ఔరా! అనిపించే ఒపేరా (Eenadu Thursday 15/03/2012)
బ్రౌజర్ అంటే...బ్రౌజర్‌ని బుల్లి డెస్క్‌టాప్ పీసీలా వాడుకోవచ్చని తెలుసా? ఒపేరా బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రపంచ వ్యాప్తంగా దీని యూజర్ల సంఖ్య సుమారు 250 మిలియన్ల పైమాటే. అదనపు అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేయకుండానే బ్రౌజర్‌లోనే అన్నీ చేసేయవచ్చు. వెబ్ విహారంలో తారసపడిన డేటాని భద్రం చేసుకునే వీలుంది. ఒపేరా యునైట్ ద్వారా సోషల్ సమూహాన్ని ఒకేచోట చేర్చొచ్చు. ఒకటా రెండా ఇలా చాలానే ఉన్నాయి. వాటి విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం!భలే 'స్పీడ్' ఎప్పుడు కొత్త ట్యాబ్ క్లిక్ చేసినా దాంట్లో థంబ్‌నెయిల్ బాక్సుల్లా వెబ్ సర్వీసులు ఓపెన్ అవుతాయి. అవి స్పీడ్ డయల్ అనేది తెలిసిందే. ఇది అన్ని బ్రౌజర్లలో ఉన్నప్పటికీ ఒపేరాలో మాత్రం దీన్ని నచ్చినట్టుగా మార్చేయవచ్చు. మొత్తం ట్యాబ్ విండోకి నచ్చిన ఫోటోని బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ ద్వారాCustom background image లోకి వెళ్లి నచ్చిన ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి పెట్టుకుంటే సరి. స్పీడ్ డయల్‌లో ఎన్ని కాలమ్స్ ఉండాలో కూడా సెట్ చేయవచ్చు. రైట్‌క్లిక్‌లో చాలానే ట్యాబ్ బటన్‌పై రైట్‌క్లిక్ చేయండి. భిన్నమైన ఆప్షన్లు గుత్తగా కనిపిస్తాయి. Pin Tabతో ముఖ్యమైన వెబ్ సర్వీసుల్ని ఐకాన్ ట్యాబ్‌గా పెట్టుకోవచ్చు. దీంతో బార్‌పై ఎక్కువ ట్యాబ్ విండోలను ఓపెన్ చేసుకోవచ్చు. బ్రౌజింగ్ హిస్టరీ సేవ్ అవ్వకుండా ఒక్క ట్యాబ్‌లోనే వెబ్ విహారం చేయాలంటే New Private Tab ఎంచుకోవచ్చు. స్పీడ్ విండోలు లేకుండా బ్లాంక్ ట్యాబ్ కావాలంటే Create Follower Tab ఉంది. ట్యాబ్ విండోల స్థానాల్ని మారొచ్చు. ట్యాబ్ విండోను వేర్వేరు చోట్ల పెట్టుకునే వీలుంది. ట్యాబ్‌ల వరుస క్రమాన్ని మార్చాలంటే Arrange ఉంది. ఆకట్టుకునే రూపం బ్రౌజర్‌లో థీమ్స్ మార్చుకున్నట్టుగా బ్రౌజర్ లోగో, బ్యాక్‌గ్రౌడ్ ఇమేజ్‌లను కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ట్యాబ్ విండోపై రైట్‌క్లిక్ చేసి Cutomize-> Appearanceలోకి వెళ్లాలి. 'స్కిన్స్, ప్యానల్స్, టూల్‌బార్‌లు, బటన్స్'ని ఒక్కొక్కటిగా మార్చుకోవచ్చు. 'స్పీడ్ డయల్స్' ట్యాబ్ విండోలోకి వెళ్లి కనిపించే ఇమేజ్‌లను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకునే వీలుంది. అందుకు Use Image as Speed Dial Background క్లిక్ చేయాలి. వాటిని పీసీ డెస్క్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్‌లా కూడా మార్చుకోవచ్చు. మరిన్ని వాల్‌పేపర్లకు 'వాల్‌పేపర్స్' ట్యాబ్ ఉంది. Appearance-> Skin-> Icon Sizeతో గుర్తుల సైజుని కూడా పెంచొచ్చు. 'ప్యానల్' ప్రత్యేకం అదనపు అవసరాలకు కుడివైపు డీఫాల్ట్‌గా టూల్‌బార్ ఉంటుంది. అదే 'ప్యానల్'. Notesతో ముఖ్యమైన టెక్ట్స్ మేటర్‌ని కాపీ చేసి భద్రం చేసుకోవచ్చు. అక్కర్లేని టెక్ట్స్ ఫైల్స్‌ని 'ట్రాష్'లోకి పంపేయవచ్చు. బ్రౌజింగ్ 'హిస్టరీ'నిToday, Yesterday, Earlier this week, Month, Older విభాగాల్లో చూడొచ్చు. ఒపేరా యునైట్‌తో కమ్యూనిటీగా ఏర్పడి ఫైల్ షేరింగ్, ఫొటో షేరింగ్ చేయవచ్చు. ప్రత్యేక మెస్సెంజర్‌తో ఛాటింగ్ చేయవచ్చు కూడా. బుక్‌మార్క్‌లను మేనేజ్ చేసుకోవడానికి ప్రత్యేక విభాగం ఉంది. డిలీట్ చేసిన బుక్‌మార్క్‌లను ట్రాష్‌లో పొందొచ్చు. గూగుల్, బింగ్, యాహూ, వికీపీడియా, ఆస్క్... సెర్చింజన్‌లను ఒకేచోట పొందొచ్చు. 'విండోస్' ఆప్షన్‌తో మొత్తం ట్యాబ్ విండోలను ప్యానల్ నుంచే మేనేజ్ చేయవచ్చు కూడా. ప్యానల్‌లోని ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి అదనపు సౌకర్యాల్ని పొందుపరచవచ్చు. ప్యానల్‌లో మార్పులు చేయాలంటే 'కస్టమైజ్' చేయాలి. ప్యానల్‌లో అక్కర్లేని వాటిని అన్‌చెక్ చేసి తీసేయవచ్చు. Panel Placementతో తెర అన్ని వైపులకూ మార్చుకోవచ్చు. ప్యానల్ ఆటో హైడ్ అవ్వాలంటే Show panel toggle at edge of window చెక్ చేయాలి. అన్నీ అందులోనే! అదనపు సర్వీసుల్ని విడ్జెట్స్ రూపంలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. కేటగిరీల్లో Fun and Games, radio and Music, Social websites, Science, Time and date... చాలానే ఉన్నాయి. మ్యూజిక్‌లో వెబ్ రేడియో స్టేషన్లను వినొచ్చు. డెస్క్ టాప్‌పైనే గేమ్స్ ఆడుకోవచ్చు. ఆడేప్పుడు తెరపై ఐకాన్లు, అప్లికేషన్లు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. 'యానిమేటెడ్ ఐ'తో తెరపై అందమైన రెండు కళ్లు ప్రత్యక్షమయ్యేలా చేయవచ్చు. 'బాస్కెట్‌బాల్' గేమ్‌ని ఇన్‌స్టాల్ చేసి గోల్స్ వేయవచ్చు. 'డేట్ అండ్ టైం'తో తెరపై ఆకర్షణీయమైన తేదీ, సమయాన్ని చూపించే వెడ్జెట్స్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు. మరికొన్ని... * ట్యాబ్‌లను థంబ్‌నెయిల్ బాక్స్‌ల్లా కనిపించేలా చేయాలంటే బ్రౌజర్ పై భాగంలో మధ్య కనిపించే మూడు చుక్కల దగ్గర పాయింటర్ ఉంచి డ్రాగ్ చేయాలి. * స్టేటస్ బార్‌లో కనిపించే మాగ్నిఫైయర్ బార్‌తో బ్రౌజర్‌లోని టెక్ట్స్‌ని జూమ్‌ఇన్, జూమ్ అవుట్ చేయవచ్చు. * క్లోజ్ చేసిన మొత్తం ట్యాబ్స్‌ని ట్యాబ్ విండోల చివర ఉండే గుర్తుతో ఓపెన్ చేయవచ్చు. రీసైకిల్‌బిన్ ఐకాన్‌లా కనిపిస్తుంది. జాబితా మొత్తాన్ని తీసేయాలంటే Clear List of Closed Tabs ను క్లిక్ చేయాలి. * బ్రౌజింగ్‌లో ఏదైనా టెక్ట్స్ మేటర్‌ని ఆటోమాటిక్‌గా నోట్స్‌లోకి పంపేయాలంటే మాస్టర్ మెనూలోని Page-> Copy to Noteను క్లిక్ చేయాలి. షార్ట్‌కట్ Ctrl+Shift+C * బ్రౌజింగ్‌లో అన్ని పాప్‌అప్ విండోలను బ్లాక్ చేయాలంటే మాస్టర్ మెనూలోని Settings-> Quick Preferences-> Block all Pop-Upsను చెక్ చేయాలి. * ఫైర్‌బాక్స్‌లో మాదిరిగా వివిధ రకాల యాడ్‌ఆన్స్‌ని 'ఎక్స్‌టెన్షన్స్' రూపంలో పొందొచ్చు. అందుకు ఒపేరా మాస్టర్ మెనూలోని Get Extensionsను సెలెక్ట్ చేయాలి. విభాగాల వారీగా వీటిని పొందుపరిచారు. * మరిన్ని వివరాలకు www.opera.com/browser/ |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి