2012 ఓ డజను ...(Eenadu Tech_27/12/12)
పరిధుల్ని చెరిపేస్తూ... అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయింది. ఆధునిక సౌకర్యాలన్నీ మునివేళ్లపైనే. అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తూ టెక్నాలజీ భిన్నమైన గ్యాడ్జెట్‌లను 2012లో పరిచయం చేసింది. వాటిలో కొన్ని...ఐదుకు చేరింది! మరింత స్లిమ్‌గా రెటీనా డిస్‌ప్లేతో ఐఫోన్ వెర్షన్ మార్చుకుని ఐఫోన్ 5గా మార్కెట్‌లో ప్రవేశించింది. ప్రత్యేకంగా రూపొందించిన A6 చిప్‌ని దీంట్లో వాడారు. ఏ5 చిప్‌తో పోలిస్తే మొబైల్ సీపీయూ సామర్థ్యం, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ రెట్టింపు అయ్యింది. దీంతో బ్యాటరీ ఎక్కువగా ఆదా అవుతుంది. 8 మెగాపిక్సల్ ఐసైట్ కెమెరాని వాడారు. వీడియో, ఇతర వివరాలకు www.apple.com/iphone/41 మెగాపిక్సల్ నోకియా మరో అడుగు ముందుకేసి ఏకంగా 41 మెగాపిక్సల్ కెమెరాతో మొబైల్‌ని ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. Carl Zeiss, PureViewఇమేజింగ్ టెక్నాలజీతో నాణ్యమైన ఫొటోలు తీసుకోవచ్చు. హెచ్‌డీ వీడియోలకైతే కొదవే లేదు. 16 జీబీ ఇన్‌బిల్డ్ మెమొరీ ఉంది. http://goo.gl/Pyvgb రెండూ రెండే! ట్యాబ్లెట్ విప్లవానికి నాంది పలికిన ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేతో మరింత సొగసుగా యాపిల్ ప్రియుల్ని ఆకట్టుకుంది. సుమారు 2,75,000 అప్స్‌ని దీంట్లో వాడుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ. వీడియో ఛాటింగ్ ముందు భాగంలో 1.2 మెగాపిక్సల్, వెనక 5 మెగాపిక్సల్ ఐసైట్ కెమెరాని ఏర్పాటు చేశారు. తెర రిజల్యుషన్ 2048X1536 పిక్సల్స్. * ఇదే ఐప్యాడ్‌ని మరింత తక్కువ పరిమాణంలో 'ఐప్యాడ్ మిని' రూపొందింది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/3Chn9 'కన్ను'కుట్టేలా... D800. నికాన్ కంపెనీ తయారు చేసిన కెమెరా. టెక్ ప్రియుల కన్నుకుట్టేలా ఈ కెమెరా కన్ను మార్కెట్‌లో సందడి చేసింది. 36.3 మెగాపిక్సల్స్ దీని సామర్థ్యం. 7360 * 4912 రిజల్యుషన్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. ఫుల్ హెచ్‌డీ రిజల్యుషన్‌తో వీడియోల చిత్రీకరణ చేయవచ్చు కూడా. 51 పాయింట్ ఆటోఫోకస్ సిస్టం ఉంది. ఇతర వివరాలకు http://goo.gl/GgyWR ఇదే మొదటిది కంప్యూటర్ ప్రాసెసర్ల రూపకర్త ఇంటెల్ మరో కొత్త ప్రయత్నంతో ముందుకొచ్చింది. డ్యుయల్ కోర్ 1Ghzప్రాసెసర్‌తో స్మార్ట్ మొబైల్ ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు XOLO X900. 8 మెగాపిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్, హైక్వాలిటీ తాకేతెరతో ఆకట్టుకుంది. ప్రత్యేక మోడ్‌లో సెకన్‌లో 10 ఫొటోలను తీస్తుంది. మరిన్ని వివరాలకుhttp://goo.gl/oHpri గూగుల్ కళ్లజోడు వీడియోలు తీయాలంటే కెమెరానో, సెల్‌ఫోనో వాడతాం. అందుకు భిన్నంగా గూగుల్ ప్రత్యేక కళ్లజోడుని Project Glassesని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ కళ్లుజోడు మాదిరిగానే దీన్ని ధరించి వీడియోలు, ఫొటోలు తీయవచ్చు. ఉదాహరణకు స్కైడైవింగ్ చేసేవాళ్లు కళ్లజోడు ధరించి రియల్‌టైంలోనే స్ట్రీమింగ్ వీడియో ఫుటేజ్‌ని రికార్డ్ చేయవచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/wlzGy గెలాక్సీ జోరు! శామ్‌సంగ్ కంపెనీ తయారు చేసిన గేలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది జూన్‌లో మార్కెట్‌లోకి వచ్చిన గెలాక్సీ ఎస్3 దక్కిన ఆదరణే అందుకు ఉదాహరణ. 4.8 అంగుళాల తాకేతెర, AMOLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.0 ఓఎస్‌తో టెక్ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఇతర వివరాలకు http://goo.gl/33 Mqn మొత్తం మూడు సెర్చ్ దిగ్గజం గూగుల్ వెబ్ విహారంలోనే కాకుండా గ్యాడ్జెట్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. Nexus పేరుతో మొబైల్, ట్యాబ్లెట్, పోర్టబుల్ ట్యాబ్‌లతో టెక్ ప్రియుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆండ్రాయిడ్ ఎస్‌తో అన్ని గూగుల్ వెబ్ సర్వీసులతో స్మార్ట్ ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. వీడియో ఛాటింగ్‌కి 1.3 మెగాపిక్సల్, వెనక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. 10 అంగుళాల తాకే తెర, హై రిజల్యుషన్ క్వాలిటీతో ట్యాబ్‌ని అందుబాటులోకి తెచ్చింది. మరిన్ని వివరాలకు www.google.com/nexus/ |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి