Budget 2012


సేవా ముఖర్జీ!
నడ్డి విరిగేలా వడ్డిస్తాం!
కఠినమైన మాటల్ని సైతం... చాలా మృదువుగా.. ఆదరంగా.. అనునయంగా మాట్లాడటంలో ప్రణబ్‌దా శైలే వేరు! ఆతిథ్యమిస్తూనే.. అదరగొడతారు. మీ 'సేవ'లో తరిస్తామంటూనే... పైసాపైసా పన్నులెన్నుతారు!
దేశంలో సేవారంగం ఎంతో విస్తరించిందంటూ.. దీన్నెలా విస్మరిస్తామంటూ.. జనం నెత్తిన మరొక్క రెండు శాతం 'సేవా పన్ను'.. కొసరికొసరి మరీ వడ్డించారు, అక్షరాలా రూ.18 వేల కోట్లు గుంజుకుంటున్నారు! మొత్తం మీద పన్ను పేరుతో రూ.45 వేల కోట్లు దండుకునే పథకం వేశారు.
భోజన పక్షపాతిలా.. ఒక్క ఆహారం తప్పించి... మిగతా సబ్సిడీలన్నీ తగ్గించేస్తామంటూ.. ఖర్చు తగ్గించుకునే కసరత్తు చేశారు, జనం నెత్తిన కత్తులు కట్టారు. త్వరలో అవి జారి పడటం తథ్యం! ముందే చెప్పుకొన్నట్టు... సారువారి శైలే వేరు మరి!
ఆదాయం పన్ను ఏదో మినహాయింపు ఇచ్చినట్టే ఇచ్చారుగానీ.. అంతకు ఒక్కరోజు ముందే తగ్గించిన పీఎఫ్‌ వడ్డీరేట్లతో కడుపు నిండకుండానే చేశారు. మొత్తానికి కొత్త పథకాలు లేవు.. కొత్త విధాన నిర్ణయాలు లేవు... ఒక్క నడ్డివిరిగే కానరాని ఈ కర్రులు తప్ప! ఎంత గొప్ప సేవ!!
అడ్డగోలుగా సేవా పన్ను బాదుడు
గరిష్ఠ పరిమితి 12 శాతానికి పెంపు
నెగటివ్‌ జాబితాలో లేకుంటే సర్వీసు టాక్సు
రైల్లో ఏసీ ప్రయాణానికి 3 శాతం పైనే
విమాన ప్రయాణం 12% భారం
జీవిత బీమాకూ మొదటి ఏడాది 3 శాతం
ప్రైవేటు రంగం నీరసించడంతో 32 వేల కోట్ల ఆదాయ లోటు
పెట్రో భారంతో మరో 49 వేల కోట్లు
విదేశీ వాణిజ్య అప్పులకు గేట్లు బార్లా
మౌలిక సదుపాయాలకు అదే మార్గమన్న మంత్రి
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రకటన
సాగు రుణాలకు 3% వడ్డీ రాయితీ
వితంతు, వికలాంగులకు రూ.300 పెన్షన్‌
ఆధార్‌ ద్వారానే ప్రభుత్వ పథకాల చెల్లింపులు
రూ.10 వేల వరకు పొదుపు ఖాతా వడ్డీపై పన్నులేదు
వైద్య పరీక్షలకు రూ.5 వేల వరకు ఆదాయం లెక్కల్లో మినహాయింపు
వేతన జీవులకు స్వల్ప వూరట
ఐటీ మినహాయింపు పరిమితి 2 లక్షలు
ఐదు లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.5-10 లక్షలకు 20 శాతం
రూ.10 లక్షల పైన 30 శాతం




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)