'హలో..!' లైఫ్‌స్త్టెల్ మార్చేయండి! (Eenadu_13/09/2012)
స్మార్ట్ మొబైల్ చేతిలో ఉంటే... మీ లైఫ్‌స్త్టెల్ మారిపోతుంది తెలుసా?అదెలా సాధ్యం అంటారా?అందుకు ప్రత్యేక అప్లికేషన్లు ఉన్నాయి! అన్నీ ఉచితం కూడా!ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్ మొబైలే. పీసీల్లో మాదిరిగా కొత్త అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసి వాడేస్తున్నారు. జీవనశైలికి సంబంధించిన అనేక విషయాలను ప్రత్యేక అప్లికేన్లతో మొబైల్‌లోనే పొందవచ్చని తెలుసా? వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవచ్చు. క్యాలెండర్ తెరిచి తిథి, వార, నక్షత్ర వివరాలు పొందవచ్చు. కుర్రకారు కోసం కత్తిలాంటి అప్లికేషన్లు ఉన్నాయి. సెలూన్‌కి వెళ్లే ముందే ఎలాంటి హెయిర్ స్త్టెల్‌ని చేయించుకోవాలో మొబైల్‌లోనే ఎంపిక చేసుకునే వీలుంది. అమ్మాయిల గోళ్లకు 'నెయిల్ డిజైన్స్'తో అప్లికేషన్ సిద్ధం... ఇలా చెప్పాలంటే బోలెడు. ఆయా ఆండ్రాయిడ్ లైఫ్ స్త్టెల్ అప్లికేషన్ల సంగతులేంటో తెలుసుకుందాం!భలే హెయిర్ స్త్టెల్...
స్మార్ట్‌గా కనిపించాలంటే హెయిర్ స్త్టెల్ ఎంత ముఖ్యమో యువతకు వేరే చెప్పక్కర్లేదు. సెలూన్‌కి వెళ్లే ముందే మీకు సరిపడే హెయిర్ స్త్టెల్‌ని మొబైల్‌లోనే ఎంపిక చేసుకునే వీలుంది. Men HairStylesఅప్లికేషన్‌తో ఇది సాధ్యం. గూగుల్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వేలల్లో హెయిర్ స్త్టెల్స్ కనిపిస్తాయి. నచ్చిన వాటిని ఎస్‌డీకార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు. స్నేహితులతో వాటిని పంచుకోవచ్చు కూడా. ముఖ ఆకృతులకు అనుగుణంగా ఆయా హెయిర్ స్త్టెల్స్ కనిపిస్తాయి. పొడవైన హెయిర్ స్త్టెల్ కావాలంటే Long Hairstyles లోకి వెళ్లాలి. ఉంగరాల జుట్టు వారి కోసం Curly HairStylesఉంది. http://goo.gl/uu2Tz
* ఇలాంటిదే మరోటి Mens Hairstyles Idea Book.ముఖ ఆకృతి ఆధారంగా ఎలాంటి స్త్టెల్ నప్పుతుందో తెలుసుకోవచ్చు. అన్ని స్త్టెల్స్‌ని 'క్లిప్స్' రూపంలో పొందుపరిచారు. http://goo.gl/M3csz* ఒక్క హెయిర్ స్త్టెల్సేనా? మరి, డ్రస్సింగ్ సంగతేంటి అనే వారికి ప్రత్యేకంClothing.సూట్స్, షర్ట్‌లు, జీన్స్, జాకెట్స్, టీి-షర్ట్స్, షూలను విభాగాల వారీగా బ్రౌజ్ చేసి చూడొచ్చు. శరీర ఆకృతి ఆధారంగా ఎలాంటివి నప్పుతాయో తెలుసుకునేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది. http://goo.gl/f2W4l
* ఇలాంటిదే మరోటి Cool Guy- Style App for Men. దీంట్లోని మెనూల్లోకి వెళ్లి ఫ్యాషన్ ట్రెండ్స్‌ని బ్రౌజ్ చేసి చూడొచ్చు. ఫ్యాషన్ చిట్కాల్ని తెలుసుకోవచ్చు కూడా. నచ్చిన వాటిని ఆయా ఆన్‌లైన్ స్టోర్‌ల్లోకి వెళ్లి కోనుగోలు చేసే వీలుంది. http://goo.gl/GlEKV
* ఆకట్టుకునే టాటూలు కావాలంటే? Best Tattoo ఉంది. సెర్చ్‌బాక్స్‌తో కీవర్డ్స్ టైప్ చేసి టాటూ డిజైన్స్ వెతకొచ్చు. నచ్చిన వాటిని ఎస్‌డీకార్డ్‌తో సేవ్ చేసుకోవచ్చు. http://goo.gl/JV1Y4
అమ్మాయిలకు ప్రత్యేకం!
పార్టీకి వెళ్లేప్పుడు జడ వేసుకోవాలా? లేదా వదిలేయాలా? అనేది అమ్మాయిలకు పెద్ద సమస్యే. అలాంటి అమ్మాయిల కోసం Smart Hairstyle టూల్ ఉంది. ఫొటోని అప్లికేషన్‌లోకి అప్‌లోడ్ చేసి మెనూలో కనిపించే హెయిర్ స్త్టెల్స్‌ని అప్త్లె చేసి చూడొచ్చు. షార్ట్, లాంగ్, మీడియం, కర్లీ... లాంటి స్త్టెల్స్ అనేకం ఉన్నాయి. క్లిప్స్‌లోకి హెయిర్‌కి సెట్ అయ్యేలా ఫొటోని మార్పులు చేసుకునే వీలుంది. జుట్టు రంగుల్ని కూడా మార్చి చూసుకోవచ్చు. http://goo.gl/QNHCN
* ఇలాంటిదే మరోటి Hair Catalog. అప్లికేషన్ గ్యాలరీలోని స్త్టెల్స్‌ని బ్రౌజ్ చేసి ఎంపిక చేసుకోవచ్చు. http://goo.gl/nb81r
* గోళ్ల రంగుపై మక్కువలేని మగువ ఉండదేమో? అలాంటి అమ్మాయిల్ని ఆకట్టుకుంటోంది Nail Art Designs.గ్యాలరీలో అనేక డిజైన్లు ఉన్నాయి. ఆయా డిజైన్లు వేళ్ల ఆకృతుల్ని బట్టి ఎలా కనిపిస్తాయో తెలుసుకోవచ్చు. సెర్చ్‌లోని కీవర్డ్స్ ఆధారంగా కావాల్సిన డిజైన్‌ని వెతకొచ్చు. ఉదాహరణకు పువ్వులతో కూడిన నెయిల్ డిజైన్స్ కావాలంటే సెర్చ్‌లో flowersటైప్ చేస్తే సరి. పెళ్లికి సరిపడే డిజైన్స్ కావాలంటే Wedding Nail కీవర్డ్ వాడాలి.http://goo.gl/xUPou
* ఇక టచప్‌లు, మేకప్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి ప్రత్యేక అప్లికేషన్ ఉంది. అదేMakeup Ideas. కళ్లు, పెదాలకు సంబంధించిన ఇమేజ్‌లు చాలానే ఉన్నాయి. ఆయా మేకప్ ఐడియాస్‌తో అధరాల్ని మరింత అందంగా, కళ్లని ఇంకొంచెం కైపుగా తీర్చిదిద్దుకోవచ్చు. గ్యాలరీలోని నచ్చిన వాటిని ఎస్‌డీకార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు. స్నేహితులతో పంచుకోవచ్చు కూడా. http://goo.gl/in11A
* అమ్మాయిల హైహీల్స్ మాటేంటి? అనే వారంతా Simple Shoes చూడొచ్చు. గ్యాలరీలో వేలల్లో మోడళ్లు ఉన్నాయి. నచ్చిన వాటిని ఎస్‌డీకార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు.http://goo.gl/W4NDs
కాస్త సంప్రదాయంగా...
ఇక వాస్తు శాస్త్రానికి సంబంధించిన వివరాలు కావాలంటే Vastu Compass టూల్‌ని ఇన్స్‌స్టాల్ చేసుకుంటే సరి. దీంట్లోని 'యాక్టివ్ కంపాస్' ద్వారా అన్ని దిక్కుల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. సాధారణ కంపాస్ మాదిరిగానే మొబైల్‌ని భూమికి సమాంతరంగా ఉంచి వాడుకోవాలి.http://goo.gl/NKBX4
* ఇలాంటిదే మరోటి Vastu Calculator. http://goo.gl/ZRq02
* ఎంత స్మార్ట్ మొబైల్ అయినా డీఫాల్ట్‌గా ఇంగ్లిష్ క్యాలెండరే ఉంటుంది. అలా కాకుండా హిందూ శాస్త్రం ప్రకారం రూపొందించిన క్యాలెండర్ కావాలంటే అందుకు మార్గముంది. తిథి, వార, నక్షత్రాల్ని తెలుసుకోవాలన్నా, పండగల వివరాలు కావాలన్నా Hindu Calendar ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. ఇన్‌స్టాల్ చేశాక లొకేషన్‌ను ఎంటర్ చేయాలి. దీంతో లోకల్ డేటాతో క్యాలెండర్ లోడ్ అవుతుంది. http://goo.gl/7c4z8
* సంఖ్యా శాస్త్రం ఆధారంగా రోజూవారీ జాతకాన్ని తెలుసుకోవడానికి Numerology Daily Horoscope ఉంది. పుట్టిన రోజు వివరాల్ని ఎంటర్ చేయాలి. http://goo.gl/7bw7E
డైరీ రాసుకోండి!
వాడుతున్న స్మార్ట్ మొబైల్‌ని డైరీగా మార్చేయవచ్చు. అందుకు Private Diary ఉంది. వ్యక్తిగత వివరాలు, రోజువారీ జీవితాన్ని క్రమబద్దం చేసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం డైరీని పాస్‌వర్డ్ పెట్టుకుని సెక్యూర్ చేసుకునే వీలుంది. వివిధ రకాల థీమ్స్‌తో డైరీని ఆకట్టుకునేలా చేయవచ్చు. డైరీలోకి ఫొటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. http://goo.g l/8LTZ8
* ఇలాంటిదే మరోటి The Diary. http://goo.gl/jbjnA
* కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పుట్టినరోజు వివరాల్ని మేనేజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా డైరీ కావాలంటే Birthday Diary ఉంది. ఫొటోలు, పేరు, మొబైల్, ఈమెయిల్, ప్లేస్... వివరాలతో నోట్స్ రాసుకోవచ్చు. ఇవ్వాలనుకునే బహుమతి వివరాల్ని కూడా ఎంటర్ చేయవచ్చు. ఆటోమాటిక్‌గా ఫోన్‌కాల్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ చేయవచ్చు. http://goo.gl/nDiAe
* గృహ అలంకరణపై మీకు ఆసక్తి ఉంటేInterior Design HD. ఎక్కువ రిజల్యుషన్‌తో కూడిన ఇమేజ్ ఫొటోలను అప్‌లోడ్ చేశారు. ఫొటోలను బ్రౌజ్ చేస్తూ అలంకరణ రీతుల్ని గమనించొచ్చు. http://goo.gl/n0PsY
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి