పోస్ట్‌లు

2013లోని పోస్ట్‌లను చూపుతోంది

హింస ధ్వని! (14/07/13_Sunday magazine)

చిత్రం
హింస ధ్వని! వేలిముద్రల్లో నేరస్థుల ఆనవాళ్లు ఉన్నట్టే...'నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో' వార్షిక నివేదికల్లో రక్తపు మరకల గుర్తులు కనిపిస్తాయి, హాహాకారాల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. యముని మహిషపు గంటల సవ్వడిని తలపించే ఆ అంకెల రంకెలివి... వీ ధులన్నీ ఎర్రగా - రక్తంతో కళ్లాపి చల్లినట్టు. చెట్లకు పుర్రెల గుత్తులు. ఎటుచూసినా శవాల గుట్టలు. ట్రక్కులకొద్దీ నోట్ల కట్టలు. ఎక్కడి నుంచో తుపాకుల మోతలు. పత్రికల నిండా చావు రాతలు. ఎవడో దొంగాడు...ముసలమ్మ మెడలోని పుస్తెలతాడు తెంచుకెళ్తున్నాడు. ఇంకెవడో ముసుగు వెధవ, తాళాలు పగులగొట్టి ఇల్లంతా దోచేస్తున్నాడు. డెబిట్‌కార్డు బేబులోనే ఉంటుంది, ఖాతాలోని డబ్బు మాయమౌతుంది. ఇ-మెయిల్‌లో లాటరీ వూరింపులు, ఫేస్‌బుక్‌ నిండా అమ్మాయిల మార్ఫింగ్‌ ఫొటోలు. మన జాగాలో ఏ గూండాలో పాగావేస్తారు. ప్రశ్నించలేం. తిరగబడలేం. ఎవరి నేరాలివి? ఏ ముఠాల ఘోరాలివి? 34వేల హత్యలు, 35వేల హత్యాయత్నాలు, 25వేల అత్యాచారాలు, 27వేల దోపిడీలు - ఇవేం ప్రగతి సూచికలు కాదు. ఏడాది కాలపు పాపాల చిట్టాలు. 2012 సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తాజాగా విడుదల చే

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

చిత్రం
అందరూ...ఇంటర్నెట్‌లో సమాచారాన్ని చూస్తారు, మెయిల్స్‌ చూసుకుంటారు. మహా అయితే వీడియోలు వీక్షిస్తారు. అతి కొద్దిమంది మాత్రం, వ్యాపార అవకాశాల్ని వెతుక్కుంటారు. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను 'వరల్డ్‌ వైడ్‌ డబ్బు'గా మార్చుకుంటారు, 'నెట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌'గా అవతరిస్తారు. సం స్థ పేరు: పేరేదైనా, చివర్లో 'డాట్‌కామ్‌' తోక. చిరునామా: బెడ్‌రూమ్‌ కమ్‌ ఆఫీస్‌రూమ్‌ కమ్‌ మీటింగ్‌రూమ్‌ కమ్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌. హోదా: మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కమ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కమ్‌ క్లర్క్‌ కమ్‌ ఆఫీస్‌బాయ్‌ మౌలిక సదుపాయాలు: డొక్కు కంప్యూటర్‌, పాత బైకు. వాటాదారులు: ఏక వ్యక్తి సైన్యం. మహా అయితే, ఒకరిద్దరు మిత్రులు. మేధోమథనం: ఇరానీ కేఫ్‌లోనో, కాఫీడేలోనో. ఆఫీసు మెట్ల మీదో, క్యాంపస్‌ చెట్ల నీడనో. లక్ష్యాలు: మార్కెట్‌లో నిలవాలి. జీవితంలో 'సక్సెస్‌' సాధించాలి. * * * s..u..c..c..e..s..s ...అన్న మాటకు అంతర్జాలంలో రకరకాల నిర్వచనాలు ఉంటాయి. ఆ ఆంగ్లాక్షరాల్ని మనం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో టైపు చేయగానే ఎవరో చెప్పిన విజయ సూత్రాలూ, ఇంకెవరివో గెలుపు చరిత

కసి పెట్టారు..కని పెట్టారు! (Eenadu eetaram_08/06/13)

చిత్రం
సెల్‌ఫోన్‌లో ఎడతెగని కబుర్లు... ఆన్‌లైన్‌లో తెమలని చాటింగ్‌లు... సరదాలు, స్వీట్‌నథింగ్స్‌... ఎప్పుడూ ఉండేవేగా! ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారు కొందరు యూత్‌... ప్రాజెక్టులంటూ ప్రయోగాలు మొదలెట్టారు... దిగాక అవాంతరాలు అడ్డుపడ్డాయ్‌... అయినా మధ్యలోనే కాడి వదిలేయలేదు... పట్టుపట్టి ముందుకెళ్లారు. ఎట్టకేలకు సాధించారు... అవార్డులూ వరించాయ్‌... ఇంతకీ ఆ విజేతలేం చేశారు? ఆలోచన ఎగిరింది! పరికరం:  ఆర్నిథాప్టర్‌ (పక్షి, హెలికాప్టర్‌ పోలికలున్న విహంగం) రూపకర్తలు:  వి.ఎన్‌.జశ్వంత్‌, ఎస్‌.ఎన్‌.వి.ఆంజనేయప్రసాద్‌, కాటం శ్రీనివాస్‌ ప్రత్యేకతలు:  శత్రు స్థావరాలపై పక్షిలా ఎగురుతూ ఫొటోలు తీస్తుంది. 26/11 లాంటి ఉగ్రవాద సంఘటనల్లో శత్రువుల ఆనుపానులు గుర్తిస్తుంది. కారు రేసుల్ని పైనుంచి వీడియోలు తీస్తుంది. ప్రేరణ:  ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా. చేసే ఆవిష్కరణ దేశానికి ఉపయోగపడాలనే తలంపు. సాధించారిలా:  ముగ్గురూ హైదరాబాద్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులే. కోర్సులో భాగంగా ఏదైనా భిన్నమైన ప్రాజెక్టు చేయాలనుకున్నారు. అంతర్జాలంలో వెతికితే పక్షిని పోలిన హెలికాప్టర్‌ని ఆర్నిథాప్టర్‌

సకల సౌకర్యాల బజార్! (Eenadu_07/06/13)

చిత్రం
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కొన్నారా?ఇన్‌బిల్ట్‌గా ఉండే సౌకర్యాలు కొన్నే! అదనంగా కావాలంటే? స్టోర్‌లోకి వెళ్లండి...ఆప్స్‌తో పాటు ఇంకా అనేకం! ఏదైనా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గా ఫేస్‌బుక్‌, స్కైప్‌, ఒపేరా, సోషల్‌హబ్‌, యూట్యూబ్‌, డ్రాప్‌బాక్స్‌, వాట్స్‌అప్‌... లాంటి అప్లికేషన్లు ఉండనే ఉంటాయి. మరి, కొత్త ఆప్స్‌ని ప్రయత్నించాలని ఉందా? గూగుల్‌ ప్లేలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆప్స్‌ని అప్‌లోడ్‌ చేస్తున్నారు. అవొక్కటే కాదు. స్టోర్‌ నుంచి ఈ-బుక్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేనా... బోరింగ్‌ అనిపిస్తే సినిమాలు చూడొచ్చు. వాటన్నింటినీ అందిపుచ్చుకోవాలంటే మీరూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వాల్సిందే. 'ప్లే' స్టోర్‌లో ఆప్స్‌తో ఆడుకోవాల్సిందే. మరెందుకాలస్యం... వాటి సంగతులేంటో చూద్దాం! టైపింగ్‌ కష్టమైతే..  * * * తాకేతెర స్మార్ట్‌ ఫోన్‌లోని క్వర్టీ కీబోర్డ్‌లో టైప్‌ చేయడం కష్టంగా అనిపిస్తే,  Swiftkey Keyboard   ఆప్‌ని ప్రయత్నించొచ్చు. టైపింగ్‌లో పదాల్ని ఆటోమాటిక్‌గా కరెక్ట్‌చేయడంతో పాటు 'వర్డ్‌ ఆల్గరిథమ్‌'ని చూపిస్తుంది. జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ల్లాంటి ఆన్‌లైన్‌ సర్వీసుల్లోనూ సపోర్ట్‌ చేస్తు

యువ నేస్తం...ఈ-పుస్తకం (Eenadu_07/06/13)

చిత్రం
యువగుండెల్లో... భావోద్వేగపు పరిమళాలు... అయినా జనం చేరే మార్గం తెలియదు! కలం కదిపితే కమ్మని రచనలు... అచ్చు వేయిద్దామంటే అదో ప్రయాస! ఇలాంటి కష్టాలకిక కాలం చెల్లినట్టే... కాణీ ఖర్చు లేకుండా రచనల్ని ఈ-పుస్తకాలుగా మలుస్తున్నాయి ఆన్‌లైన్‌ పుస్తక ప్రచురణ సంస్థలు... సత్తా ఉన్న కొత్త రచయితలకు సదా స్వాగతం అంటున్నాయి... ప్రచారం, మార్కెటింగ్‌ బాధ్యతా వాళ్లదే! ఊపందుకున్న ఈ కొత్త ట్రెండ్‌ సంగతులేంటో చూద్దామా? కు ర్రకారు సరదాలకు సరిదోస్తులే. అనుమానం లేదు! వారితోపాటే సాహిత్య ప్రియులు, జ్ఞాన పిపాసులూ ఉంటారండోయ్‌. అందుకే కాస్త తీరిక దొరికితే పుస్తకం తిరగేస్తుంటారు. వీలైతే కలం కదిలిస్తుంటారు. కథలు, కథానికలు, కవిత్వాలు, నవలలు.. ఎడాపెడా రాసేవాళ్లకి కొదవే లేదు. ఇప్పుడీ యువ రచనా వ్యాసంగం 'డిజిటల్‌' బాట పట్టింది. బ్లాగులు, సైట్లతో ముందుకెళ్లడమే కాదు, తమ రచనలను 'ఈ-పుస్తకం'గా వెలువరించే ధోరణిని యువత అందిపుచ్చుకుంటోంది. పెరిగిన సాంకేతిక ఈ కొత్త అభిరుచికి దారులు తెరుస్తోంది. యువతలో పెరుగుతున్న 'ఈ-రీడింగ్‌' అభిరుచి అందుకు ప్రోత్సాహం కల్పిస్తోంది. 'ఈ-రీడర్‌' పరికరాలు, స్మార్ట్‌ఫ

యువకలం...కోలాహలం! (06/04/13)

చిత్రం
సెల్‌ చాటింగ్‌కు సై... ఆన్‌లైన్‌ కాలక్షేపానికి సిద్ధం... సరదాలకు ముందు... కొత్త గ్యాడ్జెట్స్‌ని రఫ్ఫాడిస్తాం... ఏ కుర్రకారైనా ఇంతేగా? మరి పుస్తకాలు చదువుతారా? అని అడగండి...'అబ్బో... మాకంత తీరికెక్కడిది?' అనేస్తారు! అయితే ఈ తీరును బ్రేక్‌ చేసే వారూ ఉన్నారు! చదవడమేనా? ఆకట్టుకునే రచనలతో మది దోచేస్తున్నారు...వీళ్ల దృష్టంతా యువతపైనే... అలాంటి కొందరి పరిచయం. పు స్తకమంటే బద్ధకించే కుర్రాడైనా ప్రేమ, రొమాన్స్‌... పదాలు కనపడితే కళ్లు నులుముకుంటాడు. ఆకట్టుకునే శైలి అందిందా, అక్షరాల వెంట పరుగులు తీస్తాడు. ఇదే మంత్రంతో యువత నాడి పట్టేస్తున్నారు నేటి రచయితలు. చేతన్‌భగత్‌, రశ్మీబన్సాల్‌, రవీందర్‌సింగ్‌, అమీశ్‌ త్రిపాఠి, దుర్జయ్‌దత్తా... పేరేదైనా ముడిసరుకు ప్రేమ, కెరీర్‌, వ్యక్తిత్వ వికాసం, రొమాన్స్‌, స్నేహం, మేనేజ్‌మెంట్‌, భావోద్వేగాలే. ఇంటర్నెట్‌ పరిచయాలు, సెల్‌ఫోన్‌ ప్రేమలతో రవీందర్‌సింగ్‌ 'ఐ టూ హ్యాడ్‌ ఏ లవ్‌స్టోరీ' అల్లితే మూడునెలల్లో లక్షన్నర లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌' అంటూ రశ్మీబన్సాల్‌ స్ఫూర్తి పాఠాలు బోధిస్తే కళ్లకద్దుకుంది యువత. 'డ

సులువుగా వ్యాపారం.. క్షణాల్లో వ్యవహారం! (11/04/13)

చిత్రం
వాణిజ్య ప్రపంచంలో మీరో వ్యాపారా?చదువుతూనే చిరు వ్యాపారం చేస్తున్నారా?ఇంట్లో చిన్నతరహా పరిశ్రమ నడుపుతున్నారా?మరి మీ లావాదేవీలకు ప్రత్యేకమైన ఆప్స్‌ ఉన్నాయని తెలుసా?స్మార్ట్‌ మొబైల్‌ ఉంటే దూసుకుపొండి మరి!  సూత్రాలు కావాలంటే? చక్కని వ్యాపార సూత్రాల్ని అందిస్తోంది  Mind Tools అప్లికేషన్‌. నాయకత్వ లక్షణాలు, బృంద సారథ్యం, డెసిషన్‌ మేకింగ్‌, ప్రొజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, టైం మేనేజ్‌మెంట్‌... లాంటి మరిన్ని అంశాలున్నాయి. హోం పేజీలో వచ్చిన ఐకాన్‌ గుర్తులతో కావాల్సిన అంశాన్ని ఎంచుకుని చదవుకోవచ్చు. http://goo.gl/X3kBF ఎడిట్‌ చేయాలా? ముఖ్యమైన బిజినెస్‌ డాక్యుమెంట్‌లు, డేటాబేస్‌లను ఎడిట్‌ చేసి పని ముగించాలంటే ఆఫీస్‌ ఆప్స్‌ని వాడుకోవచ్చు. వాటిల్లో  Olive Office ఒకటి. గూగుల్‌ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి.  docx, xlsx, pptx  ఫైల్స్‌ని ఎడిట్‌ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివారలకు  http://goo.gl/uCDV5 *  ఆండ్రాయిడ్‌ యూజర్లు వాడుకునేందుకు మరోటి Kingsoft Office. http://goo.g l/gbdP5   మీ కున్న బిజినెస్‌ కార్డ్‌ని క్షణాల్లో మొబైల్‌ నుంచే అడ్రస్‌బుక్‌లోని సభ్యులతో పంచుకుంటే? మీరెక్కడున్నప