ట్యాబ్లేట్‌ ఒడి! బుజ్జాయిల బడి!! (Eenadu Tablet tips_26/07/2012)


ట్యాబ్లేట్‌ ఒడి! బుజ్జాయిల బడి!!
ట్యాబ్లెట్‌... పెద్దలకు మాత్రమేనా? పిల్లలకు పలకగా మారిపోయింది! అక్షరాభ్యాసం చేస్తూ అన్నీ నేర్పేస్తోంది! అందుకు అనువైన అప్లికేషన్లు ఎన్నో!!
రాబోయే రోజుల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి స్కూల్‌కి పంపే సమయంలో పలకలు కొనకపోవచ్చు. ఏ ఐప్యాడో, ట్యాబ్లెట్‌ పీసీనో కొంటారేమో. ఔరా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. టెక్‌ మార్కెట్‌లో సందడి చేస్తున్న సరికొత్త ట్యాబ్లెట్లను చూస్తే నిజమే అనిపిస్తుంది. వినోద, వ్యాపార అవసరాలతో పాటు ఇప్పుడు బుడతల దృష్టిని ఆకట్టుకునేలా ఇవి మారుతున్నాయి. బుజ్జాయిల్ని బుజ్జగించే సాఫ్ట్‌వేర్‌లు అనేకం రూపొందుతున్నాయి. అక్షరాలు, పదాల్ని పలు విధాలుగా బోధిస్తున్నాయి. బొమ్మలు గీసే ఛార్ట్‌లుగా మారిపోతున్నాయి. పాఠాలు చెప్పే టీచర్‌లా అవతరిస్తున్నాయి. చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం!దీంతో మొదలు
నర్సరీ స్కూళ్లలోకి అడుగుపెట్టగానే కొన్ని పదాలు వినిపిస్తుంటాయి. A ఫర్‌ యాపిల్‌, B ఫర్‌ బాల్‌, C ఫర్‌ క్యాట్‌... లాంటివి. ఇలా ఇంట్లో కూడా మీ బుజ్జాయికి ఆడుతూ పాడుతూ పదాల్ని నేర్పాలంటే Baby Flashcards for Kids అప్లికేషన్‌ ఉచితంగా లభ్యమవుతోంది. సుమారు 450 హై క్వాలిటీ ఫ్లాష్‌ కార్డ్స్‌ ఉన్నాయి. ఆహార పదార్థాలు, జంతువులు, అక్షరాలు, అంకెలు, రంగులు, ఆకారాలు... ఇంకా చాలానే చూపిస్తూ నేర్పించే వీలుంది. http://goo.gl/j6yBt
ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/PeyS8
రంగులతో ఆటలు
పిల్లలకు రంగుల్ని పరిచయం చేస్తోంది Color Drops Free. సుమారు 100 కలరింగ్‌ పేజీలు ఉన్నాయి. యానిమేషన్స్‌తో బొమ్మలు ఆకట్టుకుంటాయి. యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు.http://goo.gl/MXf33
ఆండ్రాయిడ్‌ యూజర్లకు Color Drops ప్రత్యేకం. ఇదో రంగులతో ఆడుకునే ఆట. http://goo.gl/93tKh
పాటలే పాటలు
పిల్లలకు పాటలు, రైమ్స్‌ చెప్పేస్తానంటూ ముందుకొస్తోందిLittle Fox Music Box. యాపిల్‌ ఐప్యాడ్‌కి ఇది ప్రత్యేకం. ఐట్యూన్స్‌ నుంచి దీన్ని పొందొచ్చు. మెడలో గిటారు తగిలించుకుని నక్క నాట్యం చేస్తూ పాటలు వినిపిస్తుంది.http://goo.gl/XQWpg
కథలు చెబుతానంటూ ముందుకొచ్చింది Kids Storyteller. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ప్రత్యేకం. గూగుల్‌ స్టోర్‌ నుంచి పొందొచ్చు. మొత్తం 23 ఆడియో స్టోరీలు ఉన్నాయి.http://goo.gl/mcPsY
కథలతో పాటు దృశ్యాలు కూడా ఉండాలంటే Zoo Storyఉంది. ఇదో ఆట. అడవిలోని జంతువుల్ని గుర్తిస్తూ వాటితో జంతుప్రదర్శనశాలని రూపొందించాలి.http://goo.gl/iPkT4
చిత్రకారులైపోతారు
పిల్లలకి చిత్రలేఖనంపై ఆసక్తి కలిగించాలంటే Drawing Padఅప్లికేషన్‌ను పొందండి. పలకపై గీచిన మాదిరిగా బొమ్మల్ని గీయవచ్చు. అదనపు కలరింగ్‌ పుస్తకాల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/KgS0b
ఇదే అప్లికేషన్ని యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. http://goo.gl/rkbrg
చేపలతో పాఠాలు
పిల్లలకు చేపల్ని చూస్తే ఆనందం. మరి వాటితోనే అంకెలు, అక్షరాల్ని నేర్పితే! Fish School HD అలాంటిదే. గుర్తుల్ని, రంగుల్ని చేపలతోనే చెప్పించొచ్చు.http://goo.gl/gMg4s
జంతువుల్ని ఇష్టపడని పిల్లలు ఉంటారా చెప్పండి. అందుకే Zoola Free animal Sounds Game వారికి ప్రత్యేకం. ఇన్‌స్టాల్‌ చేయగానే తెరపై కనపించే బొమ్మల్ని తాకితే చాలు యానిమేట్‌ అవుతూ అలరిస్తాయి. అవి చేసే శబ్దాల్ని కూడా వినొచ్చు. http://goo.gl/bSw6L
ఇలాంటిదే మరోటి Learn Animal Sounds Game Free. జంతువులు, వాటి అరుపుల్ని పిల్లలకు వినిపించొచ్చు. స్మార్ట్‌ మొబైళ్లలో కూడా వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకునే వీలుంది. http://goo.gl/nhFzY
పెంపుడు 'పప్పీ'
పెంపుడు జంతువులంటే పిల్లలకు సరదా! అందుకనే ట్యాబ్‌లోనే బుజ్జి కుక్క పిల్లని పెంచే అవకాశాన్ని కల్పిస్తోంది Pet Puppy. దీంతో ఆడుకోవడమే కాదు తెరపై కనిపించే వీధుల్లో తిప్పొచ్చు. తిండిపెడుతూ ఆరోగ్యంగా చూసుకోవచ్చు. http://goo.gl/0SNmF
అక్షరాలు, పదాల్ని ఎలా పలకాలో నేర్పిస్తోంది Kids ABC Phonicshttp://goo.gl/ki4CF
బుర్రకి పదును
ఎంతసేపూ బొమ్మలు, పాఠాలు, పాటలేనా? బుర్రకి పదనుపెట్టే పజిళ్లు లేవా? అవి కూడా చాలానే ఉన్నాయి. వాటిల్లో Kids preschool Puzzle Lite ఒకటి. ఆకారాల్ని గుర్తించడం ద్వారా ఆవేంటో చెప్పేలా అప్లికేషన్‌ రూపొందించారు.http://goo.gl/8UM1T
జంతువుల్ని గుర్తిస్తూ ఆట ఆడుకోవాలంటే Kids Puzzleఉంది. http://goo.gl/h8yk5
గణితం నేర్చుకోవాలంటే Kids Numbers and math పొందండి. పెద్ద, చిన్న అంకెల్ని గురించేలా చేయవచ్చు.http://goo.gl/Nq6P1
మరికొన్ని...
చుక్కల్ని కలుపుతూ బొమ్మలు గీసేలా చేసేదే Kids Connect The Dots, http://goo.gl/9Zr3p
యాపిల్‌ ఐప్యాడ్‌లో త్రీడీ అట్లాస్‌ కావాలంటే Barefoot World Atlas పొందండి. భూమిని బంతిలా తిప్పుతూ చూడవచ్చు. http://goo.gl/WZfa3
పదాల స్పెల్లింగ్‌లను గుర్తిస్తూ ఆడే పజిల్‌ Bookwormదీన్ని ఐట్యూన్స్‌ని నుంచి పొందొచ్చు. http://goo.gl/nfl7u

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)