేసుకుని స్విచ్‌ని మొబైల్ నుంచే ఆపరేట్ చేయవచ్చు. వై-ఫై నెట్‌వర్క్ ద్వారా సిస్టం పని చేస్తుంది. ఇక హాల్లో వెలుగుతున్న లైట్స్‌ని బెడ్‌రూంలో ఉండే ఆఫ్ చేయవచ్చు. వంట గదిలోని మైక్రోఒవెన్‌ని హాలులో కూర్చుని ఆఫ్ చేయవచ్చు. వీడియో, ఇతర వివరాలకుhttp://goo.gl/aJTQ8 సోలార్ స్పీకర్లు! సూర్యరశ్మితో పని చేసే స్పీకర్లు కావాలంటే Eton RukusXL Solar Powered Boom Boxగురించి తెలుసుకోవాలి. బ్లూటూత్ అనుసంధానంతో స్పీకర్లను సిస్టం, ట్యాబ్, మొబైళ్లకు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు ఎనిమిది గంటలు పని చేస్తుంది. http://goo.gl/tDvrX * సీఈఎస్ 2013లో ఆకట్టుకున్న మరిన్ని టెక్ హంగుల్ని తెలుసుకోవాలంటే http://go o.gl/OXsDLచూడండి. గార్డెన్‌లో టెక్నాలజీ... ఇంటి పెరట్లో మొక్కలు చనిపోతున్నాయా? కారణాలేంటో తెలియడం లేదా? అయితే, Parrot Flower Power పరికరాన్ని మొక్కలున్న కుండీల్లో పెట్టండి. కుండీలోని మట్టిలోకి దీన్ని గుచ్చిన దగ్గర్నుంచి మీ మొబైల్‌కి ఎప్పటికప్పుడుసూర్యరశ్మి, మట్టిలోని తేమ, ఉష్ణోగ్రత, కావాల్సిన ఎరువుల్ని ఎలర్ట్ మెసేజ్‌లను చేరవేస్తుంది. ఉదాహరణకు నీళ్లు లేక మొక్క వాడిపోతే వెంటనే నీళ్లుపోయాలని ఎలర్ట్ చేస్తుంది. ఎండతో మొక్క ఎండిపోతున్నట్లయితే ఎలర్ట్ చేసి నీడలో పెట్టమని చెబుతుంది. ఛార్జ్ చేస్తే ఆరు నెలలు పని చేస్తుంది. వివరాలకు http://goo.gl/ViGwl |
http://www.facebook.com/pages/Electronic-Security-Systems-and-Solar-Products/245701395548462
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి