పెన్ డ్రైవ్ ఉంటే... సాఫ్ట్ వేర్ వెంటే! (Software tips 28/06/2012)



పీసీలో స్పేస్‌ లేదా? అదనపు అప్లికేషన్లు అవసరమా? అయితే, పెన్‌డ్రైవ్‌లో పెట్టుకోవచ్చు!! ఎక్కడైనా... ఎప్పుడైనా వాడుకునే వీలుంది!!
సిస్టంలో కావాల్సిన సాఫ్ట్‌వేర్‌లు లేకపోతే ఎంత కాన్ఫిగరేషన్‌ ఉన్న కంప్యూటర్‌ అయినా ఉపయోగం లేనట్టే. అలాగని కనిపించిన ప్రతి సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేస్తే సిస్టం స్పేస్‌ వృథా అవుతుంది. అందుకే అవసరమైన వాటినే వాడాలి. సాఫ్ట్‌వేర్‌లలో కొన్నింటిని పీసీలోనే ఇన్‌స్టాల్‌ చేసుకుని పని చేయగలం. మీకు తెలుసా? కొన్ని సాఫ్ట్‌వేర్‌లను సిస్టంలోనే కాకుండా పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఏ సిస్టంలోనైనా పెన్‌డ్రైవ్‌ కనక్ట్‌ చేసి వాటిని వాడుకునే అదనపు వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు పాస్‌వర్డ్‌లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భద్రం చేసుకుని యూఎస్‌బీ డ్రైవ్‌లో పెట్టుకోవచ్చు. యాంటీవైరస్‌, మాల్వేర్‌ టూల్స్‌ని పెన్‌డ్రైవ్‌లోనే ఉంచి ఏ సిస్టంలోనైనా రన్‌ చేసి వైరస్‌ల పని పట్టొచ్చు.. ఇలా చాలానే ఉన్నాయి. మరి, పెన్‌డ్రైవ్‌లో ఒదిగిపోయి పని చేసే ఆయా యుటిలిటీ టూల్స్‌ గురించి తెలుసుకుందాం!ఇదో వర్డ్‌ ప్రాసెసర్‌
వర్డ్‌ ఫైల్స్‌ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎడిట్‌ చేసుకునేలాJarte టూల్‌ని రూపొందించారు. దీన్ని సిస్టంలోనే కాకుండా యూఎస్‌బీ డ్రైవ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఇంట్లో, ఆఫీస్‌లో ఎక్కడైనా ఏ సిస్టంలోనైనా రన్‌ చేసి వాడుకోవచ్చు. అన్ని విండోస్‌ ఓఎస్‌ల్లో పని చేస్తుంది. టూల్‌ని డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసేప్పుడు Select Destination Locationలో డీఫాల్ట్‌గా సిస్టం డ్రైవ్‌ కనిపిస్తుంది.Browseపై క్లిక్‌ చేసి మెనూలోని యూఎస్‌బీ డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేసి ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియను కొనసాగించాలి. మొత్తం పూర్తయ్యాక యూఎస్‌బీ డ్రైవ్‌లోకి Jarte ఫోల్డర్‌ వస్తుంది. దాంట్లోని Jarte.exe ఫైల్‌ని రన్‌ చేయడం ద్వారా ఏ సిస్టంలోనైనా పోగ్రాంని వాడుకోవచ్చు. వివిధ రకాల ఫార్మెట్‌లతో డాక్యుమెంట్‌ని ఎడిట్‌ చేయవచ్చు. ట్యాబ్‌ విండోల్లో డాక్యుమెంట్స్‌ని ఓపెన్‌ చేసుకోవచ్చు. ఎమ్మెస్‌ వర్డ్‌లో మాదిరిగా స్పెల్‌చెక్‌, డిక్షనరీ, పిక్చర్‌, పేరాగ్రాఫ్‌ సెట్టింగ్స్‌... లాంటి మరిన్ని ఆప్షన్లతో డాక్యుమెంట్స్‌ని క్రియేట్‌ చేసుకునే వీలుంది. http://goo.gl/ NbrOX
డాక్టర్‌ 'వెబ్‌'
సిస్టం వాడితే కచ్చితంగా యాంటీవైరస్‌ ఉండాల్సిందే. ఆన్‌లైన్‌లో ఉచిత యాంటీవైరస్‌లు చాలానే ఉన్నాయి.Dr.Web CureIt కూడా అలాంటిదే. యాంటీవైరస్‌, యాంటీ స్పైవేర్‌ స్కానర్‌గా దీన్ని పిలుస్తున్నారు. ఎలాంటి ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ లేకుండానే దీన్ని యూఎస్‌బీ డ్రైవ్‌ నుంచి రన్‌ చేయవచ్చు. ఒక్కసారి రన్‌ చేస్తే మొత్తం సిస్టంని స్కాన్‌ చేసి వైరస్‌లు, ట్రోజన్స్‌, యాడ్వేర్‌, స్పైవేర్‌, హ్యాక్‌టూల్స్‌, రూట్‌కిట్స్‌, మాల్వేర్‌లను వెతికి పట్టేస్తుంది. గుర్తించిన వాటిని తొలగిస్తుంది. Express Scan, Complete Scan, Custom Scan చేయవచ్చు.http://goo.gl/PagfX
McAfee Stinger కూడా అలాంటిదే. ఇదో పోర్టబుల్‌ యాంటీవైరస్‌ స్కానర్‌. 3000 వైరస్‌లను ఇది గుర్తించగలుగుతుంది. http://goo.gl /1oxDa
అన్నీ భద్రం!
ఆన్‌లైన్‌లో ఒక్కో సర్వీసుకి ఒక్కో పాస్‌వర్డ్‌ వాడుతుంటాం. వాటిల్లో కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఏదీ మర్చిపోకూడదనుకుంటే Cryptnosటూల్‌ని యూఎస్‌బీలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. అన్ని పాస్‌వర్డ్‌లను సురక్షితంగా మేనేజ్‌ చేసుకోవచ్చు. ఎక్కడైనా వాటిని సురక్షితంగా పొందొచ్చు. http://goo.gl/rulfm
* ఇలాంటిదే మరోటి KeePass. లాగిన్‌ వివరాల్ని ప్రత్యేక ఎన్‌క్రిప్షన్‌ కోడ్‌తో భద్రం చేస్తుంది. ఇన్‌స్టలేషన్‌లోDestination Locationలో పెన్‌డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేయాలి. డ్రైవ్‌లోని ఫోల్డర్‌లోకి వెళ్లి KeePass.exe ఫైల్‌ని రన్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్‌ చేయాలి. Newతో మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేసుకుని లాగిన్‌ వివరాల డేటాబేస్‌ని తయారు చేయాలి. Add Entryతో సైట్‌ పేరు, యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌, నోట్స్‌... డేటాని ఎంటర్‌ చేయాలి. పాస్‌వర్డ్‌ Expire Dateని సెట్‌ చేయవచ్చు కూడా. Password Generatorతో క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను పొందే వీలుంది. http://goo.gl/gzat3
పెన్‌డ్రైవ్‌లోనే డైరీ
వాడుతున్న పెన్‌డ్రైవ్‌లోనే డిజిటల్‌ డైరీ రాసుకుంటే!EfficientDiaryతో ఇది సాధ్యమే. డౌన్‌లోడ్‌ చేసిన జిప్‌ ఫోల్డర్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయాలి. వచ్చిన ఫోల్డర్‌లోనిEfficientDiary.exe ఫైల్‌ని డబుల్‌క్లిక్‌ చేసి డైరీ రాసుకోవచ్చు. ఓపెన్‌ చేసి డైరీకి మాస్టర్‌ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. New Diary Entryపై క్లిక్‌ చేసి తేదీల వారీగా డైరీ రాసుకోవచ్చు. మేటర్‌ మధ్యలో ఇమేజ్‌ ఫైల్స్‌ని ఇన్‌సర్ట్‌ చేసుకునే వీలుంది. అదనపు ఫైల్స్‌ని డైరీకి ఎటాచ్‌ చేయవచ్చు. ఎన్‌క్రిప్షన్‌, పాస్‌వర్డ్‌ వివరాలతో డైరీని సురక్షితం చేసుకోవచ్చు. http://goo.gl/xhgVf
స్కాన్‌ చేస్తారా?
డాక్యుమెంట్స్‌, ఇతర డేటా ఫైల్స్‌ని స్కాన్‌ చేస్తుంటారా? అయితే, స్కాన్‌ చేసిన వాటిని సులభమైన పద్ధతిలో పీడీఎఫ్‌లోకి మార్చుకోవాలంటే? WinScan2PDF టూల్‌ సిద్ధంగా ఉంది. ఒకటికంటే ఎక్కువ పేజీలను స్కాన్‌ చేసి అన్నింటినీ ఒకే పీడీఎఫ్‌ ఫైల్‌గా మార్చేయవచ్చు.http://goo.gl/pXmt8
* జేబులో పే...ద్ద డిక్షనరీ పెట్టుకుని తిరిగితే! అదెలా సాధ్యం అంటారా! ఆ నిఘంటువు డిజిటల్‌ డిక్షనరీ అయితే! Dictionary.NET అలాంటిదే. 65 భాషల్లో వాడుకోవచ్చు. అనువాదం (Translation) కూడా చేసుకోవచ్చు. దీన్ని వాడుకోవాలంటే సిస్టంలో .Net Framework 4 ఉండాల్సిందే.http://goo.gl/v2Zmd
* ఫొటోల బ్రౌజింగ్‌, ఎడిట్‌ చేయడానికి యూఎస్‌బీ డ్రైవ్‌లోనే అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే! Free Vimager ఉంటే సరి. ఇదో పోర్టబుల్‌ ఇమేజ్‌ వ్యూయర్‌. Red eye removal, Image Cropping, Color and brightness, Image borders...తో ఎడిటింగ్‌ చేయవచ్చు. స్త్లెడ్‌షో మాదిరిగా ఫొటోలు చూడొచ్చు. ఇమేజ్‌ ఫైల్స్‌ని పీడీఎఫ్‌ ఫార్మెట్‌లో మార్చుకునే వీలుంది. http://goo.gl/tqpVD



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు