ఆప్స్ తో... అందరికి అన్ని!!! (Eenadu_29/11/12)
చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటే... బోలెడన్ని అప్లికేషన్లు! మోడల్ ఏదైనా... ఓఎస్‌లు వేరైనా... వాడుకున్నోళ్లకు వాడుకున్నన్ని! వాటిల్లో కొత్తవాటి సంగతుల్ని చూద్దాం!కాస్త తీరిక దొరికితే చాలు. మునివేళ్లు మొబైల్ తెరపై వాలిపోతాయి. ఆప్స్‌తో చాలానే చేస్తుంటాం. మరి, మీకు తెలుసా?ఆండ్రాయిడ్ మొబైల్‌ని విండోస్ 8 మొబైల్‌గా మార్చేయవచ్చు... ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్స్‌ని ఇతరులెవ్వరూ వాడకుండా లాక్ చేయవచ్చు... అడ్రస్ బుక్‌లోని కాంటాక్ట్‌లను నిత్యం బ్యాక్‌అప్ చేయవచ్చు... ముఖ్యమైన కాల్స్‌ని రికార్డ్ చేయవచ్చు... చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!గూగుల్ మ్యూజిక్! గూగుల్ అందిస్తున్న Play Musicఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న 20,000 పాటల్ని ఉచితంగా వినొచ్చు. నచ్చిన వాటిని సోషల్ నెట్‌వర్క్‌ల్లో పంచుకోవచ్చు. మ్యూజిక్ మార్కెట్‌లో ఉన్న కొత్త ఆల్బమ్స్‌ని చూడొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ అప్లికేషన్ పని చేస్తుంది.http://goo.gl/6cXEZ తాళం వేయండి! మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్లను ఇతరులు వాడకుండా చేయాలంటే App Lock తో సాధ్యమే. ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆప్‌ని ఓపెన్ చేయగానే ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్లు జాబితాగా కనిపిస్తాయి. వాటిలో కావలసిన వాటిని తాళం గుర్తుతో చెక్ చేసి సురక్షితం చేసుకోవచ్చు. ఆపై వాటిని వాడుకోవాలంటే పాస్‌వర్డ్ ఉండాల్సిందే.http://goo.gl/gBFr6 కొత్తగా హోం స్క్రీన్! మొబైల్‌లో రకరకాల హోం స్క్రీన్స్‌ని మార్చుకోవాలంటే, Go Launcher EX అప్లికేషన్ ఉంటే చాలు. అవసరాల మేరకు Customize చేసుకునే వీలుంది. 'విడ్జెట్స్'తో అదనపు సౌకర్యాల్ని తెరపై నిక్షిప్తం చేయవచ్చు. http://goo.gl/ey4t0 విండోస్ మాదిరిగా! మీరు వాడేది ఆండ్రాయిడ్ మొబైలే. కానీ, చూడ్డానికి విండోస్ 8 మొబైల్ మాదిరిగా కనిపించాలంటే అందుకో బుల్లి అప్లికేషన్ ఉంది. అదే Fake Windows 8. రన్ చేయగానే హోం స్క్రీన్, ఐకాన్స్ అన్నీ విండోస్ 8 మాదిరిగా కనిపిస్తాయి.http://goo.gl/lJgJb *మొబైల్‌లోకి పిల్లి చేరి తెరను నాకేసే సరదా అప్లికేషన్ పేరు Screen Licking Cat. గూగుల్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. http://goo.gl/8Jfsl 'ట్యూన్' చేయండి! నాసా శాస్త్రవేత్తలు చెప్పే తాజా వివరాలు తెలుసుకోవాలంటే NASA App HD ఆప్‌ని ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/vb14W * కొన్ని ప్రత్యేక అప్లికేషన్లతో మొబైల్ పరిధిని విస్తరించుకుంటోంది. డాక్టర్‌లా మారి సలహాలు ఇస్తుంది. అందుకు ఉదాహరణే Pregnancyఅప్లికేషన్. ఐఫోన్ యూజర్లను ఐట్యూన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం, ఇతర చిట్కాల్ని తెలుసుకోవచ్చు. రోజూ డైరీ రాసుకునే వీలుంది. వారాలు లెక్కిస్తూ బేబీ పెరుగుదలని అంచనా వేయవచ్చు. http://goo.gl/XBTht * మీకు ఎలాంటి హెయిర్‌స్త్టెల్ సెట్ అవుతుందో మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అందుకు Hairstyle Liteఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. http://goo.gl/DNjrn విండోస్ వాడితే! మీ మెదడుకున్న పదునెంతో తెలుసుకోవాలంటేIQ Numeric Test ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి.http://goo.gl/ex6jy * త్రీడీలో రూపొందించిన బైక్ రేస్ గేమ్ ఆడాలంటేAE 3D Motor గేమ్‌ని నిక్షిప్తం చేసుకోండి.http://goo.gl/tDngN * యాంగ్రీబర్డ్స్ మాదిరిగా విండోస్ ఫోన్‌లోనూ ఆడాలంటే BirdsBuzzఉంది. http://goo.gl/ZYUAp భలే బ్లాక్‌బెర్రీ! ఎసెమ్మెస్‌లు, ఈమెయిల్స్, ఛాటింగ్‌ల్లో ఆకట్టుకునే ఎమోటికాన్స్ వాడాలంటే? Fancy Smiley-Fancy Characters.. ఆప్‌ని ఉచితంగా పొందొచ్చు.http://goo.gl/mG6Dx * మీ రోజువారీ ఖర్చుల్ని బ్లాక్‌బెర్రీ ఎప్పటికప్పుడు నోట్ చేయాలంటే Expense Book వాడొచ్చు. వారం, నెల, సంవత్సరాల వారీగా ఆదాయ, వ్యయాల్ని లెక్కగట్టొచ్చు. http://goo.gl/xw6Xm * బ్లాక్‌బెర్రీలోనే ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికిPhoto Studio వాడొచ్చు. http://goo.gl/Oo0G3 * యూట్యూబ్ వీడియోలను వీక్షించేందుకు అనువైనదే Viewer for YOUTUBE. వీడియోలను బ్రౌజ్ చేసి చూసేందుకు అనువుగా ప్లేయర్‌ని రూపొందించారు. http://goo.gl/lVrxE మరికొన్ని.. * వాయిస్‌ని రికార్డ్ చేసి ప్రత్యేక టూల్‌తో మరొకరి వాయిస్‌లా మార్చేసి వినాలంటే Change My Voiceఆప్‌ని ప్రయత్నించండి. పిల్లి, రోబో... మాట్లాడినట్టుగా మార్చొచ్చు. ఆడ, మగ వాయిస్‌లను తారుమారు చేయవచ్చు. కోరస్, ఏకో ఎఫెక్ట్‌లను యాడ్ చేయవచ్చు.http://goo.gl/LyPQ0 * మీకొచ్చే ఫోన్‌కాల్స్‌ని ఆటోమాటిక్‌గా రికార్డ్ చేయాలంటే Auto Call Recorder ఆప్‌ని నిక్షిప్తం చేసుకోండి. ఏయే కాల్స్‌ని రికార్డ్ చేయాలో ముందే సెట్ చేసుకోవాలి. రికార్డ్ చేసిన కాల్స్‌ని ఇతరులకి షేర్ చేసే వీలుంది. రికార్డ్ చేసిన కాల్స్ ఆటోమాటిక్‌గా ఎస్‌డీ కార్డ్‌లో సేవ్ అయ్యేలా చేయవచ్చు. http://goo.gl/klaKw * నోకియా ఫోన్ వాడుతున్నారా? మీరు డ్రైవింగ్‌లోనో... ఏదైనా ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్‌ని ఆటోమాటిక్‌గా రిజెక్ట్ చేసి, కాలర్ నెంబర్‌కి మెసేజ్ వెళ్లేలా చేయాలంటేCallManager ఆప్‌ని నిక్షప్తం చేసుకోండి.http://goo.gl/6XoCV * స్మార్ట్ మొబైల్ పిల్లల చేతిలో ఆట బొమ్మలా నవ్వించడం మాత్రమే కాదు. టీచర్‌లా పాఠాలు చెబుతోంది. అందుకు అనువైన అప్లికేషన్లు చాలానే ఉన్నాయి. ఆకట్టుకునే బొమ్మలతో పిల్లలు అక్షరాల్ని చదివేలా చేస్తోంది Kids Learn to Read. http://goo.gl/peZjg * ఇంగ్లిష్ రైమ్స్‌ని వినిపించి పిల్లల్ని అలరిస్తోందిNursery Rhymes అప్లికేషన్. కావాల్సిన వాటిని డౌన్‌లోడ్ చేయవచ్చు. రింగ్‌టోన్‌గా సెట్ చేసే వీలుంది కూడా. http://goo.gl/OO70x |
http://www.facebook.com/pages/Electronic-Security-Systems-and-Solar-Products/245701395548462
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి