Eenadu Saturday Eetaram (31/12/2011)

కుర్రకారు...
గడచిపోయిన ఏడాదిలో వాళ్ల అడుగుజాడల విశేషాలెన్నో! సరదాల్ని రాకెట్‌ వేగంతో పరుగులెత్తించారు. అవినీతికి వ్యతిరేకంగా ముందుకురికారు. ఫార్ములా వన్‌కి 'గ్రాండ్‌' స్వాగతం పలికింది వాళ్లే. ఐశ్వర్య అమ్మయితే అభిషేక్‌ కన్నా ఎక్కువగా మురిసిందీ వీళ్లే. వెబ్‌ని పరుగులు పెట్టించిందీ, గాడ్జెట్స్‌ జోరు పెంచిందీ మన యువతే. పెద్దలొద్దంటున్నా శృంగారానికి పెద్దపీట వేస్తుందీ ఈ కళాకారులే. ఒకటా? రెండా? వారు ముద్ర వేయని రంగం లేదు. అడుగు పెట్టని చోటే కనిపించదు. ఆ ట్రెండ్స్‌... టాపిక్స్‌... ఆకట్టుకున్న వివాదాల ముచ్చట్లు.
అడుగు పెట్టి... అదరగొట్టి!
కదనోత్సాహం
యాభై కోట్ల మంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఊతమిచ్చిన వాళ్ల సంఖ్య. ఒకే విషయంపై ఇంతమంది ఏకతాటిపైకి రావడం అరుదే. దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రఖ్యాత టైమ్‌ పత్రిక ప్రపంచంలోని పది ముఖ్య సంఘటనల్లో అన్నా ఉద్యమాన్ని ఒకటిగా గుర్తించింది.
ఐశ్వర్య అమ్మతనం
శ్వర్య ఈ ఏడాదే అమ్మ అయింది. అభిషేక్‌, అమితాబ్‌లకన్నా చిత్రంగా యువత సంబరాల్లో మునిగింది. ఆ ముద్దులొలికే పాపాయిని చూడాలని ఆన్‌లైన్లో వెతుకులాడింది. గూగుల్‌లో అత్యధికులు గాలించిన వ్యక్తిగా ఐష్‌ రికార్డులకు ఎక్కింది. అన్నట్టు 11-11-11 రోజునే ఐష్‌ అమ్మవుతుందని నూట యాభై కోట్ల రూపాయల బెట్టింగ్‌ జరిగిందని భోగట్టా!
శృంగార పాఠాలు
యువత శృంగారంపై కూడా కుండబద్దలు కొడుతోంది. ఇండియా టుడే సర్వే ప్రకారం 'పద్దెనిమిది నిండకుండానే మేం శృంగారంలో పాల్గొన్నాం' అని పదిహేను శాతం మంది ఒప్పుకుంటే, ముగ్గురిలో ఒకరు 'పెళ్లికి ముందే మాకు ఆ అనుభవం ఉంది' అని అంగీకరించారు.
కుర్ర'కారు' జోరు
కారులో, కుర్రకారులో కామన్‌గా ఉండేది వేగం. ఫార్ములా వన్‌ రూపంలో ఆ వేగం యూత్‌ని చుట్టేసింది. తొలి ఇండియన్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ పోటీలకు వేదిక ఢిల్లీలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌. సచిన్‌, షారూఖ్‌లాంటి స్టార్ల నుంచిఎందరో పోటీలకు హాజరయ్యారు. తొంభై అయిదువేల మంది ప్రేక్షకులు పోటీదారుల్ని హుషారెత్తించారు. కొనసాగింపుగా ఐపీఎల్‌ తరహాలో ఐ 1 సూపర్‌ సిరీస్‌లు రానున్నాయి.
వెర్రెత్తించిన కొలవెరి
నుష్‌ పాడిన తింగ్లిష్‌ పాట 'కొలవెరి డీ' వెర్రెక్కించింది. యూట్యూబ్‌లో ఇప్పటికి మూడు కోట్ల మంది వీక్షించారు. డిన్నర్‌ చేద్దాం రమ్మంటూ జపాన్‌ ప్రధాని నుంచి ధనుష్‌కి ఆహ్వానమందింది. హిందీ వెర్షన్‌ నాకంటే నాకని అక్షయ్‌, షారూఖ్‌ల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.
వెబ్‌, గ్యాడ్జెట్ల హోరు
న్‌లైన్‌ని, సెల్‌ఫోన్‌ని యూత్‌ నుంచి విడదీసి చూడగలమా? ఈ జోరు ఈ ఏడాది మరింత ఊపందుకుంది. నవంబరు నాటికి దేశంలో నెట్‌ యూజర్లు పన్నెండు కోట్లు. అందులో డెబ్భె ఎనిమిది శాతం ముప్ఫైఐదు లోపు నవ యువతే. ఈ ఒక్క ఏడాదే ఫేస్‌బుక్‌కి లాగిన్‌ అయింది 1.1 కోట్లు. ముంబై, ఢిల్లీ, బెంగళూరుల తర్వాతి స్థానం మన హైదరాబాద్‌దే.* సరికొత్త గ్యాడ్జెట్లు యువతని మురిపించాయి. ఆకాశ్‌ టాబ్లెట్‌ హాట్‌ టాపిక్‌ అయి కూర్చుంది. ఆన్‌లైన్‌ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. సెల్‌ఫోన్లలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల వాటా పద్దెనిమిది శాతం.
వివాదాల 'తారా'పథం
విజయానికి వివాదాల బాట పరుచుకున్న వారూ ఉన్నారు. ముఖ్యంగా పూనమ్‌ పాండే.. వీణా మాలిక్‌.. సన్నీ లియోన్‌లు. వరల్డ్‌కప్‌కు ముందు పూనమ్‌ ఓ అనామకురాలు. 'భారత జట్టు కప్పు గెలిస్తే వలువలూడదీస్తా' అని సంచలనం లేవదీసింది. కవర్‌ పేజీకి నగ్నంగా పోజులిచ్చి ఏమీ తెలియదంటూ పెద్ద దుమారమే లేపింది వీణా మాలిక్‌. కెనడా నుంచి విచ్చేసిన శృంగార భామ బిగ్‌బాస్‌లో కనిపించి బాలీవుడ్‌లోనే ఛాన్స్‌ కొట్టేసింది. అన్నట్టు... టాప్‌లెస్‌గా కనిపించి మన కాజల్‌ అగర్వాల్‌ రేపిన వివాదమూ తక్కువేం కాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)