వీక్షణం... విలక్షణం! (Eenadu Thursday_20/12/12)
యూట్యూబ్... ఇదో యూనివర్సల్ ఛానల్!ఇష్టమైన ప్రొగ్రాంని టీవీలో చూడలేకపోతే ఏం చేస్తారు? వెంటనే యూట్యూబ్‌లో వెతికి వీక్షిస్తారు. మీకు తెలుసా? ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో అనేక అదనపు సౌకర్యాల సాయంతో వాటిని చూసేందుకు భిన్నమైన మార్గాలున్నాయి. ఒకే క్లిక్కుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫార్మెట్‌లు మార్చొచ్చు. అవేంటో తెలుకుని అందుబాటులో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను హాయిగా వీక్షించండి...హెచ్‌డీలో చూడొచ్చు! యూట్యూబ్‌లోని డీఫాల్ట్ ఫార్మెట్‌లో వీడియోలు చూడడం తెలిసిందే. కానీ, వీడియో ఏదైనా హైడెఫినెషన్‌లో వీక్షించాలంటే అందుకో ప్రత్యేక ఫైర్‌ఫాక్స్ యాడ్‌ఆన్ సిద్ధంగా ఉంది. అదే Youtube High Definition. లింక్‌లోకి వెళ్లి సర్వీసుని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసి రీస్టార్ట్ చేయాలి. దీంతో అడ్రస్‌బార్ పక్కనే హెచ్‌డీ ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. ఇక యూట్యూబ్‌లో ఎప్పుడు వీడియోలు చూస్తున్నా ఐకాన్ గుర్తుపై క్లిక్ చేసి కావాల్సిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. 'వీడియో క్వాలిటీ' మెనూలో Highest Resolution, హెచ్‌డీ 1080, హెచ్‌డీ 720, లార్జ్, మీడియం... లాంటి మరిన్ని ఫార్మెట్‌లను సెలెక్ట్ చేయవచ్చు. మెనూలోనే కాకుండా వీడియోలోని సెట్టింగ్స్ గుర్తుపై కావాల్సిన క్వాలిటీలోకి మార్చుకోవచ్చు.http://goo.gl/dDglL ఇది చాలా 'స్మార్ట్' వీడియోలు వేగంగా బఫర్ అవ్వాలంటే Smart Video for Youtube గురించి తెలుసుకోవాల్సిందే. దీన్ని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేయగానే వీడియో ప్లేయర్‌లో అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. అందుకు పాయింటర్‌ని ప్లే బటన్‌పై ఉంచాలి. వచ్చిన టూల్‌బార్‌లోని 'పాజ్' బటన్‌పై క్లిక్ చేసి వీడియోని వేగంగా బఫర్ అయ్యేలా చేయవచ్చు. ఎంత సమయంలో బఫర్ పూర్తవుతుందో కూడా తెలుసుకునే వీలుంది. బఫర్ ఫూర్తవ్వగానే ఆటోమాటిక్‌గా వీడియో ప్లే అవ్వాలంటే Start Playing When Buffered ఆప్షన్‌ని చెక్ చేయాలి. http://goo.gl/Fc6pL రెండు ఫార్మెట్‌లు! యూట్యూబ్‌లో మీకు నచ్చిన వీడియోని డౌన్‌లోడ్ చేయాలంటే ఒకే ఒక్క క్లిక్కుతో బ్రౌజర్‌లోని అదనపు సౌకర్యంతో ఎంపీ4, ఎఫ్‌ఎల్‌వీ ఫార్మెట్‌ల్లో పొందొచ్చు. అందుకు Download Youtube Videos as MP4 and FLV యాడ్‌ఆన్‌ని బ్రౌజర్‌లో నిక్షిప్తం చేయండి. వెంటనే యూట్యూబ్ వీడియో ప్లేయర్ కింది భాగంలో Download బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి MP4 360p, FLV 480p, MP4 720 (HD) ఫార్మెట్‌ల్లో వీడియోలను డౌన్‌లోడ్ చేయవచ్చు.http://goo.gl/x8ANQ ఇలా వెతకండి! ఏదైనా అంశానికి సంబంధించిన వీడియోలను వెతకాలంటే యూట్యూబ్ హోం పేజీలోకి వెళ్లి అక్కడి సర్చ్ బటన్‌లో టైప్ చేయక్కరలేదు.YouTube IT యాడ్‌ఆన్ ఉంటే సరి. దీన్ని బ్రౌజర్‌లో నిక్షిప్తం చేయగానే విండోస్ రైట్‌క్లిక్ మెనూలోని కొత్తగా అదనపు సౌకర్యం వచ్చి చేరుతుంది. ఆపై గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లేదా మరేదైనా టెక్స్ట్ మేటర్‌లోని అంశానికి సంబంధించిన వీడియోలను వెతకడం మరింత సులువు. కేవలం టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసి రైట్‌క్లిక్‌లోని 'యూట్యూబ్ ఐటీ'పై క్లిక్ చేయాలి. వెంటనే యూట్యూబ్ ఓపెన్ అవ్వడంతో పాటు ఎంపిక చేసిన అంశానికి సంబంధించిన వీడియోల జాబితా కనిపిస్తుంది. http://goo.gl/oEmRV 'రీప్లే' ఇలా.. వినాంప్‌లో మాదిరిగా యూట్యూబ్ ప్లేయర్‌లో చూసిన వీడియోలు ఆటోమాటిక్‌గా రీప్లే అవ్వాలంటే YouTube Auto Reply యాడ్‌ఆన్‌తో సాధ్యమే. దీన్ని నిక్షిప్తం చేయగానే ప్లేయర్ కింది భాగంలో అదనపు Reply బటన్ కనిపిస్తుంది. ఏదైనా వీడియోని ప్లే చేశాక అదే వీడియోని మళ్లీ చూడాలనుకుంటే 'రీప్లే' బటన్‌పై క్లిక్ చేయండి.http://goo.gl/uPZOG అన్ని అందులోనే! ఒకే యూట్యూబ్ వీడియోని వివిధ ఫార్మెట్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే Youtube MP3 Podcasterయాడ్‌ఆన్ ఉంటే చాలు. ఇన్‌స్టాల్ చేయగానే ప్లేయర్ కిందిభాగంలోనూ, అడ్రస్‌బార్ పక్కన కనిపించే టూల్‌బార్‌లోనూ అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. సెట్టింగ్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి MP3 Bit Rate, Volume Control లను కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లలో ప్లే చేసుకునేలా 3జీపీ ఫార్మెట్‌లోనూ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి నాణ్యతతో కూడిన వీడియో ఫైల్ కావాలంటే FULL HD ని సెలెక్ట్ చేసుకోండి.http://goo.gl/BYZkP సినిమా మోడ్ యూట్యూబ్‌లో వీడియోలు చూసేప్పుడు పేజీలో వైట్‌స్పేస్ వల్ల వీడియో క్వాలిటీ పూర్తిస్థాయిలో కనిపించడం లేదా? మరైతే యూట్యూబ్ బ్యాక్‌గ్రౌండ్‌ని లైట్స్ ఆఫ్ చేసినట్టుగా నలుపు రంగులో కనిపించేలా చేయవచ్చు. అందుకో ప్రత్యేక సర్వీసు సిద్ధంగా ఉంది. అదే Youtube Light Switch.బ్రౌజర్‌లో యాడ్‌ఆన్‌ని ఇన్‌స్టాల్ చేసి యూట్యూబ్‌ని ఓపెన్ చేస్తే అంతా నలుపు రంగులో కనిపిస్తుంది. http://goo.gl/o7FJU ఫార్మెట్ ఏదైనా... యూట్యూబ్ నుంచి కావాల్సిన వీడియోలను వివిధ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే Easy Youtube Video Downloader ఉంది. బ్రౌజర్‌కి యాడ్ చేయగానే ప్లేయర్ కింది భాగంలో 'డౌన్‌లోడ్' బటన్ కనిపిస్తుంది. కావాల్సిన వీడియోని ఎంపిక చేసి డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి. వీడియో ఫైల్స్‌ని ఆడియో ఫైల్స్ రూపంలో డౌన్‌లోడ్ చేయాలంటేMP3 ఫార్మెట్‌ని సెలెక్ట్ చేస్తే సరి. http://goo.gl/EllYj ఎక్కడి దక్కడే! మీ మెయిల్‌లోనో... ఇతర వెబ్ సైట్‌ల్లోనూ బ్రౌజ్ చేస్తున్న వీడియో లింక్స్‌ని ఓపెన్ చేయాలంటే ఆయా వీడియో షేరింగ్ సైట్‌ల్లోకి వెళ్లక్కర్లేకుండా అక్కడే సినిమా ఫైల్ మాదిరిగా ప్లే చేయవచ్చని తెలుసా? అందుకు Youtube Anywhere Player యాడ్‌ఆన్ ఉంది. దీన్ని ఇన్‌స్టాల్ చేశాక బ్రౌజర్‌ని రిస్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. http://goo.gl/Muxye మ్యూజిక్ ప్లేయర్ పాటలు, వీడియోలు చూడడానికి ప్రత్యేక మ్యూజిక్ ప్లేయర్‌ని ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌కి యాడ్ చేయవచ్చు. అందుకు Youtube Music Player ఉంది. బుక్‌మార్క్స్ పక్కనే యూట్యూబ్ ప్లేయర్ కనిపిస్తుంది. మెనూపై క్లిక్ చేసి 'ప్లేలిస్ట్'లను తయారు చేసుకోవచ్చు. కావాల్సిన ఆల్బమ్‌లను వెతకాలంటే Search ఉంది. ముందుగానే క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్‌ని వినేందుకు Load పై క్లిక్ చేయండి. ప్లేయర్‌ని సులువుగా మేనేజ్ చేసేందుకు షార్ట్‌కట్‌లు కూడా ఉన్నాయి. http://goo.gl/JOczH |
http://eenadu.net/Specialpages/e-eenadu/e-eenaduinner.aspx?qry=sp-eenadu1
http://www.facebook.com/pages/Electronic-Security-Systems-and-Solar-Products/245701395548462
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి