సొంత సైటుకి సోగాసులిలా!!! (Eenadu_06/12/12)
ఉద్యోగి... వ్యాపారి... విద్యార్థి! కాస్త టెక్నాలజీ పరిచయం ఉంటే చాలు... నాకూ ఓ సైటుంటే? అన్న ఆలోచనే!ఉచిత సైట్‌లను అందించే సైట్‌లు ఇప్పటికే చాలానే ఉన్నా, మరిన్ని హంగులతో సరికొత్త వెబ్ సర్వీసులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. వాటితో మీరే సొంత సైట్‌ని రూపొందించుకోవచ్చు. అందుకు అనువైన మార్గాలేంటో వివరంగా చూద్దాం!దానికి ప్రత్యేకం! మీ అభిరుచికి తగినట్టుగా మీ వెబ్‌సైట్ హోంపేజిని ఉచితంగా రూపొందించుకోవాలంటే ఒక సాధనంAbout.Me. లాగిన్ అయి మీకు నచ్చిన ఫొటోని అప్‌లోడ్ చేశాక, Biographyలోకి వెళ్లి మీ వివరాలను నమోదు చేయవచ్చు. ఏవైనా వెబ్ లింక్‌లను పేజీకి యాడ్ చేయాలంటే 'లింక్స్' ఉంది. సెట్టింగ్స్ ద్వారా నచ్చిన సోషల్ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేసి మీ సైటును షేర్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ అప్లికేషన్స్ కోసం Appsఉంది. ఐకాన్ల రూపంలో అప్లికేషన్లు కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు బ్లాగింగ్ ప్రియులైతే 'బ్లాగర్' సర్వీసుని పేజీలో పెట్టుకునే వీలుంది. ఇతరుల పేజీలను చూడాలనుకుంటే 'ఎక్స్‌ప్లోర్ పేజెస్' ఉంది. ప్రత్యేక వెబ్ లింక్‌తో మీ పేజీని ఎక్కడైనా షేర్ చేయవచ్చు. http://about.me |
సోషల్ ఫ్రొఫైల్ మాదిరిగా కాకుండా పూర్తిస్థాయిలో వెబ్‌సైట్‌ని రూపొందించాలనుకుంటే Weebly ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో సైట్‌ని రూపొందించొచ్చు. ఆకట్టుకునే థీమ్స్ ఉన్నాయి. ప్రకటనలకు చోటు కేటాయించి ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుంది. బ్లాగింగ్, ఫొరమ్స్‌తో అనుసంధానం కావచ్చు. ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేసుకునే వీలుంది. వీడియోలను అప్‌లోడ్ చేసే వీలుంది. www.weebly.com |
* ఆకట్టుకునే టెంప్లెట్స్‌తో సైట్‌ని క్రియేట్ చేసుకోవాలంటే WIX ఉంది. ప్రత్యేక యాడ్‌ఆన్స్‌తో అదనపు వెబ్ సర్వీసుల్ని సైట్‌లో పెట్టుకోవచ్చు.www.wix.com* ఇలాంటిదే మరోటి ZOHO. వివిధ రకాల టెంప్లెట్స్‌తోనే కాకుండా embedding కోడ్‌తో అదనపు సర్వీసుల్ని సైట్‌కి పొందుపరచొచ్చు.www.zoho.com/sites/ * మొబైల్ ఫార్మెట్‌లో సైట్‌ని రూపొందించుకోవాలనుకుంటే Octomobi ఉంది. అన్ని స్మార్ట్ మొబైల్స్‌కీ అనువుగా ఉంటుంది. www.octo mobi.com * ఇలాంటిదే మరోటి Onbile. మల్టిపుల్ పేజీలతో సైట్‌ని రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత. ఇమేజ్ గ్యాలరీలను కూడా క్రియేట్ చేయవచ్చు.ww.onbile.com |
http://www.facebook.com/pages/Electronic-Security-Systems-and-Solar-Products/245701395548462
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి