గూగుల్‌ ప్లస్‌ (Eenadu Thursday 14-07-2011)


గూగుల్‌ మరో అడుగు ముందుకేసింది... కొత్త సోషల్‌ నెట్‌వర్క్‌తో ఆకట్టుకుంటోంది... పేరు 'గూగుల్‌ ప్లస్‌'! ఫే¶¶స్‌బుక్‌కి పోటీ!
కటే జీమెయిల్‌ ఐడీ. కొత్త విండోలోకి వెళ్లక్కర్లేదు. అడ్రస్‌లు కూడా టైప్‌ చేయక్కర్లేదు. క్లిక్‌తో సోషల్‌ నెట్‌వర్క్‌ సిద్ధం అయిపోతుంది. స్నేహితుల 'సర్కిల్‌'... వీడియో ఛాటింగ్‌ల 'హ్యాంగ్‌అవుట్స్‌'... 'పికాసా' ఆల్బమ్‌లు... ఒకటా రెండా అన్నీ 'ప్లస్సే'! అవేంటో వివరంగా తెలుసుకుందాం! ఇలా ప్రవేశించండి
జీమెయిల్‌ ద్వారానే గూగుల్‌ ప్లస్‌లోకి వెళ్లాలి. https://plus.google.com లింక్‌లోకి వెళ్లి సైన్‌ఇన్‌ అవ్వడమే. ఇందులో అన్ని నెట్‌వర్క్‌ల్లో మాదిరిగానే ప్రొఫైల్‌ని ఏర్పాటు చేసుకోవాలి. Home, Photos, Profile, Circles విభాగాలతో హోం పేజీ కనిపిస్తుంది. Family, Friends... అంటూ ప్రత్యేక సర్కిల్స్‌ ఉంటాయి. ఉదాహరణకు School friends పేరుతో క్లాస్‌మేట్స్‌ సర్కిల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎడమవైపు స్నేహితుల ప్రొఫైల్స్‌పై క్లిక్‌ చేసి చూడొచ్చు.
స్నేహితులతో సర్కిల్‌
Circlesద్వారా సభ్యుల జాబితా చూడొచ్చు. Find and invite ద్వారా ఆహ్వానం పంపే వీలుంది. పేర్లతో వెతకొచ్చు. మిత్రుడి ప్రొఫైల్‌లోకి వెళ్లి Add to circle నొక్కితే ఆహ్వానించినట్టే. People Who have added you ద్వారా కొత్తగా చేరిన సభ్యుల్ని చూడొచ్చు. పేజీలో Friends, Family, Acquaintances... లాంటి సర్కిల్స్‌లోకి కావలసిన సభ్యుల ఫొటోలను డ్రాగ్‌ చేసుకోవచ్చు. కావాలంటే కొత్త సర్కిల్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సర్కిల్స్‌ వల్ల ఏ సమాచారాన్ని ఏ ఏ గ్రూపులతో పంచుకోవచ్చో నిర్ణయించుకోవచ్చు. పోస్ట్‌ చేసే సమాచారం ఆ సర్కిల్స్‌లోని సభ్యులకే పరిమితం అవుతుంది.
పంచుకోండిలా!
సభ్యులతో సమాచారాన్ని పంచుకోవడానికి Streamబాక్స్‌లో టెక్ట్స్‌, ఫొటోలు, వీడియో, ఎటాచ్‌మెంట్‌లను నిక్షిప్తం చేసి Shareనొక్కింతే సరి. ఒకో సర్కిల్‌కి వేరు వేరుగా పంపాలంటే ప్లస్‌ గుర్తుతో కూడిన Add circle or people to share with... నొక్కాలి. కుటుంబ చిత్రాలను బంధువులతో మాత్రమే పంచుకోవాలంటే కెమెరా గుర్తుపై నొక్కి ఫొటోలను అప్‌లోడ్‌ చేసి, ప్లస్‌ గుర్తు ద్వారా Family ఎంపిక చేసుకుని పంపవచ్చు. మొత్తం కాంటాక్ట్స్‌ అందరికీ పంపాలంటే Public నొక్కాలి.
లైవ్‌ వీడియో ఛాటింగ్‌
ఇతర సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో లేని అదనపు సౌకర్యం 'హ్యాంగ్‌అవుట్‌'. దీని ద్వారా సభ్యులతో వీడియో ఛాటింగ్‌ చేయవచ్చు. అందుకు ముందుగా వెబ్‌కెమేరాను అనుసంధానం చేసి Start a hangoutనొక్కితే సరి. ఛాటింగ్‌ చేస్తూనే యూట్యూబ్‌ వీడియోలను చూడొచ్చు కూడా. Mute video, Mute Mic, Settings సౌకర్యాల్ని పొందుపరిచారు. సెట్టింగ్స్‌ ద్వారా వీడియో ఛాటింగ్‌ని మార్చుకునే వీలుంది.
విశేషాల విభాగం
ప్రపంచ వ్యాప్తంగా వార్తల్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన Sparks కూడా భిన్నమైనదే. Fashion, Film, sports, Android, Robotic... విభాగాల ద్వారా తాజా వివరాలు పొందవచ్చు. వాటిల్లో సమాచారాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. Search ద్వారా కావాల్సిన అంశాన్ని వెతకొచ్చు.
ఫొటోలకు ప్రత్యేకం
ఫొటోల విభాగం ద్వారా పికాసా వెబ్‌ ఆల్బమ్‌లను పొందవచ్చు. కొత్త ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ నుంచి కూడా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. * సులభంగా పంచుకునేందుకు సెట్టింగ్స్‌ పక్కనే Share ఏర్పాటు చేశారు.
మరికొన్ని...
*Create an album ద్వారా ఫొటోలతో ఆల్బమ్‌ను తయారు చేయవచ్చు. యూట్యూబ్‌ గుర్తు ద్వారా సరాసరి వీడియోలు షేర్‌ చేయవచ్చు. మొబైల్‌లోని డేటాని పంచుకోవడానికి From your phone ఏర్పాటు చేశారు. * సెట్టింగ్స్‌ ద్వారా మార్పులు చేయవచ్చు. రక్షణ నిమిత్తం Profile and Privacy ఉంది.
* మొబైల్‌లో గూగుల్‌ని యాక్సెస్‌ చేయాలంటే కుడివైపు ఉన్న Get Google+ for your mobile deviceపై నొక్కితే సరి. లేదా మొబైల్‌లో http://m.google.com/plusను పొందవచ్చు.


అదిరే ఆండ్రాయిడ్‌ చిట్కాలు!
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నారా? ఎవరికీ తెలియని టిప్స్‌ కావాలా? ఫోన్‌ని దగ్గర పెట్టుకుని ప్రయత్నిస్తారా? మొబైల్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటున్న ఆండ్రాయిడ్‌కి సంబంధించి మాన్యువల్‌లో రాయని చిట్కాలు అనేకం. అవేంటో తెలుసుకుని అదరగొట్టేయండి.

'లాంగ్‌ ప్రెస్‌' తెలుసా?
మొబైల్‌లో ఏదైనా ఓపెన్‌ చేయాలంటే గుర్తుపై నొక్కి వదిలేస్తాం. అలా కాకుండా నొక్కి పట్టుకుంటే వచ్చే సదుపాయాలు కొన్ని ఉంటాయి. దీన్నే 'లాంగ్‌ ప్రెస్‌' అంటారు. * హోం కీని నొక్కి ఉంచడం ద్వారా అప్పుడే వాడిన ఎనిమిది అప్లికేషన్లు (Recently Used Apps) కనిపిస్తాయి. * భూతద్దంలా కనిపించే సెర్చ్‌ కీపై నొక్కి ఉంచితే Speak Now లేబుల్‌తో మైక్రోఫోన్‌ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ వాయిస్‌ కమాండ్స్‌తో 10 కమాండ్‌లను రికార్డ్‌ చేయవచ్చు. ఉదాహరణకు Call to Rajesh అని పలకడం ద్వారా రాజేష్‌కు ఫోన్‌ చేయవచ్చు. * 'బ్యాక్‌ కీ' నొక్కిపెడితే బుక్‌మార్క్‌లు, ఎక్కువగా విజిట్‌ చేసిన వెబ్‌ పేజీలు కనిపిస్తాయి. * హోం స్క్రీన్‌ బ్యాగ్‌గ్రౌండ్‌పై నొక్కి ఉంచితే ప్రత్యేక మెనూలో ఆప్షన్లు కనిపిస్తాయి. దాంట్లోని Shortcutsతో కావాల్సిన అప్లికేషన్‌ను తెరపై పెట్టుకోవచ్చు. * ఎక్కువ ఐకాన్లు ఉంటే ఒకే తరహా అప్లికేషన్లతో ఫోల్డర్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫొటోపైనే!
అడ్రస్‌ బుక్‌లో పేర్లను కాకుండా ఫొటోలను నొక్కితే వచ్చే మెనూ నుంచి ఫోన్‌ చేయడం మాత్రమే కాకుండా మెసేజ్‌, ఈ-మెయిల్‌ పంపవచ్చు. * ఆండ్రాయిడ్‌ కెమెరాతో మీ ఫొటోలు మీరే తీసుకునే వీలుంది. కెమెరా అప్లికేషన్‌లోని Self Portrait Modeను ఎంపిక చేసుకుంటే సరి. కొన్ని సెకన్లకు ఒకసారి ఫొటోలు తీస్తుంది.
రెండు సార్లు
మెయిల్‌ చేస్తున్నప్పుడు వాక్యం పూర్తవ్వగానే 'పుల్‌ స్టాప్‌' టైప్‌ చేసి, స్పేస్‌ నొక్కి కొత్త వాక్యాన్ని మొదలు పెడతాం. ఇలా రెండూ టైప్‌ చేయకుండా రెండు స్లార్లు స్పేస్‌బార్‌ని నొక్కితే చాలు.
వాటినీ వాడొచ్చు
ఫోన్‌ రింగయినప్పుడు ఎత్తకుండా సైలెంట్‌లో పెట్టాలంటే ఏం చేస్తాం? సాధారణంగా స్త్లెడర్‌గానీ, రెడ్‌బటన్‌గానీ నొక్కుతాం. అలా కాకుండా ఫోన్‌ పవర్‌ బటన్‌, వాల్యూమ్‌ బటన్స్‌తో సైలెంట్‌లో పెట్టవచ్చు. * ఆండ్రాయిడ్‌ తెరపై టైం మాత్రమే చూపిస్తుంది. తేదీ చూడాలంటే 'నోటిఫికేషన్‌ ట్రే'ని కిందికి డ్రాగ్‌ చేస్తే సరి.
ఇలా వెతకొచ్చు
బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు ఏదైనా పదాన్ని వెతకాలంటే Menu Key-> Moreపై క్లిక్‌ చేయండి. Find on page ద్వారా సెర్చ్‌బాక్స్‌, కీబోర్డ్‌ ప్రత్యక్షమవుతాయి. * ఏదైనా పేజీని ఫేస్‌బుక్‌లో పంచుకోవాలంటే బ్రౌజర్‌ విండోలోని Menu key-> More-> Share Pageలోకి వెళ్లాలి. వచ్చిన మెనూలోని Facebookను తాకితే ఫేస్‌బుక్‌ నెట్‌వర్క్‌ అవుతుంది.
అక్కర్లేకుంటే?
కొన్ని కాల్స్‌కి జవాబు ఇవ్వకూడదనుకుంటే వాటిని 'వాయిస్‌ మెయిల్‌'లోకి వెళ్లేలా చేయవచ్చు. అందుకు కాంటాక్ట్‌ 'ఎడిట్‌'లోకి వెళ్లి Additional info ద్వారా Send directly to Vicemail ఎంపిక చేయాలి.
ఫాంట్‌ పెద్దగా...
బ్రౌజింగ్‌లో వెబ్‌ పేజీల ఫాంట్‌ సైజు పెంచాలంటే Menu key-> More-> Settingsలోకి వెళ్లి, 'టెక్ట్స్‌ సైజు'ని Normal నుంచి Largeకి మార్చుకోవచ్చు. * కీబోర్డ్‌లు ఇతర భాషల్లో కావాలనుకుంటే 'ఆండ్రాయిడ్‌ మార్కెట్‌'లోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. * 'గూగుల్‌ మ్యాప్స్‌'ని మార్కెట్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.


కీబోర్డే కాదు!
మీటలు లేని కీబోర్డ్‌ని చూశారా? కంప్యూటర్‌ కీబోర్డ్‌ కాస్తా పియానోగా మారడం తెలుసా? అయితే చిత్రంలో కనిపించే 'మ్యాజిక్‌ కీబోర్డ్‌' గురించి తెలుసుకోవాల్సిందే! బ్లూటూత్‌, వై-ఫై నెట్‌వర్క్‌లతో కీబోర్డ్‌ని పీసీకి కనెక్ట్‌ చేయవచ్చు. వీడియోలు చూసేప్పుడు ప్లేయర్‌ కంట్రోలర్‌లా, టైపింగ్‌ చేసేప్పుడు సాధారణ కీబోర్డ్‌లా, మ్యూజిక్‌ ప్లే చేయాలనుకున్నప్పుడు పియానోగా మార్చుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌కు ప్రత్యేక షార్ట్‌కట్‌ కీలను ఏర్పాటు చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లో వాడే ట్రాక్‌బాల్‌లా కూడా మార్చేయవచ్చు. http://goo.gl /Dn8xL


అరచేతిలో తెర!
విష్యత్తులో ఐఫోన్‌ ఎలా మారనుందో తెలియాలంటే ఒక్కసారి చిత్రాన్ని గమనిచండి. దీన్ని చేతి గడియారంలా ధరించవచ్చు. దీంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రొజెక్ట్‌ ద్వారా అరచేతిలోనే తెర ప్రత్యక్షం! చేతిలో తాకితే ఆయా సదుపాయాలు అనుసంధానం అవుతాయి. టచ్‌స్క్రీన్‌, హోం బటన్‌, రిసీవర్‌, కెమేరా, స్పీకర్‌, మైక్రోఫోన్‌ సదుపాయాల్ని నిక్షిప్తం చేశారు. http://goo.gl/r4iNZ


చేతికి సౌకర్యం
క్కువ సేపు మౌస్‌ వాడకం వల్ల మణికట్టు దగ్గర మచ్చలు పడుతుంటే చేతిలో ఒదిగిపోయే G50 Vanguard మౌస్‌ను పెట్టుకుంటే సరి. చేతి ఆకారంతో దీన్ని తయారు చేశారు. మౌస్‌ను పట్టుకున్నప్పుడు మణికట్టు కింద ఆనదు. దీంట్లో మొత్తం 11 బటన్లను ఏర్పాటు చేశారు. http://tinyurl.com/27o8jmo


బ్రేక్‌ ద రూల్స్‌
ట్రాఫిక్‌ రూల్స్‌ అన్నింటినీ మర్చిపోయి స్వేచ్ఛగా రోడ్లపై సంచరించాలంటే Free Running ఆడుకోండి. ఇష్టం వచ్చినట్టు పరిగెత్తొచ్చు. కారు, బస్సు, భవనం ఏదైనా ఎదురొస్తే తప్పుకోకుండా స్పైడర్‌మ్యాన్‌లా ఎగురుతూ దూకేయవచ్చు. పరిగెత్తేందుకు బాణం గుర్తులు, ఎగిరేందుకు X అక్షరాన్ని నొక్కాలి. www.miniclip.com/games/free-running/en/


చిటికెలో...!

ఇలా 'విష్‌' చేయండి: వీడియో, మ్యూజిక్‌, ఇమేజ్‌లు... లాంటి ఆకర్షణీయమైన ఎఫెక్ట్‌లతో గ్రీటింగ్‌ కార్డ్‌ని తయారు చేయాలంటే www.easyhi.comలోకి వెళ్లండి. Get Started Now నొక్కి మూడే దశల్లో ఇమేజ్‌, వీడియో, ఆడియో, టెక్ట్స్‌తో కార్డ్‌ తయారు చేసి మెయిల్‌ చేయవచ్చు.
పదాలకు పరిష్కారం: ఏదైనా పదంలో కొన్ని అక్షరాల్ని మాయం చేసి ఆ పదాల్ని కనుక్కునే పజిల్‌ ఎవరైనా మిమ్మల్ని అడిగితే వెంటనే www.wordsdomination.comలోకి వెళ్లండి. బాక్స్‌లో పదాన్ని టైప్‌ చేసి సెర్చ్‌ కొడితే పరిష్కారం వచ్చేస్తుంది.
ముఖమే పాస్‌వర్డ్‌: ఇప్పటి వరకూ యూజర్‌నేమ్‌లు, పాస్‌ వర్డ్‌లు, పిన్‌ నెంబర్లు వాడుతున్నాం. భవిష్యత్‌లో వీటి అవసరం లేకుండా 'ఫేస్‌ రికగ్నేషన్‌' టెక్నాలజీ వచ్చేస్తోంది. అంటే కంప్యూటర్‌ మీ ముఖాన్ని గుర్తించి పని చేస్తుందన్నమాట!



విలువైన సాఫ్ట్‌వేర్‌లతో ఉపయోగాలెన్నో..!
ఆఫీస్‌ ఫైల్స్‌ని పీడీఎఫ్‌లోకి మార్చుకోవడానికి మార్గాలేంటి? డౌన్‌లోడ్స్‌ వేగం పెంచడానికి ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలంటే? ఉచిత సాఫ్ట్‌వేర్‌ స్థావరాలు ఉన్నాయా?... ఇలాంటి ఎన్నో చిట్కాలు తెలియాలంటే పాఠకులు చెప్పే ఈ-కబుర్లు చదవాల్సిందే.
పీడీఎఫ్‌ చేయాలా?
వర్డ్‌, ఎక్సెల్‌, ప్రెజంటేషన్‌ ఫైల్స్‌ని పీడీఎఫ్‌గా మార్చుకోవాలా? అయితే, Nitro PDf software ఉంది. దీంట్లో పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఎడిట్‌ చేసుకోవచ్చు కూడా. ట్రయల్‌ వెర్షన్‌ను నిక్షిప్తం చేసుకుని ప్రయత్నించండి. www.nitropdf.com* ఉచిత కన్వర్ట్‌తో ఆఫీస్‌ ఫైల్స్‌ని పీడీఎఫ్‌లోకి మార్చుకోవాలంటే Free PDF Converter టూల్‌ని పొందండి. www.dopdf.com/download.php* ఆన్‌లైన్‌లోనే సులభంగా వర్డ్‌ ఫైల్స్‌ని పీడీఎఫ్‌లోకి మార్చుకోవాలంటే www.doc2pdf.net ఉంది. బ్రౌజ్‌తో ఫైల్‌ని సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసి కన్వర్ట్‌ చేయవచ్చు.
- ఎన్‌.శ్రీనివాస్‌
చదివితే చాలు
ఈమెయిల్స్‌ చదవడం ద్వారా సంపాదించవచ్చని తెలుసా? www.paisalive.comలోకి వెళితే సరి. సైన్‌ఇన్‌ అవ్వగానే మీ పేరు మీద రూ.99 రూపాయలు డిపాజిట్‌ అవుతాయి.
- వీరమల్లు రాకేష్‌, రావుట్ల
వేగం పెంచండిలా!
నెట్‌ నుంచి ఎక్కువ డౌన్‌లోడ్స్‌ చేసే వారు Free Download Managerద్వారా డౌన్‌లోడ్‌ వేగాన్ని పెంచొచ్చు. 'బిట్‌టొరెంట్‌' తో ఫైల్స్‌ని దిగుమతి చేసుకునే వీలుంది. కనెక్షన్‌ సరిగా లేక డౌన్‌లోడ్‌ కాకుండా ఆగిన ఫైల్స్‌ని తిరిగి మొదటి నుంచి చేయకుండా, ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి అయ్యేలా చేయవచ్చు. www.freedownloadmanager.org/download.htm
- భరత్‌, హైదరాబాద్‌
అప్లికేషన్‌ అడ్డాలు
సాఫ్ట్‌వేర్‌లు, డ్రైవర్లు, గేమ్‌లు ఉచితంగా అందించే అప్లికేషన్‌ అడ్డాలు తెలుసా? అవే http://en.softonic.com,www.softpedia.com వీటి నుంచి అప్‌డేటెడ్‌ వెర్షన్లను పొందొచ్చు.
- జి.శ్రీను
మొబైల్‌కి ప్రత్యేకం
మొబైల్‌లో గేమ్‌లు, అప్లికేషన్లు, థీమ్స్‌ని పొందాలంటే www.phoneky.comలోకి వెళ్లండి. * స్ట్రీమింగ్‌లో లైవ్‌ టీవీలను చూసేందుకు http://akeelwap.net* ఎంపీ3 పాటల కోసం www.longmp3.com చూడండి.
- పి.భరత్‌, బుర్గంపాడు
రెండూ... రెండే!
ప్లాష్‌ వీడియో ఫైల్స్‌ని పొందడానికి Video Downloaderనిక్షిప్తం చేసుకోండి. ఎఫ్‌ఎల్‌వీ, ఎంపీ4, F4V, WMV, ASF, MPG, MPEG, AVI... ఫార్మెట్‌లను ఇది సపోర్ట్‌ చేస్తుంది. www.iwisoft.com/videodownloader/* ఆడియో, వీడియోలను కావాల్సిన ఫార్మెట్‌లోకి మార్చుకోవడానికి Video Converter ఉంది. వీడియోలను ఇమేజ్‌లుగా, యానిమేషన్‌ జిప్‌ ఫైల్స్‌గా మార్చుకోవచ్చు కూడా. బిట్‌రేట్‌, ఫ్రేమ్‌రేట్‌, వీడియో సైజు, ఆడియో ఛానల్‌, ఆడియో వాల్యూమ్‌లను మార్చుకునే వీలుంది. రెండు ఆడియో ఫైల్స్‌ని కలపడం, ట్రిమ్‌, క్రాఫ్‌ చేయవచ్చు. ఆడియో ఫైల్స్‌పై వాటర్‌మార్క్‌ను పెట్టొచ్చు. www.iwisoft.com/videoconverter/
- సాయి కార్తిక్‌, కడప
తెలుగు కావాలంటే?
బ్రౌజర్‌లో తెలుగు ఫాంట్‌ కనిపించడం లేదా? అయితే, padma యాడ్‌ఆన్‌ను నిక్షిప్తం చేసుకుంటే సరి. మళయాలం, తమిళం, గుజరాతీ, బెంగాలీ భాషల్ని కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నట్లయితే కింది లింక్‌ నుంచి పొదండి. https://addons.mozilla.org/en-US/firefox/addon/padma/
- పి.కిరణ్‌రెడ్డి
చక్కని సైట్‌లు..
డ్రాయింగ్‌ పాఠాలు కావాలంటే www.drawspace.com లోకి వెళ్లండి. * బొమ్మలు గీయడం ఇష్టమైతే ఆన్‌లైన్‌ సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. www.queeky.com/appలో ఫొటోషాప్‌లో మాదిరిగా బొమ్మలు గీయవచ్చు. టూల్‌బార్‌, కలర్‌ పాలెట్స్‌, లేయర్లు ఆప్షన్లు ఉన్నాయి. * మరింత సులభంగా బొమ్మలు వేసేలా రూపొందిందే http://artpad.art.com. బ్రెష్‌ బొమ్మలి గీసి స్నేహితులతో పంచుకోవచ్చు. ఇలాంటివే మరికొన్ని... http://drawanywhere.com, www.flashpaint.com, www.gliffy.com
- షేక్‌ జహూర్‌, సుళ్లూరిపేట




 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు