పోయిన సమాచారం... చిటికెలో లభ్యం! (Computer tips_02/08/2012)

పోయిన సమాచారం... చిటికెలో లభ్యం!
ముఖ్యమైన డాక్యుమెంట్‌లు... ఫొటోలు... వీడియోలు... డేటా ఏదైనా డిలీట్‌ అయ్యిందా? తిరిగి పొందేందుకు సరికొత్త మార్గాలున్నాయి! సరైంది ఎంచుకోండి!

సిస్టంలో భద్రం చేసిన డేటాని అనుకోకుండా డిలీట్‌ చేస్తే తిరిగి పొందొచ్చా? ఒక్కసారి తీసేయగానే హార్డ్‌డిస్క్‌, పెన్‌డ్రైవ్‌, మెమొరీ కార్డుల్లో నుంచి కూడా పోతుందా? అసలు సిస్టంలో డేటా ఎలా సేవ్‌ అవుతుంది?... సాధారణ వినియోగదారుడికి ఇలా చాలా సందేహాలు ఉంటాయి. మీకు తెలుసా? డ్రైవ్‌ నుంచి డిలీట్‌ చేసిన డేటా వెంటనే తొలగిపోదు. డిస్క్‌లోని మెమొరీ లొకేషన్స్‌లో అలానే ఉంటుంది. కొత్తగా మరేదైనా డేటా ఆయా లొకేషన్స్‌లో ఓవర్‌రైట్‌ అయితే తప్ప, పూర్తిగా పోదు. ఇలాంటి సందర్భాల్లో డిలీట్‌ అయిన డేటాని తిరిగి పొందడానికి ఉచిత సాఫ్ట్‌వేర్‌లు చాలా ఉన్నాయి. డ్రైవ్‌ని ఎంచుకుని రికవరీ టూల్‌ని రన్‌ చేయగానే మొత్తం స్కాన్‌ చేసి తిరిగి డేటాని మన ముందుంచుతాయివి. ఇలా వెర్షన్లు మార్చుకుంటూ అందుబాటులోకి వచ్చిన సరికొత్త రికవరీ టూల్స్‌పై ఓ కన్నేద్దాం!వెతికి తెచ్చేస్తుంది
ఫొటోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌, డాక్యుమెంట్‌లు, వీడియోలు, ఈమెయిల్స్‌, కంప్రెస్డ్‌ ఫైల్స్‌ లేదా మరేదైనా ఇతర ఫైల్స్‌ని డిలీట్‌ చేసినా తిరిగి తెస్తుంది Recuva ఉచిత సాఫ్ట్‌వేర్‌. ఇన్‌స్టాల్‌ చేసి వచ్చిన విండోలోని 'ఫైల్‌ టైప్‌'ని ఎంపిక చేయాలి. ఉదాహరణకు డాక్యుమెంట్‌లను రికవర్‌ చేయాలంటే Documentsని ఎంచుకోవాలన్నమాట. తర్వాత ఏ లొకేషన్‌ నుంచి ఫైల్స్‌ని పొందాలనేది నిర్ణయించుకోవాలి. హార్డ్‌డిస్క్‌లోని ఏదైనా డ్రైవ్‌ నుంచి ఫైల్స్‌ని పొందాలంటే In a Specific Locationని ఎంపిక చేయాలి. యూఎస్‌బీ డ్రైవ్‌, మెమొరీ కార్డ్‌ల నుంచి పొందాలంటే On my Media Card చెక్‌ చేయండి. ఆపై Startక్లిక్‌ చేస్తే చాలు. థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో రికవరీ డేటా కనిపిస్తుంది. మరింత క్షుణ్ణంగా డ్రైవ్‌ని వెతికి తీయాలంటే Enable Deep Scan ఉండనే ఉంది. ఇమేజ్‌లు అయితే థంబ్‌నెయిల్‌ బాక్సుల్లో ప్రివ్యూ కూడా చూడొచ్చు. www.piri form.com/recuva/download
పోలీస్‌ని పెట్టండి!
పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందేందుకు పోలీస్‌లను ఆశ్రయించినట్టుగానే సిస్టంలోని డేటాని రికవర్‌ చేసేందుకు PC Inspector File Recovery టూల్‌ ఉంది. పోయిన సమాచారాన్ని Recover Deleted Files విభాగం నుంచి పొందొచ్చు. ఫార్మెట్‌ అయినా, సిస్టం క్రాష్‌ అయినా పోగొట్టుకున్న డేటాని Find Lost Data నుంచి పొందే వీలుంది. యాక్సెస్‌ కాని డ్రైవ్‌ని నుంచి డేటా తీసుకోవాలంటే Find Lost Drive ఉంది. హోం విండోలోని Open Driveని ఎంపిక చేసి ముందుగా డ్రైవ్‌ని ఎంపిక చేసుకోవాలి.www.snapfiles.com/get/pcinspector.html
ఇట్టే సాధ్యం!
విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌ మాదిరిగా సులభమైన ఇంటర్ఫేస్‌తో రికవరీ ఫైల్స్‌ని అందిస్తోంది Pandora Recovery అప్లికేషన్‌. ఇన్‌స్టాల్‌ చేయగానే వచ్చే విండోలోని 'సెర్చ్‌' ట్యాబ్‌లోకి వెళ్లి ఫైల్‌ పేరుతో వెతికి పొందవచ్చు. ఫైల్‌ మెమొరీ సైజు ఆధారంగా కూడా వెతికే వీలుంది. తేదీల వారీగా కూడా పొందవచ్చు. Search Statisticsలో రివకరీ ఫైళ్ల స్టేటస్‌ చూడొచ్చు. ఓవర్‌రైట్‌ అయిన ఫైల్స్‌ని కూడా తెలుసుకోవచ్చు. Surface Scanలోకి వెళ్లి ఒకేసారి డ్రైవ్‌ మొత్తాన్ని స్కాన్‌ చేసి డిలీట్‌ చేసిన ఫైళ్ల జాబితాని పొందొచ్చు. ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేసి Quick Viewతో ఇమేజ్‌ ఫైల్స్‌ ప్రివ్యూ చూసుకునే వీలుంది. రివకర్‌ చేయాలంటే రైట్‌క్లిక్‌ చేసి Recover toతో ప్రత్యేక ఫోల్డర్‌లోకి కాపీ చేసుకోవచ్చు.http://goo.gl/ualxF
ఫొటోలకు ప్రత్యేకం
కెమెరా, మొబైల్‌, ట్యాబ్‌... ఎందులోనైనా ఫొటోలు తీసి భద్రం చేస్తుంటాం. ఇలాంటి రిమూవబుల్‌ స్టోరేజ్‌ మీడియా డ్రైవ్‌ల నుంచి డిలీట్‌ చేసిన ఫొటోలను రికవర్‌ చేయాలంటే? Zero Assumption Digital Image Recovery టూల్‌ సిద్ధంగా ఉంది. ఇన్‌స్టాల్‌ చేసి వచ్చిన విండోలో డ్రైవ్‌ స్టోరేజ్‌ డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. సిస్టంకి కనెక్ట్‌ చేసిన అన్ని రిమూవబుల్‌ డ్రైవ్‌లన్నీ Specify Folder to store recovered images inలో చూడొచ్చు. ఒక్కసారి డ్రైవ్‌ని ఎంచుకున్నాకProceedపై క్లిక్‌ చేసి రికవర్‌ చేసిన ఇమేజ్‌లను చూడొచ్చు.http://goo.gl/Y0Pl1
మరింత భిన్నంగా!
సులభమైన ఇంటర్ఫేస్‌తో రూపొందిన TOKIWA Data Recoveryటూల్‌ మరోటి. ఇన్‌స్టాల్‌ చేసి కనిపించే డ్రైవ్‌ల్లో ఏదైనా సెలెక్ట్‌ చేసి రికవరీ ఫైల్స్‌ని స్కాన్‌ చేయవచ్చు. అన్ని రకాల ఫైల్స్‌ని File, Folder, Type, Size... వివరాలతో చూపిస్తుంది. బాక్స్‌లో ఫైల్‌ పేరుని టైప్‌ చేసి కూడా వెతికే వీలుంది. Shift, Ctrl కీలను నొక్కి ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ని ఒకేసారి ఎంపిక చేసి పొందవచ్చు. దీనికి ఇన్‌స్టలేషన్‌ ప్రాసెస్‌ ఉండదు. ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి EXE ఫైల్‌ని రన్‌ చేస్తే సరిపోతుంది. పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకుని ఏ సిస్టంలోనైనా వాడుకోవచ్చన్నమాట. http:// goo.gl/TYOLm
అన్నింటిలోనూ!
పీసీ, మ్యాక్‌ల్లో వాడుకునేలా రూపొందిందే Undelete Plus. డ్రైవ్‌ని ఎంచుకుని Start Scan నొక్కితే చాలు మొత్తం ఫైల్స్‌ని వెతికి తెస్తుంది. ప్రివ్యూ విండోలో ఇమేజ్‌ ఫైల్స్‌ని చూడొచ్చు. చెక్‌బాక్స్‌లతో రికవర్‌ చేయాలనుకునే ఫైల్స్‌ ఎన్నైనా చెక్‌ చేసి పొందగలగడం దీంట్లోని ప్రత్యేకత.http://undeleteplus.com
ఇలాంటిదే మరోటి Freeundelete. వైల్డ్‌కార్డ్‌ క్యారెక్టర్‌లతో కావాల్సిన ఫైల్స్‌ని మాత్రమే వెతకొచ్చు. రివకరీ ఫోల్డర్‌ని ఎంచుకుని Undeleteపై క్లిక్‌ చేస్తే చాలు. www.officere covery.com/freeundelete/download.htm
మరోటి Glary Undelete, www.glarysoft.com/products/utilities/glary-undelete/download

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)