'సాఫ్ట్‌'గా ప్రేమించండి! (14/02/13)

ప్రేమ... ఇదో భాషకందని బైనరీ లాంగ్వేజీ... కళ్లు కంపైల్‌ చేస్తే... యద లోతుల్లో రన్‌ అయ్యి... మనసిచ్చిన ఇన్‌పుట్‌ తీసుకుని... హృదయమనే హెచ్‌డీ తెరపై... 'అవును.. ఇది ప్రేమే' అంటూ అవుట్‌పుట్‌ ఇస్తుంది! అది మొదలు... లవర్స్‌ అందరూ ఎథికల్‌ హ్యాకర్సే... కంప్యూటర్‌... ల్యాపీ... ట్యాబ్‌.. ఫోన్‌... అనే తేడా లేకుండా అన్నీ వేదికలైపోతాయి! ఇక నెట్టింట్లో వీరి సందడి అంతా ఇంతా కాదు! అప్లికేషన్ల దగ్గర్నుంచి... అన్‌లైన్‌ సర్వీసుల వరకూ... అన్నీ వీరి అడ్డాలే! ప్రేమికుల రోజు వచ్చిందంటే వేరే చెప్పాలా? నెట్టింట్లో వీరిదే హంగామా! 'నువ్వు... నేను... టెక్నాలజీ!' అంటూ... వేలెంటైన్స్‌ మధ్య వారధిగా మారుతున్న టెక్‌ సంగతులేంటో చూద్దాం!స్మార్ట్‌ పరికరం చేతిలో ఉంటే... సాఫ్ట్‌గా లవ్‌ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌లు చాలానే ఉన్నాయి! పీసీ.. ల్యాపీ.. ఫోన్‌.. ట్యాబ్లెట్‌ ఏదైనా కావచ్చు... అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!
కట్టుకునే ఆందమైన ప్రేమలేఖతో మీ ప్రేమని తెలియజేయాలనుకుంటున్నారా? అయితే, 'టామ్‌' జంట సిద్ధంగా ఉంది. వారిని మీ మొబైల్‌లోకి ఆహ్వానించాలంటేTom's Love Letters ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి. టామ్‌ జంట మీ తరుపున ప్రేమ సంగతుల్ని చెప్పేస్తాయి. 9 అందమైన డిజైన్లతో పాటు... మూడు లవ్‌ ట్రాక్స్‌ కూడా ఉన్నాయి. పోస్ట్‌కార్డ్స్‌ విభాగంలోకి వెళ్లి ప్రేమని పోస్ట్‌ చేయవచ్చు. http://goo.gl/lY0kdయాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/4xg52
ఇలాంటిదే మరోటి Angela's Valentine.వీడియోలతో టామ్‌, ఏంజిలా చెప్పుకునే రొమాంటిక్‌ కబుర్లు చూడొచ్చు.http://goo.gl/2cZoE
ఐఫోన్‌, ట్యాబ్‌ యూజర్లు http://goo.gl/21ofx
ప్రపోజ్‌ చేస్తున్నారా?
ప్రేమను వ్యక్తం చేసేందుకు అనువైన రోజు ఈ రోజే అని సిద్ధం అవుతున్నారా? అయితే, ఒక్కసారి ప్రేమ జాతకాన్ని సరదాగా చెక్‌ చేసుకోండి. అందుకు అనువైన అప్లికేషన్‌ సిద్ధంగా ఉంది. అదే Love Horoscopes. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ రాశి ఆధారంగా హోరోస్కోప్‌ని వెతికి చూడొచ్చు. మీ సంకల్పాన్ని, ప్రేమ, భావాల్ని... ప్రత్యేక గ్రాఫ్‌తో చూడొచ్చు. అదృష్ట సంఖ్యని (లక్కీనెంబర్‌)ని కూడా తెలుసుకునే వీలుంది. http://goo.gl/4y7xj
యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/U5ntU
బ్లాక్‌బెర్రీ వాడుతున్నట్లయితే Love SMSఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. విభాగాల వారీగా మెసేజ్‌లను బ్రౌజ్‌ చేసి పంపొచ్చు. http://goo.gl/0lOaU
'మ్యాచ్‌' చేయండి!
ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారా? సరదాగా మీ జోడీ ఏమేరకు మ్యాచ్‌ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే అందుకో సాఫ్ట్‌వేర్‌ ఉంది. పేరు MateMatcher.టూల్‌ని రన్‌ చేసి పేర్లు ఎంటర్‌ చేయాలి. విండో కనిపించే Show Me పై క్లిక్‌ చేయగానే ప్రత్యేక మీటర్‌పై మీ జోడీకి వచ్చిన మార్కుల శాతాన్ని చూపిస్తుంది. http://goo.gl/ex3BW
'కవిత' పంపండి!
ప్రేమను మాటల్లో కంటే కట్టిపడేసే కవితలా చెప్పాలంటే అందుకు Love Poems సిద్ధంగా ఉన్నాయి. వేలల్లో బ్రౌజ్‌ చేసుకుని నచ్చిన వాటిని మెసేజ్‌, ఈమెయిల్‌ చేయవచ్చు. ట్విట్టర్‌లో ట్వీట్‌ చేయవచ్చు కూడా. రోమాంటిక్‌ మెసేజ్‌లకు ఇది ప్రత్యేకం. http://goo.gl/9D2hx
యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.http://goo.gl/WQvVQ
మనసులోని ఊసుల్ని భిన్నంగా చెప్పాలనుకుంటే Say I Love You ఉంది. విషయాల్ని గుర్తు చేస్తుంది కూడా.http://goo.gl/rbrSD
మంచి కొటేషన్‌తో ప్రేమికులు శుభాకాంక్షలు చెప్పుకోవాలంటే Love and Romance Quotes ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. నచ్చిన కొటేషన్స్‌ని ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ చేసే వీలుంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయవచ్చు కూడా.http://goo.gl/OYg5w
లవ్‌ మెసేజ్‌లతో ప్రేమని తెలియజేయాలంటే Love Messageఉంది. లవ్‌, ఫ్రెండ్‌షిప్‌, రొమాన్స్‌లతో కూడిన మెసేజ్‌లు చూడొచ్చు. http://goo.gl/btzFX
'ముద్దు' ముచ్చట!
తాకే తెరపై అందమైన పెదాలు. వాటిని ముద్దాడితే! అదేKissing Test ఆప్‌. యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా నిక్షిప్తం చేసుకోండి. ఇన్‌స్టాల్‌ చేసి జండర్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఉదాహరణకు మీరు 'ఫిమెయిల్‌'ని సెలెక్ట్‌ చేస్తే అందమైన పెదాలు ప్రత్యక్షమవుతాయి. ఇక ఆలస్యం చేయకండి. http://goo.gl/ulGoR
మీరెంతహాటో తెలుసుకోవాలంటే అందుకో డిటెక్టర్‌ ఉంది. అదే Hotness Detector ఆప్‌. ఇన్‌స్టాల్‌ చేసి తెరపై కనిపించే లవ్‌ గుర్తుపై బొటనవేలు ఉంచాలి. దీంతో ఇన్‌పుట్‌ తీసుకుని ప్రాసెస్‌ చేసి మీరెంత శాతం హాటో చెబుతుంది. http://goo.gl/NTe8l
కొటేషన్స్‌తో కూడిన లవ్‌ వాల్‌పేపర్లు, బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌లు కావాలంటేQuotes Wallpapers & Backgrounds ఆప్‌ని పొందండి. సుమారు 25,000 డిజైన్లు ఉన్నాయి.http://goo.gl/pKF7w
ప్రేమ గుర్తులు
ఆకట్టుకునే గ్రీటింగ్‌ కార్డ్‌తో మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుని గ్రాఫిక్‌ డిజైన్‌ చేస్తున్నారా? అందులో లవ్‌ గుర్తుల్ని వాడాలనుకుంటే Free Large Love Icons టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. కావాల్సిన ఫొటో ఫార్మెట్‌లను ఎంపిక చేసుకోవచ్చు. http://goo.gl/nJsd1
లవ్‌ కొటేషన్స్‌తో కూడిన హై రిజల్యుషన్‌ డిజైన్లు కావాలంటే 60 Love Sayings టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
తెరపై అవే తళుకులు
ప్రేమికుల రోజు మీ పీసీని కూడా ప్రేమ తళుకులతో అలంకరించాలంటే లవ్‌ స్క్రీన్‌సేవర్లు పెడితే సరి. అయితే,Universe of Loveసేవర్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. http://goo.glEz2R
రోమియో, జూలియెట్‌.... ఆంటోని, క్లియోపాత్ర... కార్టూన్‌ జంటల్ని వాల్‌పేపర్లుగా పీసీలో ఆహ్వానించాలంటే ALTools Valentines Day డెస్క్‌టాప్‌ వాల్‌పేపర్‌ని నిక్షిప్తం చేయాల్సిందే.http://goo.gl/fR18d
చక్కని మెలోడీ మ్యూజిక్‌తో కూడిన వాలెంటైన్‌ స్క్రీన్‌సేవర్‌ ఇన్‌స్టాల్‌ చేయాలంటే Valentine Day సేవర్‌ని డౌన్‌లోడ్‌ చేస్తే సరి. http://goo.gl/4 WpmU
ఆకట్టుకునే కార్టూన్లతో లవ్‌ స్క్రీన్‌సేవర్‌ని పెట్టుకోవాలనుకుంటే Flavor of Love డౌన్‌లోడ్‌ చేసుకోండి.http://goo.gl/5w5Os
అదరాలంతే..!
మొబైల్‌ని లవ్‌ థీమ్స్‌తో అలంకరిస్తే! నోకియా వాడుతున్నట్లయితేఒవీ స్టోర్‌ నుంచి LOVE థీమ్‌ని నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/tM7fL
వాలెంటైన్‌ థీమ్‌ మరోటి. http://goo.gl/Mg3QQ
నోకియాలో Love Poemsకావాలంటే http://goo.gl/cjLuV
ఆకట్టుకునే లవ్‌ఫ్రేమ్స్‌తో ఫొటో ఆల్బమ్స్‌ని క్రియేట్‌ చేయాలంటే? ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచిLove Frames ఆప్‌ని నిక్షిప్త చేసుకోండి. క్రియేట్‌ చేసిన ఆల్బమ్స్‌ని సోషల్‌నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేయవచ్చు.http://goo.gl/Zhigz
మీరు వాడుతున్న ట్యాబ్‌, మొబైల్‌ని ఆకట్టుకునే లవ్‌ వాల్‌పేపర్లతో అలంకరించాలంటే Love Critters Liteఆప్‌ని నిక్షిప్తం చేసుకోండి. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఇది ప్రత్యేకం. http://goo.gl/v1xTb
పరీక్షించుకోండి
మీ లవర్‌పై మీకెంత ప్రేముందో సరదాగా తెలుసుకోవాలంటే Love Caculator ఆప్‌ని ప్రయత్నించండి. పేరు, వయస్సు, రాశి... వివరాల్ని ఎంటర్‌ చేసి లెక్కగట్టొచ్చు. http://goo.gl/CVXRU
యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/WLoVj
వేలిముద్రలతో లవ్‌ టెస్ట్‌ చేయాలంటే అందుకు FingerPrint Love Test ఉంది. పేర్లు ఎంటర్‌ చేసి... కనిపించే బాక్స్‌లో వేలిముద్రల్ని ఉంచడం ద్వారా టెస్ట్‌ చేయవచ్చు.http://goo.gl/y53sf
ప్రశ్నలకు సమాధానాల్ని ఇవ్వడం ద్వారా మీ ప్రేమని రుజువు చేయాలంటే అందుకు Love Test రాయాల్సిందే. మూడు రకాలుగా మొత్తం 60 ప్రశ్నలకు జవాబివ్వాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు http://goo.gl/bprLL
యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ని నుంచి పొందొచ్చు.http://goo.gl/0wLAo
మీరు నోకియా వాడుతున్నట్లయితే ఒవీ స్టోర్‌ నుంచిLove Calculator ఆప్‌ని పొందొచ్చు. http://goo.gl/FGPl0
పేరు, పుట్టిన రోజు వివరాల్ని ఎంటర్‌ చేసి పీసీలోనే మీ ప్రేమని కొలిచి చూడాలంటే? Love Actually టూల్‌ని వాడొచ్చు. వివరాల్ని ఎంటర్‌ చేశాక Calculate Our Suitabilityఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. http://go o.gl/9xRfV
ఆన్‌లైన్‌లోనే సరదాగా చెక్‌ చేయాలంటేwww.calculatoroflove.comలోకి వెళ్లండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)