పండగ ఘుమఘుమలు

తెల్లవారు జామున వేసే భోగిమంటలూ, ముంగిట్లో మెరిసే రంగవల్లికలూ, పిల్లలకు పోసే భోగి పళ్లూ, ఆకాశంలో ఎగిరే గాలిపటాల పోటీలూ... వీటికి దీటుగా వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ వచ్చినప్పుడేగా సంక్రాంతి సంబరం! అరిసెలూ, జంతికల్లాంటి సంప్రదాయ వంటకాలతో పాటూ ఈసారి వీటినీ చేసి చూడండి.
కావల్సినవి:గోధుమలు - అరకేజీ, చక్కెర - ముప్పావుకేజీ, సజ్జలు, జొన్నలు -అరకప్పు చొప్పున, జీడిపప్పు పొడి - అరకప్పు, కరిగించిన నెయ్యి - కలపడానికి సరిపడా.
తయారీ: ముందుగా బాణలిలో గోధుమల్ని నూనె లేకుండా దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఆ తరవాత సజ్జలు, జొన్నల్ని కూడా విడివిడిగా వేయించుకోవాలి. చక్కెరను పొడిచేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో గోధుమలు, సజ్జలు, జొన్నల్ని విడివిడిగా వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చక్కెరపొడి, జీడిపప్పుపొడి వేసి బాగా కలపాలి. ఆ తరవాత నెయ్యి వేస్తూ ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది.
కావల్సినవి: జొన్నపిండి - నాలుగుకప్పులు, వెన్న లేదా నెయ్యి - చెంచా, ఉప్పు - తగినంత, జీలకర్ర - అరచెంచా, నువ్వులు - చెంచా, పచ్చిమిర్చి పేస్టు - ఒకటిన్నర చెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు - పావుచెంచా, వాము - పావుచెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ:ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి. ఆ తరవాత వేడినీళ్లు పోస్తూ గట్టిగా ముద్దలా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి మంట తగ్గించాలి. గోరువెచ్చని నీటితో చేయిని తడిచేసుకుని తరవాత పిండిని తీసుకుని జంతికల గొట్టంలో ఉంచి నూనెలో జంతికల్లా వేయాలి. ఎర్రగా వేగాక తీస్తే సరిపోతుంది. జొన్నపిండి జంతికలు సిద్ధం.
కావల్సినవి: మైదా - మూడు కప్పులు, కొబ్బరిపాలు - రెండు కప్పులు, మొక్కజొన్నపిండి -చెంచా, వరిపిండి -అరకప్పు, వాము -కొద్దిగా, వెన్న -రెండు చెంచాలు, కారం -చిటికెడు, ఉప్పు - కొద్దిగా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ:ఓ గిన్నెలో పైన పేర్కొన్న పదార్థాలన్నీ తీసుకుని గట్టిగా చపాతీపిండిలా కలపాలి. దీన్ని అరగంట నాననివ్వాలి. తరవాత కొద్దిగా పిండిని తీసుకుని పూరీలా వత్తుకుని అరసెంటీమీటరు దూరంలో చాకుతో పొడుగ్గా గాట్లులా పెట్టుకోవాలి. దీన్ని మళ్లీ రెండు చివర్లతో రోల్‌లా చుట్టుకుని నూనెలో వేయించుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకుంటే సరిపోతుంది.
- ఎం.సత్య, హైదరాబాద్‌
కావల్సినవి:సోయాపిండి - రెండు కప్పులు, బియ్యప్పిండి - అరకప్పు, వాము - అరచెంచా, జీలకర్ర - అరచెంచా, పచ్చిమిర్చి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని వేడినీళ్లతో చపాతీపిండిలా కలపాలి. దీన్ని పదినిమిషాలు నాననిచ్చి కొద్దిగా తీసుకుని గుండ్రంగా చెగోడీలా చుట్టుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకుని కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేస్తే సరిపోతుంది.
- మాధవీలత, హైదరాబాద్‌
కావల్సినవి: సెనగపిండి - కేజీ, బియ్యప్పిండి - అరకేజీ, నూనె - వేయించడానికి సరిపడా, బెల్లం - కేజీ.
తయారీ: ఓ గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి తీసుకుని నీళ్లు పోస్తూ గరిటెజారుగా వచ్చేలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని చిల్లుల గరిటెలోంచి వేస్తూ బూందీ దూసుకోవాలి. ఎర్రగా అయ్యాక తీసిపెట్టుకోవాలి.మరో గిన్నెలో బెల్లం తురుము వేసి చిన్న గ్లాసు కన్నా కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. ముదురుపాకం వచ్చాక దింపేసి అప్పుడు బూందీ వేసుకుని బాగా కలపాలి. దీన్ని నూనె రాసిన పళ్లెంలోకి మార్చి ఏదైనా గిన్నెతో పైన నొక్కినట్లు చేయాలి. వేడితగ్గాక ముక్కల్లా చేసుకుంటే సరిపోతుంది.
- కంటిపూడి సూర్యకుమారి, రావులపాలెం
కావల్సినవి: మైదా - రెండు కప్పులు, ఉప్పు - తగినంత, నువ్వులు - చెంచా, వేడినెయ్యి - చెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
పొడికోసం: తెల్ల నువ్వులు - రెండుకప్పులు, బెల్లం తురుము - రెండుకప్పులు, యాలకులపొడి - అరచెంచా, ఎండుకొబ్బరితురుము - రెండు చెంచాలు.
తయారీ: ముందుగా ఓ గిన్నెలో మైదా, తగినంత ఉప్పు, నువ్వులు, వేడినెయ్యి తీసుకుని బాగా కలిపి ఆ తరవాత సరిపడా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా పూరీపిండిలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని కాసేపు నాననివ్వాలి. ఇంతలో పొయ్యిమీద బాణలి పెట్టి అది వేడయ్యాక మంట తగ్గించి నువ్వుల్ని వేయించుకోవాలి. ఐదారునిమిషాలయ్యాక మరో పళ్లెంలోకి మార్చాలి. కొద్దిగా చల్లారనిచ్చి బెల్లం తురుము కూడా కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. అందులోనే యాలకులపొడి, కొబ్బరితురుము కూడా కలిపితే సరిపోతుంది. చేతికి నూనె రాసుకుని కొద్దిగా మైదా ఉండను తీసుకుని చిన్న పూరీలా వత్తుకోవాలి. అందులో ముందుగా చేసిపెట్టుకున్న నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచుల్ని మూసేసి మూటకట్టేసినట్లు తిప్పాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసేయాలి. చాలా రుచిగా ఉంటాయివి.
- పి.సాయిజ్యోతి, మహబూబ్‌నగర్‌

Eenadu Direct link: http://eenadu.net/vasundara/Vasundarainner.aspx?qry=ruchulu

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)