Eenadu Eetaram(29/09/12)
ఆశయం ఎగసి...ఆలోచన మెరిసి! లక్ష్యానికి ఆశయం తోడైతే సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు ఆశ చూపినా ఆశయం తన లక్ష్యం మార్చుకోదు. దానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఆలోచన చిన్నదే. కానీ వూహించని ఆవిష్కరణలకు కారణమవుతుంది. అది సాధ్యం కావాలంటే మాత్రం ఆచరణ పక్కాగా ఉండాలి. గమ్యం చేరే దారిలో అనుక్షణం తపించాలి. అప్పుడు అంతర్జాతీయ అవార్డులనూ ఎగరేసుకుపోవచ్చు. మేం పరిష్కరిస్తాం.. మా ఇంటి ముందు మురుగు పొంగుతోంది- మేం శుభ్రం చేయిస్తాం. మా వీధిలో లైట్లు వెలగడం లేదు- సరి చేయిస్తాం. లోకల్ ట్రైన్‌లో పోకిరీల చేష్టలు శృతి మించుతున్నాయి- అధికారుల్ని అప్రమత్తం చేస్తాం! ఇ లా భరోసా ఇస్తున్నదెవరో కాదు, ముగ్గురు యువతరంగాలు. ఇలాంటి సమస్యలకు పరిష్కార వేదికగా ఓ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ ఆలోచన ప్రతిష్ఠాత్మక 'మైక్రోసాఫ్ట్ అంతర్జాతీయ ఇమేజ్' పోటీల్లో రెండోస్థానం లభిచింది. న లుగురు యూత్ కలిస్తే ఫేస్‌బుక్ ముచ్చట్లు, ట్విట్టర్ ట్వీటుల చర్చలు నేటి ట్రెండ్. అదే మాధ్యమాన్ని సమాజ మార్పు వేదికగా, సమస్యల్ని పరిష్కరించే వ...