టెక్నాలజీతో... కాలానికి కళ్లెం! (Eenadu_18/10/12)

ఉరుకుల పరుగుల జీవితం... రెండు చేతులు చాలనంత వేగం... ఈ నేపథ్యంలో సాంకేతికత తెలిస్తే... చిటికెలో పనులు చక్కబెట్టవచ్చు!
భుజానికో ల్యాప్‌టాప్‌ బ్యాగు... చేతిలో ట్యాబ్లెట్‌... జేబులో మొబైల్‌... అన్నీ ఉంటాయి. కానీ, రోజు గడిచి ఇంటికొచ్చాక 'ఏంటో ఎంత ట్రై చేసినా రోజులో చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి!' అనుకునే కోవలోకి మీరు వస్తారా? అయితే, మీరు టెక్నాలజీని సరిగా వాడుకోవట్లేదన్నమాట. ఉన్న గ్యాడ్జెట్స్‌్‌ సాయంతో మరింత సులువుగా పనులు చేసుకోవాలంటే కొన్ని కిటుకులు తెలియాలి.వెంటే వెబ్‌ సర్వీసులు
రోజులో ఏయే పనులకు ఎంత సమయం కేటాయిస్తున్నామో, ఎక్కడ సమయం వృథా అవుతోందో లాంటి వివరాలను విశ్లేషించుకోవాంటేwww.toggl.com లోకి వెళ్లాలి. ఈ టైం ట్రాకింగ్‌ సర్వీసును పీసీ, మ్యాక్‌, మొబైల్‌, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. దీంట్లో సభ్యులై చేయాల్సిన పనుల్ని జాబితా పెట్టుకుని వాటిపై ఎంతెంత సమయం కేటాయిస్తున్నామో ట్రాక్‌ చేయవచ్చు.
వేర్వేరు సోషల్‌ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్‌ చేయాలంటే అందుకు ఓ వేదిక సిద్ధంగా ఉంది. అదేhttp://hootsuite.com.దీంట్లో సభ్యులై ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌.. ఎకౌంట్‌లను మేనేజ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు.
చేయాల్సిన పనుల్ని, సన్నిహితుల పుట్టినరోజుల్ని గుర్తుపెట్టుకోవాలంటే http://10boxes.comలో సభ్యులైపోండి. ఇదో వ్యక్తిగత ఆన్‌లైన్‌ క్యాలెండర్‌. ముఖ్యమైన ఈవెంట్స్‌ని సెట్‌ చేస్తే ఎప్పటికప్పుడు రిమైండ్‌ చేస్తుంది. నెట్‌వర్క్‌గా ఏర్పడి ముఖ్యమైన ఈవెంట్స్‌ని ఇతరులకూ గుర్తు చేయవచ్చు.
అండగా అప్లికేషన్లు!
సాఫ్ట్‌వేర్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని పనుల్ని క్రమపద్ధతిలో పూర్తి చేసుకోడానికి 'ఎవర్‌నోట్‌' ప్రత్యేకం. బ్రౌజింగ్‌లో తారసపడే ఆసక్తికరమైన అంశాల్ని దీంట్లో స్టోర్‌ చేసుకోవచ్చు. http://evernote.com
చేయాల్సిన పనుల్ని గుర్తు చూస్తూ పర్సనల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తానంటోందిwww.wunderlist.com.ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ వివరాలతో లాగిన్‌ అవ్వొచ్చు.
మొబైల్‌నే స్కానర్‌గా మార్చేసి ముఖ్యమైన బిల్లులు, పత్రాల్ని డిజిటల్‌గా మార్చాలంటేCamScannerగురించి తెలుసుకోవాల్సిందే. గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసి కావాల్సిన బిల్లుల్ని ఫొటో తీయగానే ఆటోమాటిక్‌గా క్రాప్‌ చేస్తుంది. పీడీఎఫ్‌ ఫైల్‌గా మార్చేస్తుంది. వాటిని అప్లికేషన్‌ నుంచే మెయిల్‌ చేయవచ్చు. క్లౌడ్‌ స్టోరేజ్‌లో ఫైల్స్‌ని భద్రం చేయవచ్చు. http://goo.gl/JqRQY
మీ మెయిల్‌కి వచ్చిన Docx ఫైళ్లను రివ్యూ చేయాల్సివస్తే పీసీ కోసమో, ఎమ్మెస్‌ ఆఫీస్‌ కోసమో వెతుక్కుంటూ టైం వేస్ట్‌ చేయక్కర్లేదు. అందుకుOfficeSuite Viewer 6 ఇన్‌స్టాల్‌ చేస్తే సరి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/8ff2X
మరికొన్ని...
రోజువారీ షెడ్యూల్స్‌ని ఆన్‌లైన్‌లో సులభంగా మేనేజ్‌ చేసుకోవాలంటే www.doogle.comలో సభ్యులైపోండి.
ఏదైనా వెబ్‌ సర్వీసు గురించి తెలుసుకోవాలంటేwww.cruxbot.comలోకి వెళ్లండి.
ఎక్కువ పరిమాణంలో ఉన్న ఇమేజ్‌ని క్రాప్‌ చేయాలంటే http://cropp.meసైట్‌ని ఓపెన్‌ చేయండి.
అవసరం మేరకు కావాల్సిన ఐకాన్లు, ఇతర గుర్తులు కావాలనుకుంటే వాటిని డిజైన్‌ చేసి సమయం వృథా చేయకుండా http://iconmonstr.com లోకి వెళ్లండి.
ఎక్కువ మెమొరీ ఉన్న ఫొటోలను కంప్రెస్‌ చేసి తగ్గించాలంటే www.punypng.comవెబ్‌సర్వీసుతో చిటికెలో సాధ్యం.
ఇమేజ్‌ నాణ్యత తగ్గకుండా jpgఫైల్‌ని కంప్రెస్‌ చేయాలంటే www.jpegmini.comఉంది.
ఇవేమో గ్యాడ్జెట్‌లు!
ద్యోగ రీత్యా ఎక్కువగా పేపర్‌ వర్క్‌ చేస్తుంటారా? రాసిన డాక్యుమెంట్‌లను కంప్యూటర్‌లోకి అప్‌లోడ్‌ చేయాలా? అయితే, రెండు పనుల్నీ ఒకేసారి పూర్తి చేయవచ్చు! అందుకో ప్రత్యేక డివైజ్‌ ఉంది. అదేBoogie Board Rip.ఎల్‌సీడీ ఈ-రైటర్‌గా దీన్ని పిలుస్తున్నారు. ట్యాబ్లెట్‌గా కనిపించే దీని ఎల్‌సీడీ తెర పరిమాణం 9.5 అంగుళాలు. స్త్టెలస్‌తో పేపర్‌పైన రాసినట్టే నోట్స్‌ రాయవచ్చు. నిమిషాల్లో కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి మొత్తం డాక్యుమెంట్స్‌ని డిజిటల్‌గా మార్చేయవచ్చు. ఒక్కసారి పీసీ ఫార్మెట్‌లోకి మార్చుకున్నాక ఇక సిస్టంపైనే ఎడిట్‌ చేసుకోవచ్చు. తెరపై నోట్స్‌ పూర్తవ్వగానే బటన్‌పై నొక్కి పీడీఎఫ్‌ ఫార్మెట్‌లో సేవ్‌ చేయవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో రైటర్‌ని పీసీని కనెక్ట్‌ చేయవచ్చు. బృంద చర్చల్లో పాల్గొన్నప్పుడు ముఖ్యమైన విషయాల్ని నోట్స్‌ రాసుకుని చిటికెలో వాటిని పీసీ ఫైల్‌గా అందరికీ పంపొచ్చు. చిత్రకారులకూ ఇది ఉపయోగమే. ధర సుమారు రూ.6,290. వివరాలకు http://goo.gl/ov7s6రాసేది ఏదైనా సరే అప్పటికప్పుడు రికార్డు చేసే పెన్ను కావాలా? రికార్డు చేయడమే కాదు కావాలంటే ఆడియో రూపంలో చదివి వినిపిస్తుంది కూడా. అదే LiveScribe Echo పెన్ను. దీంతో రాశాక సిస్టంకి కనెక్ట్‌ చేసి రికార్డ్‌ చేసిన సమాచారాన్ని కాపీ చేసుకోవచ్చు. పెన్నుకి ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని వినొచ్చు కూడా. ధర సుమారు రూ.11,990.http://goo.gl/pXpTm
వినూత్నమైన ఛార్జింగ్‌ సౌకర్యం కావాలంటేPortronics Charger X గురించి తెలుసుకోవాల్సిందే. ఇదో పోర్టబుల్‌ ఛార్జర్‌. దీని సాయంతో మొబైల్‌, ట్యాబ్‌, ఎంపీ3 ప్లేయర్‌... లాంటి వాటిని ఛార్జ్‌ చేయవచ్చు. ఒకేసారి రెండు పరికరాల్ని ఛార్జ్‌ చేయవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 5600mAh. ధర సుమారు రూ.2,999.http://goo.gl/xOsvB

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)