పీసీ మాస్టారు...మహాజోరు! (Eenadu_20/09/12)

పీసీ అంటే... ఆఫీస్‌ అసిస్టెంటో... వీడియో గేమ్‌ల అడ్డానో... సాఫ్ట్‌వేర్‌ల స్థావరమో మాత్రమే కాదు! తెలివిని పెంచే విజ్ఞాన భాండాగారం! చదువు చెప్పే ఉపాధ్యాయ బృందం! అదెలా అంటారా? కొన్ని ప్రత్యేక టూల్స్‌, వెబ్‌ సర్వీసులతో సాధ్యమే!!
మీ పీసీని పాఠాలు చెప్పే మాస్టారులాగా మార్చడానికి బోలెడు మార్గాలున్నాయి. ఇక అదే పిల్లలకు పాఠాలు నేర్పుతుంది. విజ్ఞానాన్ని పెంచే ఊసులు చెబుతుంది. భాషల వెనకున్న భావాల్ని బోధిస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు దోహద పడుతుంది. ఇలా ఒకటేమిటి చాలానే చేస్తుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే స్నేహితుడిలా మారిపోతుంది. అందుకు అనువైన అప్లికేషన్లు నెట్‌లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అన్నింటినీ ఉచితంగా పొందొచ్చు. ఆయా అరుదైన అప్లికేషన్ల సంగతులేెంటో తెలుసుకుందాం!చర్చకు ఇలా సిద్ధం!
స్కూలు, కాలేజీ, కంపెనీల్లో జరిగే బృంద చర్చల్లో (గ్రూప్‌ డిస్కషన్స్‌) మీదైన ముద్ర వేయాలంటే అందుకు మీ పీసీ సాయం చేస్తుందని తెలుసా? అందుకుArgumentativeటూల్‌ ఉంటే సరి! ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఫ్లోఛార్ట్‌ పద్ధతిలో కావలసిన అంశానికి సంబంధించిన వివరాల్ని ఒక్కొక్కటిగా పొందుపరచాలి. ఇన్‌స్టాల్‌ చేయగానే మెనూబార్‌, టూల్‌బార్‌లతో ఛార్ట్‌ ఓపెన్‌ అవుతుంది.Reason, Objection ఆధారంగా చర్చను మొదలు పెట్టాలి. ఫ్లోఛార్టుల్లో అదనపు బాక్స్‌లను తీసుకోవడానికి ఎడిట్‌ మెనూలో Addఆప్షన్‌ ఉంది. Moveఆప్షన్‌తో ఛార్ట్‌లోని బాక్స్‌ల స్థానాల్ని మార్చొచ్చు. డిస్కషన్‌ మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాత 'స్పెల్‌చెక్‌' చేసి తప్పుల్ని సవరించొచ్చు. ప్రింట్‌ ప్రివ్యూ చూసుకుని ఛార్ట్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు. మొత్తంగా బృంద చర్చల్లో మీదైన వాదనని వినిపించేందుకు 'మైండ్‌ మ్యాప్‌'లా ఉపయోగపడుతుంది. మరిన్ని వివారాలకుhttp://argumentative.sourceforge.net
ఇదో ఇంగ్లిష్‌ టీచర్‌
ఇంగ్లిషును నేర్చుకోడానికి ఉన్న టూల్స్‌్‌లో EasyWordsఒకటి. కొత్త పదాల్ని నేర్పుతుంది. మీకు మీరే టెస్ట్‌ పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ పనో, కాలేజీ ప్రాజెక్ట్‌ వర్కో చేస్తున్నప్పుడు మధ్యలోనే కొత్త పదాల్ని నేర్చుకోవచ్చు. అందుకు టూల్‌ను ఇన్‌స్టాల్‌ చేసి టెస్ట్‌ని సెట్‌ చేసుకోవాలి. ఎన్ని నిమిషాలకో ప్రశ్న రావాలో కూడా మీరే నిర్ణయించొచ్చు. మల్టిపుల్‌ ఛాయిస్‌తో ప్రశ్న తెరపై కనిపిస్తుంది. పదానికి సంబంధించిన అదనపు వివరాల్ని వెబ్‌ నిఘంటువు ద్వారా పొందొచ్చు. మొత్తం ప్రక్రియని Settings విండోలో పెట్టుకుని వాడుకోవచ్చు. వివరాలకు http://goo.gl/Qzhzx
నెట్‌లో ఏదైనా సమాచారాన్ని బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు కనిపించే క్లిష్టమైన పదాలకి అర్థం వెతకాలంటే ఆన్‌లైన్‌ నిఘంటువుల్లోకి వెళ్లక్కర్లేదు. ఒకేక్లిక్కుతో WordWebడిక్షనరీని ఓపెన్‌ చేయవచ్చు. విండో కనిపించే మైక్‌ బటన్‌పై క్లిక్‌ చేసి పదాన్ని ఎలా పలకాలో వినొచ్చు. పదానికి సంబంధించిన వికీపీడియా సమాచారాన్ని కూడా అందిస్తుంది. http://wordweb.info/free/
ఇలాంటిదే మరోటి Artha. నెట్‌ కనెన్షన్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లో దీన్ని వాడుకోవచ్చు. పదానికి సంబంధించిన Synonyms, Derivatives, Similar, Kinds... చూడొచ్చు.http://artha.sourceforge.net
పెద్దలు, పిల్లల్ని ఆకట్టుకునే పజిల్స్‌ అందిస్తూ ముందుకొచ్చింది FindThatWord పజిల్‌ సాఫ్ట్‌వేర్‌. సులువైన ఇంటర్ఫేస్‌తో మీరే పజిల్‌ని తయారు చేసి ఇతరులకు సవాల్‌ విసరొచ్చు. క్రియేట్‌ చేసిన పజిల్స్‌ని వివిధ ఫార్మెట్‌ల్లోకి ఎక్స్‌పోర్ట్‌ చేసుకునే వీలుంది. పీడీఎఫ్‌ ఫార్మెట్‌లోకి మార్చుకుని ప్రింట్‌ తీసుకోవచ్చు కూడా. http://sourceforge.net/projects/findthatword/
పిల్లలకు ప్రత్యేకం
ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు కంప్యూటర్‌నే ట్యూటర్‌గా మర్చేయాలంటే అందుకు Sebran's ABC అప్లికేషన్‌ సిద్ధంగా ఉంది. ఇన్‌స్టాల్‌ చేసి తెరపై వచ్చిన షార్ట్‌కట్‌ని ఓపెన్‌ చేయగానే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో పని మొదలు పెడుతుంది. ఆకట్టుకునే కార్టూన్స్‌తో కూడికలు, తీసివేతలు, గుణింతాలు, అక్షరాలు, అంకెల్ని నేర్పేస్తుంది. ఫుల్‌స్క్రీన్‌లో How many?, Add, Subtract, Multiply, Pick A Picture, First Letter, Memory, Word Memory, ABC Rain, Letter Rain... లాంటి మరిన్ని విభాగాలు కనిపిస్తాయి. పిల్లలు చేయాల్సిందల్లా మౌస్‌తో జవాబుని గుర్తించడమే. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు www.wartoft.nu/software/sebran/
ఇలాంటిదే మరోటి GCompris. విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుతూ పిల్లల తెలివి పెంచేందుకు తోడ్పడుతుంది. మౌస్‌ వాడకాన్ని తెలిపేందుకు ప్రత్యేక గేమ్స్‌ ఉన్నాయి. చెస్‌తో పాటు రంగుల్ని నింపే ఆటలు కూడా ఉన్నాయి. http://gcompris.net
మరింత ప్రత్యక్షంగా!
గణితం, సైన్స్‌, టెక్నాలజీ, కంప్యూటింగ్‌ పాఠాల్ని మరింత ప్రత్యక్షంగా త్రీడీలో నేర్చుకోవాలంటేwww.yenka.comలోకి వెళ్లండి. అందుకు సైట్‌లో నిక్షిప్తం చేసిన ప్లగ్గిన్‌ని సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేయాలి. కావాల్సిన పాఠాల్ని ప్రింట్‌ తీసుకోవచ్చు.
మీరెప్పుడైనా మనిషి శరీరంలోకి వెళ్లి కింది నుంచి పై వరకూ తిరిగి వస్తే ఎలా ఉంటుందో వూహించారా? అచ్చం అలాంటి అనుభూతిని కలిగించే వీడియో గేమ్‌ ఉంది. శరీరంలోకి పంపిన బుల్లి రోబో రూపంలో అంతర్గత అవయవాలన్నీ ఎలా పని చేస్తాయో చూస్తూ ఆడుకోవచ్చు. వీడియో గేమ్‌ పేరు immuneattack సైన్స్‌ విద్యార్థులకు ఇది ఎంతో ఆసక్తికరం. వీడియో, డౌన్‌లోడ్‌ కోసం www.fas.org/immuneattack/
వారికో ఆఫీస్‌!
పిల్లలు వారంతట వారే డాక్యుమెంట్స్‌, ఎక్సెల్‌ షీట్స్‌, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్స్‌ని క్రియేట్‌ చేసుకోవాలంటే, వారికో ప్రత్యేక ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ సిద్ధంగా ఉంది. అదేOOo4Kids. ముఖ్యమైన సౌకర్యాలతో, కార్టూన్‌ గుర్తులతో రూపొందించారు. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేయగానే Writer, Draw, Impress, Calc Sheet గుర్తులతో ఆఫీస్‌ ఓపెన్‌ అవుతుంది. వర్డ్‌ డాక్యుమెంట్‌ని క్రియేట్‌ చేయాలంటే రైటర్‌లోకి వెళ్లాలి. మెనూబార్‌, టూల్‌బార్‌లతో పేజీ వస్తుంది. డాక్యుమెంట్‌ని టైప్‌ చేశాక ఎమ్మెస్‌ ఆఫీస్‌లో మాదిరిగానే ఫార్మెటింగ్‌ ఆప్షన్లతో నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇదే మాదిరిగా ప్రజంటేషన్స్‌, వర్క్‌షీట్‌లను కూడా తయారు చేయవచ్చు. క్రియేట్‌ చేసిన డాక్యుమెంట్‌ ఫైల్స్‌ని ఒకేక్లిక్కుతో పీడీఎఫ్‌లోకి మార్చేయవచ్చు. http://wiki.ooo4kids.org/index.php/main_page
మరికొన్ని...
జ్ఞాపక శక్తిని మరింత పెంచుకునేందుకు అనువైన టూల్‌ MemoryLifter.వర్చువల్‌ ఫ్లాష్‌కార్డ్‌ను క్రియేట్‌ చేసి మీ మెదడుకు మీరే పదును పెట్టుకోవచ్చు.http://goo.gl/VQhve
ఫోన్‌ నెంబర్లు, బ్యాంకు ఎకౌంట్‌ నెంబర్లు, పుట్టినరోజు తేదీల్ని మర్చిపోకుండా ఉండాలంటే Skynergy Memoriser తో సాధ్యమే. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసిన వెంటనే మొత్తం డేటాని సాఫ్ట్‌వేర్‌లోకి ఫీడ్‌ చేయాలి. దాని ఆధారంగా ఎంచుకున్న సమయానికి ఫోన్‌నెంబర్లు, ఎకౌంట్‌ నెంబర్లు, పుట్టిన తేదీలను క్విజ్‌ రూపంలో సిస్టం అడుగుతుంది. పది అటెంప్ట్స్‌లో జవాబు చెప్పాలి. లేదంటే సిస్టం సరైన జవాబుని డిస్‌ప్లే చేస్తుంది. ఇలా అన్ని వివరాల్ని కంఠస్థం చేయవచ్చు.http://goo.gl/NWavp




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు