మాటలు... సందేశాలు... అన్నీ ఉచితం! (Eenadu Mobile tips 05/07/2012)


మాటలు... సందేశాలు... అన్నీ ఉచితం!
మొబైల్‌లో నెట్‌ ఉంటే చాలు... వీడియో కాల్స్‌... వాయిస్‌ కాల్స్‌... మెసేజ్‌లు... అన్నీ ఉచితం! అందుకు ఇవిగో మార్గాలు!!

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉండగానే సరిపోదు. దాన్ని 'సమయోచితం'గా ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియాలి. పైసా ఖర్చు లేకుండానే ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చని తెలుసా? వీడియో కాల్స్‌ కూడా ఉచితంగా పొందవచ్చని తెలుసా? ఇక మెసేజ్‌లైతే ఎన్నయినా పంపుకోవచ్చు. మరి వివరాల్లోకి దూకేద్దామా!ఒకటా రెండా!
ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవాలంటే Nimbuzzతో చాలా సులభం. అప్లికేషన్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక సర్వీసులో సభ్యులవ్వాలి. తర్వాత అందరికీ ఇన్విటేషన్‌ పంపి గ్రూపుగా ఏర్పడాలి. ఇక ఎప్పుడైనా వారికి ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. టెక్ట్స్‌ మెసేజ్‌లు పంపొచ్చు. ఫొటోలు, మ్యూజిక్‌, వీడియో ఫైల్స్‌ని షేర్‌ చేసుకోవచ్చు. ఛాట్‌ రూంల్లో కొత్త స్నేహితులతో కబుర్లు చెప్పొచ్చు. www.nimbuzz.com ఆండ్రాయిడ్‌ యూజర్లు మార్కెట్‌ నుంచి పొందే వీలుంది. http://goo.gl/GFA0a
వీడియో కాల్స్‌ చేసుకోవాలంటే ooVoo ఉంది. 12 మంది స్నేహితులతో ఒకేసారి వీడియో ఛాట్‌ చేయవచ్చు. వీడియో మెసేజ్‌లు పంపొచ్చు. వీడియో కాల్స్‌ని రికార్డు చేసుకోవచ్చు కూడా. వీడియో ఛాట్‌ రూంని పాస్‌వర్డ్‌తో సురక్షితం చేయవచ్చు. www.oovoo.com ఆండ్రాయిడ్‌ యూజర్లకు http://goo.gl/ cvwem
సాధారణ మొబైల్‌లో కూడా వాడుకోవాలంటే rocketalkఉంది. టెక్ట్స్‌ మెసేజ్‌లే కాకుండా వీడియో, ఆడియో, ఫొటో మెసేజ్‌లను పంపవచ్చు. www.rocketalk.com ఆండ్రాయిడ్‌ యూజర్లకి http://goo.gl/LFsgq
పీసీ వినియోగదారులకు Skype గురించి తెలిసిందే. స్మార్ట్‌ మొబైల్‌లో కూడా దీన్ని వాడుకోవచ్చు.http://skype.com
వీడియో ఛాటింగ్‌కి Tango ప్రత్యేకం. వీడియో ఛాట్‌ చేస్తూనే గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్స్‌తో పువ్వులు పంపొచ్చు. లవర్స్‌ లవ్‌ సింబల్స్‌ని తలంబ్రాలుగా పొయవచ్చు. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్‌ ఫోన్‌, పీసీ, ల్యాపీల్లో వాడుకోవచ్చు. www.tango.me
వాయిస్‌ కాల్స్‌ చేసుకునేందుకు మరో మార్గం Viber.ఎన్ని మెసేజ్‌లైనా పంపొచ్చు. సభ్యులవ్వాల్సిన అవసరం కూడా లేదు. http://viber.com
వీడియో ఛాటింగ్‌, వాయిస్‌ కాల్స్‌, టెక్ట్స్‌ మెసేజింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌... అన్నీ ఒకేచోట అందిస్తోంది Voxox. 100 ఎంబీ ఫైల్స్‌ని కూడా పంపగలగడం ప్రత్యేకత.www.voxox.com
వీడియో ఛాటింగ్‌కి మరోటి Fring. నోకియా యూజర్లు ఓవీ స్టోర్‌ నుంచి పొందొచ్చు. ఒకేసారి నలుగురు తెరపై కనిపిస్తూ మాట్లాడుకోవచ్చు. www.fring.com
యాపిల్‌ వినియోగదారులకు Facetime ప్రత్యేకం. ఐట్యూన్స్‌ నుంచి పొందవచ్చు. http://goo.gl/1rZlH
ఛాట్‌ రూం ద్వారా స్నేహితులతో వీడియో ఛాటింగ్‌ చేయాలంటే TinyChat ఉంది. http://tinychat.com
మేసేజ్‌లు మాత్రమే!
బ్లాక్‌బెర్రీ వాడుతుంటే BlackBerry Messenger ప్రత్యేకం. ఎన్నయినా మెసేజ్‌లు పంపొచ్చు. పంపిన మెసేజ్‌ చూశారా లేదో కూడా తెలుసుకోవచ్చు. పిక్చర్‌, వీడియో, వాయిస్‌ మెసేజ్‌లను కూడా పంపొచ్చు. http://goo.gl/AhJfo
అన్ని కంపెనీల డివైజ్‌ల్లోనూ ఇట్టే ఒదిగిపోయి ఛాటింగ్‌ సేవల్ని అందిస్తోంది ChatON. మీరే డ్రాయింగ్‌ చేసి యానిమేషన్‌ ఎఫెక్ట్‌తో మెసేజ్‌లు పంపొచ్చు.http://goo.gl/oZ9nj
ఐఫోన్‌ యూజర్లుకు iMessage ప్రత్యేకం. అంతులేనన్ని మెసేజ్‌లు పంపుకోవచ్చు. http://goo.gl/Zx5rE
సుమారు అన్ని ఓఎస్‌ల్లోనూ పని చేసేలా రూపొందిందేPinch. టెక్ట్స్‌ మెసేజింగ్‌కి ప్రత్యేకం.http://pinchapp.com
రియల్‌ టైం మెసేజింగ్‌తో WhatsApp ఆకట్టుకుంటోంది.www.whatsapp.com
దేశంలో ఎక్కడికైనా!
దేశంలో ఎక్కడికైనా ఉచితంగా మెసేజ్‌లు పంపాలంటేFree2sms App ఉంది. ఇన్‌స్టాల్‌ చేశాక 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి సర్వీసుల్ని ఎంపిక చేసుకోవాలి. లాగిన్‌ అయ్యి కాంటాక్ట్‌ లిస్ట్‌లోని నెంబర్లకు మేసేజ్‌లు పంపొచ్చు.http://goo.gl/rDoxW
ఇలాంటిదే మరోటి Free SMS India. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఉచిత ఎస్‌ఎంఎస్‌ సర్వీసుల్లోకి లాగిన్‌ అయ్యి మెసేజ్‌లు పంపొచ్చు.http://goo.gl/4co00
ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఎంఎంఎస్‌లు పంపాలంటే Go SMS Pro ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మెసేజ్‌లు ఇతరులు చూడకుండా తాళం వేయవచ్చు. SMS Backupతో ముఖ్యమైన మెసేజ్‌లను బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు.http://goo.gl/PCl3w
మీరిచ్చే మెసేజ్‌లు ఇతరల కంటపడకుండా చేయాలంటే NQ Mobile Vault అప్లికేషన్‌ ఉంది. ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని కూడా ఇతరులు చూడకుండా చేసే వీలుంది.http://goo.gl/HX1rz
ప్రత్యేక అప్లికేషన్‌తో మెసేజ్‌లను బ్యాక్‌అప్‌ చేసుకోవాలంటే SMS Backup & Restore ఉంది.http://goo.gl/kBcHT



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)