మీ చేతిలో E - రక్షణ!!!


దేశంలో మహిళకు రక్షణ కరవవుతోంది. ఎప్పుడెవరు యాసిడ్‌ పోస్తారో, ఎవరు కిడ్నాప్‌ చేస్తారో తెలియదు. అత్యాచారం, హత్య ఏమైనా జరగొచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరి భద్రత వారు చూసుకోవాల్సిన అవసరం పెరిగింది. మరి భద్రతా మార్గాలేమిటి? అందరికీ కరాటే, బాక్సింగ్‌ రాకపోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గరా ఇప్పుడు సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. చాలామటుకు ఆధునికమైనవే. వాటినే ఆయుధంగా చేసుకోవచ్చు, మీ భద్రతకు భరోసాగా మార్చుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా కొన్ని మొబైల్‌ అప్లికేషన్లను నిక్షిప్తం చేసుకోవడమే.
ఐ యామ్‌ సేఫ్‌
చితంగా దొరికే ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌. ఇది మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో మీ కుటుంబసభ్యులకు సమాచారం చేరవేస్తుంది. తల్లిదండ్రులదో, భర్తదో నంబరు ఈ అప్లికేషన్‌లో నమోదు చేసుకోవాలి. ఎంత వ్యవధిలో సమాచారం అందాలో నిర్ణయించాలి. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆ నంబరుకు సంక్షిప్త సందేశం వెళ్తుంది. జీపీఎస్‌ సాయంతో మీరుండే ప్రాంతం వివరాలూ అందిస్తుంది. కావాలనుకుంటే ఆ ప్రాంతం మ్యాప్‌ కూడా పంపుతుంది. ఏదయినా ప్రమాదంలో చిక్కుకున్నా... ఆటో, ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు వారు దారి తప్పించి తీసుకెళ్లినా కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడానికి ఇది ఉపయోగపడుతుంది.
గ్లింప్స్‌
ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్‌, విండోస్‌ 7 వంటి అన్ని ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకూ ఇది పనిచేస్తుంది. మీ భద్రత కోరుకునే వారికి మీరెక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో చెప్తుంది. వారికి అక్కడే వెబ్‌సైట్‌, స్మార్ట్‌ఫోన్‌ లేదా జీపీఎస్‌ సౌకర్యం ఉంటే మీరున్న ప్రాంతం మ్యాప్‌ ఇట్టే చూపిస్తుంది. ఈ అప్లికేషన్‌ కూడా ఉచితమే. కిడ్నాప్‌లకు గురైనప్పుడూ, తెలియని ప్రాంతాల్లో దారి తప్పినప్పుడూ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. సాయం అందించడానికి మార్గముంటుంది.
మై సెక్యూరిటీ 
కావాల్సిన వారికి మీ సమాచారం అందించే ఐఫోన్‌ అప్లికేషన్‌. ముందే నమోదు చేసిన నంబరుకు జీపీఎస్‌ సాయంతో మీ గురించిన సమాచారం అందిస్తుంది. ఒకరి కంటే ఎక్కువ మందికి మీ వివరాలు పంపే అవకాశమూ ఉంది. ఇబ్బందుల్లో ఉంటే అటోమేటిగ్గా తెలిసేలా ఓ అలారమ్‌ వ్యవస్థ, సేఫ్టీ కెమెరా దీనిలో ఉన్నాయి. ఈ అప్లికేషన్‌ నిక్షిప్తం చేసుకుంటే ఆటోమేటిగ్గా మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనూ, మిమ్మల్నీ ఫొటో తీసి మీరు సూచించిన వ్యక్తులకు చేరవేస్తుంది.
షేక్‌ అలర్ట్‌
ఐఫోన్‌ అప్లికేషన్‌ ఉంటే.. మిమ్మల్నెవరైనా బెదిరిస్తున్నా, దాడి చేయబోయినా మీ చేతిలో ఉండే ఫోను గట్టిగా కదిపితే చాలు. సైరన్‌ పెద్దగా మోగి ఎదుటివారు భయపడేలా చేస్తుంది. అదే సమయంలో మీరు సూచించిన వ్యక్తి నంబరుకు ఎస్సెమ్మెస్‌ వెళ్లి, మీరెక్కడున్నారో చెబుతుంది.
అటాక్‌ అలారమ్‌
ఫోన్‌, బ్లాక్‌బెర్రీల్లో పని చేస్తుంది. ఫోను గట్టిగా కదిపితే చాలు, మీరు సూచించిన వ్యక్తి ఫోనులో పెద్ద సైరన్‌ లాంటి శబ్దం కలుగుతుంది. మీరు సమస్యలో ఉన్నట్టు ఎస్సెమ్మెస్‌ పంపుతుంది. అవతలి వ్యక్తి నిద్రలో ఉన్నా, ఫోన్‌ సైలెంటు మోడ్‌లో ఉన్నా ఈ సైరన్‌ బిగ్గరగా వినిపిస్తుంది. అప్రమత్తం కాక తప్పదు.
మై ఎస్‌ఓఎస్‌
బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ఉంటుంది. ఆపదల్లో ఉన్నప్పుడు వెంటనే మీరు సమాచారం చేరవేయాలనుకున్న వారి ఫోన్లకు మీ గురించి, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నారో తెలిపే సమాచారం పంపుతుంది. దీనికోసం చేయాల్సిందల్లా ఒక చిన్న పని మాత్రమే. మీ ఫోన్‌ తెర మీటితే చాలు, ఏ ప్రాంతంలో ఉన్నారూ, పరిసరాలేమిటో కూడా సమాచారం పంపేస్తుంది. ఆపదలో ఉన్నారన్న విషయాన్నీ తెలియజేస్తుంది.
సెల్ప్‌ డిఫెన్స్‌
ప్రమాదకర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఈ అప్లికేషన్‌ నేర్పుతుంది. మీ పిల్లల్నీ ఎలా రక్షించుకోవాలో సూచనలు చేస్తుంది. ఆత్మరక్షణ పద్ధతులూ, దుండగులని భయపెట్టి తప్పించుకునే మెలకువలూ నేర్పిస్తుంది. ఆండ్రాయిడ్‌ స్టోర్‌లో దొరుకుతుంది.
ఐవాచ్‌
ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్‌, సింబియాన్‌ ప్లాట్‌ఫాంలపై పనిచేస్తుంది. మీరు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 20 సెకన్ల పాటు వీడియో తీసి, అక్కడి శబ్దాలను నమోదు చేస్తుంది. ఐదు ఫొటోలను తీస్తుంది. సమాచారం అందుకోవాల్సిన వారి నంబరు ముందే నమోదు చేసి ఉంచితే, అత్యవసర సమయంలో ఈ వివరాలన్నీ వారికి వెంటనే పంపిస్తుందీ ఉచిత అప్లికేషన్‌.
ఫైట్‌బ్యాక్‌
ముందుగా నమోదు చేసిన నంబర్లకూ, ఈమెయిల్‌ ఐడీలకూ ఆపద సమయంలో మీరున్న ప్రాంతం వివరాలూ, మ్యాప్‌ పంపిస్తుంది. ఐదు నంబర్ల వరకు ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, సింబియాన్‌ ప్లాట్‌ఫాంలపై పనిచేస్తుంది.
లైఫ్‌ 360
ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్‌, సింబియాన్‌లకు ఉపయోగపడే ఉచిత అప్లికేషన్‌ ఇది. కుటుంబసభ్యులంతా దీనిని లోడ్‌ చేసుకుంటే ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఇందులో ముందుగానే ప్రాంతాలు (లొకేషన్లు) సేవ్‌ చేసుకుంటే ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి భద్రంగా చేరుకోగానే మిగిలిన వారికి ఆటోమేటిగ్గా సందేశం చేరుతుంది. ఎస్సెమ్మెస్‌ చేరకపోతే అక్కడికి చేరుకోలేదని అర్థం. నిర్ణీత వేళ దాటిపోయినా ఎస్సెమ్మెస్‌ రానప్పుడు ఏం జరిగిందోనని వాకబు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వే కాకుండా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే బిసేఫ్‌, ఎస్‌అండ్‌ఎస్‌ రెస్క్యూ ప్యాక్‌, వన్‌ టచ్‌ ఎస్‌ఓఎస్‌, స్క్రీమ్‌ అలారం.. ఐఓఎస్‌పై పనిచేసే సర్కిల్‌ ఆఫ్‌ 6, వైడబ్ల్యూసీఏ సేఫ్టీ అలర్ట్‌ వంటి అప్లికేషన్లు యువతులకు ప్రయోజనం కలిగించేవే.. ఇవన్నీ ఉచిత అప్లికేషన్లే కావడం విశేషం.
- అరుణ్‌ పృథ్వి శాండిల్య
పోలీసులకు సాధ్యమే!
జ్రాయిల్‌లోని లాడ్‌ నగరం ఒకప్పుడు మహిళల హత్యలూ, వేధింపులకు పెట్టింది పేరు. ముఖ్యంగా గృహ హింస మరీ ఎక్కువ. కానీ ఒక్కసారిగా అక్కడెంతో మార్పు. గత ఏడాది కాలంలో ఒక్క మహిళ కూడా హత్యకు గురి కాలేదు. వేధింపుల కేసులూ గణనీయంగా తగ్గాయి. దాదాపు లేవనే చెప్పాలి. దానికి కారణం, అక్కడి పోలీసులే. తామే తలుచుకుంటే, మనసు పెట్టి పని చేస్తే అమానుషాలు జరగకుండా చూడటం సాధ్యమేనని వాళ్లు నిరూపించారు. కట్నం కోసం స్త్రీలను కుటుంబ సభ్యులు హింసించడం, చంపడం వంటి సంఘటనలు ఒకప్పుడు అక్కడ చాలా ఎక్కువ. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చేవి. ఆ చెడ్డ పేరును ఎలాగైనా దూరం చేసుకోవాలనుకున్న పోలీసులు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యుల నుంచి ఎవరికైనా ప్రమాదం ఉందని తెలిస్తే ఆ కేసును ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి, పోలీసు ఉన్నతాధికారితో పాటు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు నేరుగా విచారించే పద్ధతిని అనుసరించారు. ప్రతి రోజూ బాధిత మహిళతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించడం, ఎవరి వల్లయితే ప్రమాదం ఉందో వారిపై అనుక్షణం నిఘా ఉంచడం చేశారు. కొన్ని ఆధారాలు దొరికి, మాట వినకపోతే, పద్ధతి మార్చుకోకపోతే వాళ్ల శైలిలో దారికొచ్చేలా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇవన్నీ పని చేశాయి. 'లాడ్‌' నగరంలో అరాచకాలు తగ్గాయి

http://www.facebook.com/pages/Security-Systems-and-Solar-Products/245701395548462


If u wanna buy any of the product mentioned above, call us or leave a message on facebook..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)