సైన్స్‌ విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్‌లు


సైన్స్‌ విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్‌లు
బేసిక్‌ సైన్సెస్‌లో ఉన్నత విద్య చదివే విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఫెలోషిప్‌లను అందిస్తోంది. సైన్సెస్‌లో ఇంటర్‌, డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి. కోర్సుల్లో చేరే విద్యార్థులకు కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై) పేరుతో ఫెలోషిప్‌లను ఇస్తోంది. కింది కేటగిరీల అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లకు అర్హులు.
స్ట్రీమ్‌ ఎస్‌ఏ: 2012-13లో ఇంటర్‌ మొదటి సంవత్సరం / +1 తరగతిలో ప్రవేశించనున్న విద్యార్థులు అర్హులు.
స్ట్రీమ్‌ ఎస్‌ఎక్స్‌: 2012-13లో ఇంటర్‌ / +2 పూర్తిచేసుకొని 2013-14లో బీఎస్సీ / బీఎస్‌ / ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి.లో చేరదలచుకున్నవారు అర్హులు.
స్ట్రీమ్‌ బి: 2012-13లో బీఎస్సీ/ బీఎస్‌/ ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి.లో చేరిన విద్యార్థులు అర్హులు.
ఎంపికైన వారికి నెలకు రూ.4000 నుంచి రూ.7000 వరకు ఫెలోషిప్‌ లభిస్తుంది. ఐఐఎస్‌సి, బెంగళూరు ఈ ఫెలోషిప్‌లకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనుంది. విద్యార్థులను సైన్సెస్‌లో ఉన్నత విద్య వైపు ఆకర్షించడం ఈ ఫెలోషిప్‌ల ప్రధాన లక్ష్యం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu