మొబైల్ లాకర్లు (Eenadu Thursday 18/04/2012)




స్మార్ట్‌ మొబైల్‌ కొనేస్తారు... చకచకా నెట్‌ పెట్టేస్తారు...
ఆన్‌లైన్‌ సర్వీసుల్ని వాడేస్తారు... మరి రక్షణ మాటేమిటి?
అందుకు మొబైల్‌లోనే ఉన్నాయి కిటుకులు!
రెంటు బిల్లుల దగ్గర్నుంచి క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపుల వరకు మొబైల్‌నే వాడే కాలమిది. మెయిల్స్‌ పంపడం నుంచి సోషల్‌ నెట్‌వర్క్‌ సందేశాల వరకు కంప్యూటర్‌ అక్కర్లేకుండా మొబైల్‌ మీటల్నే నొక్కేస్తున్నాం. అందుకు రకరకాల యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాం. వాటిని సురక్షితంగా గుర్తుంచుకుని వాడకపోతే హ్యాకర్‌ వల్లో జోకర్‌ అయినట్టే! మరి, వీటన్నింటినీ గుర్తుంచుకోవడం ఎలా? అందుకు ఉచిత మొబైల్‌ అప్లికేషన్లు చాలానే ఉన్నాయి. సురక్షిత పద్ధతిలో లాగిన్‌ వివరాలను పదిలం చేయవచ్చు. ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఎవరి కంటా పడకుండా దాచవచ్చు. ఆయా కిటుకుల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం.'కీపర్‌' కేక!
వాడుతున్న పరికరం ఏదైనా లాగిన్‌ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని భద్రం చేస్తానంటూ ముందుకొచ్చింది Keeper. పాస్‌వర్డ్‌ మేనేజర్‌గా దీన్ని పిలుస్తున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, ఐపాడ్‌, కిండిల్‌ ఫైర్‌, బ్లాక్‌బెర్రీ డివైజ్‌ల్లో వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ మార్కెట్‌ నుంచి ఉచితంగా పొందే వీలుంది. 'మిలటరీ గ్రేడ్‌ ఎన్‌క్రిప్షన్‌'తో దాచిపెట్టిన డేటాని సురక్షితంగా కాపాడుతుంది. కొత్తగా వాడాలనుకునే వెబ్‌ సర్వీసులకు క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను సూచిస్తుంది. ఆపై అప్లికేషన్‌ నుంచే ఆయా సర్వీసుల్లోకి లాగిన్‌ అవ్వొచ్చు. డేటాని కంప్యూటర్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు.https://keepersecurity.com/compare
వారికి మాత్రమే!
ఇలాంటిదే మరొకటి aWallet Password Manager. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ప్రత్యేకం. డేటాని ఎస్‌డీ కార్డ్‌ మెమొరీలోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. విభాగాల వారీగా లాగిన్‌ తాళాల్ని భద్రం చేయవచ్చు. కంప్యూటర్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌లకు Computer Logings, ఆన్‌లైన్‌ షాపింగ్‌ సర్వీసులకు e-Shops,బ్యాంకింగ్‌ కోసం e-Banking, ఈమెయిల్‌ సర్వీసులకు Email Accounts... విభాగాలు ఉన్నాయి. ఇతర వెబ్‌ సర్వీసుల్ని Web Accountsలో భద్రం చేయవచ్చు. ఉదాహరణకు బ్యాకింగ్‌లో Bank, Website, Name, Password, Noteవివరాలతో ఎంట్రీ చేయవచ్చు. http://goo.gl/jqpHC
నోకియా వాడుతున్నారా?
సింబియాన్‌ ఓఎస్‌తో నోకియా వాడుతున్నట్లయితే Lite Walletx Password Manager ప్రత్యేకం. నోకియా ఒవీ స్టోర్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు. 'కీపాస్‌ఎక్స్‌, కీపాస్‌, పాస్‌వర్డ్‌ సేఫ్‌' ఆన్‌లైన్‌ సర్వీసుల్లో భద్రం చేసుకున్న ఇతర లాగిన్‌ వివరాల్ని దీంట్లోకి ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. http://goo.gl/Qrlml
*Lite-Mr.Safe మరోటి. Business, Personal, Samples, Templates...విభాగాల్లో కావాల్సిన వాటిని ఎంచుకోవచ్చు. ముందుగా ప్రధాన పాస్‌వర్డ్‌ని సెట్‌ చేసుకుని ఇతర లాగిన్‌ వివరాల్ని భద్రం చేసుకునే వీలుంది. http://goo.gl/9O3xl
* మరోటి Password Book E3 Lite. బ్యాంకు ఎకౌంట్‌, బ్యాంకు కార్డ్‌, పర్సనల్‌ ఇన్ఫో, మెయిల్‌బాక్స్‌... విభాగాలు ఉన్నాయి. http://goo.gl/H7Occ
అవి వాడితే!
ఐఫోన్‌ వినియోగదారులుUtimate Passoword Manager Freeతో లాగిన్‌ వివరాల్ని భద్రం చేసుకోవచ్చు. Username, Password, URL, Note, Category వివరాలతో డేటా కనిపిస్తుంది.http://goo.gl/DvNy6
*My Eyes Only మరోటి. దీంట్లో సేవ్‌ చేసిన డేటాని మీరే చూడగలరు. Logins, Credit Cards, Financial Accounts, Identiry Cards, Memberships, Notesవిభాగాలు ఉన్నాయి. http://goo.gl/G5Zmf
* మీతో పాటే మీ పాస్‌వర్డ్‌లు అంటూ Ever Passwordఐఫోన్‌లో సందడి చేస్తోంది. ఇతర పరికరాల్లో దాచుకున్న సమాచారాన్ని ఆటోసింక్రనైజ్‌తో కాపీ చేసుకోవచ్చు.www.everpass word.com/iphone-password-manager
మరికొన్ని...
* బ్లాక్‌బెర్రీ వాడుతున్నట్లయితే Pass word Manager Secret Serverపొందండి. http://goo.gl/NPQTK
*LastPass Password Manager Premiumతోనూ బ్లాక్‌బెర్రీ యూజర్లు డేటాని సురక్షితం చేసుకోవచ్చు. Secure Passoword Generatorతో క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకుని వాడుకునే వీలుంది. http://goo.gl/cBjjx
* ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐప్యాడ్‌... డివైజ్‌ల్లో వాడుకునేలా Keepass రూపొందించారు. అన్నింటిలోనూ ఉచితంగా వాడుకోవచ్చు. http://keepass.info/download.html
* మొబైల్‌లో డాల్ఫిన్‌ వెబ్‌ బ్రౌజర్‌ని వాడుతుంటే Dolphin Password యాడ్‌ఆన్‌ మీ కోసమే. దీంతో ఆయా వెబ్‌ సర్వీసుల్లోకి లాగిన్‌ అయ్యేప్పుడు పదే పదే వివరాల్ని నమోదు చేయక్కర్లేదు. http://goo.gl/tyvAa

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)