భవిష్యత్తులో ఫోన్‌ కాల్స్‌ ఉచితం! (Eenadu_News)


కంపెనీల వ్యూహం మారితే సాధ్యమే: మంత్రి సిబల్‌
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు క్రమంగా స్వరాధార ఆదాయ వ్యూహాన్ని విడిచిపెట్టాలని టెలికాం శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ కోరారు. భవిష్యత్తులో కంపెనీలు డేటా సేవలకు మాత్రమే రుసుము వసూలు చేయాలని.. ఫోన్‌ కాల్స్‌పై ఛార్జీలు ఉండకూడదని అన్నారు. 'ప్రస్తుతం ఆదాయం కోసం కంపెనీలు స్వరాధార సేవలపై ఆధారపడుతున్నాయి. స్వరాధార సేవలకు బదులు డేటా సేవల ఆదాయం వైపు అడుగులు వేయడానికి కంపెనీలు నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు ఇది తగిన సమయ'మని అన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌పై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పరిశ్రమ ఆలోచన ధోరణి మారాలని సూచించారు. డేటా సేవల ఆదాయ వ్యూహాన్ని కంపెనీలు అవలంబిస్తే.. భవిష్యత్తులో ఒకరితో మరొకరు ఉచితంగానే మాట్లాడుకోవచ్చు. ఎటువంటి టారిఫ్‌లు ఉండవన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ప్రజలకు కీలకమైన అవసరం. అది ప్రజలకు ఏ విధంగా సాధికారికత కల్పిస్తుందో చూడాలని మంత్రి అన్నారు. వివిధ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం దాదాపు రూ.35 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)