గ్రిడ్డు కాలం (Special news)
గ్రిడ్డు కాలం కుప్పకూలిన ఉత్తర, తూర్పు, ఈశాన్య విద్యుత్ గ్రిడ్లు స్తంభించిన జనజీవనం 21 రాష్ట్రాల్లో 60 కోట్లమందికి నరకయాతన 3 రాష్ట్రాల ఉల్లంఘనవల్లే.. తాగునీళ్లు లేవు ఏటీఎంలు బంద్ మూగబోయిన సెల్‌ఫోన్లు ఎక్కడి రైళ్లక్కడే బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 265 మంది కార్మికులు న్యూఢిల్లీ - న్యూస్‌టుడే దే శంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. సగం జనాభా పలు గంటల పాటు విద్యుత్ లేక విలవిల్లాడింది. సోమవారం అర్ధరాత్రి ఉత్తరాది గ్రిడ్ వైఫల్యంతో మొదలైన నరకయాతన మంగళవారం చుక్కల్ని చూపించింది. వరుసగా రెండో రోజూ ఉత్తరాది గ్రిడ్ కుప్పకూలగా.. దీంతో పాటు తూర్పు, ఈశాన్యగ్రిడ్లు కూడా గుడ్లు తేలేశాయి. సుమారు 21 రాష్ట్రాల్లో 60 కోట్లమంది ప్రజలు నరకాన్ని చవిచూశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని రాష్ట్రాలు గ్రిడ్ల నుంచి అధిక విద్యుత్తు లాక్కోవడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇలాంటి రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యుత్తు శాఖామంత్రి సుశీల్‌కుమార్‌షిండే హెచ్చరించారు. మంగళవారం నాటి విద్యుత్ సంక్షోభాన్ని.. ప్రపంచం ఎదుర్కొన్న విద్యుత్తు విపత్తుల్లో ఒకటిగా పేర...