మార్చేయండి... మేలు పొందండి! (Eenadu software tips_12/07/2012)



సిస్టంలో ఎప్పుడూ ఒకే అప్లికేషన్లేనా? కొత్తవి ప్రయత్నించకూడదూ? దృష్టిపెడితే ప్రయోజనాలు ఎన్నో!
వసరాన్ని బట్టే సిస్టంలో అప్లికేషన్లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. కొన్ని వినూత్నంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. ఎక్కువ మెమొరీ తీసుకోవు. వేగంగా పని చేస్తాయి. అలాంటివేంటో తెలుసుకుంటే పని సులువవుతుంది. ఉదాహరణకు రైట్‌క్లిక్‌లో సరికొత్త ఆప్షన్లను పెట్టుకోవచ్చు! నచ్చిన రంగులతో ఫోల్డర్లను అలంకరించుకోవచ్చు! ఒకే క్లిక్కుతో సిస్టం మొత్తాన్ని పర్యవేక్షించి లోపాల్ని కనిపెట్టొచ్చు... ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవేంటో వివరంగా చూద్దాం!అవన్నీ అదనం
మీరు రైట్‌క్లిక్‌లో రిఫ్రెష్‌, ఎరేంజ్‌ ఐకాన్స్‌, కట్‌, కాపీ, పేస్ట్‌... లాంటివి మాత్రమే చూసుంటారు. మరిన్ని అదనపు ఆప్షన్లను పొందుపరుచుకోవాలంటే Right Click Enhancer టూల్‌తో సాధ్యమే. టూల్‌ విండోలో Edit Right Click Menu-> Right Click Editorలోకి కావలసినవి ఎంచుకోవడమే. రైట్‌క్లిక్‌లోని Send to మెనూలోకి కూడా కొత్త విభాగాలు పెట్టుకోవచ్చు. ఫైల్‌, ఫోల్డర్లనే కాకుండా షార్ట్‌కట్‌లను కూడా కలుపుకోవచ్చు.http://goo.gl/7C24k
రంగులే రంగులు!
ఐకాన్లను ఎప్పుడూ పసుపు రంగులోనే చూసి విసుగొస్తే వివిధ రంగుల్లోకి మార్చుకోవచ్చు. అందుకు Folderico అప్లికేషన్‌ ఉంటే సరి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సెవెన్‌కి ప్రత్యేకం. ఇన్‌స్టాల్‌ చేయగానే రైట్‌క్లిక్‌ మెనూలోకి చేరిపోతుంది. ఇక మీరు కావాల్సిన ఐకాన్‌పై రైట్‌క్లిక్‌ చేసి Foldericoలోకి వెళ్లి రంగుల్ని ఎంచుకోవచ్చు. http://goo.gl/6uBGx
ఒక దాంట్లోనే!
తెరపై వివిధ రంగులతో కూడిన గడియారాల్ని పెట్టుకోవాలనుకుంటే Free Vector Clocks ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ప్రత్యేక ఫోల్డర్‌లో గడియారం షార్ట్‌కట్‌లు ఓపెన్‌ అవుతాయి. ఒక్కోదానిపై డబుల్‌క్లిక్‌ చేస్తూ అన్ని గడియారాల్ని పెట్టుకోవచ్చు. గడియారం పక్కన కనిపించే గుర్తుల సాయంతో పరిమాణాన్ని కావాల్సినంత పెంచుకోవచ్చు. Rotate Mark ద్వారా కావాల్సిన కోణంలోకి తిప్పొచ్చు. ఫోల్డర్‌ కనిపించకపోతే Start-> Programs->Free Vector Clocksతో ఓపెన్‌ చేయవచ్చు.http://goo.gl/nMSuU
హెచ్చరిస్తుంది...
ఉచిత యాంటీవైరస్‌ల్లో మరో ముఖ్యమైనదిగాThreatFireను చెప్పుకోవచ్చు. మీరు వాడుతున్న యాంటీవైరస్‌, ఫైర్‌వాల్స్‌తో కలిపి వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రమాదాల్ని తెలియజేస్తూ హెచ్చరిస్తుంది. వాటిని వెంటనే బ్లాక్‌ చేయవచ్చు. ఎక్కువ మెమొరీ కూడా తీసుకోదు. http://goo.gl/fNuHg
ఇలా సురక్షితం
కంప్యూటర్‌ లోపాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని డేటాని సురక్షితం చేసుకోవాలంటే Privacy Cleanerసిద్ధంగా ఉంది. సిస్టం మొత్తాన్ని స్కాన్‌ చేసి నివేదిక ఇస్తుంది. స్కానింగ్‌ ప్రక్రియలో భాగంగా సిస్టంలోని Traces, internet browsing, Cookies, index.dat, Memory, Startup... లాంటి వివిధ ముఖ్య విభాగాల్ని స్కాన్‌ చేసి లోపాల్ని చూపిస్తుంది. మొత్తాన్ని క్లీన్‌ చేయాలంటేStart Cleaningపై క్లిక్‌ చేస్తే సరి. క్లీనింగ్‌ పూర్తయ్యాక ఆటోమాటిక్‌గా షట్‌డౌన్‌ చేయాలంటే Shutdown Pc after Cleaning ఆప్షన్‌ ఉంది. http://goo.gl/MAOop
ఇట్టే తీసుకోవచ్చు!
వీడియో ఫైల్స్‌లో ఏదైనా ఫ్రేమ్‌ని ఇమేజ్‌ ఫైల్‌గా తీసుకోవాలంటే సులువైన మార్గం ఒకటుంది. అదేCaptureFrame. వీఎల్‌సీ ప్లేయర్‌ మాదిరిగానే వీడియోని ప్లే చేస్తుంది. కావాల్సిన ఫ్రేమ్‌ని Capture ద్వారా ఇమేజ్‌ ఫైల్‌గా మార్చొచ్చు. JPG ఫార్మెట్‌లో ప్రత్యేక ఫోల్డర్‌లో సేవ్‌ అవుతాయి. ప్రతి సెకన్‌, నిమిషానికి ఒక ఫ్రేమ్‌ని ఇమేజ్‌ ఫైల్‌గా మార్చుకునే వీలుంది. అందుకు Capture Everyలో టైం సెట్‌ చేయాలి.http://goo.gl/CHZ97
కలిపేందుకు మార్గం
పీడీఎఫ్‌ ఫైల్స్‌ని పోల్చి చూసుకోవడం... ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ని ఒకే ఫైల్‌గా మెర్జ్‌ చేయడం తెలిసిందే. అదే మాదిరిగా వర్డ్‌ ఫైల్స్‌ని కలపాలంటే?WinMerge సిద్ధంగా ఉంది. దీంతో రెండు డాక్యుమెంట్స్‌ని కంపేర్‌ చేయవచ్చు. వర్డ్‌ ఫైల్స్‌ని ఒక్కటిగా చేయవచ్చు. ప్రోగ్రామింగ్‌లో వాడే సోర్స్‌కోడ్‌లను సరి చేసి చూసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రోగ్రాంలోని 'సింటెక్స్‌' పసుపు రంగుతో హైలెట్‌ చేసుకునే వీలుంది.http://goo.gl/FXraz
ఎన్ని ఉన్నా సరే!
ఒకటి కంటే ఎక్కువ యూఎస్‌బీలను వాడుకోవాలంటే USBDeview అప్లికేషన్‌ పొందండి. సిస్టంకి కనెక్ట్‌ చేసిన అన్ని పోర్ట్‌లు విండోలో జాబితాగా కనిపిస్తాయి. డ్రైవ్‌కి సంబంధించిన సమాచారాన్ని Description, Device Type, Connected...విభాగాల్లో చూడొచ్చు. డివైజ్‌పై రైట్‌క్లిక్‌ చేసి డిస్‌కనెక్ట్‌ చేయవచ్చు. 'ఆటోప్లే' చేయవచ్చు.http://goo.gl/nSx1X
ముక్కలు చేస్తుంది!
ఎక్కువ పేజీలు ఉన్న పీడీఎఫ్‌ ఫైల్‌ని ముక్కలుగా చేయాలంటే SepPDF అప్లికేషన్‌ను పొందండి. ఒక్కో పేజీగా మాత్రమే కాదు. కొన్ని పేజీలతో సెట్స్‌ మాదిరిగా విడగొట్టుకునే వీలుంది. http://goo.gl/byTRI
ఇట్టే రన్‌ చేయవచ్చు!
సిస్టంలోని సాఫ్ట్‌వేర్‌లను రన్‌ చేయాలంటే? స్టార్ట్‌ బటన్‌లోకి 'ప్రోగ్రామ్స్‌'లోకి వెళ్లి ఓపెన్‌ చేయాలి. లేదంటే స్టార్ట్‌లోనే 'రన్‌'తోనైనా కొంతవరకూ సాధ్యమే. వీటన్నింటే సులువైన మార్గం Pretty RUNఅప్లికేషన్‌. ట్రేలోని గుర్తుపై డబుల్‌క్లిక్‌ చేస్తే విండో వస్తుంది. బాక్స్‌లో మీకు కావాల్సిన ఫైల్‌, ప్రోగ్రాం, ఫోల్డర్‌, షార్ట్‌కట్స్‌... పేర్లు టైప్‌ చేస్తే చాలు... ఆయా పేర్లతో ఉన్న అన్నింటిని జాబితాగా చూపిస్తాయి. వాటిపై క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అవుతాయి. http://goo.gl/pyu0e
కొత్త ప్లేయర్‌
పాటలు వినాలంటే ప్లేయర్‌ వాడాల్సిందే. మరి, మీకు Jaangle గురించి తెలుసా? ఇదో ఉచిత మ్యూజిక్‌ ప్లేయర్‌, ఆర్గనైజర్‌. వీడియోలను ప్లే చేసుకునేందుకు అనువుగా రూపొందించారు. ఆల్బమ్‌లను మేనేజ్‌ చేసేందుకు Albums, Artistవిభాగాలు ఉన్నాయి. http://goo.gl/ HjfrC


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు

Automatic Water Level Controller