జేబులోనే ఆరోగ్యం (Eenadu_27/09/12)
జేబులో ఫోనుంటే... ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్టే కాదు!! అనారోగ్యం ఆమడ దూరంలో ఉంటుంది! అదెలా అంటారా?అందుకు అనువైన అప్లికేషన్లు ఉన్నాయి! ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి!స్మార్ట్ మొబైల్ అంటే... ఫోన్‌కాల్స్... వెబ్ విహారం... సోషల్ నెట్‌వర్కింగ్.. మాత్రమే కాదు. నిత్యం వెన్నంటి ఉండే ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా. అంతేనా! ఫ్యామిలీ డాక్టర్ పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య చిట్కాల్ని అందించే నిపుణుడిలా మారిపోతుంది. శరీరాన్ని మానిటర్ చేసే స్కానర్‌గా సేవలందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ మొబైల్ చేతిలో ఉంటే ఫ్యామిలీ డాక్టర్ పక్కన ఉన్నట్టే. అదెలాగో తెలియాలంటే ఆయా ఆండ్రాయిడ్ అప్లికేషన్ల గురించి వివరంగా తెలుసుకోవాల్సిందే.ఇదో వర్చువల్ జిమ్! రోజులో ఓ గంట వ్యాయామం చేస్తే చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. మరి, ఎలాంటి వ్యాయామం, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపేలా మీకంటూ శిక్షకుడు ఉండాలనుకుంటే VirtuaGymఅప్లికేషన్‌తో ఇది సాధ్యమే. ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టూల్‌ని ఇన్‌స్టాల్ చేయగానే Exercise, Progress, About VirtuaGym, Settings...మెనూలతో ఓపెన్ అవుతుంది. త్రీడీ గ్రాఫిక్స్‌తో వ్యాయామ పద్ధతుల్ని వివరంగా తెలుసుకోవచ్చు. రోజూ చేసే వ్యాయామాన్ని క్యాలెండర్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. 400 రకాల వ్యాయామ పద్ధతుల్ని బ్రౌజ్ చేసి చూడొచ్చు. 100పైగా జిమ్ వర్క్‌అవుట్స్‌ని చూడొచ్చు. ఫిట్‌నెట్ చిట్కాలు పొందొచ్చు.http://goo.gl/uaVGb * ఇలాంటిదే మరోటి Complete Gym Exercise Guide. శరీరంలోని ఏయే అవయవాలకు ఎలాంటి ఎక్సర్‌సైజులు అవసరమో గ్రాఫిక్స్‌తో తెలియజేస్తుంది. వరుసగాAbExercises, Bicep, Chest, Shoulder, Traps, Lats...విభాగాలున్నాయి. వివరాల్ని గ్రాఫిక్స్‌తో తెలుసుకోవచ్చు. http://goo.gl/vCHC5 * సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నించే వారికి 20 Killer Ab Exercisesప్రత్యేకం. విజువల్స్ ద్వారా ఆయా వర్క్‌అవుట్ వివరాల్ని అందిస్తుంది. http://goo.gl/msVl9 * జబ్బల కండల్ని పెంచేందుకు 10 Killer Bicep Exercisesఉంది. గ్రాఫిక్స్, టెక్స్ట్ వివరాలతో పొందొచ్చు. http://goo.gl/ DTj6g యోగా ట్రైనర్ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతని అందించే యోగాపై ధ్యాస మళ్లితే మొబైల్‌నే యోగా గురువుగా మార్చేయ వచ్చు. అదీ ఉచితంగా!! Daily Yoga (All-in-One) అప్లికేషన్‌తో అది సాధ్యమే. ప్రపంచంలోనే పేరొందిన యోగా కోచ్ అప్లికేషన్‌గా యూజర్లను ఆకట్టుకుంటోంది. యోగాసనాల్ని హెచ్‌డీ వీడియోల్లో చూసి సాధన చేయవచ్చు. వాయిస్ ఓవర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వీడియోలను రూపొందించారు. మొత్తం 26 యోగా సెషన్స్ ఉన్నాయి. లైబ్రరీలో 200పైగా యోగా భంగిమలు, 6 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్యూన్స్‌ని కూడా పొందొచ్చు. Casual, Moderate, Intense విభాగాల్లో మీరున్న స్థితి ఆధారంగా ఎంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త యోగా సెషన్స్‌ని అప్‌డేట్ చేస్తున్నారు. http://goo.gl/xYGW0 * నడుము నొప్పికి సంబంధించిన యోగా ఆసనాల్ని ప్రత్యేకంగా సాధన చేసేందుకు డైలీయోగా ప్లగ్గిన్‌ని పొందొచ్చు. అదే Daily Yoga for Backhttp://goo.gl/eEEJf * యోగా సాధనకు Pocket Yogaమరోటి. మేజ్‌లు, టెక్స్ట్ వివరాలతో ఆసనాల్ని సాధన చేయవచ్చు.http://goo.gl/i1WGO * వాయిస్ ఓవర్, వీడియో విజువల్స్‌తో మరింత వివరంగా సాధన చేసేందుకు మరో 'పాకెట్ యోగా' ఉంది. ఇదో కమర్షియల్ టూల్. గూగుల్ ప్లే నుంచి రూ.160తో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.http://goo.gl/ZANOK గుండెకు కాపలా! వివిధ సందర్భాల్లో మీ గుండె లయని (హార్ట్‌రేట్) తెలుసుకోవాలంటే Cardiogr aph టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరి. ఇన్‌స్టాల్ చేసి తెరపై వచ్చిన ఐకాన్‌ని తాకగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాంట్లోని Startబటన్‌పై క్లిక్ చేసి చూపుడి వేలిని మొబైల్ కెమెరాపై ఉంచాలి. కెమెరా లెన్స్‌ని వేలు మొత్తం కవర్ చేసేలా చూసుకోవాలి. కొన్ని సెనన్ల తర్వాత తెర పైభాగంలో గ్రాఫ్ ద్వారా రీడింగ్ కనిపిస్తుంది. హిస్టరీలో గతంలో తీసుకున్న రీడింగ్ వివరాల్ని చూడొచ్చు. గుండెకి సంబంధించిన ఆసక్తికరమైన నిజాలను పొందొచ్చు.http://goo.gl /zdeaU * ఇలాంటిదే మరోటి Instant Heart Rate. టూల్‌ని ఓపెన్ చేసిMeasureపై ట్యాప్ చేయాలి. చూపుడు వేలిని కెమెరాపై ఉంచి రీడింగ్ చూడొచ్చు. రికార్డింగ్ పూర్తయ్యాక మీరున్న జోన్‌ని తెలుసుకోవచ్చు. పచ్చ రంగు బాక్స్‌లో ఉన్న రీడింగ్‌కి దగ్గరగా ఉంటే మీరు సురక్షితంగా ఉన్నట్టు. http://goo.gl/zmln9 * ఇలాంటిదే మరోటి Heart Rate Monitor.సేఫ్‌జోన్‌ని దాటి హార్ట్‌రేట్ పెరిగితే ఎలర్ట్ చేస్తుంది. http://goo. gl/Ad Bdz తేల్చి చెప్పేస్తుంది! మీరున్న ఎత్తుకి ఎంత బరువు ఉండాలి? అదేనండీ 'బాడీ మాస్ ఇండెక్స్'ని తెలుసుకోవాలంటేBMI Calculatorటూల్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి. అప్లికేషన్‌ను ఓపెన్ చేసి వయస్సు, ఎత్తు, బరువు వివరాల్ని ఎంటర్ చేస్తే ప్రాసెస్ చేసి మొత్తం వివరాల్ని చూపిస్తుంది.http://goo.gl/U8P4V * ఇలాంటిదే మరోటి Ideal Weight. యూజర్‌ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్‌తో అప్లికేషన్‌ను రూపొందించారు.http://goo.gl/KdmtN * మరో 'బీఎంఐ కాలిక్యులెంటర్' ఉంది. http://goo.gl/92SN5 డైటీషియన్ కావాలా? రోజూ ఎంతెంత పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకోవాలంటే DietPointపర్సనల్ వెయిట్‌లాస్ మెనేజర్ ఉంటే సరి. వివిధ రకాల 'డైట్‌ప్లాన్స్' సిద్ధంగా ఉన్నాయి. ఉదయం తీసుకునే అల్పాహారంలో ఎలాంటి కేలరీలు ఉండాలి. భోజనంలో ఎన్ని పోషక విలువలు ఉండాలి... లాంటి మరిన్ని వివరాల్ని తెలుసుకోవచ్చు. బరువు తగ్గించుకునేందుకు కావాల్సిన జాగ్రత్తల్ని అందిస్తున్నారు. ఆరోగ్య చిట్కాలకు కొదవే లేదు.http://goo.gl/WHDjx * వూబకాయంతో బాధపడుతున్నారా? మీ బరువుని తగ్గించుకునే చిట్కాల్ని Noom Weight Loss Coach అందిస్తోంది. ఎలాంటి వ్యాయామం చేయాలి? ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? వర్క్‌అవుట్స్, తీసుకుంటున్న ఆహారం, కోల్పోతున్న బరువు వివరాల్ని 'లాగ్‌బుక్'లో రికార్డ్ చేయవచ్చు. http://goo.gl/v3DV8 * తినే ఆహారంలో ఎన్ని కేలరీల శక్తి దాగుందో తెలుసుకునేందుకు ప్రత్యేక అప్లికేషన్ ఉంది. సుమారు 2,000,000 ఆహారాలకు సంబంధించిన వివరాల్ని నికిక్షప్తం చేశారు. http://goo.gl/Jlj6S మరికొన్ని... * చక్కని ఆరోగ్యానికి విలువైన చిట్కా ఏంటో తెలుసా? నీళ్లు ఎక్కువగా తాగడం. మరి, రోజు తగినన్ని నీళ్లు తాగుతున్నారా? పని ఒత్తిడిలో మర్చిపోతున్నారా? అయితే, మీకు Water Your Body చాలా అవసరం. రోజులో మీరెన్ని లీటర్ల నీళ్లు తాగారో ట్రాక్ చేస్తుంది.http://goo.gl/57kzX * అమ్మమ్మో... నానమ్మో మాదిరిగా ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే ఆరోగ్య చిట్కాల్ని అందిస్తోంది Home Remedies. ఆయా చిట్కాలతో చిన్నపాటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.http://goo.gl/tM8fH * వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషక విలువల గురించి తెలుసుకోవాలంటే Immunity Boosters టూల్‌ని పొందండి.http://goo.gl/jZqq1 * చాలినంత నిద్ర ఆరోగ్యానికి మూలం. మరి, మీరెప్పుడు పడుకుంటున్నారు? ఎప్పుడు నిద్ర లేస్తున్నారు? ఎన్ని గంటలు పడుకుంటున్నారు?... లాంటి వివరాల్ని ట్రాక్ చేసి నిద్రకున్న ప్రాధాన్యతని చెబుతోంది Sleep Time.దీంట్లో అలారం సెట్ చేస్తే మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ అలారం మోగుతుంది. http://goo.gl/qWxNg * అమ్మాయిల్ని నాజూకుగా కనిపించేలా చేస్తా అంటూ ఆకట్టుకుంటోంది My Diet Coach. ఆహార అలవాట్లను నియంత్రించుకునే చిట్కాల్ని అందిస్తోంది. http://goo.gl/JVjtS |
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి