Eenadu Thursday (07-07-11)
వీడియోలు మార్చేయండి... హాయిగా చూసేయండి! ఐప్యాడ్... మొబైల్... ట్యాబ్లెట్... బోలెడు పరికరాలు... వీటికి అనుగుణంగా... వీడియోలు మార్చుకోవడం ఎలా? ఉచిత కన్వర్టర్లు సిద్ధంగా ఉన్నాయి! ఇవిగో వాటి వివరాలు...
ఐప్యాడ్, ఐఫోన్, ఐపాడ్... వాడుతున్నవారి కోసం Aleesoft Free iPad Video Converter. ప్రొఫైల్ మెనూలో కనిపించే వివిధ ఫార్మెట్లలో కావలసినదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆపై New Taskతో వీడియో ఫైల్‌ని అప్‌లోడ్ చేయాలి. పక్కనే ఉన్న Convert ద్వారా ఫార్మెట్ మార్చుకోవచ్చు. ఎక్కువ మెమొరీతో ఉన్న ఫైల్‌ని Splitతో విడి భాగాలుగా మార్చుకునే వీలుంది కూడా. http://goo.gl/NdBEq
ఇదో స్డుడియో!
ఏ పరికరం వాడుతున్నా కావాల్సిన ఫార్మెట్‌లోకి వీడియోలను మార్చుకునేందుకు అనువుగా రూపొందించిందే Free Studio. ఎనిమిది విభాగాలుగా ఉన్న మెనూ ద్వారా ఆడియో, వీడియో ఫైల్స్‌ని మార్చుకోవచ్చు. MP3 & Audio, DVD & Video, Photo & Images లాంటి విభాగాలున్నాయి. యూట్యూబ్ వీడియోలను అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేయడానికి YOUTUBE ఉంది. దీని ద్వారా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఫార్మెట్ మార్చుకునే వీలుంది. అలాగే మొబైల్స్ మోడల్స్ కూడా ఎంచుకోవచ్చు. సీడీ, డీవీడీలపై డేటాని కూడా రైట్ చేసుకోవచ్చు. 3D ఫొటో, వీడియో ఆల్బమ్‌లను క్రియేట్ చేయవచ్చు. http://goo.gl/9mKek
* ఆండ్రాయిడ్ ఓఎస్‌లకు అనువుగా వీడియోలను మార్చుకోవాలంటే Free Video to Android Converterను పొందండి. http://goo.gl/Ca7VY
మరింత సులభం
డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో వీడియోలను మార్చుకోవాలంటే Hamster Free video Converter ఉంది. సుమారు 200 కంటే ఎక్కువ డివైజ్‌లకు సరిపడే ఫార్మెట్‌లను 40 భాషల్లో అందిస్తున్నారు. వీడియో ఫైల్‌ను డ్రాగ్ చేసి Editట్యాబ్‌లో ఫార్మెట్‌ను ఎంచుకుంటే సరి. http://goo.gl/zGwG9
దేనికదే ప్రత్యేకం
ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా వీడియోలు మార్చుకోడానికి Videora కన్వర్టర్లు ఉన్నాయి. నోకియా ఎన్97 వాడుతున్నట్లయితే దానికి సంబంధించిన కన్వర్టర్‌ని మాత్రమే పొందవచ్చున్నమాట. ఇలా యాపిల్, సోనీ, బ్లాక్‌బెర్రీ, హెచ్‌టీసీ, మైక్రోసాఫ్ట్, ఎల్‌జీ, శామ్‌సంగ్, మోటరోలా, సోనీఎరిక్సన్ లాంటి వివిధ పరికరాలకు వేర్వేరు కన్వర్టర్‌లు ఉన్నాయి. http://goo.gl/jPBwL
'క్విక్'గా చేయాలంటే?
హోం పేజీ నుంచే గుర్తుల ఆధారంగా ఫార్మెట్‌ను మార్చేలా అందుబాటులోకి వచ్చిందే Quick Media Converter HD. వాడే ఫోన్ గుర్తుపై క్లిక్ చేసి వీడియోలను మార్చుకోవచ్చు. వీడియోలను హై డెఫినెషన్ ఫార్మెట్‌లోకి మార్చుకోవచ్చు. Expert Modeతో వీడియో, ఆడియో ఫైల్స్‌ను నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. WebCam ద్వారా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. www.cocoonsoftware.com
చిటికెలో ఒదిగిపోతుంది
Miro Video Converter కూడా ఇలాంటిదే. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ రూపొందించింది. www.mirovideoconverter.com
* మీడియో కోడర్, http://goo.gl/SVtgH
*మ్యాక్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిందే Handbreak, http://handbrake.fr
మీ పాస్‌వర్డ్ పదిలమేనా? నెట్‌లో ఎన్నో సర్వీసులు వాడుతుంటాం. ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం. అన్నింటికీ లాగిన్ తాళాలు తప్పని సరి. మరి, మీ పాస్‌వర్డ్‌లు పదిలమేనా? ఇవిగో తగిన జాగ్రత్తలు...
* నిఘంటువులోని పదాల్ని వాడకుంటే మంచిది. అంకెలు, గుర్తులూ కూడా ఉండాలి.
* లాగిన్ వివరాల్ని పంచుకోకూడదు. ఒకవేళ అవసరం మేరకు చెప్పినా వెంటనే పాస్‌వర్డ్‌ని మార్చేయాలి.
* సభ్యులైన ఆయా సర్వీసుల్లోని డీఫాల్ట్ పాస్‌వర్డ్‌లను వాడ కూడదు. కొన్ని సర్వీసుల్లో యూజర్‌నేమ్‌ను మార్చేలేకపోయినప్పటికీ పాస్‌వర్డ్‌తోని నచ్చినట్టుగా మార్చుకునే వీలుంది.
* తరచూ పాస్‌వర్డ్‌లను మార్పు చేయడం మంచిది. ఎక్కువ కాలంగా వాడని సర్వీసుల లాగిన్ వివరాల్ని 'రీసెట్ పాస్‌వర్డ్'తో తిరిగి పెట్టుకోండి.
* ఆన్‌లైన్ గేమింగ్ సర్వీసుల్లో వ్యక్తిగత మెయిల్ పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే గేమింగ్ సర్వీసుల్లో అన్నీ విశ్వసనీయమైనవే అని చెప్పలేం.
* లింక్ రూపంలో మీ లాగిన్ వివరాల్ని కోరుతూ వచ్చిన మెయిల్స్‌కి స్పందించకండి. ఇలాంటి వాటిని 'ఫిషింగ్ స్కామ్స్' అంటారు. పాస్‌వర్డ్ వివరాలతో సైన్‌ఇన్ అవ్వాల్సిన అన్ని వెబ్ సర్వీసుల్ని అడ్రస్‌బార్‌లో టైప్ చేసి ఓపెన్ చేయడం మంచిది. లేదా బుక్‌మార్క్ చేసుకుని ఓపెన్ చేయాలి.
* హోటళ్లు, ఇంటర్నెట్ సెంటర్లలోని కంప్యూటర్లను వాడేప్పుడు లాగిన్ వివరాల్ని కోరే సర్వీసుల్లోకి వెళ్లడం సురక్షితం కాదు. స్పైవేర్, కీలాగ్స్‌తో హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను తెలుసుకునే వీలుంది.
* మీరు వాడుతున్న పాస్‌వర్డ్ ఎంత క్లిష్టమైనదో తెలుసుకోవడానికి 'పాస్‌వర్డ్ చెకర్స్'ని వాడండి. 'మైక్రోసాఫ్ట్ పాస్‌వర్డ్ చెకర్'లోకి వెళ్లి తెలుసుకునే వీలుంది. బాక్స్‌లో పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయగానే Weak, Medium, Strong అని బార్‌పై చూపిస్తుంది. http://goo.gl/fMFTD ఇలాంటిదే మరోటి The Password Meter. స్కోరు, ఇతర వివరాలతో క్లిష్టతను తెలియజేస్తుంది.
|
|
|
పీసీ వేగం పెంచే చిట్కాలివిగో!
పీసీ నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్ కావచ్చు. కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో 'పీసీ వేగాన్ని పెంచే చిట్కాలు, సాఫ్ట్‌వేర్‌లు ఏవి?' అని అడిగిన ప్రశ్నకు పాఠకులు విశేషంగా స్పందించి చక్కని చిట్కాలందించారు.
సీ,డీ,ఈ,ఎఫ్ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు క్లీన్, డీఫ్రాగ్మెంటేషన్ చేయడం ద్వారా పీసీ వేగాన్ని కొంతమేర పెంచొచ్చు. అందుకు MyComputer-> Drive-> Right Click-> Properties-> Tools-> Defragment Now క్లిక్ చేయాలి. ** టెంపరరీ ఫైల్స్ తీసేయాలంటే Start-> Runలోకి వెళ్లి %temp% టైప్ చేసి ఓకే చేయండి. వచ్చిన విండోలోని టెంపరరీ ఫైల్స్‌ని డిలీట్ చేయండి. ** స్టార్ట్‌అప్‌లో అక్కర్లేని పొగ్రాంలను డిసేబుల్ చేయవచ్చు. అందుకు రన్‌లోకి వెళ్లి msconfig టైప్ చేసి ఎంటర్ నొక్కండి. వచ్చిన విండోలోని 'స్టార్ట్‌అప్' ట్యాబ్‌లోకి వెళ్లి అక్కర్లేని ప్రొగ్రాంలను అన్‌చెక్ చేసి సిస్టంని రీస్టార్ట్ చేయండి. ** 'ట్యూన్‌అప్ యుటిలిటీస్' సాఫ్ట్‌వేర్‌లో సిస్టం సామర్థాన్ని పెంచే సదుపాయాలు ఉన్నాయి. http://goo.gl/RC4Xm నుంచి ఉచితంగా పొందండి. **StartUp Manager టూల్‌తో స్టార్ట్‌అప్‌లోని అప్లికేషన్లను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. http://goo.gl/x0tKd
- ఎన్.కిరణ్‌కుమార్, అనంతపురం
ఇవి ప్రత్యేకం ప్రత్యేక కమాండ్స్ ద్వారా అక్కర్లేని వాటిని తొలగించడం కష్టంగా ఉంటే 'యుటిలిటీ టూల్స్'ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. వాటిలో కొన్ని... ** స్పీడ్‌అప్ మై కంప్యూటర్, www.speedmycomputer.net** దాగివున్న స్పైవేర్‌లను తొలగించేదే SpeedUpMyPC 2011,http://goo.gl/mGaWT** ఇలాంటిదే మరొటి SpeedItUp, www.speeditupfree.com** అన్ని యుటిలిటీ సౌకర్యాల్ని అందించే మరో టూల్ Glary Utilities, http://goo.gl/5XitR (మరిన్ని సాఫ్ట్‌వేర్‌లు, చిట్కాల సైట్‌లకు ఈనాడు.నెట్ చూడండి).
- ఎం.ఫణింద్ర సాయి రెడ్డి, అనంతపూర్
ఇలా చేయండి! 'డిస్క్ క్లీన్‌అప్' గురించి తెలుసా? ఎలాంటి అదనపు టూల్స్ అక్కర్లేకుండానే అనవసరమైన ఫైల్స్, షార్ట్‌కట్‌లు, invalid keys, Temporary internet files, Recycle bin files, setup logs, error logsని తొలగించేస్తుంది. దీన్ని రన్ చేయాలంటే Start-> Programs-> Accessories-> System Tools-> Disk CleanUp క్లిక్ చేయండి. ** అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అందుకు సిస్టంలోనే Add/Remove సిద్ధంగా ఉంది. Start-> Settings-> Control Panel-> Add or Remove Programs క్లిక్ చేసి అక్కర్లేని వాటిని తొలగించాలి. ** యాంటీ వైరస్‌లను అప్‌డేట్ చేయాలి. ఉచితంగా అందుబాటులో ఉన్న యాంటీ వైరస్‌లు కొన్ని... Avast, www.avast.com, Avira, www.avira.com/en/avira-free-antivirus, Avg, http://goo.gl/WcNL7**Comodo System Cleanerతో క్లీన్ చేయవచ్చు. http://system-cleaner.co modo.com ** టెంపరరీ ఫైల్స్‌ని మాన్యువల్‌గా తొలగించడం కష్టం అయితే Temp File Cleaner నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/onLyx (మరిన్ని సూచనలకు ఈనాడు.నెట్)
- వై.శ్రీహర్ష, హైదరాబాద్
తప్పక పాటించాలి ** డెస్క్‌టాప్‌పై తక్కువ ఐకాన్లు ఉంచాలి. ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్ పెట్టడం మంచిది కాదు. **CCleaner, Zappit System Cleaner, SS Disk Cleaner టూల్స్‌తో అనవసరమైన ఫైల్స్‌ని తొలగించవచ్చు. http://goo.gl/msJHK, http://zappit.net, www.ss-tools.com/disk-cleaner/** ఓఎస్ ఒరిజినల్ వాడితే మంచిది. ** పీసీ వేగాన్ని పెంచే మరికొన్ని టూల్స్... Windows Power Tools- http://goo.gl/EUuhg, Disk Space Recovery Wizard- http://goo.gl/0buki
- ఎస్.లావణ్య, మహబూబ్‌నగర్
మైక్రోసాఫ్ట్ టూల్స్ వైరస్‌లు, స్పైవేర్‌లను తొలగించేందుకు Microsoft Safety Scanner నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/6KH54** మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్‌తో రక్షణ వలయం ఏర్పాటు చేయవచ్చు. ఒరిజినల్ ఓఎస్ అయితే ఉచితంగా డౌన్‌లోడ్ చేసి వాడుకోవచ్చు. http://goo.gl/pUoLt
- పి.హర్షిత, వైజాగ్
ముచ్చటగా మూడు రిజిస్ట్రీని క్లీన్ చేసి విండోస్ ఎర్రర్స్‌ని ఫిక్స్ చేయాలంటే 'ఎన్‌క్లీనర్' ఉండాల్సిందే. nCleaner, http://goo.gl/sQGdW ** ఇలాంటివే మరో రెండు.. Slim Cleaner, http://goo.gl/lm62YTweaknow, http://goo.gl/JkqLe
- అరుణ్, కోడిగూడెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి