ట్యాబ్లెట్‌లో బ్రౌజింగ్‌... విహారిణిలు అనేకం!! (Eenadu 21/06/2012)


ట్యాబ్లెట్‌లో బ్రౌజింగ్‌...
విహారిణిలు అనేకం!!
ట్యాబ్లెట్‌ కొంటే సరికాదు! వాడకం ముఖ్యం!! సమాచారం వెతకాలన్నా... సోషల్‌ నెట్‌వర్కుల్లో విహరించాలన్నా... బ్రౌజర్లు కావాల్సిందే!
పీసీలో బ్రౌజర్లు... సెల్‌ఫోన్‌లో బుల్లి బ్రౌజర్లు తెలిసినవే. ట్యాబ్లెట్‌కి కూడానా? అన్నారంటే... మీరు వెనకబడినట్టే! ఎందుకంటే బోల్డన్ని అదనపు సౌకర్యాల్ని అందించే ట్యాబ్లెట్‌ బ్రౌజర్లు చాలానే ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే బ్రౌజింగ్‌ మరింత సులువు అవుతుంది. అవన్నీ ఉచితం కూడా. మరి, ఆయా ట్యాబ్‌ బ్రౌజర్ల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!!ఒపేరా ఒక్కటే!
పీసీ, మొబైల్‌లోనే కాదు. ట్యాబ్‌లో ఒపేరా బ్రౌజర్‌దే హవా. Opera Mini Browserగా ట్యాబ్లెట్‌లో ఒదిగిపోతుంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూ... ఏ వెబ్‌ సర్వీసు యాక్సెస్‌ చేసినా వేగంగా పేజీలను వెతికి తెస్తుంది. డేటా యూసేజ్‌ని కూడా తక్కువ వాడుకుంటుంది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌... లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో సమాచారాన్ని సులభంగా షేర్‌ చేసుకునే వీలుంది. ఒపేరా మొబైల్‌ స్టోర్‌ నుంచి కావాల్సిన సర్వీసుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్‌క్రిప్షన్‌ పద్ధతిలో సురక్షితంగా సైట్‌లను ఓపెన్‌ చేస్తుంది. హోం పేజీలోనే స్పీడ్‌ డయల్‌తో ఎక్కువగా యాక్సెస్‌ చేసే సైట్‌లను పొందొచ్చు. బుక్‌మార్క్‌లు, హిస్టరీ, డౌన్‌లోడ్స్‌ని సులభంగా మేనేజ్‌ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌తో బ్రౌజర్‌లోని ఫాంట్‌ సైజుని పెంచుకోవచ్చు.Privacy మెనూలోకి వెళ్లి రక్షణ వలయాన్ని మరింత కట్టుదిట్టం చేయవచ్చు. పీసీలో మాదిరిగానే అడ్రస్‌బార్‌లో అడ్రస్‌ని సగం టైప్‌ చేయగానే URL auto Completionతో మొత్తం అడ్రస్‌ని అందిస్తుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్‌లోనే గేమ్స్‌ ఆడుకోవచ్చు. www.opera.com/mobile/features/
'డాల్ఫిన్‌' తెలుసా?
స్మార్ట్‌గా బ్రౌజింగ్‌ చేయాలంటే Dolphin Browserతో సాధ్యమే. సిస్టంలో మాదిరిగా 'ప్లస్‌' గుర్తుని నొక్కి కొత్త ట్యాబ్‌ని ఓపెన్‌ చేసుకోవచ్చు. 'వాయిస్‌ సెర్చ్‌'తో మాట్లాడితే చాలు డేటాని వెతికి తెచ్చేస్తుంది. 'సైడ్‌బార్‌'తో బుక్‌మార్క్‌లు, వాల్‌పేపర్లు, యూట్యూబ్‌ వీడియోలు, బింగ్‌, అమెజాన్‌... లాంటి ఇతర సర్వీసుల్ని యాక్సెస్‌ చేయవచ్చు. బ్రౌజర్‌ను క్లోజ్‌ చేయగానే క్యాచీ, హిస్టరీలను క్లియర్‌ చేయవచ్చు. ప్రత్యేక యాడ్‌ఆన్స్‌తో బ్రౌజర్‌కి అదనపు సౌకర్యాల్ని పొందుపరుచుకోవచ్చు. బుక్‌మార్క్‌లను మేనేజ్‌ చేసుకోవడానికి BookmarkFolderని ఏర్పాటు చేశారు. http://goo.gl/z02yP
కొంచెం కొత్తగా!
సిస్టంలోగానీ, మొబైల్‌లోగానీ వికీపీడియా సర్వీసుని యాక్సెస్‌ చేయడానికి ప్రత్యేక బ్రౌజర్‌ని వాడారా? ట్యాబ్లెట్‌లో వాడొచ్చు. అందుకు Tablet Browser for Wikipediaఉంది. తెరపై కనిపించే గుర్తుతో కావాల్సిన డేటాని వెతకొచ్చు. డేటాని సెలెక్ట్‌ చేసి ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌... లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్‌ చేయవచ్చు. మెయిల్‌ చేయవచ్చు కూడా. బ్లాగ్‌ని నిర్వహిస్తున్నట్లయితేWordpressతో డేటాని పోస్ట్‌ చేయవచ్చు. http://goo.gl/fSw4P
'ఫైర్‌ఫాక్స్‌' కూడా!
ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఫైర్‌ఫాక్స్‌ పీసీ బ్రౌజింగ్‌లో నెంబర్‌వన్‌. ఇప్పుడు మొబైల్‌ నుంచి ట్యాబ్లెట్‌ల్లోకి కూడా సందడి చేస్తోంది. హిస్టరీ, బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లను సింక్రనైజ్‌ చేసుకుని ఎక్కడైనా పొందే వీలుంది. వేలల్లో అందుబాటులో ఉన్న బ్రౌజర్‌ యాడ్‌ఆన్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని అదనపు సౌకర్యాల్ని బ్రౌజర్‌కి యాడ్‌ చేయవచ్చు. Personasతో బ్రౌజర్‌ని ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో ఆలంకరించొచ్చు.http://goo.gl/Bq4dK
బుక్‌మార్క్‌లకు ప్రత్యేకం
సులభంగా బుక్‌మార్క్స్‌ సింక్రనైజింగ్‌తో ట్యాబ్‌లో బ్రౌజర్‌ని వాడుకోవాలంటే Maxthon Web Browserను వాడండి. మల్టిపుల్‌ స్కిన్స్‌తో బ్రౌజింగ్‌ సాధ్యం. 10 అంగుళాల ట్యాబ్‌లకు ఇది ప్రత్యేకం. డెస్క్‌టాప్‌ పీసీ, మొబైల్‌లో పెట్టుకున్న బుక్‌మార్క్‌లను Sync to the Cloudతో ఆన్‌లైన్‌లో భద్రం చేసుకోవచ్చు. వాటిని ట్యాబ్‌లోకి సింక్రనైజ్‌ చేసుకోవడం చాలా సులభం. స్పీడ్‌ డయల్‌తో ఎక్కువగా వాడే వెబ్‌ సర్వీసుల్ని పెట్టుకునే వీలుంది.Download Managerతో డౌన్‌లోడ్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు.http://goo.gl/hddOz
బీటా వెర్షన్‌
గూగుల్‌ క్రోమ్‌ బీటా వెర్షన్‌ రూపంలో ఆండ్రాయిడ్‌ మొబైల్‌, ట్యాబ్లెట్‌ల్లో అడుగు పెట్టింది. వేగంగా పేజీలను వెతికి తెస్తుంది. పేజీలను జూమ్‌ చేసుకోవడం చాలా సులభం. లెక్కకు మించిన ట్యాబ్‌లను ఓపెన్‌ చేసుకునే వీలుంది. వాటిని నేవిగేట్‌ చేయడం సులువే. Incognito Modeతో ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ చేయవచ్చు. గూగుల్‌ సర్వీసుల్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా యాక్సెస్‌ చేయవచ్చు.http://go o.gl/AmFOj
మరికొన్ని...
ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌లో వాయిస్‌ కమాండ్స్‌తో బ్రౌజింగ్‌ చేయాలంటే Boat Browser ఇన్‌స్టాల్‌ చేసుకోండి. అదనపు యాడ్‌ఆన్స్‌తో నచ్చినట్టుగా మార్పులు చేసుకోవచ్చు. ఎక్కువగా వాడే ఆప్షన్లను Customizable Toolbarలో పొందుపరుచుకోవచ్చు. ట్యాబ్‌ బ్రౌజింగ్‌ని డిసేబుల్‌ చేయవచ్చు. ఎస్‌డీ కార్డ్‌ నుంచి కూడా బుక్‌మార్క్‌లను ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. http://goo.gl/KlB2m
Discover Your World అంటూ ముందుకొచ్చిందే Wikitude World Browser. ఫ్రెండ్స్‌ని ప్రపంచాన్ని కలిపి చూపించే వెబ్‌ విహార వాహిని. ఏదైనా కొత్త ప్రాంతం గురించి వెతికేందుకు ఇదో సరైన వారధి. http://goo.gl/waqYO
యాపిల్‌ ఐప్యాడ్‌ వాడుతున్నట్లయితే Safari బ్రౌజర్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/Hv6UZ
ప్రైవేటు బ్రౌజింగ్‌ కోసం ప్రత్యేక బ్రౌజర్‌ కావాలంటే InBrowserఉంది. బ్రౌజింగ్‌ తర్వాత ఎలాంటి డేటా దీంట్లో సేవ్‌ అవ్వదు. http://goo.gl/sO2Vd
మీ మొత్తం ఆర్థిక వ్యవహారాల్ని ఆన్‌లైన్‌లోనే రికార్డ్‌ చేసుకోవాలంటే Mint Personal Finance సిద్ధంగా ఉంది.http://goo.gl/uuh7B

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)