పోస్ట్‌లు

డిసెంబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

సొగసు జోరు..కుర్ర హుషారు! (Eenadu Eetaram_29/12/12)

చిత్రం
రాతి యుగమైనా.. రాకెట్‌ రోజులైనా... కాల గమనం ఎప్పుడూ ఒకటే! రోజుకు 24 గంటలు... ఏడాదికి పన్నెండు నెలలు... కానీ అదేం చిత్రమో.. ఈ కాలపు కాలం మహా జోరు మీదుంది... నింగిని చీల్చుకెళ్లే రాకెట్‌లా... బుల్లెట్‌ రైలు స్పీడులా... అచ్చం కుర్రకారు దూకుడులా! అందుకేనేమో... స్మార్ట్‌ఫోన్‌పై మోజు తీరకముందే... ఆన్‌లైన్‌ చాట్లాట ముగియకముందే... బ్లాగుల్లో భావాల అల్లికకు ఫుల్‌స్టాప్‌ పెట్టకముందే... మాల్స్‌లో మెచ్చిన డ్రెస్‌ వేయకముందే... యుగాంతం భయమింకా తొలగకముందే... 2012 కనుమరుగవుతోంది! ఆ అనుభూతుల దొంతరల్ని నెమరేస్తూనే... 2013కి పలుకుదాం సుస్వాగతం!! యువత కోసం సొగసులా? సొగసు సృష్టికర్తలు యువతా? అంటే కోడిముందా? గుడ్డుముందా? అన్నంత జటిల సమస్య. సమస్యను పక్కకి నెట్టేస్తే ఈ ఏడాది సొగసులు పరవళ్లు తొక్కాయనే చెప్పాలి. కాలేజీ స్వీటీల నుంచి బాలీవుడ్‌ బ్యూటీల దాకా అందరిదీ ఓం సొగసాయనమః జపమే. కుర్రాళ్లు మాత్రం తక్కువా? రిమ్‌'జిమ్‌' రిమ్‌'జిమ్‌' జిందాబాద్‌ అన్నారు. హీరోలు మీసాలు మెలేస్తే అనుసరిస్తూ రోషం చూపించారు. అలా 2012లో యువత ఆదరించిన హాట్‌ ట్రెండ్స్‌ కొన్ని. చీరకట్టు అందం:  సింగారించుకునే తీ...

Ratan Tata special article on Eenadu

చిత్రం
వృద్ధ యోధునికి టాటా 75 ఏళ్ల వయోభారం.. అప్పటిదాకా ఎన్నో ఆటుపోట్లు చవిచూసి అలిసిన శరీరం.. విశ్రాంతి కోరుకునే సమయమిది. గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌లో భాగమై.. రెండు దశాబ్దాలకు పైబడి గ్రూప్‌ సారథ్యాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చిన రతన్‌ టాటా ఇప్పుడు విశ్రాంతి పర్వంలోకి అడుగుపెడుతున్నారు. దాదాపు రూ.5 లక్షల కోట్ల టాటాల సామ్రాజ్యాన్ని వారసుడు మిస్త్రీ చేతిలో పెట్టి నేడు పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు రూ.10,000 కోట్ల టాటా గ్రూపు సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లలో రూ. 4.75 లక్షల కోట్ల స్థాయికి తీర్చిద్దిన ఘనత రతన్‌ది. గ్రూప్‌ కార్యకలాపాలను ఎల్లలు దాటించడంలోనే కాదు.. దేశ పారిశ్రామిక, వాణిజ్య పురోగతిలోనూ కీలక పాత్ర పోషించారు. మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఆయన గురించి బాగా తెల్సినవాళ్లు. 'నాకు అలసటగా ఉంది. ఈ పని రేపు చేద్దాం' అన్న మాటలు రతన్‌ నోట విన్నవారు లేరు. ఆయన దృష్టంతా లక్ష్యంపైనే. గత పదేళ్లలో దాదాపు 1,800 కోట్ల డాలర్లు.. అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి టె...

అంతర్జాలంలో అ..ఆ..ఇ..ఈ! (Eenadu Eetaram_22/12/12)

చిత్రం
ఎవరన్నారు? తెలుగు కనుమరుగవుతోందని...ఎవరన్నారు?? తెలుగులో చదివితే ఉద్యోగాలు కరవవుతాయని...ఇది ఒట్టి అపోహ, భ్రమే! అంటున్నారు టెక్‌ నిపుణులు...పైపెచ్చు... భవిష్యత్తులో ఆన్‌లైన్‌ తెలుగుమయం...అంతర్జాలం కొలువుల నిలయం... ఇది ఖాయం అని సెలవిచ్చేస్తున్నారు...ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆ సంగతుల సమాహారం. ఆన్‌లైన్‌ వెలుగులకు శ్రమిస్తున్న కొందరు యువ తరంగాల పరిచయం. కం ప్యూటర్‌, ఆన్‌లైన్‌, అంతర్జాలం అనగానే గుర్తొచ్చేది ఆంగ్లమే. ఇదంతా గతం. పరిస్థితులు మారుతున్నాయి. స్థానిక భాషల ప్రాభవం మొదలవుతోంది. అందులో తెలుగు భాష సైతం తన స్థానం పదిల పరుచుకుంటోంది. ఇది అత్యయిక పరిస్థితి. అందుకే గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాహూలాంటి దిగ్గజాలు ముందే మేలుకున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, కన్నడమంటూ స్థానిక భాషలకు తమ సేవలు విస్తరిస్తున్నాయి. యువతలో భాగమైన ఫేస్‌బుక్‌ సైతం తెలుగును ప్రోత్సహిస్తోంది. ఫలితమే నిత్యం లక్షలమంది తమ చాట్లాటలు, అభిప్రాయాల్లో అలవోకగా తెలుగు అక్షరాల్ని వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌ని పోలిన వూక్‌స్టర్‌లాంటి సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లు అయితే అచ్చంగా తెలుగు భాష, వ్యక్తులకే పట్టం కడుతున్నాయి. సె...

2012 ఓ డజను ...(Eenadu Tech_27/12/12)

చిత్రం
20 12  ఓ డజను ... ''గతం గట్టి పునాది అయినప్పుడే... భవిష్యత్‌ అనే భవనం దృఢంగా నిలుస్తుంది!'' గెలాక్సీ తళుకుల్లో... తాకేతెర మాయల్లో... క్లౌడ్‌ స్టోరేజ్‌ల్లో... ఫేస్‌బుక్‌ వాల్‌ పోస్టింగ్‌ల్లో... మరో ఏడాది తన మనుగడకి ముగింపు పలకనుంది. టెక్‌ ప్రియుల గుండెల్లో డజన్ల జ్ఞాపకాల్ని వదిలేసి హై రిజల్యుషన్‌ వెలుగుల్ని వెదజల్లుతూ వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో 2012 వేదికగా నిలిచిన డజన్ల జ్ఞాపకాలు కొన్ని... పరిధుల్ని చెరిపేస్తూ... అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయింది. ఆధునిక సౌకర్యాలన్నీ మునివేళ్లపైనే. అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తూ టెక్నాలజీ భిన్నమైన గ్యాడ్జెట్‌లను 2012లో పరిచయం చేసింది. వాటిలో కొన్ని... ఐదుకు చేరింది! మరింత స్లిమ్‌గా రెటీనా డిస్‌ప్లేతో ఐఫోన్‌ వెర్షన్‌ మార్చుకుని ఐఫోన్‌ 5గా మార్కెట్‌లో ప్రవేశించింది. ప్రత్యేకంగా రూపొందించిన  A6  చిప్‌ని దీంట్లో వాడారు. ఏ5 చిప్‌తో పోలిస్తే మొబైల్‌ సీపీయూ సామర్థ్యం, గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ రెట్టింపు అయ్యింది. దీంతో బ్యాటరీ ఎక్కువగా ఆదా అవుతుంది. 8 మెగాపిక్సల్‌ ఐసైట్‌ కెమెరాని వాడారు. వీడియో, ఇతర వివరాలకు  www.apple.com/iphone...

ఉసిరితో పసిడి అందం! (Eenadu Vasundhara)

చిత్రం
ఉసిరికాయను ఉత్తినే తిన్నా, పచ్చడిగా పెట్టుకున్నా రుచి బాగుంటుంది. అలాగని అది కేవలం వంటలకే కాదు, చర్మానికీ, జుట్టుకీ కళ్లు చెదిరే మెరుపునివ్వడంలోనూ ముందే ఉంటుంది. నారింజ పండులో కన్నా ఇరవై రెట్లు అధికంగా ఉసిరిలో విటమిన్‌ 'సి' ఉంటుంది. కనుక దీన్ని తినడం వల్ల నిత్య యౌవనంగా కనిపించవచ్చు. ఉ సిరికాయల్ని బాగా ఎండబెట్టి మిక్సీలో పొడి చేసుకోవాలి. దీనిని ఒక డబ్బాలో ఉంచుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఈ పొడిని ముఖ్యంగా మెరిసే జుట్టుకోసం వాడుకోవచ్చు. రెండు చెంచాల ఉసిరి పొడికి టేబుల్‌ స్పూను పెరుగు, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి పేస్టులా చేసుకోవాలి. దానిని మాడుకి తగిలేలా రాసుకోవాలి. గంటయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మారుతుంది. తలలో తెల్ల వెంట్రుకలు కనిపిస్తూ ఉంటే ఉసిరి పొడికి నిమ్మరసాన్ని కలిపి జుట్టుకి రాసుకోవాలి. దీనివల్ల సహజమైన నలుపు రంగుని పొందవచ్చు. ఖరీదైన కండిషనర్ల కన్నా, ఉసిరి పొడికి గోరువెచ్చని నీటిని కలిపి రాసుకుంటే మంచిది. జుట్టుకి అది చక్కని పోషణనిస్తుంది. ఉసిరి పొడినే షాంపూగా కూడా వాడుకోవచ్చు. జుట్టు ఎండిపోయినట్టు జీవం లేకుండా కనిపిస్తే నీటిలో ఉసిరి పొడ...

ఐడియా యుద్ధం! (Eenadu Sunday_16/12/12)

చిత్రం
కొత్త ఆలోచనలు కదంతొక్కుతాయి. ఆవిష్కరణలు సై అంటే సై అంటాయి. ఐడియా పోటీలూ, బిజినెస్‌ ప్లాన్‌ కాంపిటీషన్లూ... క్యాంపస్‌ బుర్రలకు పదునుపెడుతున్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం గెలుపు తలుపులు తెరుస్తున్నాయి. ఆ లోచన... చిన్న పాయగా మొదలై... మహా సముద్రంలా విస్తరిస్తుంది. ఇది... జ్ఞానశక్తి. మేధకు సంబంధించింది. పోటీ... ప్రపంచానికి వీరుడినిస్తుంది. వీరుడికి విజయాన్నిస్తుంది. విజయానికి అర్థాన్నిస్తుంది. ఇది... ఇచ్ఛాశక్తి. గెలవాలన్న తపనతో ముడిపడింది. ఆచరణ... అద్భుతమైన ఐడియాలన్నీ వాటంతటవే అత్యద్భుతమైన వ్యాపారాలైపోవు. అమలు ముఖ్యం. చిత్తశుద్ధి ఉండాలి. ఇదే క్రియాశక్తి. ఆచరణే ప్రాణం. ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తి ఈ మూడింటినీ కలిపి 'మహాశక్తి'గా అభివర్ణిస్తుంది భారతీయత. అది ఐడియాల పోటీ కావచ్చు, బిజినెస్‌ ప్లాన్‌ కాంపిటీషన్‌ కావచ్చు-ఏ విజయానికైనా ఇదే మార్గం, ఇదే మంత్రం! ఐడియాలు కావాలి... నూట ఇరవైకోట్ల కస్టమర్లున్నారు. ఇంటర్నెట్‌ ఉంది. ఇంటికో ఇంజినీరింగ్‌ పట్టభద్రుడున్నాడు. మౌలిక సౌకర్యాలున్నాయి. లేనిదల్లా ఐడియాలే. ఉన్నా అడుగుబొడుగు సరుకే. కాపీ రాగమే! నిఖార్సయిన ఐడియాల కొరత మార్కెట్‌ను...

వీక్షణం... విలక్షణం! (Eenadu Thursday_20/12/12)

చిత్రం
యూట్యూబ్‌... ఇదో యూనివర్సల్‌ ఛానల్‌! రంగం ఏదైనా... అంశాలు ఎన్నైనా... సెర్చ్‌ కొడితే చాలు! లెక్కకు మిక్కిలి వీడియోలు! మరి, ఫైర్‌ఫాక్స్‌ వేదికపై వాటిని వీక్షించాలంటే? వారధులు చాలానే! ఇ ష్టమైన ప్రొగ్రాంని టీవీలో చూడలేకపోతే ఏం చేస్తారు? వెంటనే యూట్యూబ్‌లో వెతికి వీక్షిస్తారు. మీకు తెలుసా? ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో అనేక అదనపు సౌకర్యాల సాయంతో వాటిని చూసేందుకు భిన్నమైన మార్గాలున్నాయి. ఒకే క్లిక్కుతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫార్మెట్‌లు మార్చొచ్చు. అవేంటో తెలుకుని అందుబాటులో ఉన్న యూట్యూబ్‌ ఛానళ్లను హాయిగా వీక్షించండి... హెచ్‌డీలో చూడొచ్చు! యూట్యూబ్‌లోని డీఫాల్ట్‌ ఫార్మెట్‌లో వీడియోలు చూడడం తెలిసిందే. కానీ, వీడియో ఏదైనా హైడెఫినెషన్‌లో వీక్షించాలంటే అందుకో ప్రత్యేక ఫైర్‌ఫాక్స్‌ యాడ్‌ఆన్‌ సిద్ధంగా ఉంది. అదే  Youtube High Definition.  లింక్‌లోకి వెళ్లి సర్వీసుని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసి రీస్టార్ట్‌ చేయాలి. దీంతో అడ్రస్‌బార్‌ పక్కనే హెచ్‌డీ ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. ఇక యూట్యూబ్‌లో ఎప్పుడు వీడియోలు చూస్తున్నా ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి కావాల్సిన క్వాలిటీని సెలెక్ట్‌ చేసుకోవచ్...

ఆ తెల్లవాడే అసలైన తెలుగు వాడు!

చిత్రం
ఆ తెల్లవాడే అసలైన తెలుగు వాడు! 1817, ఆగస్ట్‌ 13.   ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి! ఒ క్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్రౌన్‌ తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ నడిపిన ధర్మపాఠశాలల నిర్వాహకుడు. క్రైస్తవ ...

Ranga Vallika (Eenadu Sankranthi special)

చిత్రం

ఇంటెల్‌ ఇంట్లో కొత్త కొత్తగా..! (Eenadu Thursday_13/12/12)

చిత్రం
అప్లికేషన్ల సంగతి సరే... భిన్నమైన సాఫ్ట్‌వేర్‌లను వాడితే! అందుకు ప్రత్యేక స్టోర్‌ సిద్ధంగా ఉంది! అదే 'ఇంటెల్‌ ఆప్‌అప్‌'! అన్నీ ఉచితమే! వీ డియో ఫైల్స్‌ని ప్లే చేయాలంటే ఎప్పుడూ వీఎల్‌సీ ప్లేయరేనా? అదే పనిని మూవీ స్టూడియోతో భిన్నంగా చేయవచ్చు. ఆండ్రాయిడ్‌లో గేమింగ్‌ ప్రియుల్ని ఆకట్టుకున్న యాంగ్రీబర్డ్స్‌ని డెస్క్‌టాప్‌పైన ఎగిరేలా చేయవచ్చు. తాకేతెరపై సందడి చేసిన 'టాకింగ్‌ టామ్‌'ని పీసీలోనూ మాట్లాడేలా చేయవచ్చు. జీఆర్‌ఈ.. టొఫెల్‌... జీమాట్‌.. లాంటి పరీక్షలకు ఉపయోగపడే ఇంగ్లిష్‌ గ్రామర్‌ అప్లికేషన్లు వాడుకోవచ్చు... చెప్పాలంటే ఇలాంటి భిన్నమైన సాఫ్ట్‌వేర్‌లు ఇంటెల్‌ ఆప్‌అప్‌లో చాలానే ఉన్నాయి. వాటితో మీ పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచొచ్చు. మరి, ఆయా టూల్స్‌ని పీసీలో ఎలా వాడుకోవొచ్చో వివరంగా తెలుసుకుందాం! ఇదో ప్రత్యేక అడ్డా! అవసరానికి సరిపడే రకరకాల టూల్స్‌ని అందిస్తోంది  www.appup.com . ఇంటెల్‌ కంపెనీ రూపొందించిన ఇందులోని టూల్స్‌ని వాడుకోవాలంటే ముందుగా 'ఆప్‌అప్‌' ఫ్లాట్‌ఫాంని పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. ఆపై మెయిల్‌ ఐడీ వివరాలతో స్టోర్‌లో సభ్యులవ్వాలి.  View మెనూ...