కొత్త సాఫ్ట్‌వేర్‌లంటే ఆసక్తి ఉందా? (Eenadu Thursday 24/05/2012)



కొత్త సాఫ్ట్‌వేర్‌లంటే ఆసక్తి ఉందా?
వెబ్‌ విహారంలో వెతికేస్తుంటారా?
మరీ అంత కష్టపడొద్దు!
ఇవిగో సులువు మార్గాలు!!


కొన్ని సాఫ్ట్‌వేర్‌లతో పని సులువు కావడమే కాదు, ఎన్నో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు సిస్టంలోని ఫొటోలను త్రీడీలో ఎఫెక్ట్‌లతో చూడొచ్చు... నిమిషానికో, గంటకో, రోజుకో వాల్‌పేపర్‌ తనంతట తనే మారిపోయేలా చేయవచ్చు... ఒకే క్లిక్కుతో సిస్టంలోని చెత్తని తొలగించొచ్చు... రైట్‌క్లిక్‌లో అదనపు సౌకర్యాల్ని పొందుపరచవచ్చు... ఇలా ఎన్నో ప్రయోజనాల్ని అందించే సాఫ్ట్‌వేర్‌ల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం! అవన్నీ ఉచితం కూడా!!చిన్నదే కానీ...
సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ మెమొరీ తక్కువే! ఇన్‌స్టాల్‌ చేసి చూస్తే కళ్లు చెదిరే సౌకర్యాలు! సిస్టంలో మీరు భద్రం చేసిన ఫొటోలన్నీ త్రీడీలో దర్శనమిస్తాయి. ఇంతకు ముందు మీరెన్నడూ ఫొటోలను అలా బ్రౌజ్‌ చేసుండరు. విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌కు భిన్నంగా పని చేసే ఆ సాఫ్ట్‌వేరే VISIONS. నెట్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టంలోని డ్రైవ్‌ల్లోని ఫొటోలను స్కాన్‌ చేస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఫొటోలన్నీ త్రీడీ ఇంటర్ఫేస్‌లో కనిపిస్తాయి. Layout మెనూలో మరిన్ని ఎఫెక్ట్‌లను పొందుపరిచారు. Ctrl+1, Ctrl+2, Ctrl+3, Ctrl+4, Ctrl+5, Ctrl+6షార్ట్‌కట్‌లతో ఆయా ఎఫెక్ట్‌లను మార్చుకోవచ్చు. ఫోల్డర్లలోని ఫొటోలు థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో కనిపిస్తాయి. ప్రత్యేక విండోలో చూడాలంటే ఫొటోపై డబుల్‌క్లిక్‌ చేస్తే సరి. ఫొటోలను డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో Editing Roomలోకి తీసుకెళ్లి ఎడిట్‌ చేయవచ్చు. Adjustments, Effects, Artwork ఆప్షన్లు ఉన్నాయి. ఎడిట్‌ చేశాక Printing House ద్వారా ప్రింట్‌ తీసుకోవచ్చు. www.twins-solutions.com/download.html
ఇట్టే మారిపోతుంది!
నిర్ణీత సమయంలో వాల్‌పేపర్లు మారిపోవాలనుకుంటేJohn's Background Switcher అప్లికేషన్‌తో సాధ్యమే! విండోలోని Addతో సిస్టంలోని ఇమేజ్‌లు, ఫోల్డర్‌లను ఎంపిక చేసుకోవచ్చు. Change Every ఆప్షన్‌తో టైంని సెట్‌ చేసుకోవాలి. Picture Modeతో వాల్‌పేపర్‌ స్త్టెల్‌ని సెట్‌ చేసుకోవచ్చు. http://goo.gl/wCesq* ఇలాంటిదే మరోటి My Daily Wallpaper. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రేలో ఐకాన్‌ గుర్తుతో చేరిపోతుంది. ఓపెన్‌ చేస్తే Browse all galleries, Random Wallpapers మెనూలతో విండో వస్తుంది. ర్యాండమ్‌ వాల్‌పేపర్లలో కనిపించే ఇమేజ్‌లను Set as wallpaperతో వాల్‌పేపర్‌గా పెట్టుకోవచ్చు. 'బ్రౌజ్‌ ఆల్‌ గ్యాలరీ'పై క్లిక్‌ చేసి 3D, Fantasy, Abstract, Animal & Plants, Science Fiction...విభాగాల్లోకి నెట్‌ నుంచి ఇమేజ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు వివిధ మోడళ్ల కార్‌లను వాల్‌పేపర్‌గా పెట్టుకోవాలంటే Browse all Galleries-> Vihicles-> Download Next group of Random Wallpapersపై క్లిక్‌ చేయాలి.Minimizeపై క్లిక్‌ చేస్తే విండో తిరిగి సిస్టం ట్రేలో చేరిపోతుంది.http://goo.gl/cfF6w
ఒక్క క్లిక్‌ చాలు
సిస్టం లోపల చేరిపోయిన చెత్తని తొలగించడమెలాగో తెలియకపోతే ఆ పనిని JetClean టూల్‌కి అప్పగించేయండి. తెరపై కనిపించే గుర్తుతో ఓపెన్‌ చేయగానే Registry Clean, Windows Clean, Apps Clean, Shortcuts Clean, RAM Clean విభాగాలతో విండో వస్తుంది.Scan Nowపై ఒక్కసారి క్లిక్‌ చేస్తే చాలు అన్ని విభాగాల్లోని చెత్తని పోగేస్తుంది. తర్వాత Repair బటన్‌పై క్లిక్‌ చేసి మొత్తం చెత్తని తొలగించొచ్చు.
కొత్తగా 'రైట్‌క్లిక్‌'
ఇప్పటి వరకూ రైట్‌క్లిక్‌లో మీరు చూసిన ఆప్షన్లు ఏంటి?Arrange, Refresh, Paste, Undo, New... లాంటివి కొన్నే. వీటికి మరిన్ని జోడించాలంటే FileMenu Tools అప్లికేషన్‌తో సాధ్యమే. ఇన్‌స్టాల్‌ చేయగానే రైట్‌క్లిక్‌లోకి కొత్త ఆప్షన్ల జాబితా చేరిపోతుంది. ఉదాహరణకు ఏదైనా ఫోల్డర్‌ ఐకాన్‌ మార్చాలంటే రైట్‌క్లిక్‌ చేసి Properties-> Customize-> Change Iconలోకి వెళ్లక్కర్లేదు. ఫోల్డర్‌పై రైట్‌క్లిక్‌ చేసిFileMenu Tools-> Change Iconపై క్లిక్‌ చేస్తే చాలు. 'పోల్డర్ల' సైజుని కూడా రైట్‌క్లిక్‌ నుంచే మార్చేయవచ్చు. మెనూకి కొత్త కమాండ్స్‌ని ఇవ్వాలంటే? టూల్‌బార్‌లోనిAddCommandపై క్లిక్‌ చేయాలి. కుడివైపు కనిపించేPropertiesతో కమాండ్‌ బటన్‌కి అప్లికేషన్‌ను ఎసైన్‌ చేయాలి.మెనూలోని ఆప్షన్ల స్థానాల్ని Move up, Move Downతో మార్చుకోవచ్చు. http://goo.gl/l4GSa
మరికొన్ని...
* సెర్చ్‌లో ఎక్కువగా సమాచారాన్ని వెతుకుతుంటారా? అయితే, ఫైర్‌ఫాక్స్‌ యాడ్‌ఆన్‌ SearchPreviewతో సెర్చ్‌ రిజల్ట్స్‌లో కనిపించే లింక్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లను థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో ప్రివ్యూ చూడొచ్చు.http://goo.gl/ktfoM
* ముఖ్యమైన విషయాల్ని మర్చిపోకుండా డెస్క్‌టాప్‌పై నోట్స్‌ రాసుకుని ఎప్పుడూ కనిపించేలా పెట్టుకోవాలంటేPNotesను పొందండి. ఐకాన్‌ గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి New Noteతో నోట్స్‌ రాసుకోవచ్చు. http://goo.gl/1YgEs
* సిస్టంలోని ఫైల్‌, ఫోల్డర్‌లను వెతకాలంటే ఎక్స్‌ప్లోరర్‌ ఒక్కటే మార్గం కాదు. అదనపు టూల్స్‌ చాలానే ఉన్నాయి. వాటిల్లో Everything ఒకటి. రన్‌ చేసి విండో బాక్స్‌లో ఫైల్‌ పేరు టైప్‌ చేస్తే చాలు మొత్తం జాబితాగా వచ్చేస్తాయి. http://goo.gl/eSgbf
* వాల్‌పేపర్‌తో మెర్జ్‌ అయిపోయి పని చేసే క్యాలెండర్‌ కావాలంటే Interactive Calendar టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి. ముఖ్యమైన విషయాల్ని, అపాయిట్‌ మెంట్స్‌ని, ఈవెంట్స్‌ని క్యాలెండర్‌లో ఎంటర్‌ చేసి పెట్టుకోవచ్చు. క్యాలెండర్‌లోని బాక్స్‌పై డబుల్‌క్లిక్‌ చేస్తే మొత్తం మేటర్‌ కనిపిస్తుంది. http://goo.gl/ciE5Q
=======================================================================================================================


==================================================================================================================

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)