ఇంటెల్‌ ఇంట్లో కొత్త కొత్తగా..! (Eenadu Thursday_13/12/12)



అప్లికేషన్ల సంగతి సరే... భిన్నమైన సాఫ్ట్‌వేర్‌లను వాడితే!
అందుకు ప్రత్యేక స్టోర్‌ సిద్ధంగా ఉంది! అదే 'ఇంటెల్‌ ఆప్‌అప్‌'!
అన్నీ ఉచితమే!
వీడియో ఫైల్స్‌ని ప్లే చేయాలంటే ఎప్పుడూ వీఎల్‌సీ ప్లేయరేనా? అదే పనిని మూవీ స్టూడియోతో భిన్నంగా చేయవచ్చు. ఆండ్రాయిడ్‌లో గేమింగ్‌ ప్రియుల్ని ఆకట్టుకున్న యాంగ్రీబర్డ్స్‌ని డెస్క్‌టాప్‌పైన ఎగిరేలా చేయవచ్చు. తాకేతెరపై సందడి చేసిన 'టాకింగ్‌ టామ్‌'ని పీసీలోనూ మాట్లాడేలా చేయవచ్చు. జీఆర్‌ఈ.. టొఫెల్‌... జీమాట్‌.. లాంటి పరీక్షలకు ఉపయోగపడే ఇంగ్లిష్‌ గ్రామర్‌ అప్లికేషన్లు వాడుకోవచ్చు... చెప్పాలంటే ఇలాంటి భిన్నమైన సాఫ్ట్‌వేర్‌లు ఇంటెల్‌ ఆప్‌అప్‌లో చాలానే ఉన్నాయి. వాటితో మీ పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచొచ్చు. మరి, ఆయా టూల్స్‌ని పీసీలో ఎలా వాడుకోవొచ్చో వివరంగా తెలుసుకుందాం!
ఇదో ప్రత్యేక అడ్డా!
అవసరానికి సరిపడే రకరకాల టూల్స్‌ని అందిస్తోంది www.appup.com.ఇంటెల్‌ కంపెనీ రూపొందించిన ఇందులోని టూల్స్‌ని వాడుకోవాలంటే ముందుగా 'ఆప్‌అప్‌' ఫ్లాట్‌ఫాంని పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. ఆపై మెయిల్‌ ఐడీ వివరాలతో స్టోర్‌లో సభ్యులవ్వాలి. Viewమెనూతో కావలసిన టూల్స్‌ని జాబితా నుంచి ఎంపిక చేసుకోవచ్చు.
లైబ్రరీగా మారిపోతుంది!
ఉచిత పుస్తకాలు కావాలనుకుంటే http://goo.gl/jda27లోకి వెళ్లండి. పిల్లల కోసం Nursery Rhymes ఉంది. సుమారు 100 రైమ్స్‌ని పొందొచ్చు.
సుమారు 10,000 ఉచిత పుస్తకాల్ని అందించే Wattpadని పొందవచ్చు. వాట్‌ప్యాడ్‌ కమ్యూనిటీలో సభ్యులై ఇతరులతో అభిప్రాయాల్ని పంచుకోవచ్చు.
నూక్‌ ఈ-పుస్తక స్థావరాన్ని పీసీలోనే యాక్సెస్‌ చేయాలంటే Nook for pcని పొందొచ్చు. సుమారు 2 మిలియన్ల పుస్తకాల్ని చూడవచ్చు.
గణిత శాస్త్రాన్ని అభ్యసించే వారికి 'హ్యాపీ మ్యాథ్స్‌' సిరీస్‌ ఉంది.
వ్యాపారం చేస్తున్నారా?
చేస్తున్న బిజినెస్‌కి సంబంధించిన టూల్స్‌ కావాలంటే Businessలోకి వెళ్లొచ్చు. ఉత్పత్తి వివరాలతో నమూనా ప్రజంటేషన్‌ని తయారు చేసి ప్రదర్శించడానికి Presentation Creator ని వాడుకోవచ్చు.
My Dairy Notes తో రోజువారీ పనుల్ని సులువుగా మేనేజ్‌ చేయవచ్చు.
ఆదాయ వ్యయాల వివరాలను నమోదు చేయడానికి 'బడ్జెట్‌ వర్క్‌బుక్‌'లను రూపొందించుకోవచ్చు.
ఎక్కువ మంది ఉద్యోగులతో కంపెనీని నిర్వహిస్తున్నట్లయితే Employees Information Systemతో అందరి రికార్డ్స్‌ని సులభంగా మేనేజ్‌ చేయవచ్చు.
http://goo.gl/gZxfL.
ఆటలే ఆటలు..
అలరించే ఆటల కోసం 'గేమ్స్‌' అడ్డాలోకి వెళితే సరి.Fruit Ninja Lite లాంటి ఆటలు బోలెడు.
చిత్రకారుడిలా మారిపోవాలంటే My Little Artist ఉంది.
గేమింగ్‌ ప్రియుల్ని కట్టిపడేసిన Chiken Invaders 3 Xmasగేమ్‌ని ఉచితంగా పొందవచ్చు.
ఇక యాంగ్రీబర్డ్స్‌ ఆడాలంటే పెయిడ్‌ వెర్షన్‌లోకి వెళ్లి Angry Birds Rio, Angry Birds Star Wars లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Jumpie 2, Bubble Ball Lite, Subway Surfers... లాంటి మరిన్ని గేమ్స్‌ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వివరాలకు http://goo.gl/wPgrS
ఆరోగ్యమే మహాభాగ్యం
పొగతాగడం వల్ల ఆరోగ్యానికి వచ్చే ముప్పేంటో తెలుసుకునేందుకు Smoke Risk Finder ఉంది. పొగతాగడం మొదలుపెట్టిన తేదీ, రోజులో కాల్చే సిగరెట్లు... వివరాల్ని ఎంటర్‌ చేసి ఏ మేరకు అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవచ్చు.
విటమిన్స్‌, మినరల్స్‌ వల్ల ప్రయోజనాలు, అవి దొరికే ఆహారాన్ని తెలుసుకునేందుకు ViMi ఉంది.
ఆరోగ్యం విషయంలో యోగాకి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఆసనాల్ని సాధన చేయాలంటే Yoga App ని పొందండి.
రోజూ వారీ వ్యాయామాన్ని ప్రత్యేక ట్రైనర్‌ సమక్షంలో చేయాలంటే Personal Trainer ఉండాల్సిందే. శరీరంలోని వివిధ ప్రత్యేక భాగాలకు అవసరమయ్యే కసరత్తులను ఇమేజ్‌ వ్యూల్లో పొందొచ్చు. మరిన్ని హెల్త్‌ టూల్స్‌ కోసం http://goo.gl/c148V
వాటికి ప్రత్యేకం..
ఫొటోలు, వీడియోలను ఎడిట్‌ చేసేందుకు ప్రత్యేక టూల్స్‌ ఉన్నాయి. తక్కువ మెమొరీతో ImEditటూల్‌ని వాడుకోవచ్చు. టిఫ్‌, జిఫ్‌, బీఎంపీ, పీఎన్‌జీ... లాంటి మరిన్ని ఇమేజ్‌లను ఫొటోషాప్‌లో మాదిరిగా ఎడిట్‌ చేయవచ్చు.
వీడియోలను సులువైన పద్ధతిలో ఎడిట్‌ చేసేందుకు Freemake Video Converter ఉంది. ఏవీజీ, ఎంపీ4, ఎంకేవీ, 3జీపీ... లాంటి మరిన్ని ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది.
యూట్యూబ్‌ వీడియోలను ప్రత్యేక ప్లేయర్‌లో వీక్షించాలంటే iPlay వాడొచ్చు. లింక్‌ని బాక్స్‌లో పేస్ట్‌ చేసి watch పై క్లిక్‌ చేస్తే సరి. మరిన్ని కావాలంటేhttp://goo.gl/u25e5
లైఫ్‌స్టెల్‌ మార్చొచ్చు
టూల్స్‌తో లైఫ్‌స్టెల్‌ ఏ మేరకు ప్రభావితం అవుతుందో తెలుసుకోవాలంటే 'లైఫ్‌స్టెల్‌' విభాగంలోకి వెళ్లాల్సిందే. బారసాలకి రకరకాల పేర్లను పొందడానికి Baby Names ఉంది.
సందర్భాలకు సరిపడే సరికొత్త వంటకాల్ని వండేందుకు మెనూని అందిసోంది Fine Cooking Menu Makerవీడియోలను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.
భగవద్గీతలోని శ్లోకాల్ని, వాటి అర్థాల్ని తెలుసుకోవాలంటే Bhagavad Githa టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
ఇంట్లో హాలు, రీడింగ్‌ రూం, బెడ్‌ రూం... ఏదైనా మీ అభిరుచి మేరకు అలంకరించాలనుకుంటే Room Planner టూల్‌ని వాడుకోండి. మరిన్ని లైఫ్‌స్త్టెల్‌ టూల్స్‌కి http://goo.gl/yVGBG మరిన్ని యుటిలిటీ టూల్స్‌ కోసం http://goo.gl/eFhBE

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు