సోషల్‌ నెట్‌వర్క్‌ కొత్త వారధులు! (Social networking special_06/09/2012)


సోషల్‌ నెట్‌వర్క్‌ అంటే... ఫేస్‌బుక్‌, ఆర్కుట్‌, గూగుల్‌ ప్లస్‌లేనా..?
ఇంకేం కొత్తవి లేవా?ఎందుకు లేవూ!!
రొటీన్‌కి భిన్నంగా చాలానే ఉన్నాయి!!
ప్రయత్నిస్తే పోలా!!
ప్పుడూ అదే ప్రొఫైల్‌... అవే స్క్రాప్‌లు... అప్‌డేట్స్‌... సోషల్‌ నెట్‌వర్క్‌లు అంటే అంతేనా? ఏం కాదు. ఇంకా చాలానే చేయవచ్చు. అందుకు అనువైన సోషల్‌ నెట్‌వర్క్‌లు చాలానే ఉన్నాయి. ఆసక్తులమేరకు ఆయా సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో సభ్యులై అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. లోకల్‌ క్లబ్‌లుగా ఏర్పడి ఆలోచనలకు వేదికలు ఏర్పాటు చేసుకోవచ్చు. తీరిక దొరికినప్పుడు అమ్మలందరూ ఒకచోట చేరి పెంపకం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలపై చర్చించుకోవచ్చు. ఇది 'మెలైఫ్‌' అంటూ మొత్తం సోషల్‌ లైఫ్‌ని ఒకేచోట మేనేజ్‌ చేసుకునే వీలుంది. 'మీట్‌ మి' అంటూ కొత్త స్నేహానికి ఆహ్వానం పంపొచ్చు... మరి, ఆయా సోషల్‌ వారధుల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!!సై అంటే సై!!
ఏదైనా సామాజిక అంశంపైనో... సరదాగా గడపడం కోసమో... ఈవెంట్‌ ప్లానింగ్‌ నిమిత్తమో... మిత్ర బృందం మొత్తం కలవాలి అనుకుంటే? ఏముందీwww.meetup.com నెట్‌వర్క్‌లో సభ్యులైతే సరి. గ్రూపులుగా ఏర్పడి అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. మీరున్న లొకేషన్‌ ఆధారంగా స్థానికంగా ఏర్పాటైన గ్రూపులు కనిపిస్తాయి. విభాగాల వారీగా గ్రూపుల్ని బ్రౌజ్‌ చేసుకునే వీలుంది. మీరు విద్యార్థి అయితేEducation & Learningలోకి వెళ్లి చూడొచ్చు. మీరు టెక్నాలజీ ప్రియులైతే Tech విభాగంలోకి వెళ్లి మీరున్న లొకేషన్‌లో ఏర్పాటైన గ్రూపుల్ని బ్రౌజ్‌ చేసి ఈవెంట్‌ వివరాల్ని తెలుసుకోవచ్చు. వారం రోజుల క్యాలెండర్‌ హోం పేజీలోనే కనిపిస్తుంది. తేదీలపై క్లిక్‌ చేసి ఈవెంట్‌ వివరాల్ని చూడొచ్చు. నెట్‌వర్క్‌లో సభ్యులయ్యాక ఆసక్తి మేరకు మీరే ఒక గ్రూపుని క్రియేట్‌ చేసి ప్రమోట్‌ చేయవచ్చు. గ్రూపుని క్రియేట్‌ చేయగానే హోం, మెంబర్స్‌, స్పాన్సర్లు, ఫొటోలు, డిస్కషన్‌... వివరాలతో గ్రూపు క్రియేట్‌ అవుతుంది. మీకు ఇష్టమైన గ్రూపు కనిపిస్తే Join us పై క్లిక్‌ చేసి సభ్యులవ్వడమే. దీంట్లో క్రియేట్‌ చేసిన గ్రూపుని ఫేస్‌బుక్‌ స్నేహితులకు తెలిసేలా చేయడం కూడా చాలా సులభం.
ప్రత్యేక వారధి!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, Linkedin ... లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో సభ్యులై ఉన్నారా? మరి, వాటన్నింటినీ ఒకేచోట యాక్సెస్‌ చేసే నెట్‌వర్క్‌ సిస్టం ఉందని తెలుసా? అదే www.mylife.com దీంట్లో జీమెయిల్‌, యాహూ, హాట్‌మెయిల్‌, ఏఓఎల్‌... లాంటి ఇతర ఈమెయిల్‌ ఎకౌంట్‌లను కూడా మేనేజ్‌ చేసుకునే వీలుంది. అంటే దీంట్లో సభ్యులైతే ఏ ఒక్క అప్‌డేట్‌ మీ కంటపడకుండా పోదన్నమాట. అంతేకాకుండా మీ ఫ్రొఫైల్‌ని ఎంతమంది నెటిజన్లు సెర్చ్‌ చేసి చూస్తున్నారో కూడా ట్రాక్‌ చేసి చూడొచ్చు. స్టేటస్‌ మొత్తం జాబితాగా కనిపిస్తుంది. ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకుని సోషల్‌ నెట్‌వర్క్‌లు, ఈమెయిల్‌ ఎకౌంట్‌లను సెట్‌అప్‌ చేసుకోవాలి. My Identity Monitor లోకి వెళ్లి మీ ప్రొఫైల్‌ సెర్చ్‌లను ట్రాక్‌ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, క్లాస్‌మేట్స్‌, వర్క్‌ కాంటాక్ట్స్‌లోకి వెళ్లి విభాగాలవారీగా స్నేహితుల్ని వెతికిపట్టుకోవచ్చు. 'యాడ్‌ ఎకౌంట్స్‌'పై క్లిక్‌ చేసి డాష్‌బోర్డ్‌పైకి ఇతర సోషల్‌నెట్‌వర్క్‌లు, ఈమెయిల్‌ సర్వీసుల్ని యాడ్‌ చేసుకునే వీలుంది.
జ్ఞాపకాలకు ప్రత్యేకం
వాడుతున్న సోషల్‌నెట్‌వర్క్‌ల్లో ఫొటోలు పంచుకోవడం మామూలే. మరింత భిన్నంగా, సురక్షితంగా మీ ఫొటో జ్ఞాపకాల్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలంటే? అందుకు ప్రత్యేక వారధే www.photojima.com లాగిన్‌ అయ్యి ఫొటో అల్బమ్‌ని క్రియేట్‌ చేసి అందరికీ ఆహ్వానాన్ని పంపొచ్చు. దీంట్లో తయారు చేసే ఆల్బమ్‌లను Islandsగా పిలుస్తున్నారు. ఫొటోలను నెట్‌వర్క్‌లోని ఎవరు చూడాలనేది ముందే నిర్ణయించొచ్చు. 'పబ్లిక్‌ షేరింగ్‌'తో అందరూ చూసేలా ఫొటోలను షేర్‌ చేసే వీలుంది. ప్రత్యేక ఎడిటింగ్‌ టూల్స్‌తో ఫొటోలను ఎడిట్‌ చేసి అదనపు హంగులు అద్దొచ్చు. Bump color, Resize, Crop...ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్‌ యూజర్లు మొబైల్‌ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని నెట్‌వర్క్‌ని మొబైల్‌ నుంచే మేనేజ్‌ చేయవచ్చు. 'ఎక్స్‌ఫ్లోర్‌' ద్వారా పబ్లిక్‌ షేరింగ్‌ ఫొటోలను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. నచ్చిన ఫొటోలపై కామెంట్‌ చేయవచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన ఫొటోలను 'పాపులర్‌' విభాగంలో చూడొచ్చు.
ఎన్నో 'ఆలోచనలు!'
ఓ మంచి ఆలోచన సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తెలుస్తుంది. అలాంటి ఆలోచనలేమైనా మీ మదిలో తడితే పంచుకునేందుకు ఒక వేదిక ఉండాలంటూ ముందుకొచ్చింది http://beta.thedogood.netసభ్యులై వివిధ అంశాలపై మీకొచ్చే పోస్టింగ్‌ చేసి నెట్‌వర్క్‌ సభ్యులతో పంచుకోచ్చు. Health, Relationships, School & Work, Culture, Business... లాంటి మరిన్ని విభాగాలున్నాయి. ఎక్కువ ఆదరణ పొందిన వాటిని Most Viewsలో చూడొచ్చు. పోస్టింగ్‌లను చదివి వాటినిపై కామెంట్‌ చేసే వీలుంది. బాగా ఆకట్టుకున్నవాటిని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌... నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేయవచ్చు. ప్రత్యేకంగా మెయిల్‌ చేసే వీలుంది.
ఇదో 'పాస్‌పోర్ట్‌'
ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారా? లేదంటే ట్రావెలింగ్‌ అంటే ఇష్టమా? ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తుంటారా? అయితే, మీరు వెళ్లాలనుకునే ప్రాంతాలకు సంబంధించిన విషయాల్ని ప్రత్యేక నెట్‌వర్క్‌ ద్వారా తెలుసుకోవాలంటే www.mysocialpassport.comలో సభ్యులవ్వండి. నెట్‌వర్క్‌లోని ఇతరులు చేసిన పోస్టింగ్‌ల ద్వారా ఆయా ప్రాంతాలకు సంబంధించిన విశేషాల్ని తెలుసుకోవచ్చు. మీకు కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చు కూడా. మీరుంటున్న ప్రాంతం, చుట్టొచ్చిన నగరాలు, పర్యాటక ప్రాంతాలు... వివరాలతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆసక్తుల మేరకు సెర్చ్‌ ద్వారా నెట్‌వర్క్‌ సభ్యుల్ని వెతికి ట్విట్టర్‌లో మాదిరిగా 'ఫాలో' అవ్వాలి. నెట్‌వర్క్‌లో సభ్యుల్ని తొలగించాలంటే 'బ్లాక్‌ యూజర్‌' ఉంది. 
ఆటల నెట్‌వర్క్‌
'నేను ఈ రోజు నుంచి జిమ్‌కి వెళ్లాను! ఆపకుండా మూడు కిలోమీటర్లు పరిగెత్తాను!' అని అప్‌డేట్‌ పోస్ట్‌ చేశారు. అప్పుడు మీ ఫ్రెండ్‌ 'వెరీగుడ్‌!! కీప్‌ ఇట్‌ అప్‌!' అని ప్రోత్సహించాడు. అంతేకాదు 'నేను ఈ రోజు ఆపకుండా 30 పుష్‌అప్స్‌ తీశాను. నువ్వు ప్రయత్నిస్తావా?' అని ఛాలెంజ్‌ విసిరాను. ఇదంతా ఎందులో అంటారా? అందుకు ప్రత్యేక అడ్డా ఉంది. అదే http://tribesports.com దీంట్లో సభ్యులై స్నేహితుల స్పోర్ట్స్‌ యాక్టివిటీని చూడొచ్చు. అప్‌డేట్స్‌ చూస్తూ ప్రోత్సహించవచ్చు. ట్విట్టర్‌లో మాదిరి నెట్‌వర్క్‌లోని సభ్యుల్ని 'ఫాలో' అవ్వాల్సిందే. 
ఇవో రెండు
స్నేహానికి ఎప్పుడూ ఒకటే వేదికా? కొత్త స్నేహ గీతాల్ని ఆలపిస్తూ ముందుకొచ్చింది www.meetme.comసుమారు 40 మిలియన్ల యూజర్లు దీంట్లో సభ్యులై స్నేహానికి ఆహ్వానం పలుకుతున్నారు. దీంట్లో కావాల్సినంత వినోదపు అంశాలున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూనే వీడియో ఛాటింగ్‌లో ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పొచ్చు. నెట్‌వర్క్‌లోకి సైన్‌ఇన్‌ అయ్యి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల్లోని స్నేహితులకు ఆహ్వానాన్ని పంపొచ్చు. గేమ్స్‌ ఆడేందుకు ప్రత్యేక విభాగం ఉంది.
ఇలాంటిదే మరోటి http://badoo.com సభ్యులై మీరున్న లొకేషన్‌ ఆధారంగా స్నేహితుల్ని వెతకొచ్చు. గూగుల్‌ మ్యాపింగ్‌పై నెట్‌వర్క్‌ సభ్యుల వివరాల్ని తెలుసుకోవచ్చు. 
అడగడమే ఆలస్యం!
ఏదైనా సందేహం వస్తే వెంటనే ఎవరినైనా అడిగి నివృత్తి చేసుకుంటాం! ఇలా ఏదైనా అంశానికి సంబంధించిన విషయాల్ని ప్రశ్నల రూపంలో అడిగి జవాబు తెలుసుకునేందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ ఉంది. అదే http://qooh.me సులభమైన ఇంటర్ఫేస్‌తో నెట్‌వర్క్‌ని రూపొందించారు. సభ్యులైFind People స్నేహితుల్ని వెతకొచ్చు. Tagపై క్లిక్‌ చేసి సభ్యుల్ని ఫాలో అవ్వాలి. ప్రొఫైల్‌లో కనిపించే బాక్స్‌లో ప్రశ్న టైప్‌ చేసి పోస్ట్‌ చేయవచ్చు.Repliesలో సమాధానాల్ని చూడొచ్చు. మెయిల్స్‌ చెక్‌ చేసిన మాదిరిగా ఇన్‌బాక్స్‌లో మీకొచ్చిన ప్రశ్నల్ని చెక్‌ చేయాలి. లాజిక్‌లేని ప్రశ్నల్ని Delete చేసే వీలుంది.

అమ్మలకో అడ్డా!
మాతృమూర్తులందరికీ ఇదే మా ఆహ్వానం అంటోంది www.cafemom.com దీంట్లో సభ్యులై తీరిక సమయాల్లో నెట్‌వర్క్‌ సభ్యులతో ముచ్చట్లు పెట్టొచ్చు. Conversation, Advice, Entertainment విభాగాలు ఉన్నాయి. పిల్లల పెంపకంపై సలహాలు, సూచనల్ని నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు.Love & Marriage, Mom Confessions, Babies, Single Moms...అంటూ ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడి ఆలోచనల్ని పంచుకుంటున్నారు. అమ్మగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని పోస్టింగ్‌ చేసి నెట్‌వర్క్‌ సభ్యుల సలహాల్ని తీసుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు