Eenadu Thursday (20-07-11)

ఆలోచనలకు అద్దండి అందాలు!
కొత్త కంపెనీ విశేషాలు... ప్రాజెక్ట్‌ వర్క్‌ వివరాలు... ప్రకటనల రూపురేఖలు... ఆలోచనలకు అందాలు... ఇలా అవసరాలు బోలెడు! వాటిని ఆకట్టుకునేలా మార్చాలంటే? పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ తప్పనిసరి! ఇవన్నీ ఇప్పుడు చాలా సులభం... అందుకు మార్గం ఆన్‌లైన్‌ సర్వీసులే!
వర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ అవసరం పడని నెట్‌ యూజర్లు చాలా తక్కువ మంది. అందుకోసం సాఫ్ట్‌వేర్‌లను వెతుక్కోవడం పెద్దపనే. కానీ అవేమీ అక్కర్లేకుండానే అనుకున్న ఆలోచనలకు చక్కని అందాలద్ది, అద్భుతమైన ప్రెజంటేషన్లను సాధ్యం చేసే ఆన్‌లైన్‌ సర్వీసులు చాలా అందుబాటులో ఉన్నాయి. నలుగురితో పంచుకోవడం కూడా చాలా సులభం. పైగా ఇవన్నీ ఉచితం. ఆ హంగుల సంగతులేంటో చూద్దాం! చక్కని వారధి
పేరు: EMPRESSR
ఇందులో సభ్యులైతే చాలా సులువుగా ప్రెజంటేషన్‌లను సృష్టించుకుని వాటిని సోషల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా పంచుకోవచ్చు. ఫ్లికర్‌, గూగుల్‌, యాహూ, ఫేస్‌బుక్‌, ఫొటోబకెట్‌లోని డేటాని నేరుగా సైట్‌ నుంచే యాక్సెస్‌ చేస్తూ ప్రెజంటేషన్స్‌లో వాడుకోవచ్చు. ఇతరులు చేసిన స్త్లెడ్‌షోలను కూడా చూడొచ్చు. ఫొటోలు, మ్యూజిక్‌, వీడియో, ఆడియోలతో స్త్లెడ్‌లను తయారు చేయవచ్చు. సాఫ్ట్‌వేర్‌లా ఓపెన్‌ అయిన విండోలో టెక్ట్స్‌, షేప్స్‌, టేబుల్‌, ఛార్ట్‌లతో రకరకాల విభాగాలు కనిపిస్తాయి. Transition Propertiesతో యానిమేషన్‌ను జత చేయవచ్చు. ప్రివ్యూ చూసి షేర్‌ చేసుకోవచ్చు. Embed కోడ్‌తో బ్లాగుల్లో, సైట్‌ల్లో ప్రెజంటేషన్స్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు కూడా. http://em pressr.com
లాగిన్‌ అయితే చాలు
పేరు: Zoho Show
సభ్యత్వం లేకుండానే గూగుల్‌, యాహూ, ఫేస్‌బుక్‌ ఐడీలతో దీంట్లోకి లాగిన్‌ అయిపోవచ్చు. ఎమ్మెస్‌ ఆఫీస్‌ పవర్‌పాయింట్‌లో రూపొందించిన ప్రెజంటేషన్స్‌ని అప్‌లోడ్‌ చేసి పంచుకోవచ్చు. ఎడిట్‌ చేయవచ్చు కూడా. ఖాళీ స్త్లెడ్‌తో షో రూపొందించాలంటే Create a New Presentation ఉంది. థీమ్స్‌లో బోలెడు డిజైన్లు. యానిమేషన్‌ కోసం Slide Transitions ఉంది. మిత్రులకు ఆహ్వానం పంపడం ద్వారా షేర్‌ చేసుకోవచ్చు. Export తో సిస్టంలోని స్త్లెడ్‌లను అప్‌లోడ్‌ చేసి పంచుకునే వీలుంది. http://show.zoho.com
280 స్త్లెడ్లు
పేరు: 280Slides
ప్రెజంటేషన్స్‌ని ఎప్పుడైనా ఎక్కడైనా పొందడానికి ఇదో వారధి. స్త్లెడ్‌లను అప్‌లోడ్‌ చేసి భద్రం చేయవచ్చు. Try it Now, Free క్లిక్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. సిస్టంలో రూపొందించిన ప్రెజంటేషన్‌లను దీంట్లోకి అప్‌లోడ్‌ చేయాలంటే Import an Existing Presentation ఉంది. pptx ఫైల్‌ ఫార్మెట్‌ను మాత్రమే ఇది సపోర్ట్‌ చేస్తుంది. కావాల్సిన ఇమేజ్‌లను, వీడియోలను సరాసరి నెట్‌ నుంచి ఇన్‌సర్ట్‌ చేసుకోవడం ప్రత్యేకత. అందుకోసం అక్కడే గూగుల్‌ సెర్చ్‌ ఏర్పాటు చేశారు. www.280slides.com
చాలా సులువు...
పేరు: Prezentit
సెకన్లలో ప్రెజంటేషన్‌ రూపొందించేందుకు ఇదో మార్గం. ముందుగానే డిజైన్‌ చేసిన టెంప్లెట్‌లను ఎంపిక చేసుకుని టెక్ట్స్‌, ఇమేజ్‌లతో తయారు చేయవచ్చు. యానిమేషన్‌ వేగాన్ని నియంత్రించే వీలుంది. డిజైనింగ్‌ పూర్తయ్యాక షేర్‌, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://prezentit.com
మరిన్ని అదనం
పేరు: vcasmo

గేమింగ్‌ ప్రియులా?
వీడియో గేమ్‌ ప్రియులకు సోనీ ప్రత్యేక మొబైల్‌ రూపొందించింది. పేరు Sony Ericsson Experia Play. ఈ స్త్లెడ్‌ అవుట్‌ మోడల్‌లో క్వర్టీ కీబోర్డ్‌కి బదులుగా 'ప్లే స్టేషన్‌ గేమ్‌ కంట్రోల్‌'ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 2.3 ఓఎస్‌, 3జీ సదుపాయాలతో ఇది పని చేస్తుంది. నాలుగు అంగుళాల తాకేతెర, 1 Gaga Hertz Snapdragon II Processor, వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరా, లెడ్‌ ఫ్లాష్‌, వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో వీజీఏ కెమెరాలను ఏర్పాటు చేశారు. ధర రూ. 35,000. http://goo.gl/qrW4G

అవే వినిపిస్తాయి!
యర్‌ఫోన్‌ పెట్టుకుని పాటలు వింటున్నప్పుడు బయటి శబ్దాలు ఆటంకపరుస్తున్నాయా? అయితే, Kill Noise ఇయర్‌ప్లగ్‌ సూట్‌ను పెట్టుకుంటే సరి! వీటిని 'ఎలక్ట్రానిక్‌ ఫిల్టరింగ్‌'తో రూపొందించారు. http://goo.gl/tWexG

ఐఫోన్‌కి 'క్వర్టీ కీబోర్డ్‌'
ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌ వర్చువల్‌ క్వర్టీ కీబోర్డ్‌ తెలిసిందే. అదనంగా ఎక్సటర్నల్‌ కీబోర్డ్‌ను ఫోన్‌ను అనుసంధానం చేయవచ్చని తెలుసా? అందుకు ప్రత్యేకంగా కీబోర్డ్‌ ప్యానల్‌ను తయారు చేశారు. అదే Qwerty Keyboard for iphone. ఫోన్‌కు కింది భాగంలోని ఏర్పాటు చేసిన డాక్‌ సిస్టం ద్వారా కీబోర్డ్‌ని ఫోన్‌కి అనుసంధానం చేయవచ్చు. దీంతో ఎప్పుడైనా వర్చువల్‌ కీబోర్డ్‌తో పని లేకుండానే చక చకా టైప్‌ చేసేయవచ్చు. http://goo.gl/BjJkh

ఇవిగో చవక ట్యాబ్లెట్‌లు!
మార్కెట్‌లో ట్యాబ్లెట్‌ల సందడే సందడి. వారానికో కొత్త మోడల్‌ వస్తోంది. కానీ ధరలు కూడా ఎక్కువే. మరైతే చవక ట్యాబ్లెట్‌లు లేవా? ఎందుకు లేవూ... ఇవి అవే!
తొమ్మది వేలే!
యాపిల్‌ ఐప్యాడ్‌, శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌... లాంటివి కొనాలంటే పాతికవేలు పైమాట. కానీ రూ.9000కే ట్యాబ్లెట్‌ని కొనవచ్చని తెలుసా? దీని పేరు Binatone HomeSurf. నెట్‌ బ్రౌజింగ్‌, మెయిల్స్‌ని చూసుకోవడం చాలా సులభం. ఆండ్రాయిడ్‌ 1.6 ఆపరేటింగ్‌ సిస్టంతో పని చేస్తుంది. ఎనిమిది అంగుళాల తెర, వై-ఫై, 2 జీబీ మెమొరీ, ఇన్‌బిల్డ్‌ మైక్‌, స్పీకర్లతో తయారు చేశారు. బ్యాటరీ బ్యాక్‌అప్‌ నాలుగు గంటలు. ఇంటర్నెట్‌ రేడియో, యూట్యూబ్‌ ప్లేయర్‌లను కూడా నిక్షిప్తం చేశారు. http://goo.gl/Ej6ZR
ఇది ఎనిమిదే...
పై దానికంటే వెయ్యి తక్కువకు ట్యాబ్లెట్‌ కొనాలకుంటే Wesproe-pad ఉంది. ఆండ్రాయిడ్‌ 1.6 ఓఎస్‌తో పని చేసే దీన్ని 2.1 వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. 7 అంగుళాల ఎల్‌సీడీ తెర, ఇన్‌బిల్డ్‌ వై-ఫై, 128 ఎంబీ ర్యామ్‌, 2 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సదుపాయాలతో రూపొందించారు. 32 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే వీలుంది. బ్యాటరీ బ్యాక్‌అప్‌ 4 గంటలు. http://goo.gl/lStBN
పదికే 3జీ!
అటు ఇటుగా ఐప్యాడ్‌ను పోలి ఉండే ట్యాబ్లెట్‌ Accord @pad. ధర సుమారు రూ.10,000. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 1.7 వెర్షన్‌తో పని చేస్తుంది. వై-ఫై, 3జీ ప్రత్యేకత. 7 అంగుళాల తెర, 2 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, ఇన్‌బిల్డ్‌ స్టీరియో స్పీకర్లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లతో తయారు చేశారు. కీబోర్డ్‌, మౌస్‌, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌లను అనుసంధానించుకోవచ్చు. 16 జీబీ వరకూ మెమొరీ పెంచుకోవచ్చు. బ్యాటరీ బ్యాక్‌అప్‌ 5 గంటలు. http://goo.gl/FsF6Y
ఇరవైకి హెచ్‌సీఎల్‌
హెచ్‌సీఎల్‌ కంపెనీ ల్యాబ్‌టాప్‌లు రూ. 14,500 నుంచి 33,000 వరకూ ఉన్నాయి. వాటిల్లో HCL Me మోడళ్లు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌, 3 మెగాపిక్సల్‌ మెమొరీ, యూఎస్‌బీ ఎనెక్టివిటీ, బ్లూటూత్‌, వై-ఫై, 3జీ, వాయిస్‌ కాలింగ్‌, జీపీఎస్‌ నేవిగేషన్‌ సదుపాయాల్ని నిక్షిప్తం చేశారు. హై డిఫినెషన్‌ క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. http://goo.gl/ceMpy
రెండు మోడళ్లు
ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌ ఇన్ఫీబీమ్‌.కామ్‌ Phi మోడళ్లను సుమారు రూ.15,000లకే అందిస్తోంది. ఒకటేమో ఆండ్రాయిడ్‌పైనా, మరొటి విండోస్‌ సీఈ ఓస్‌లతో పని చేస్తాయి. 7 అంగుళాల తెర, 256 ర్యామ్‌, వై-ఫై, 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, యూఎస్‌బీ పోర్ట్‌లు, మల్టీమీడియా సదుపాయాలతో రూపొందించారు. 32 జీబీ వరకూ మెమొరీ పెంచుకోవచ్చు. బ్యాటరీ బ్యాక్‌అప్‌ 5 గంటలు. www.infibeam.com/phi
* బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఆధునిక ట్యాబ్లెట్‌ కొనాలంటే OlivePad ఉంది. యాపిల్‌ ఐప్యాడ్‌కి పోటీగా తయారు చేశారు. 7 అంగుళాల తెర, 3 మెగాపిక్సల్‌ కెమేరా, ముందు భాగంలో వీజీఏ కెమేరా, 3జీ, వై-ఫై, జీపీఎస్‌, మైక్రోఫోన్‌, ఇన్‌బిల్డ్‌ స్పీకర్లు, కార్డ్‌ రీడర్‌... లాంటి సౌకర్యాలతో రూపొందించారు. http://goo.gl/4tpkv


చిటికెలో..!
'ప్లస్‌' అవుతోంది: గూగుల్‌ ప్లస్‌ సభ్యుల సంఖ్య అప్పుడే 10 మిలియన్లకు చేరింది. మరి, ఫేస్‌బుక్‌ సభ్యుల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 750 మిలియన్లు. ఫేస్‌బుక్‌లోని ఫొటోలను గూగుల్‌ ప్లస్‌లోకి మార్చుకోవాలంటే Move2Picasa అప్లికేషన్‌ వాడొచ్చు.
పాడుతూ నేర్చుకోండి: స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌... లాంటి ఇతర భాషల్ని పాడుతూ నేర్చుకోవాలంటే www.lyricsgaps.comలోకి వెళ్లండి. ఆయా భాషల పాటలు అప్‌లోడ్‌ చేసి ఉంటాయి.
సినీ ప్రియులా?: డ్యాకుమెంటరీ చిత్రాలు తీస్తుంటారా? సినిమాలు చూడడం ఇష్టమా? అయితే www.openfi lm.com సిద్ధంగా ఉంది. విభాగాల వారీగా వీడియోలను వెతికి చూడొచ్చు. నచ్చిన వాటిని స్నేహితులతో పంచుకునే వీలుంది.


వీడియోలను పంచుకునే మార్గాలెన్నో!
తీసిన వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలంటే ఆన్‌లైన్‌లో చాలా మార్గాలున్నాయి. 'వీడియో షేరింగ్‌ సర్వీసులు ఏమిటి?' అని అడిగిన ప్రశ్నకు పాఠకులు అనేక సూచనలు చేశారు. వాటిల్లో కొన్ని...
యూట్యూబ్‌తో మొదలు
లాంటి మెమొరీ పరిధులు లేకుండా వీడియోలను అప్‌లోడ్‌ చేసి పంచుకునేందుకు ప్రధాన వేదిక 'యూట్యూబే'. ఉచితంగా యూజర్‌ ఎకౌంట్‌ని క్రియేట్‌ చేసుకుంటే సరి. వీడియోలను అప్‌లోడ్‌ చేసిన తర్వాత లింక్‌ మెయిల్‌తో వీడియోలను పంచుకోవచ్చు. www.youtube.com* 'మెటాకేఫ్‌' మరో సర్వీసు. దీంట్లో సభ్యులై వీడియోలను అప్‌లోడ్‌ చేసుకుని పంచుకోవచ్చు. మెచ్చిన వీడియోల జాబితా కూడా ఉంది. ఛానల్స్‌ ట్యాబ్‌ ద్వారా టీవీ ఛానళ్ల కార్యక్రమాలు చూడొచ్చు. వేర్వేరు విభాగాల వీడియోలను చూసుకోవచ్చు. www.metacafe.com* 'డైలీమోషన్‌' మరోటి. సభ్యులై అప్‌లోడ్‌ చేసిన వీడియోలను బ్లాగులు, సైట్‌లు, సోషల్‌నెట్‌వర్క్‌లో పంచుకునే వీలుంది. www.dailymotion.com* జీమెయిల్‌లో 'గూగుల్‌ వీడియో'ల్లో లాగిన్‌ అయి అప్‌లోడ్‌ చేసి మెయిల్‌ చేసే వీలుంది. http://video.google.com* ఫన్నీ వీడియోలతో ఆకట్టుకునే 'బ్రేక్‌' సర్వీసులో సభ్యులై వీడియోలను అప్‌లోడ్‌ చేసి పంచుకోవచ్చు. www.break.com
- చైతన్య, హైదరాబాద్‌
ముచ్చటగా మూడు
వీడియోలను చూడడమే కాకుండా పంచుకోవడానికి http://blip.tv. *www.viddler.com ద్వారా హెచ్‌డీ క్వాలీటీతో వీడియోలను షేర్‌ చేయవచ్చు. * కమ్యూనిటీ రూపంలో వీడియోలను షేర్‌ చేసుకునేందుకు http://vimeo.com ఉంది. * రాపిడ్‌షేర్‌, ఫైల్‌సర్వ్‌, ఫైల్‌ సోనిక్‌, మెగాఅప్‌లోడ్‌ లాంటి ఫైల్‌ హోస్టింగ్‌ సర్వీసుల నుంచి వీడియోలను డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటే www.premiumzilla.comలో సభ్యులైపోండి. సభ్యులవ్వగానే 10 జీబీ ట్రాఫిక్‌ని పొందొచ్చు.
- సాయి ప్రశాంత్‌, సూర్యాపేట
'డ్రాప్‌' చేస్తే సరి!
ప్రపంచ వ్యాప్తంగా 110 మిలియన్ల మంది వాడుతున్న 'మీడియాషేర్‌' తెలుసా? దీంట్లో 200 ఎంబీ ఫైల్స్‌ని పంచుకునే వీలుంది. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేసే వీలుంది. www.mediafire.com* వేగంగా వీడియో ఫైల్‌ని అప్‌లోడ్‌ చేసి పంచుకోవాలంటే www.filedropper.comఉంది. సభ్యులై 5 జీబీ ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. * వీడియోలను ట్విట్టర్‌ నెట్‌వర్క్‌లో పంచుకోవాలంటే http://sharesend.com ఉంది. 100 ఎబీ ఫైల్స్‌ని మాత్రమే పంపగలం. * ఉచితంగా 1 జీబీ వీడియో ఫైల్‌ని పంచుకునేందుకు www.filesend.net సిద్ధం. * మరికొన్ని... www.filesa vr.com, www.adrive.com
- మైత్రి, హైదరాబాద్‌
'హోస్ట్‌' సర్వీసులు
ఫైల్‌ హోస్టింగ్‌ సర్వీసుల ద్వారా కూడా వీడియో ఫైల్స్‌ని పంచుకోవచ్చు. ఉదాహరణకు 1 జీబీ వీడియో ఫైల్‌ని పంచుకోవాలంటే అప్‌లోడ్‌ చేసి లింక్‌కి మెయిల్‌ చేయడం ద్వారా పంపొచ్చు. వాటిల్లో 'డ్రాప్‌బాక్స్‌' ఒకటి. దీంట్లో సభ్యులై 2 జీబీ వీడియో ఫైల్‌ని అప్‌లోడ్‌ చేసి మెయిల్‌ చేయవచ్చు. www.dropbox.com * 200 ఎంబీ ఉన్న వీడియో ఫైల్స్‌ని ఉచితంగా షేర్‌ చేసుకోవాలంటే 'జిప్పీషేర్‌' ఉంది. ఒక్కసారి అప్‌లోడ్‌ చేశాక 300 రోజుల వరకూ స్టోర్‌లో ఉంటుంది. www.zippyshare.com * ఒక సినిమా మొత్తాన్ని అప్‌లోడ్‌ చేసి స్నేహితుడికి మెయిల్‌ చేయాలంటే 'స్లింగ్‌ఫైల్‌' ఉంది. సభ్యత్వం అక్కర్లేకుండానే 1 జీబీ వీడియో ఫైల్స్‌ ఉచితంగా అప్‌లోడ్‌ చేయవచ్చు. 500 జీబీ వరకూ మెమొరీ స్పేస్‌ ఉచితం. www.slingfile.com
- టి.భావన, నల్గొండ, మహాత్మగాంధీ యూనివర్సిటీ
ఒకటా రెండా..!
డ్రాప్‌షాట్స్‌ ద్వారా పంచుకోవడమే కాదు, లైబ్రరీల్లో వీడియోలను నిక్షిప్తం చేసుకోవచ్చు. www.dropshots.com* 'సోషల్‌ మీడియో' రూపంలో సేవలందించే సైట్‌లు చాలానే ఉన్నాయి. కమ్యూనిటీలా ఏర్పడి వివిధ రంగాలకు చెందిన వీడియోలను పంచుకుంటున్నారు. Ourmedia అందుకు ప్రత్యేకం. దాదాపు లక్షన్నర సభ్యులు వీడియోలను అప్‌లోడ్‌ చేసి పంచుకుంటున్నారు. * ఇలాంటిదే మరో సర్వీసు www.saymedia.com* మరో మూడు సర్వీసులు www.liveleak.com, www.pixorial.com, www.eyespot.com 
- సంపత్‌ కుమార్‌, వైజాగ్‌
మరెన్నో...
* www.wikiupload.com * www.filehosting.org
* www.wixi.com * www.badongo.com
* www.4shared.com * www.filefactory.com
- రమ్య, చింతల్‌


ప్రశ్న-జవాబులు
* విప్రో 7బీ1630 మోడల్‌ ల్యాప్‌టాప్‌ వాడుతున్నా. డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయడం ఎలా?
- ఈమెయిల్‌
విప్రో ల్యాప్‌టాప్‌కి అవసరమైన అన్ని డ్రైవర్స్‌ ఒకే చోట లేకపోవడం వల్ల ఏమేం కావాలో చెబితే ఆయా లింక్స్‌ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. కింది వెబ్‌సైట్స్‌లో మీకు కావాలాల్సిన డ్రైవర్స్‌ కోసం ప్రయత్నించండి. www.software112.com, www.giveawayoftheday.com, http://goo.gl/kxCqx

* విండోస్‌ అల్టిమేట్‌ ఓఎస్‌ని వాడుతున్నాను. గంటకి ఒకసారి ఆటోమాటిక్‌గా సిస్టం రీస్టార్ట్‌ అవుతోంది. విండోస్‌ రికవరీ చూపిస్తోంది. పరిష్కారం తెలుగపలరు?
- శ్రవణ్‌కుమార్‌
కింది వెబ్‌ సైట్స్‌ ద్వారా మీ సమస్యని పరిష్కరించవచ్చు. http://goo.gl/m7R5F, http://goo.gl/T6uEh

* నేను వాగుతున్న 2జీబీ యూఎస్‌బీ పని చేయడం లేదు. అందుకో ముఖ్యమైన డేటా ఉంది. సిస్టంకి కనెక్ట్‌ చేయగానే సున్నా బైట్స్‌ అనిపించింది. తర్వాత Please enter new disk అని చూపిస్తోంది. డేటాని తిరిగి పొందాలంటే ఎలా?
- కె.ఆనంద సాగర్‌, చిత్తూరు
కింది వెబ్‌ సైట్‌ నుంచి రికవరీ టూల్స్‌ని పొందండి. యూఎస్‌బీ డ్రైవ్‌ని స్కాన్‌ చేసి డేటాని రికవర్‌ చేయడానికి ప్రయత్నించండి. http://goo.gl/55aMf, http://goo.gl/s1cnd

* నోకియా 7210 సూపర్‌నోవా మొబైల్‌ వాడుతున్నాను. 2 జీవీ మెమొరీ కార్డ్‌ వాడుతున్నాను. మెమొరీ కార్డ్‌కి పెట్టిన పాస్‌వర్డ్‌ మర్చిపోయాను. దీంతో కార్డ్‌ని ఓపెన్‌ చేయలేకపోతున్నా. పరిష్కారం తెలుపగలరు?
- కృష్ణ తేజ, పూనె
కింది సైట్‌ నుంచి మెమొరీ లాకర్‌ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్‌ చేసి ప్రయత్నించండి. http://goo.gl/vkVxl, * మీరు ఫోన్‌ ఎస్‌60 మోడల్‌ ఏ వెర్షనో చూసి కింది సైట్‌లో చెప్పినట్టుగా చేయండి. http://goo.gl/gzVAO

* నేను వాడుతున్న నెట్‌ కనెక్షన్‌ నెమ్మదిగా పని చేస్తుంది. వేగం పెంచాలంటే ఏం చేయాలి?
- ముస్తఫా
మీరు వాడుతున్న కనెక్షన్‌ ప్పీడ్‌ వేగం ఎంత? సుమారు వస్తున్న బ్రాండ్‌విడ్త్‌ ఎంత? అనే దాన్ని బట్టి స్పీడ్‌ని అంచనా వేయగలం. ఎక్కువ మంది యూజర్స్‌ని షేర్‌ చేయడం వల్ల మీ నెట్‌స్పీడ్‌ తగ్గుండొచ్చు. రాత్రిపూట షేరింగ్‌ కొంచెం తగ్గుతుంది. అప్పుడు కూడా వేగం అలానే ఉంటే వైరస్‌ ఉందేమో చెక్‌ చేయండి. వైరస్‌ని తొలగించి ప్రయత్నించండి. ఇంటర్నెట్‌ బూస్టర్స్‌ ద్వారా 10 శాతం పెంచవచ్చు. ఉచిత బూస్టర్స్‌ వాడడం వల్ల ఒక్కోసారి ఎక్కువ స్పాం వచ్చే అవకాశం ఉంది.
- Ch.A.S.మూర్తి, C-DAC
 
 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు