Eenadu Thursday (30-06-11)
సరికొత్త సౌకర్యాల 'యాహూ'! యాహూ మెయిల్ కొత్త వెర్షన్... సరికొత్త హంగులతో అలరిస్తోంది... మెయిల్ వేగం పెరిగింది... రక్షణ అదిరింది హద్దుల్లేని స్టోరేజ్... సులభమైన ఇంటర్ఫేస్ అప్లికేషన్లు అదనం.. ఫోల్డర్లు ప్రత్యేకం సోషల్ నెట్‌వర్క్ అప్‌డేట్స్... ఇలా ఎన్నో!
ఈమెయిల్‌కి జవాబివ్వడానికి 'రిప్త్లె' క్లిక్ చేయక్కర్లేదు. సోషల్ నెట్‌వర్క్‌ల్లో స్క్రాప్‌లకు ఇచ్చే మాదిరిగా జావాబు పంపేయవచ్చు. మెయిల్ కిందే రిప్త్లె బాక్స్‌ని ఏర్పాటు చేశారు. దాంట్లో టైప్ చేసి 'సెండ్' చేస్తే సరి. * కాంటాక్ట్‌లు, అప్‌డేట్స్, ఇతర అప్లికేషన్స్‌ని ట్యాబ్ విండోల్లో ఓపెన్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు Sent ఫోల్డర్‌ను ఓపెన్ చేస్తే బ్రౌజర్‌లో మాదిరిగా కొత్త ట్యాబ్‌లో వస్తుంది. * కొత్తగా ఇన్‌బాక్స్‌కు చేరిన మెయిల్స్‌ని చూసేందుకు Check for new emails బటన్‌ను ఏర్పాటు చేశారు. అదే ఇన్‌బాక్స్ పక్కన కనిపించే బాణం గుర్తు. దానిపై క్లిక్ చేస్తే ఇన్‌బాక్స్ అప్‌డేట్ అవుతుంది. * మెయిల్ అడ్రస్‌లను మెనేజ్ చేయడానికి Contacts ట్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కాంటాక్ట్స్‌ని ఇంపోర్ట్ చేశాక Fix Duplicate Entries బటన్‌తో ఒకటికంటే ఎక్కువ సార్లు అడ్రస్‌ల్లో చేరిన డుప్లికేట్ ఐడీలను తొలగించే వీలుంది.
సోషల్ నెట్‌వర్క్‌లు
ఇన్‌బాక్స్ నుంచే సోషల్ నెట్‌వర్క్ అప్‌డేట్స్ పొందడానికి వీలుగా My Social Networks ఏర్పాటు చేశారు. మెనూపై క్లిక్ చేస్తే వచ్చే కొత్త ట్యాబ్ ద్వారా Sobees సోషల్ నెట్‌వర్క్ ఇంటర్ఫేస్‌తో ఫేస్‌బుక్, ట్విట్టర్, మైస్పేస్, లింక్డ్‌ఇన్ ఫ్రెండ్‌ఫీడ్... నెట్‌వర్క్‌లను పొందవచ్చు. సెర్చ్‌బాక్స్‌తో నెట్‌వర్క్‌ల్లోని అప్‌డేట్స్‌ని వెతకొచ్చు కూడా. Update Statusతో ఒకేసారి అన్ని సోషల్ నెట్‌వర్క్‌ల్లోని స్టేటస్‌ను మార్చే వీలుంది.
అక్కడే అప్లికేషన్లు
మెయిల్‌లోనే ఆన్‌లైన్ సర్వీసుల్ని అప్లికేషన్ల రూపంలో పొందొచ్చు. సెట్టింగ్స్‌పై క్లిక్ చేస్తే అప్లికేషన్ల గ్యాలరీ ఓపెన్ అవుతుంది. * ఆన్‌లైన్ కొనుగోళ్లకు All my Purchases ఉంది. Add ద్వారా ఇన్‌బాక్స్‌లోనే సర్వీసుని నిక్షిప్తం చేసుకోవచ్చు. * ఫొటోలను మెయిల్‌లోనే ఎడిట్ చేయాలంటే గ్యాలరీలోని Picnikను యాడ్ చేసుకోండి. * ఫొటో ఫేరింగ్ సర్వీసు ఫ్లిక్కర్‌ని కూడా పొందే వీలుంది. * రంగు గంగుల ఫాంట్‌లతో సందేశాలు పంపడానికి My Cool Fonts ఉంది. వాటితో కంపోజ్ చేసి Create email క్లిక్ చేస్తే సరి. * My Photosతో అల్బమ్‌లు తయారు చేసి పంచుకోవచ్చు.
మరింత ఆకర్షణీయం
శుభాకాంక్షలు పంపాలంటే కార్డ్ డిజైనింగ్ సర్వీసుల కోసం వెతుక్కోకుండా Stationery ఏర్పాటు చేశారు. ఇందులోకి వెళ్లి నచ్చిన డిజైన్‌పై క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్‌లో కంపోజ్ మెయిల్ ఓపెన్ అవుతుంది. టెక్ట్స్ టైప్ చేసి Send చేయడమే. సందర్భాన్ని బట్టి డిజైన్ల ఎంచుకునేలా Abstract, Animals, Flowers, Fun, Holidays, Events, Nature, Sports... విభాగాలు ఉన్నాయి.
ఫైల్ పెద్దదైనా!
ఎక్కువ మెమొరీ ఫైల్స్‌ని మెయిల్‌లో పంపడానికి Attach Large Files అప్లికేషన్ ఉంది. Yousendit ఆధారంగా ఇది పని చేస్తుంది. యాహూ ఐడీతో సైన్‌ఇన్ అయ్యి Select filesతో ఎంచుకోవాలి. ఉచిత వెర్షన్‌లో 100 ఎంబీ ఫైల్స్ పంపే వీలుంది. ప్రీమియం వెర్షన్ తీసుకుంటే 2 జీబీ ఫైల్స్‌ని కూడా పంపేయవచ్చు. * 'నోట్‌ప్యాడ్'తో బ్రౌజింగ్‌లో తారసపడిన ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్ విండోలో యాహూ నోట్‌ప్యాడ్ ఓపెన్ అవుతుంది. Add Noteతో నోట్స్ టైప్ చేసుకోవచ్చు. ప్రత్యేక ఫోల్డర్లను క్రియేట్ చేసుకుని ఫైల్స్‌ని విభజించవచ్చు. ఎక్కడైనా వాటిని పొందే వీలుంది.
స్త్లెడ్ షో ఉంది
ఎటాచ్‌మెంట్ రూపంలో వచ్చిన ఫొటోలను మెయిల్‌లోనే స్త్లెడ్‌షోలో చూసేలా View Slide Show ఏర్పాటు చేశారు. కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. *
సుమారు 700 మిలియన్ల సభ్యులున్న ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి ఇదో కాపలా. మాలిషియస్ లింక్స్, వైరస్‌లను ఇట్టే పట్టేస్తుంది. ఫిషింగ్, స్పాం డేటాని స్కాన్ చేసి అప్రమత్తం చేస్తుంది. వాల్‌పై పోస్ట్ చేసే పోస్టింగ్‌లను స్కాన్ చేస్తుంది. ఈ నిఘాని పొందాలంటే www.mypagekeeper.orgలోకి వెళ్లాలి. అంతకంటే ముందే ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే Go to App ద్వారా వచ్చే పేజీలో Add MyPageKeeper-> Allowను ఎంపిక చేసుకోవాలి. వెంటనే News Feed, Wall posts, Spamming Apps స్కాన్ చేసి స్టేటస్‌ని పచ్చ రంగులో You are Secure అని చూపిస్తుంది.
సైట్‌కి రక్షణ
ప్రతి రోజూ కనీసం 600 సైట్లు హ్యాకర్ల దాడులకు గురవుతున్నాయని 'స్టాప్‌దిహ్యాకర్' నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాదు Protect your Website, Protect your Reputation అంటూ ఉచిత రక్షణ అందిస్తున్నారు. అందుకు చేయాల్సిందల్లా www.stopt hehacker.comలో సభ్యులవడమే. Sign Up Now క్లిక్ చేసి మీ సైట్ పేరు, ఈమెయిల్‌తో రిజిస్టర్ చేస్తే ప్రతి రోజూ గమనిస్తూ Google Safe Browsing List పంపుతుంది. మీ సైట్ 'బ్లాక్‌లిస్ట్'లో చేరితే మెయిల్ ద్వారా అప్రమత్తం చేస్తుంది.
టీవీ చూస్తారా?: టీవీలో ఏదైనా మంచి కార్యక్రమాన్ని చూడలేకపోయారా? అయితే, www.n yootv.comలోకి వెళ్లండి. విభాగాల వారీగా కార్యక్రమాల జాబితా కనిపిస్తుంది. కావలసినదేదో చూసేయడమే! |
వారికి ప్రత్యేకం: విద్యార్థుల కోసం రూపొందిన సెర్చ్ ఇంజన్ www.sweetsearch.com. ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమాచారం, ఇతర పాఠ్యాంశాలపై వివరణ పొందొచ్చు. Sweetsearch2Day, School Librarians, Sweet sites, Social Studies... సెర్చ్ లింక్స్‌ను అందిస్తున్నారు. |
ద్రేనిలో ఎంత?: ఆహారంలో ఎన్ని కెలరీలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే www.twofood s.comలోకి వెళ్లండి. ఏవైనా రెండు ఐటమ్స్ వివరాల్ని ఎంటర్ చేసి దేనిలో ఎన్ని కెలరీలు ఉన్నాయో పోల్చవచ్చు. |
హార్డ్‌వేర్ సమస్యా?సమస్య ఏదైనా సమాధానం సిద్ధం! పీసీలో సమస్యా? పరిష్కారం వెతుకుతున్నారా? సాఫ్ట్‌వేర్‌లకు అప్‌డేట్స్ కావాలా? సోషల్ నెట్‌వర్క్‌లను ఒకేచోట పొందాలా? యూఎస్‌బీ డ్రైవ్ ఫార్మెట్ అవ్వడం లేదా? స్నేహితుడి సిస్టంను ఇంట్లోనే పొందాలా? 'రన్' కమాండ్స్ కావాలా?... అయితే పాఠకుల కబుర్లు చదవాల్సిందే!
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలకు సమాధానం కావాలంటే www.computing.net చూడండి. ఇదో నెట్‌వర్క్ ఫోరమ్. సమస్యని పోస్ట్ చేస్తే సభ్యులు సమాధానం ఇస్తారు. హోం పేజీలో ప్రశ్నల జాబితా చూడొచ్చు. *www.networking-forum.com కూడా అలాంటిదే. సభ్యులైతే సాంకేతిక అంశాలపై చర్చించవచ్చు. * సాఫ్ట్‌వేర్‌ల అప్‌డేట్స్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి http://filehippo.comలోకి వెళ్లండి. Update Cheker ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇంకా సులువు. http://filehippo.com/updatechecker/* కుర్రకారుకి ప్రత్యేక సోషల్ నెట్‌వర్క్ http://shtyle.fm.
- ఎన్.రాధాకృష్ణ, జంగారెడ్డిగూడెం
ఇదో వారధి మొబైల్‌లోనూ కంప్యూటర్‌లోనూ సోషల్ నెట్‌వర్క్‌లను సులభంగా ఓపెన్ చేసుకునే మార్గం www.nimbuzz.com. ఉచితంగా ఫోన్‌కాల్స్, ఛాటింగ్, మెసేజ్‌లు పంపొచ్చు కూడా.
అభినవ్, మేడ్చెల్
ఫార్మెట్ కాకుంటే? వైరస్‌ల వల్ల యూఎస్‌బీ డ్రైవ్ ఫార్మెట్ కాకపోతే డాస్ కమాండ్ ప్రాంప్ట్‌తో ఇట్టే చేయవచ్చు. డ్రైవ్‌ని అనుసంధానం చేసిన తర్వాత స్టార్ట్‌లోని రన్‌తో డాస్ ఓఎస్‌ని ఓపెన్ చేయాలి. Format అనే ఎక్స్‌టర్నల్ కమాండ్‌తో మొత్తం డేటాని తుడిచేయవచ్చు. ఉదాహరణకు మీరు వాడే యూఎస్‌బీ డ్రైవ్ F అయితే, format f:/q టైప్ చేసి ఎంటర్ నొక్కితే సరి!
- పి.అభిషేక్, మేడ్చెల్
ఎక్కడున్నా సరే! స్నేహితుడి కంప్యూటర్‌ను మీ కంప్యూటర్‌లోనే చూడొచ్చు. 'టీమ్‌వ్యూయర్'తో ఇది సాధ్యమే. సైట్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను రెండు కంప్యూటర్లతో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రెండు సిస్టంల్లోని అప్లికేషన్స్‌ని రన్ చేయడం ద్వారా ఒకే సిస్టంలో రెండిటినీ యాక్సెస్ చేయవచ్చు. www.teamviewer.com/en/index.aspx
- మహ్మద్ అమీన్
'రన్' చేద్దాం! స్టార్ట్ మెనూలోని రన్ ద్వారా ప్రత్యేక కమాండ్స్‌తో అప్లికేషన్లను ఓపెన్ చేయవచ్చు. *Calcతో కాలిక్యులేటర్‌ను పొందొచ్చు. *Chkdiskతో పాడైన ఫైల్స్‌ని సరి చేయవచ్చు. *Control కమాండ్‌తో కంట్రోల్ ప్యానల్‌ను ఓపెన్ చేయవచ్చు. *Explorer ద్వారా విండోస్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవుతుంది. * మరికొన్ని... Clipbrd- Cleans up hard driver, logoff- logoff the computer, MMC-Microsoft Management Console, Taskmgr- Task Manager, sysedit- Edit system startup files, wmplayer-windows media player * మరిన్ని రన్ కమాండ్స్ కోసం ఈనాడు.నెట్ చూడండి.
- రాకేష్, కర్నూల్
బ్రౌజర్ చిట్కాలు * బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేసినప్పుడు వచ్చే 'రీస్టోర్ సెషన్'లో కావాల్సిన ట్యాబ్‌ను మాత్రమే ఓపెన్ చేయాలంటే Ctrlని నొక్కితే సరి. * ఫైర్‌ఫాక్స్ కొత్త వెర్షన్‌లో Tab Groupsతో ఓపెన్ చేసిన అన్ని ట్యాబ్‌లను థంబ్‌నెయిల్ బాక్స్‌ల్లో చూడొచ్చు. సెర్చ్‌బాక్స్ పక్కనే కనిపించే బాణం గుర్తుపై క్లిక్ చేసి ట్యాబ్ గ్రూప్స్‌ని ఓపెన్ చేయవచ్చు. Ctrl+Shift+E షార్ట్‌కట్‌తో కూడా పొందొచ్చు. * ఆన్‌లైన్ సర్వీసుల తాళాల్ని సురక్షితంగా స్టోర్ చేయాలంటే LastPass Password Manager యాడ్‌ఆన్‌ను నిక్షిప్తం చేయండి. http://goo.gl/Z9DL9
- అర్జున్, వైజాగ్
ఎక్సెల్ వాడుతున్నారా?
ఎక్సెల్‌లో టేబుల్స్ క్రియేట్ చేస్తున్నారా? ఒక వర్క్‌బుక్‌లో మూడు షీట్‌లు ఉంటాయన్న విషయం తెలిసిందే! కొత్తగా మరో షీట్ బుక్‌లో కావాలంటే? ఇన్‌సర్ట్ మెనూలోకి వెళ్లి Workbookపై క్లిక్ చేయండి. Sheet 4 కనిపిస్తుంది. షీట్ పేరు మార్చాలంటే సెలెక్ట్ చేసి Format-> Sheet-> Renameపై క్లిక్ చేయండి. బుక్‌లో నుంచి షీట్‌ని మాయం చేయాలంటే Hide క్లిక్ చేయండి. షీట్‌ను వర్క్‌బుక్ నుంచి తొలగించాలంటే మెనూలోని Deleteని ఎంచుకోండి.
- రూపేష్, వరంగల్
ఇది బుర్రకు మేత రక్తపాతం, విధ్వంసాలు లేకుండా బుర్రకు పదును పెట్టే ఆటలు కావాలనుకుంటే Ancient JEWELS ఉంది. గేమ్ ప్రారంభం అవ్వగానే టేబుల్‌లో వివిధ రంగుల్లో వజ్రాలు కనిస్తాయి. ఒకే రంగులో ఉన్న మూడు కలిసేలా ఆడాలి. వేగంగా కనుక్కోలేకపోతే ప్రత్యేక గుర్తుతో క్లూ కనిపిస్తుంది. http://goo.gl/3GohW
- ఈమెయిల్
ఈ అంశంపై చాలా చర్చ జరగుతోంది. మనం 1 కేబీ అంటే 1000 బిట్స్ అనుకుంటాం. కానీ, కంప్యూటర్ మాత్రం 1 కేబీని 1024 బిట్స్‌గా పరిగణిస్తుంది. 1000 బిట్స్ 1కేబీకి తీసుకుంటే 4 జీబీని 3.73 జీబీ అని కంప్యూటర్ చూపిస్తుందని ఒక వాదన. కానీ, కొన్ని వెండర్స్ చెబుతున్న ప్రకారం ఆటోమాటిక్ డ్రైవర్లు, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లోడ్ చేయ్యడం వల్ల ఆ స్పేస్ చూపించదని మరో వాదన. * నాకు ప్రమాదం జరగడం వల్ల బీటెక్ మధ్యలోనే ఆపేశాను. ఇప్పుడు ఇంట్లోనే ఉండాల్సివస్తోంది. ఇంటర్నెట్ ద్వారా వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ కోర్సులు చేసేందుకు ఏమైనా మార్గాలున్నాయా?
- ప్రశాంత్
కింది సైట్‌ల్లో సభ్యులై ప్రిపరేషన్ ప్రారంభిచవచ్చు. అవగాహన పెరిగాక వివిధ సోపెన్‌సోర్స్ టూల్స్ డౌన్‌లోడ్ చేసుకుని సాధన చేయవచ్చు. అలాగే, వివిధ డిజైన్‌లతో సొంత బ్లాగ్‌ని ప్రారంభించండి. మరింత నైపుణ్యం కావాలంటే పెయిడ్ ఈ-లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. * http://goo.gl/5sbvL, www.online-web-design-course.com, www.w3schools.com, www.e-learningcenter.com/free.htm, http://webdesign.about.com/c/ec/9.htm, www.homeandlearn.co.uk * విండోస్ సెవెన్ అల్టిమేట్ ఓఎస్ వాడుతున్నాను. విండోస్ అప్‌డేట్‌లో ఏదో సమస్య ఉంది. దీంతో డెస్క్‌టాప్ అప్లికేషన్లు సరిగా పని చేయడం లేదు. జీటాక్‌లో ఛాట్ చేస్తున్నప్పుడు ఇమేజ్‌లు కనిపించడం లేదు. పరిష్కారం తెలుపగలరు?
- శ్రవణ్‌కుమార్
జీటాక్, యాహూలో ఛాట్ చేయగలరుగానీ ఇమేజ్‌లు చూడలేరు. ఇమేజ్‌లను ఛాట్ ద్వారా చూపించడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే డీఫాల్ట్ డిసేబుల్ అయ్యుండొచ్చు. ఎనేబుల్ చేయండి. సిస్టంలో 2 జీబీ మెమొరీ ఉండడం వల్ల మీ గ్రాఫిక్ కార్డ్ సరైన రిజల్యుషన్ ఇవ్వకపోవచ్చు. మీ మెమొరీ అయినా పెంచండి లేదా 256 గానీ, 512 మెమొరీ గ్రాఫిక్స్ కార్డ్ అమర్చండి. * కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆఫీస్‌లో లినక్స్ సర్వర్లు వాడుతున్నారు. అది నాకో పెద్ద సమస్యగా మారింది. ఆన్‌లైన్ లినక్స్ సర్వర్ల గురించి తెలిపే సర్వీసులు ఉన్నాయా?
- మూర్తి
కింది వెబ్ సైట్ ద్వారా ప్రయత్నించండి. http://goo.gl/a3qlC, http://goo.gl/44q5q, http://goo.gl/mnTV3 అంతేకాకుండా మీరు లినక్స్, సీవీఎస్ ఫోరమ్స్‌లో సాధన చేయండి. దీంతో మీరు ఎదుర్కొంటున్న చాలా సమస్యల్ని పరిష్కరించవచ్చు. * HP Compaq Notebook వాడుతున్నాను. విండోస్ డిపెండర్‌ను ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. మాన్యువల్‌గా ఓపెన్ చేస్తున్నా అదే పరిస్థితి. వైరస్‌ల నుంచి నోట్‌బుక్‌ను రక్షించుకోవడం ఎలాగో తెలుపగలరు? ఫైల్స్, ఫోల్డర్లను పాస్‌వర్డ్‌తో లాక్ చేసే ఫ్రీవేర్‌లను తెలుపగలరు?
- ప్రవీణ్ కుమార్
మీరు లైసెన్స్ సాఫ్ట్‌వేర్ వాడుతున్నట్లయితే విండోస్ ఎసెన్షియల్స్‌ని కింది సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసి ఆటోమాటిక్ అప్‌డేట్స్‌ని ఎనేబుల్ చేయండి. www.microsoft.com/security_essentials/, www.avast.com * ఫైల్స్, ఫోల్డర్లను లాక్ చేసే సాఫ్ట్‌వేర్‌ల కోసం కింది సైట్‌లను చూడండి. www.safehousesoftware.com, http://goo.gl/NP7H4, www.protect-folders.com/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి