పోస్ట్‌లు

మార్చి, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

మహా పయనం... సుదూరం!

మహా పయనం... సుదూరం! కొన్ని లక్షల అడవిమృగాలు... ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి... వేల కిలోమీటర్లు సుదూర తీరాలకు ప్రయాణిస్తాయి... ఏడాది మొత్తం అవలా గమనంలోనే ఉంటాయి... ఎందుకు..? ఏమిటి...? ఎక్కడ..? మ నం ఒకటో రెండో అడవి జంతువులు కనిపిస్తేనే ఎంతో ఆసక్తిగా చూసేస్తాం. అదే కొన్ని లక్షల అడవి మృగాల్ని ఒక్కసారిగా చూస్తే? దబదబమని వాటి పరుగుల శబ్దం.... ఆ ఒత్తిడికి అంతెత్తున లెగుస్తున్న దుమ్ము... సూర్య కిరణాల వెలుగులో నల్లగా మెరిసిపోతున్న వాటి కొమ్ములు... అదంతా చూడటానికి ఎంతో చిత్రంగా అనిపించేయదూ! ఇవన్నీ ఏ సినిమా కబుర్లో అనుకుంటున్నారేమో? కానేకాదు. టాంజానియాకి వెళితే ఇవన్నీ కళ్లారా చూడొచ్చు. అదీ... ఏడాదంతా! ఎందుకంటే అన్ని రోజులూ వీటి ప్రయాణం ఇలాగే ఓ వృత్తంలా కొనసాగుతుంది. పక్షులు వలస వెళ్లి పిల్లలతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడం మనం చూస్తుంటాం. అలాంటి వలసే ఇదీనూ. నేలమీద తిరిగే జీవుల వలసలో ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. దీన్నే ది గ్రేట్‌ వైల్డ్‌ బీస్ట్‌ మైగ్రేషన్‌, సెరంగటి వైల్డ్‌ బీస్ట్‌ మైగ్రేషన్‌ అంటూ పిలిచేస్తుంటారు. ఏమా జంతువులు? *  నీలి రంగు అడవి మృగాలు *  నల్లని అడవి ...